Sign In

For Suspension of fresh subscription in certain schemes of NIMF, kindly refer to ADDENDUM

మ్యూచువల్ ఫండ్స్‌లో ఆన్‌లైన్ పెట్టుబడి- తెలివైన పెట్టుబడికి ఒక తెలివైన మార్గం

సారాంశం: వరల్డ్ వైడ్ వెబ్ దాని కొనుగోలుదారులతో వేగవంతం అవడం వల్ల, పెట్టుబడి కూడా దాని పెట్టుబడిదారుల కోసం ఆన్‌లైన్‌ బాట పట్టింది. బ్రోకర్ చుట్టూ పరుగెత్తడం, పేపర్ వర్క్ చేయడం మరియు సుదీర్ఘమైన క్యూలలో నిలబడటం కన్నా మ్యూచువల్ ఫండ్స్‌లో ఆన్‌లైన్ పెట్టుబడితో ఆదాయాన్ని సేవ్ చేయడం అందరికీ శ్రేయస్కరం. తాజా మార్కెట్ ట్రెండ్‌లు, ఎన్ఏవిలు, డివిడెండ్‌లు, వివిధ కాలిక్యులేటర్లు మరియు వివిధ టూల్స్‌కి యాక్సెస్ మొదలైనవన్నీ కేవలం కొన్ని క్లిక్‌ల దూరంలో ఉన్నాయి. కాబట్టి, మీరు ఇప్పటికీ పాత ట్రాక్‌ను అనుసరిస్తున్నట్లయితే, మీ ఫండ్స్‌ని అప్‌గ్రేడ్ చేయడానికి మరియు ఆన్‌లైన్‌లో పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన సమయం.

నేటి వేగవంతమైన మరియు ఇంటర్నెట్ యుగంలో, మీరు తెలుసుకోవాలనుకున్న ప్రతిదీ మరియు మీరు కొనుగోలు చేయాలనుకునే ఏదైనా ఎల్లపుడూ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటే, పెట్టుబడులు ఎందుకు ఆన్‌లైన్‌లో పెట్టకూడదు?

అవును! మన రోజువారీ బిజీ జీవితంలో సమయం చాలా విలువైనది. పని మరియు ఇంటి బాధ్యతలను నిర్వర్తించడం ఎక్కువ సమయం తీసుకుంటుంది, మిగిలిన రోజంతా మీటింగ్స్ మరియు డెడ్‌లైన్స్ మధ్య ప్యాక్ చేయబడుతుంది. మీరు పొందే కొన్ని విలువైన క్షణాలలో డబ్బును నిర్వహించాల్సి వస్తే, పెట్టుబడి కోసం వ్యక్తిగతంగా బ్యాంకుకు వెళ్లడం చాలా కష్టం. అలాగే ముందుగా పెట్టుబడి రకాలు మరియు పాలసీల గురించి అవగాహన పొందడం, మార్కెట్‌ని అర్థం చేసుకోవడం, టెక్నాలజీని పరిశీలించడం మరియు పాలసీ డాక్యుమెంట్‌లను చదవడం, లాక్ ఇన్ పీరియడ్, లిక్విడిటీ మొదలైన వాటి పరంగా జీరో డౌన్ ప్రాధాన్యతలను పొందాలని డిమాండ్ చేయడం అనేది కూడా వ్యక్తిగతంగా అసాధ్యం. ఈ విధంగా విషయాలను సరళీకృతం చేయడానికి, సమయాన్ని ఆదా చేయడానికి మరియు ప్రజలను ప్రోత్సహించడానికి మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి, ఆన్‌లైన్ పెట్టుబడి సాధ్యం అవుతుంది.

ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్‌తో ప్రజలు సౌకర్యవంతంగా ఉన్నందున, పెట్టుబడిదారు కూడా చాలా పెట్టుబడి బ్యాంకులను గుర్తించారు. మునుపటి రోజుల్లో పెట్టుబడి పెట్టడం అనేది మ్యూచువల్ ఫండ్స్ఎక్కువ పేపర్ వర్క్‌ను కలిగి ఉండే సుదీర్ఘమైన పని, కానీ ఆన్‌లైన్ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులకు పెరిగిన ప్రజాదరణ, వినియోగంతో ఆఫ్‌లైన్ ప్రాసెస్ ఇక ముగిసిందని మరియు ఆన్‌లైన్ అప్లికేషన్ తక్కువ, సరళమైన ప్రాసెస్‌ను కలిగి ఉంటుందని స్పష్టమైంది. దీనికి కావలసిందల్లా ఒక ఫారమ్ నింపడం. ఇది వెంటనే సబ్మిట్ అవుతుంది, కావున ఇక క్యూలలో నిలబడవలసిన అవసరం ఉండదు మరియు ఆన్‌లైన్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ అనేది కేవలం ఒక క్లిక్‌తో పూర్తయ్యే పని కనుక; ట్రాన్స్‌ఫర్ మరియు వాణిజ్య లావాదేవీలు కూడా క్షణంలో జరుగుతాయి.

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టేటప్పుడు, వివిధ ప్లాన్‌లు, స్కీమ్‌లు మరియు దాని ఫీచర్‌లతో పాటు నిబంధనలు తెలుసుకోవడం చాలా అవసరం, అందుకే దాదాపు అన్ని అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీల (ఏఎంసిలు) వెబ్‌సైట్‌లలో ఇవన్నీ స్పష్టంగా పేర్కొనబడ్డాయి. అలాగే, మ్యూచువల్ ఫండ్స్‌లో మీ ఆన్‌లైన్ పెట్టుబడి అనుభవం కోసం మృదువైన ప్రవాహాన్ని సులభతరం చేయడానికి వివిధ పెట్టుబడి కంపెనీల యొక్క రిస్క్ ప్రొఫైలింగ్ వెబ్‌సైట్‌లతో యూజర్‌కు మరింత సహాయపడటానికి, ఆఫర్ చేసిన ప్రోడక్ట్ యొక్క ప్రాథమిక సమాచారం నుండి మార్కెట్ అప్‌డేట్‌ల వరకు ప్రతిదీ అందుబాటులో ఉంచుతుంది తాజా ఎన్ఏవిలు, స్కీమ్ సమాచారం, అప్లికేషన్ ఫారమ్ మొదలైనవి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇంకా అనేక టూల్స్ మరియు కాలిక్యులేటర్లు ఉన్నాయి, ఇవి పెట్టుబడిదారులకు తమ లక్ష్యాలు, ఎస్ఐపిలు మరియు కార్పస్‌ను అంచనా వేయడానికి మరింత సహాయపడతాయి. అన్ని వేళల్లో అమితమైన సమాచారం అందుబాటులో ఉన్నందున మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి అనేది ఇకపై శ్రమతో కూడుకున్న ప్రాసెస్ కాదు.

మరియు మ్యూచువల్ ఫండ్స్‌లో ఆన్‌లైన్‌ పెట్టుబడి తరువాత, పెట్టుబడిదారునికి ట్రాన్సాక్షన్ పిన్ కేటాయించబడుతుంది మరియు అతని పెట్టుబడులను చూపే ఒక డాష్‌బోర్డ్ కూడా ఉంటుంది, ఇక్కడ దాని పనితీరు మరియు ట్రాన్సాక్షన్‌ను ట్రాక్ చేయవచ్చు, అదనపు సమాచారం, డివిడెండ్ మొదలైనవాటిని చెక్ చేయవచ్చు.

కావున, మీరు ఇప్పటికీ పాత మార్గాన్ని అనుసరిస్తున్నట్లయితే, మీ ఫండ్స్‌ని ఆన్‌లైన్‌లో అప్‌గ్రేడ్ చేసి, పెట్టుబడి పెట్టడానికి సమయం వచ్చింది.

డిస్‌క్లెయిమర్లు
ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు వ్యక్తం చేయబడుతున్న ఉద్దేశాలు కేవలం అభిప్రాయాలను మాత్రమే కలిగి ఉంటాయి. అందువల్ల వీటిని పాఠకుల కోసం మార్గదర్శకాలు లేదా సిఫార్సులు లేదా ప్రొఫెషనల్ గైడ్‌గా పరిగణించకూడదు. పరిశ్రమ మరియు మార్కెట్లకు సంబంధించిన నిర్దిష్ట వాస్తవిక మరియు గణాంక సమాచారం (చారిత్రాత్మకమైన మరియు అంచనా వేయబడిన) స్వతంత్ర థర్డ్ పార్టీ వనరుల నుండి సేకరించబడింది, ఇవి విశ్వసనీయమైనవిగా పరిగణించబడ్డాయి. ఎన్ఎఎం ఇండియా (రిలయన్స్ నిప్పాన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్) అటువంటి సమాచారం లేదా డేటా యొక్క ఖచ్చితత్వం లేదా ప్రామాణికతను, లేదా అటువంటి డేటా మరియు సమాచారం ప్రాసెస్ చేయబడిన లేదా అంచనా వేయబడిన ఊహల యొక్క సహేతుకతను స్వతంత్రంగా ధృవీకరించలేదు; ఎన్ఎఎం ఇండియా (గతంలో రిలయన్స్ నిప్పాన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ అని పేర్కొనబడేది) అటువంటి డేటా మరియు సమాచారం యొక్క ఖచ్చితత్వం లేదా ప్రామాణికతకు ఏ విధంగానూ హామీ ఇవ్వదు. ఈ మెటీరియల్స్‌లో ఉన్న కొన్ని స్టేట్‌మెంట్‌లు మరియు వాదనలు ఎన్ఎఎం ఇండియా యొక్క (గతంలో రిలయన్స్ నిప్పాన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ అని పేర్కొనబడేది) ఉద్దేశాలు లేదా అభిప్రాయాలను ప్రతిబింబిస్తాయి, ఇవి అటువంటి డేటా లేదా సమాచారం ఆధారంగా ఏర్పడి ఉండవచ్చు.

ఏవైనా పెట్టుబడులు పెట్టడానికి ముందు, ఒక వ్యక్తిగత నిపుణుడి సలహా తీసుకోవాల్సిందిగా పాఠకులకు సూచించడమైనది, ఒక తెలివైన పెట్టుబడి నిర్ణయం తీసుకోవడానికి విషయాలను ధృవీకరించుకోవాలి. స్పాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, ట్రస్టీ, వారి సంబంధిత డైరెక్టర్లు, ఉద్యోగులు, అనుబంధ సంస్థలు లేదా ప్రతినిధులు ఎవరూ కూడా ఈ మెటీరియల్‌లో ఉన్న సమాచారం కారణంగా ఉత్పన్నమయ్యే నష్టాలకు ప్రత్యక్ష, పరోక్ష, ప్రత్యేక, యాదృచ్ఛిక, పర్యవసాన, శిక్షణాత్మక లేదా దండనాత్మక నష్టాలకు ఏ విధంగానూ బాధ్యత వహించరు.

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి, స్కీమ్ సంబంధిత అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి.


Get the app