Sign In

For Suspension of fresh subscription in certain schemes of NIMF, kindly refer to ADDENDUM

మ్యూచువల్ ఫండ్స్‌లో ఆన్‌లైన్‌లో పెట్టుబడి పెట్టండి​

మీ డబ్బును వృద్ధి చేయడానికి, అలాగే మీ పన్ను విధించదగిన ఆదాయాన్ని కూడా ఆదా చేయడానికి పెట్టుబడులు ఒక మంచి మార్గం. చాలా కాలం వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు (ఎఫ్‌డిలు), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్‌సి), పోస్ట్ ఆఫీస్ ఫండ్స్ మొదలైన వాటిలో మాత్రమే పెట్టుబడి పెట్టి, వాటి నుంచి మంచి లాభాలు పొందగలరని విశ్వసించేవారు. కానీ మ్యూచువల్ ఫండ్స్ అంతిమంగా పెట్టుబడుల వాటాను పొందడానికి మార్గాన్ని సుగమం చేశాయి, ముఖ్యంగా ఎవరైతే ఎక్కువ లాభాలను పొందే క్రమంలో రిస్కులు తీసుకోవడంలో వెనకడుగు వేయరో వారికి ఒక మంచి ఆప్షన్.

మ్యూచ్యువల్ ఫండ్స్‌ను మరింత సాధారణ, సులభమైన పద్ధతిలో నిర్వచించవలసి ఉంటే, మ్యూచ్యువల్ ఫండ్ అనేది సాధారణ ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి పెట్టుబడిదారులు వారి ఫండ్స్‌ను సెక్యూరిటీలలో పెట్టుబడిగా పెట్టి లాభాలను పొందటానికి సహాయపడే ఒక సాధనం. ఆ తర్వాత జనరేట్ చేయబడిన లాభాలు షేర్‌హోల్డర్స్ మధ్య డివిడెండ్‌ల వాటాగా షేర్ చేయబడతాయి. కానీ ఈ ఫండ్స్ నిర్వహణ అనేది అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు (ఎఎమ్‌సిలు) లేదా మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ద్వారా నిర్వహించబడుతుంది, ఇక్కడ ఫండ్ మేనేజర్లు లేదా మనీ మేనేజర్లు అని పిలువబడే వృత్తి నిపుణులు ఉంటారు, వారు మార్కెట్ పనితీరును గమనిస్తూ, మీ డబ్బు మీకు అనుకూలమైన లాభాలను అందిస్తుందని నిర్ధారిస్తారు.

మరింత సులభతరం చేయడానికి, మీ సమయం, అలాగే శ్రమను తగ్గించడానికి, మీరు ఆన్‌లైన్ మ్యూచువల్ ఫండ్స్ కోసం అప్లై చేయవచ్చు. దీని అర్థం కొన్ని వివరాలు అందించి, కొన్ని క్లిక్స్ చేయడం ద్వారా, పేపర్ వర్క్ యొక్క అన్ని ఇబ్బందులను దూరం చేసి, మీరు మీ డబ్బును పెట్టుబడి పెట్టడానికి, అలాగే దాని నిర్వహణకు సిద్ధంగా ఉంటారు. అన్ని లావాదేవీలు, ఫండ్ ట్రాన్స్‌ఫర్‌లు వేగంగా చేయవచ్చు. ఇంటర్నెట్‌లోని మొత్తం సమాచారానికి త్వరిత, సులువైన యాక్సెస్, ప్రత్యేకించి మార్కెట్‌లోని స్కీంలు, ప్లాన్‌ల గురించి మొత్తం ప్రాసెస్‌ను తెలుసుకోవడాన్ని సులభతరం చేస్తుంది. కాబట్టి, షేర్లు లేదా స్టాక్ ట్రేడింగ్‌లో పెట్టుబడి పెట్టడం లేదా పెట్టుబడుల ఆన్‌లైన్ నిర్వహణ కేక్ వాక్ లాగా ఉంటుంది.

