Sign In

For Suspension of fresh subscription in certain schemes of NIMF, kindly refer to ADDENDUM

మైనర్ అకౌంట్‌లో మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడి: ఎలా పెట్టుబడి పెట్టాలి, లాభాలు మరియు నష్టాలు​

"ఇన్వెస్ట్-అండ్-ఫర్‌గెట్-ఇట్" అనే పాలసీని నమ్మే పెట్టుబడిదారునికి, మ్యూచువల్ ఫండ్స్ ఒక తెలివైన ఎంపిక కావచ్చు. అయితే, దీర్ఘకాలిక పెట్టుబడి కోసం పెట్టుబడిదారునికి సహనం మరియు స్థిరత్వం అవసరం. ఇక్కడ, మైనర్ పేరుతో పెట్టుబడి పెట్టడం మిమ్మల్ని మరింత స్థిరంగా మరియు క్రమశిక్షణగా ఉంచుతుంది. తల్లిదండ్రులుగా, మీ బిడ్డ ఎలాంటి విపత్కర ఆర్థిక పరిస్థితిలో బాధపడకుండా చూసుకోవడం గొప్ప బాధ్యత అనిపించుకుంటుంది.

పెరుగుతున్న విద్యా ఖర్చులను పరిగణనలోకి తీసుకున్నప్పుడు, తల్లిదండ్రులు/సంరక్షకులు భవిష్యత్తులో వారు భరించాల్సిన విద్యా ఖర్చుల గురించి ఆలోచనలో పడతారు. అందువల్ల, వీలైనంత త్వరగా మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల మీపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా ఆ కర్తవ్యాన్ని సులభంగా నెరవేర్చవచ్చు.

ఒక మైనర్ కోసం మ్యూచువల్ ఫండ్ అకౌంటులో ఎలా పెట్టుబడి పెట్టాలి

కెవైసి అనుకూల సంరక్షకుని ద్వారా మైనర్ పేరు మీద మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి సాధ్యమవుతుంది. ఒక సంరక్షకుడు తల్లిదండ్రులు కావచ్చు లేదా న్యాయస్థానం నియమించిన చట్టపరమైన సంరక్షకుడు కావచ్చు. మీరు తల్లిదండ్రులు అయితే, మీరు రిలేషన్‌షిప్ ప్రూఫ్‌ను సమర్పించాలి మరియు మీరు చట్టపరమైన సంరక్షకులైతే, మిమ్మల్ని చట్టపరమైన సంరక్షకునిగా నియమిస్తూ కోర్టు జారీ చేసిన లేఖ అవసరం అవుతుంది. మైనర్ కోసం మీకు కింద పేర్కొన్న విషయాలు అవసరం-

1. మైనర్ వయస్సు రుజువు (ఏదైనా ప్రభుత్వం జారీ చేసిన రుజువు లేదా స్కూల్ సర్టిఫికేట్ మొదలైనవి)
2. పెట్టుబడికి ఆధారమైన బ్యాంక్ అకౌంట్ మైనర్ లేదా మైనర్/సంరక్షకుని పేరుతో ఉండాలి

ఇప్పుడు మనం ఈ ఆర్టికల్‌లోని అత్యంత ఆసక్తికరమైన భాగానికి వెళ్దాం, మైనర్ పేరు మీద మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల కలిగే లాభాలు మరియు నష్టాలు.

మైనర్ పేరుతో మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల కలిగే లాభాలు

● పిల్లల పేరు మీద పెట్టుబడి పెట్టడం వల్ల తల్లిదండ్రులు లేదా సంరక్షకులలో క్రమశిక్షణ పెరుగుతుంది. ఇది వారిని మరింత స్థిరంగా మరియు ఆర్థిక లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రేరేపిస్తుంది. ఒకసారి మీరు పెట్టుబడితో మానసికంగా కనెక్ట్ అయిన తర్వాత, ఫండ్ నుండి ఉపసంహరించుకోవడం అనేది మీ మనస్సులో చివరి విషయంగా మిగిలిపోతుంది.

● అలాగే, ఇది తల్లిదండ్రులు లేదా సంరక్షకుల కోసం మాత్రమే కాదు, పిల్లల పేరు మీద ప్రత్యేక పెట్టుబడి అకౌంటును కలిగి ఉండటం వల్ల అతనికి/ఆమెకు ఆర్థిక బాధ్యతల గురించి మరింత అవగాహన కలుగుతుంది. చిన్నప్పటి నుండే ఒక పెట్టుబడి ప్రోడక్ట్‌ను కలిగి ఉండాలనే భావన పిల్లల్లో పొదుపు అలవాటును పెంచుతుంది. పిల్లలు మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిని అతని/ఆమె పిగ్గీ బ్యాంక్‌గా పరిగణించవచ్చు మరియు తదనుగుణంగా పొదుపు చేయవచ్చు.

● మరీ ముఖ్యంగా, దీర్ఘకాలిక మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి పన్ను చెల్లింపుదారుల పన్ను సామర్థ్యాన్ని పెంచుతుంది. పిల్లవాడు మైనర్ అయ్యే వరకు మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి నుండి వచ్చే ఏదైనా మూలధన లాభాల పై పన్ను తల్లిదండ్రులు లేదా సంరక్షకుల పన్ను స్లాబ్ ప్రకారమే విధించబడుతుంది. మైనర్ 18 ఏళ్లు దాటిన తర్వాత, మూలధన లాభాల పన్ను పిల్లల చేతుల్లోకి వస్తుంది.

అంతేకాకుండా, 18 సంవత్సరాల వయస్సు తర్వాత తల్లిదండ్రులు లేదా సంరక్షకుల కంటే పిల్లవాడు తక్కువ ఆదాయపు పన్ను పరిధిలోకి వస్తాడు. అందువల్ల, మైనర్‌ పై పన్ను బాధ్యత నామమాత్రంగా ఉంటుంది.

మైనర్ పేరుతో మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల కలిగే నష్టాలు

● పిల్లలకు 18 ఏళ్లు నిండిన తర్వాత మీరు పెట్టుబడి అకౌంట్ స్టేటస్‌ని మైనర్ నుండి మేజర్‌కు మార్చాలి. ఇది చేయడం చాలా ముఖ్యం. లేదంటే, భవిష్యత్ లావాదేవీల నుండి అకౌంట్ పరిమితం చేయబడవచ్చు. ఇక్కడ మైనర్ నుండి మేజర్‌కు మారడానికి నిర్వచించబడిన కొన్ని ప్రధాన నియమాలు ఉన్నాయి, వాటిని అనుసరించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మేజర్ అయిన చిన్నారికి పాన్ కార్డ్ ఉండాలి మరియు కెవైసి పూర్తి చేసి ఉండాలి.

● అలాగే, భారీ మొత్తంగా పెట్టుబడి పెట్టడంలో కూడా ఒక లోపం ఉంది. 18 ఏళ్ల పిల్లలు ఆ డబ్బును నిర్వహించే విధంగా పరిణతి చెందకపోవచ్చు. అంతేకాకుండా, మైనర్ పెట్టుబడి అకౌంటులో జాయింట్ హోల్డర్‌ను కలిగి ఉండటానికి మీకు అనుమతి లేదు. అయినప్పటికీ, అది కూడా ఒక మంచి అభిప్రాయం.

మీ పిల్లల భవిష్యత్తు విషయానికి వస్తే సమాచారంతో కూడిన నిర్ణయం తీసుకోండి. అలాగే ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, మరొకరికి ఏది పని చేస్తుందో అది మీకు పని చేయకపోవచ్చు. కాబట్టి, మీ సౌకర్యాన్ని బట్టి పెట్టుబడి పెట్టండి.

ఇక్కడ ఉన్న సమాచారం సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు పేర్కొన్న వివరణలు కేవలం అభిప్రాయాలను మాత్రమే సూచిస్తాయి, కావున వీటిని, పాఠకులకు మార్గదర్శకాలు, సిఫార్సులు లేదా నిపుణుల సలహాలుగా పరిగణించకూడదు. బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారం, అంతర్గతంగా అభివృద్ధి చేయబడిన డేటా మరియు ఇతర విశ్వసనీయమైన మూలాల ఆధారంగా ఈ డాక్యుమెంట్ తయారు చేయబడింది. స్పాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, ట్రస్టీ లేదా వారి డైరెక్టర్లు, ఉద్యోగులు, అనుబంధ సంస్థలు లేదా ప్రతినిధులు ("సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు") అటువంటి సమాచారం యొక్క ఖచ్చితత్వం, పరిపూర్ణత, సమగ్రత మరియు విశ్వసనీయతకు ఎలాంటి బాధ్యత వహించరు. ఈ సమాచారాన్ని స్వీకరించే వారు తమ సొంత విశ్లేషణ, వివరణలు మరియు పరిశోధనలపై ఆధారపడాలని సూచించడమైనది. తెలివైన పెట్టుబడి నిర్ణయం తీసుకోవడానికి, వృత్తిపరమైన నిపుణుల సలహా తీసుకోవాలని పాఠకులకు సలహా ఇవ్వడమైనది. ఈ మెటీరియల్ తయారీ లేదా జారీలో భాగంగా ఉన్న వ్యక్తులతో సహా సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు, ఈ మెటీరియల్‌లో ఉన్న సమాచారం ఆధారంగా పొందిన లాభాలు, నష్టాలతో సహా ఏదైనా ప్రత్యక్ష, పరోక్ష, ప్రత్యేక, అనుకోని, పర్యవసాన, శిక్షణాత్మక లేదా దండనాత్మక నష్టాలకు బాధ్యత వహించవు. ఈ డాక్యుమెంట్ ఆధారంగా తీసుకునే ఏ నిర్ణయానికైనా స్వీకర్త మాత్రమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది.

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి, స్కీమ్ సంబంధిత అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి.


Get the app