ఒక వస్తువును కొనుగోలు చేసేటప్పుడు, మన పెట్టుబడుల కోసం మనం చెల్లించే డబ్బు విలువను నిర్ణయించడానికి రెండు సాధారణ విషయాలను గురించి ఆరా తీస్తాము, అవి: ప్రోడక్ట్ కొటేషన్ మరియు పనితీరు. మ్యూచువల్ ఫండ్స్ కూడా అంతే. సామాన్యుల భాషలో మ్యూచువల్ ఫండ్స్ సెబీ (మ్యూచువల్ ఫండ్స్) రెగ్యులేషన్స్, 1996 కింద సెబీ ద్వారా నిర్వహించబడతాయి మరియు నియంత్రించబడతాయి, ఇక్కడ కొందరు వ్యక్తుల సమూహాలు సమిష్టిగా తమ డబ్బును సెక్యూరిటీలలో పెట్టుబడి పెడతారు.
మ్యూచువల్ ఫండ్స్దాని పెట్టుబడిదారులకు నిధుల యొక్క విభిన్న పెట్టుబడుల కోసం లేదా తక్కువ ఖర్చుతో వృత్తిపరంగా నిర్వహించే సెక్యూరిటీల కోసం అనుమతిస్తుంది.
మనందరికీ తెలిసినట్లుగా మ్యూచువల్ ఫండ్ రకాలు ఈక్విటీ ఫండ్స్, డెట్ ఫండ్స్, డైవర్సిఫైడ్ ఫండ్స్, మనీ మార్కెట్ ఫండ్స్, గిల్ట్ ఫండ్స్, సెక్టార్ స్పెసిఫిక్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్, ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్, లార్జ్, మిడ్ లేదా లో క్యాప్ ఫండ్స్, ఓపెన్ ఎండెడ్ ఫండ్స్, క్లోజ్ ఎండెడ్ ఫండ్స్, డివిడెండ్ పేయింగ్, రీఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ మొదలైనవి, పెట్టుబడి పెట్టేటప్పుడు పైన పేర్కొన్న మరియు ఇతర రకాల సెక్యూరిటీలను గురించి మీరు స్పష్టంగా తెలుసుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు మరియు ఎంపిక చేసుకోవచ్చు. మీరు మీ మనీ మేనేజర్ నుండి సలహాలను కోరినప్పుడు మరియు పాలసీ డాక్యుమెంట్‌ను చదివేటప్పుడు ఇందులో ఉన్న రిస్కుని గుర్తించగలుగుతారు మరియు నెట్ అసెట్ వాల్యూ (ఎన్ఏవి) యొక్క తాజా ట్రెండ్‌లను , తద్వారా మీ మ్యూచువల్ ఫండ్స్ పనితీరు చూడగలుగుతారు.
ఎన్ఏవి ని నిర్వచనం - యూనిట్‌ల యొక్క నెట్ అసెట్ వాల్యూ (ఎన్ఏవి) ప్రతిరోజూ లేదా నిబంధనల ద్వారా నిర్దేశించబడిన విధంగా నిర్ణయించబడుతుంది.
మ్యూచువల్ ఫండ్ ఎన్ఏవి ఈ కింది ఫార్ములా ప్రకారం లేదా కాలానుగుణంగా సెబీ సూచించిన ఇతర ఫార్ములా ప్రకారం లెక్కించబడుతుంది.
ఎన్ఎవి = [మార్కెట్ /స్కీమ్ యొక్క పెట్టుబడుల సరసమైన విలువ + రిసీవబుల్స్ + సంపాదించిన ఆదాయం + ఇతర అసెట్స్ - ఖర్చులు - పేయబుల్స్ - ఇతర లయబిలిటీలు] / అవుట్‌స్టాండింగ్ యూనిట్‌ల సంఖ్య
ఎన్ఎవి నాలుగు దశాంశ స్థానాల వరకు లెక్కించబడుతుంది.
ఎన్ఏవి అనేది మీ పెట్టుబడుల యొక్క లిక్విడేషన్ విలువను ప్రతిబింబిస్తుంది మరియు దానిని రెగ్యులర్‌గా ట్రాక్ చేయడం ద్వారా పెట్టుబడి పెట్టడానికి ముందు ప్రోడక్ట్ పనితీరును నిర్ధారించడంలో సహాయపడుతుంది. ఇలా చేయడంతో మీరు మార్కెట్ హెచ్చుతగ్గులు మరియు అనేక పెట్టుబడులు, ప్రోడక్ట్ పనితీరుపై గల ప్రభావాలను గురించి నిశితంగా చెక్ చేయవచ్చు. చాలా వరకు ఎన్ఏవి అనేది విభిన్నమైన ప్రొడక్ట్స్ కోసం చూసే పెట్టుబడిదారులను ఆహ్వానించే ఒక కారకంగా పనిచేస్తుంది, అదే సమయంలో రిటర్న్స్ లెక్కించడంలో వారికి సహాయపడుతుంది మరియు వారి నెలవారీ చెల్లింపులను కూడా చాలా ముందుగానే నిర్వహిస్తుంది. వివరంగా చెప్పాలంటే, ఎన్ఏవి అనేది మీ రిటర్న్స్ మరియు రిస్కులను తెలుసుకోవడానికి మరియు అంచనా వేయడానికి ఒక ఫార్ములాగా మాత్రమే కాకుండా, మీరు మ్యూచువల్ ఫండ్స్‌ని ఖచ్చితమైన అర్హత కలిగిన పెట్టుబడులుగా గుర్తించడానికి మరియు ట్రేస్ చేయడానికి వీలు కల్పిస్తుంది.