మ్యూచ్యువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టేటప్పుడు, మీరు మీ ఆర్థిక లక్ష్యాలు, అనుకూలత ఆధారంగా వాటిలో వివిధ రకాల నుండి ఎంచుకోవచ్చు. మీరు అలా చేస్తున్నప్పుడు, పాలసీ డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవాలి, అలాగే అందులో ఉన్న రిస్క్ గురించి తెలుసుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్‌లో ఆన్‌లైన్ ద్వారా పెట్టుబడి పెట్టడం ఇప్పుడు సాధ్యమైనందున, వారి ఫండ్స్ నిర్వహించడానికి మరియు దానిలో జాగ్రత్తగా అప్లై చేయడానికి స్వేచ్ఛ ఉంది. మ్యూచువల్ ఫండ్స్‌లో ఆన్‌లైన్ ద్వారా పెట్టుబడి సౌకర్యాన్ని చూస్తున్నప్పుడు, ఎక్కువ మంది ఈ విధానంలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు దాదాపుగా ప్రతి మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఆన్‌లైన్ పెట్టుబడి సదుపాయాన్ని అందిస్తుంది. మీ ఫండ్స్ మెరుగైన నిర్వహణ మరియు వ్యూహాత్మక ప్రణాళికను సులభతరం చేయడానికి, ఫండ్ మేనేజర్లు సహాయం చేయడానికి అందుబాటులో ఉన్నారు, అలాగే సరైన స్కీంను ఎంచుకోవడానికి, గరిష్ఠ లాభాల కోసం దానిని రెగ్యులర్‌గా నిర్వహించడానికి వారు మీకు సహాయపడతారు.

మీరు ఇంకా ఏ పెట్టుబడులను చేయకపోతే, అలాగే పెట్టుబడి పెట్టడానికి ఉత్సాహంగా ఉంటే, మీరు మ్యూచ్యువల్ ఫండ్స్ కోసం ఆన్‌లైన్‌లో శోధించి, దాని ప్రస్తుత, కొత్త పెట్టుబడిదారులకు ఆన్‌లైన్ లావాదేవీలను అందించే అనేక ఎఎమ్‌సిలను మీరు కనుగొనవచ్చు.

డిస్‌క్లెయిమర్లు
ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు వ్యక్తం చేయబడుతున్న ఉద్దేశాలు కేవలం అభిప్రాయాలను మాత్రమే కలిగి ఉంటాయి. అందువల్ల వీటిని పాఠకుల కోసం మార్గదర్శకాలు లేదా సిఫార్సులు లేదా ప్రొఫెషనల్ గైడ్‌గా పరిగణించకూడదు. పరిశ్రమ మరియు మార్కెట్లకు సంబంధించిన నిర్దిష్ట వాస్తవిక మరియు గణాంక సమాచారం (చారిత్రాత్మకమైన మరియు అంచనా వేయబడిన) స్వతంత్ర థర్డ్ పార్టీ వనరుల నుండి సేకరించబడింది, ఇవి విశ్వసనీయమైనవిగా పరిగణించబడ్డాయి. ఎన్ఎఎం ఇండియా (రిలయన్స్ నిప్పాన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్) అటువంటి సమాచారం లేదా డేటా యొక్క ఖచ్చితత్వం లేదా ప్రామాణికతను, లేదా అటువంటి డేటా మరియు సమాచారం ప్రాసెస్ చేయబడిన లేదా అంచనా వేయబడిన ఊహల యొక్క సహేతుకతను స్వతంత్రంగా ధృవీకరించలేదు; ఎన్ఎఎం ఇండియా (గతంలో రిలయన్స్ నిప్పాన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ అని పేర్కొనబడేది) అటువంటి డేటా మరియు సమాచారం యొక్క ఖచ్చితత్వం లేదా ప్రామాణికతకు ఏ విధంగానూ హామీ ఇవ్వదు. ఈ మెటీరియల్స్‌లో ఉన్న కొన్ని స్టేట్‌మెంట్‌లు మరియు వాదనలు ఎన్ఎఎం ఇండియా యొక్క (గతంలో రిలయన్స్ నిప్పాన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ అని పేర్కొనబడేది) ఉద్దేశాలు లేదా అభిప్రాయాలను ప్రతిబింబిస్తాయి, ఇవి అటువంటి డేటా లేదా సమాచారం ఆధారంగా ఏర్పడి ఉండవచ్చు.

ఏవైనా పెట్టుబడులు పెట్టడానికి ముందు, ఒక వ్యక్తిగత నిపుణుడి సలహా తీసుకోవాల్సిందిగా పాఠకులకు సూచించడమైనది, ఒక తెలివైన పెట్టుబడి నిర్ణయం తీసుకోవడానికి విషయాలను ధృవీకరించుకోవాలి. స్పాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, ట్రస్టీ, వారి సంబంధిత డైరెక్టర్లు, ఉద్యోగులు, అనుబంధ సంస్థలు లేదా ప్రతినిధులు ఎవరూ కూడా ఈ మెటీరియల్‌లో ఉన్న సమాచారం కారణంగా ఉత్పన్నమయ్యే నష్టాలకు ప్రత్యక్ష, పరోక్ష, ప్రత్యేక, యాదృచ్ఛిక, పర్యవసాన, శిక్షణాత్మక లేదా దండనాత్మక నష్టాలకు ఏ విధంగానూ బాధ్యత వహించరు.

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి, స్కీమ్ సంబంధిత అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి.


Get the app