ఇది ఓవర్‌నైట్ సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టే ఒక ఓపెన్ ఎండెడ్ డెట్ స్కీమ్
క్రికెట్లో టెస్ట్ మ్యాచ్ కంటే వన్డే మ్యాచ్‌ను ఎందుకు ఎక్కువగా చూస్తారని అని ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే, ఫలితం ఒక్క రోజులో తేలిపోతుంది. టి20 ఫార్మాట్ అయితే ఇంకా త్వరగా తేలిపోతుంది. ఆ సన్నాహం, ఉత్సాహం మరియు ఫలితం తేలిపోతుంది అనే సంతృప్తి వలన మీకు మరింత ఆసక్తి కలుగుతుంది. పెట్టుబడి పెట్టడంలో కూడా ఇలాంటి అంశాలే మిమ్మల్ని ఉత్సాహపరిస్తే, మీ ఆసక్తికి తగినట్లుగా ఉండి, వేరే వాటితో పోల్చినప్పుడు తక్కువ రిస్కును కలిగి ఉండి ప్రతిరోజూ లాభాలను అందించే సరికొత్త ఫండ్‌ను మీ ముందుకు తెచ్చాము.
వివరణ:
నిప్పాన్ ఇండియా ఓవర్‌నైట్ ఫండ్
సులభంగా చెప్పాలంటే, ఈ ఫండ్ ఒక రోజులో మెచ్యూర్ అయ్యే డెట్ మ్యూచువల్ ఫండ్, ఇది డెట్, మనీ మార్కెట్ సాధనాలలో పెట్టుబడి పెడుతుంది. అవును మీరు సరిగ్గానే చదివారు! గత రోజుకు సంబంధించిన పెట్టుబడి ఫలితాన్ని తెలుసుకోవడానికి ఒక్క వ్యాపార దినం చాలు. ఆసక్తికరంగా ఉంది కదా?
మీ వద్ద ఉన్న పెద్ద మొత్తాన్ని తాత్కాలికంగా ఎక్కడైనా పెట్టుబడి చేయాలని అనుకుంటున్నారా? ఎమర్జెన్సీ ఫండ్‌ను సృష్టించడం లేదా మార్కెట్‌లో సరైన సమయంలో పెట్టుబడి పెట్టడం వంటి ఏదైనా కారణం కావచ్చు. మీకు ఇది సరైన ఫండ్. ఇది ఇతర వాటితో పోల్చినప్పుడు తక్కువ రిస్కుతో మధ్య స్థాయి ఆదాయాన్ని అందిస్తుంది. మీరు ఒక్క రోజు నుండి ఒక్క నెల వరకు మాత్రమే పెట్టుబడి చేయవచ్చు. మీరు పాక్షిక విత్‌డ్రాలు చేయాలనుకుంటే ఈ ఫండ్ మీకు బాగా సరిపోతుంది.
ఇది పని చేసే విధానం ఏమిటి?
ప్రతి వ్యాపార దినం ప్రారంభమైనప్పుడు, ఫండ్ మేనేజర్ సెక్యూరిటీలను 1 రోజు మెచ్యూరిటీ కాలంతో కొనుగోలు చేస్తారు. అందువల్ల, ప్రతిరోజూ వడ్డీ ఎన్ఎవి కి జోడించబడుతుంది మరియు కొత్త కొనుగోలు జరుగుతుంది. ఈ విధంగా, మీరు ప్రతిరోజూ రిటర్న్స్ పొందుతున్నారు.
అందించబడుతున్న మెచ్యూరిటీ వ్యవధి ఒక్క రోజు కాబట్టి, ఇది సాధారణంగా వడ్డీ రేటులో మార్పు లేదా జారీచేసేవారి క్రెడిట్ రేటింగ్ మొదలైనటువంటి సెక్యూరిటీలతో సంబంధం కలిగి ఉండగల ఏవైనా రిస్కులను తగ్గిస్తుంది.
గమనించవలసిన ఫీచర్లు
గమనించవలసిన కొన్ని అదనపు ఫీచర్లు కింద పేర్కొనబడ్డాయి-
- ఇతర వాటితో పోల్చి చూసుకున్నప్పుడు రిస్క్ తక్కువ
- తర్వాతి వ్యాపార దినమున మెచ్యూర్ అయ్యే డెట్, మనీ మార్కెట్ సాధనాలలో పెట్టుబడులు చేయబడతాయి
- రోజువారీ రిటర్న్స్
- పెట్టుబడి వ్యవధి 1 రోజు నుండి 1 నెల వరకు
- లాక్-ఇన్ పీరియడ్ ఉండదు
- టి+1 ప్రాతిపదికన రిడెంప్షన్లు
-
మొదటి కొనుగోలు- ₹5,000, ఆ తర్వాత ₹1 మల్టిపుల్స్‌లో
-
అదనపు కొనుగోలు- ₹1,000, ఆ తర్వాత ₹1 మల్టిపుల్స్‌లో
- డైరెక్ట్/రెగ్యులర్ ప్లాన్ల కింద వివిధ ప్లాన్స్/ఆప్షన్‌లు, అవి:
- గ్రోత్/డివిడెండ్ ఎంపిక
- ప్రతి రోజూ/ప్రతి వారం/ప్రతి నెల/త్రైమాసిక డివిడెండ్ రీఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్
- నెలవారీ/త్రైమాసిక డివిడెండ్ చెల్లింపు ఎంపిక
నిప్పాన్ ఇండియా ఓవర్‌నైట్ ఫండ్
వీటిని కోరుకునే పెట్టుబడిదారులకు ఈ ప్రోడక్ట్ అనుకూలంగా ఉంటుంది*
- స్వల్ప వ్యవధిలో ఆదాయం
- ఓవర్‌నైట్ మెచ్యూరిటీతో డెట్, మనీ మార్కెట్ సాధనాలలో పెట్టుబడి
*ప్రోడక్ట్ తమకు అనుకూలంగా ఉందా అనే సందేహం ఉంటే పెట్టుబడిదారులు తమ ఆర్థిక సలహాదారులను సంప్రదించాలి.
డిస్‌క్లెయిమర్:
ఇక్కడ ఉన్న సమాచారం సాధారణంగా చదవడం కోసం మాత్రమే, అలాగే ఈ విషయాలు కేవలం అభిప్రాయాలు మాత్రమే కలిగి ఉంటాయి. అందువల్ల ఈ సమాచారాన్ని మార్గదర్శకాలు, సిఫార్సులు లేదా చదువుతున్న వారికి ప్రొఫెషనల్ గైడ్‌గా పరిగణించకూడదని మా మనవి. ఏవైనా పెట్టుబడులు పెట్టడానికి ముందు, చదువుతున్న వారు దానికి సంబంధించి నిపుణుల సలహా తీసుకోవాలని సలహా ఇవ్వబడుతుంది, అలాగే తెలివైన పెట్టుబడి నిర్ణయం తీసుకోవడానికి ముందు ఆ పెట్టుబడికి సంబంధించిన కంటెంట్‌ను ఒకటికి రెండుసార్లు ద్రువీకరించాలి. స్పాన్సర్, ఇన్వెస్ట్మెంట్ మేనేజర్, ట్రస్టీ, వారి సంబంధిత డైరెక్టర్లు, ఉద్యోగులు, అనుబంధ సంస్థలు లేదా ప్రతినిధులు ఎవరూ కూడా ఈ మెటీరియల్‌లో ఉన్న సమాచారం కారణంగా ఉత్పన్నమయ్యే నష్టాలకు ప్రత్యక్ష, పరోక్ష, ప్రత్యేక, యాదృచ్ఛిక, పర్యవసాన, శిక్షణాత్మక లేదా దండనాత్మక నష్టాలకు ఏ విధంగానూ బాధ్యత వహించరు.
మరిన్ని వివరాలు మరియు విధానాల కోసం దయచేసి నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ ద్వారా మమ్మల్ని సంప్రదించడానికి సంకోచించకండి. మీరు మాకు 18602660111 పై కాల్ చేయవచ్చు లేదా ఇక్కడ పేర్కొన్న ఈమెయిల్ అడ్రస్ ద్వారా మెయిల్ చేయవచ్చు:
[email protected].