వివిధ ప్రోడక్టులు అందించే
తాజా ఎన్ఏవి ని పరిశీలించి ట్రాక్ చేయాలని చాలా మంది ఇన్వెస్టర్లు భావించినప్పటికీ, ఈ పద్ధతిని నిరర్థకం అని వ్యతిరేకించే వారు కూడా కొందరు ఉన్నారు, ఎందుకనగా, ఎవరైనా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టినప్పుడు, వారు ఎన్ఏవి వద్ద అసెట్స్ యొక్క ప్రస్తుత మార్కెట్ ధర వద్ద లెక్కించిన యూనిట్‌లను కొనుగోలు చేస్తారు. అందువల్ల, ఇది ఫండ్ యొక్క అంతర్గత విలువను సూచిస్తుంది. అయితే, స్టాక్ పెట్టుబడి విషయంలో, స్టాక్స్ ధర సాధారణంగా దాని బుక్ వాల్యూ నుండి మారుతుంది, అంటే కంపెనీ బుక్ వాల్యూతో పోలిస్తే స్టాక్ ధర ఎక్కువ లేదా తక్కువగా ఉండొచ్చు.
ఒకరి నమ్మకాలతో సంబంధం లేకుండా, మార్కెట్ పరిజ్ఞానం పరంగా ఎన్ఏవి ట్రెండ్‌లను పరిశీలించడం అనేది ఎల్లప్పుడూ మంచి ఆలోచన. మరియు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్‌లు రిస్క్‌తో కూడి ఉన్నప్పటికీ, బాగా నిర్వహించబడినప్పుడు దానిని గొప్ప రివార్డ్‌గా పరిగణించాలి.
సారాంశం: ఎన్ఏవి మీ పెట్టుబడుల లిక్విడేషన్ విలువను ప్రతిబింబిస్తుంది మరియు దానిని క్రమం తప్పకుండా ట్రాక్ చేయడం ద్వారా ఒక ప్రోడక్ట్ పై పెట్టుబడి పెట్టడానికి ముందు దాని పనితీరును నిర్ధారించడంలో మీకు సహాయపడుతుంది. ఇలా చేయడం ద్వారా మీరు మార్కెట్ హెచ్చుతగ్గులు మరియు అనేక పెట్టుబడి ప్రోడక్ట్స్ పనితీరుపై ప్రభావాలను నిశితంగా చెక్ చేయవచ్చు. ఎన్ఏవి అనేది ఒక నిర్దిష్ట రోజున మార్కెట్‌లో ప్రదర్శించే ఫండ్స్ యొక్క ప్రతి షేర్ విలువను సూచిస్తుంది.
డిస్‌క్లెయిమర్లు
ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు వ్యక్తం చేయబడుతున్న ఉద్దేశాలు కేవలం అభిప్రాయాలను మాత్రమే కలిగి ఉంటాయి. అందువల్ల వీటిని పాఠకుల కోసం మార్గదర్శకాలు లేదా సిఫార్సులు లేదా ప్రొఫెషనల్ గైడ్‌గా పరిగణించకూడదు. పరిశ్రమ మరియు మార్కెట్లకు సంబంధించిన నిర్దిష్ట వాస్తవిక మరియు గణాంక సమాచారం (చారిత్రాత్మకమైన మరియు అంచనా వేయబడిన) స్వతంత్ర థర్డ్ పార్టీ వనరుల నుండి సేకరించబడింది, ఇవి విశ్వసనీయమైనవిగా పరిగణించబడ్డాయి. ఎన్ఎఎం ఇండియా (రిలయన్స్ నిప్పాన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్) అటువంటి సమాచారం లేదా డేటా యొక్క ఖచ్చితత్వం లేదా ప్రామాణికతను, లేదా అటువంటి డేటా మరియు సమాచారం ప్రాసెస్ చేయబడిన లేదా అంచనా వేయబడిన ఊహల యొక్క సహేతుకతను స్వతంత్రంగా ధృవీకరించలేదు; ఎన్ఎఎం ఇండియా (గతంలో రిలయన్స్ నిప్పాన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ అని పేర్కొనబడేది) అటువంటి డేటా మరియు సమాచారం యొక్క ఖచ్చితత్వం లేదా ప్రామాణికతకు ఏ విధంగానూ హామీ ఇవ్వదు. ఈ మెటీరియల్స్‌లో ఉన్న కొన్ని స్టేట్‌మెంట్‌లు మరియు వాదనలు ఎన్ఎఎం ఇండియా యొక్క (గతంలో రిలయన్స్ నిప్పాన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ అని పేర్కొనబడేది) ఉద్దేశాలు లేదా అభిప్రాయాలను ప్రతిబింబిస్తాయి, ఇవి అటువంటి డేటా లేదా సమాచారం ఆధారంగా ఏర్పడి ఉండవచ్చు.
ఏవైనా పెట్టుబడులు పెట్టడానికి ముందు, ఒక వ్యక్తిగత నిపుణుడి సలహా తీసుకోవాల్సిందిగా పాఠకులకు సూచించడమైనది, ఒక తెలివైన పెట్టుబడి నిర్ణయం తీసుకోవడానికి విషయాలను ధృవీకరించుకోవాలి. స్పాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, ట్రస్టీ, వారి సంబంధిత డైరెక్టర్లు, ఉద్యోగులు, అనుబంధ సంస్థలు లేదా ప్రతినిధులు ఎవరూ కూడా ఈ మెటీరియల్‌లో ఉన్న సమాచారం కారణంగా ఉత్పన్నమయ్యే నష్టాలకు ప్రత్యక్ష, పరోక్ష, ప్రత్యేక, యాదృచ్ఛిక, పర్యవసాన, శిక్షణాత్మక లేదా దండనాత్మక నష్టాలకు ఏ విధంగానూ బాధ్యత వహించరు.
మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి, స్కీమ్ సంబంధిత అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి.