Sign In

For Suspension of fresh subscription in certain schemes of NIMF, kindly refer to ADDENDUM

ఈ ఫ్రెండ్‌షిప్ డే రోజున ఫైనాన్షియల్ ప్లానింగ్!

స్నేహం అనేది జోకులు, కేజ్రీ క్షణాలు మరియు చిలిపి చేష్టలకు మించిన ఒక ప్రత్యేక బంధం. జీవితం ఎత్తుపల్లాలతో నిండి ఉంటుంది, ప్రతి ఒక్కరూ ఆనందకరమైన క్షణాలను పంచుకుంటారు, నిజమైన స్నేహితులు మాత్రమే కష్టసమయాల్లో మనకు తోడుగా ఉంటారు. డబ్బు కూడా అలాంటిదే, అది ఎలాగో ఇక్కడ ఇవ్వబడింది.

  • మంచి సమయాల్లో తోడుగా ఉండే నిజమైన సహచరుడు చెడు సమయాల్లోనూ తోడుగా ఉంటాడు
    ఒక మంచి స్నేహితుడి వలే, సరిగ్గా నిర్వహించబడే ఆర్ధిక వ్యవస్థలు మీ కలలను నెరవేర్చడంలో సహాయపడటమే కాకుండా సంక్షోభ సమయంలోనూ మిమ్మల్ని కాపాడతాయి. మీరు లిక్విడ్ ఫండ్స్ వంటి మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా అటువంటి కార్పస్ నిర్మించవచ్చు. మార్కెట్ లాభాల్లో ఉన్నప్పుడు, మంచి మ్యూచువల్ ఫండ్ స్కీమ్ మీకు అధిక రిటర్న్స్ అందిస్తుంది మరియు మార్కెట్ సంక్షోభ సమయంలో నష్టాలను నియంత్రిస్తూ మీ పెట్టుబడులను రక్షిస్తుంది.
  • డబ్బు ఎల్లప్పుడూ మీకు సహాయం చేస్తుంది
    నిజమైన స్నేహితుడు అంటే మనం వారిని పూర్తిగా నమ్మవచ్చు మరియు సమయం వచ్చినప్పుడు వారు మనకు అండగా నిలుస్తారు అన్న నమ్మకం ఉంటుంది. అదేవిధంగా, అత్యవసర పరిస్థితులలో మీ సేవింగ్‌లు పరిస్థితిని అదుపులో ఉంచుతాయి మరియు భవిష్యత్తులో ఏవైనా అప్పులు లేదా ఆర్థిక సంక్షోభం నుండి మిమ్మల్ని రక్షిస్తాయి.
  • ఎలాంటి ద్వేషాలు లేకుండా మరియు ఏదీ ఆశించకుండా సహాయం చేయడం
    కొన్ని పరిస్థితులలో మీరు దూరంగా ఉండాలని మరియు స్నేహం నుండి విరామం కోరుకున్నప్పుడు ఇది జరుగుతుంది. మరియు మంచి స్నేహితుడు ఎలాంటి దురుద్దేశం లేకుండా మీ స్థానాన్ని గౌరవిస్తారు. ఒక గొప్ప స్నేహితుడిని లాగా, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మీ సేవింగ్స్ వివిధ ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు వివిధ పథకాలకు వెళ్ళడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. అది కూడా, ఎలాంటి ప్రశ్నలు అడగకుండా లేదా ఎలాంటి ద్వేషం లేకుండా. కావున భవిష్యత్తు కోసం పొదుపు చేస్తూనే మీరు మరింత ఆదా చేసుకోవచ్చు మరియు మీ కలలను నెరవేర్చుకోవచ్చు.

మీ ఆర్థిక వ్యవహారాలతో ఒక నమ్మకమైన మరియు దీర్ఘకాలిక స్నేహబంధం ఎలా ఏర్పరచుకోవాలి?

విదేశీ పర్యటన, ఇల్లు లేదా కార్ కొనుగోలు లేదా ఆరోగ్య అత్యవసర పరిస్థితి లేదా ఆర్థిక సంక్షోభం వంటి కష్ట సమయాల్లో, సరైన సమయంలో చేసిన సరైన పెట్టుబడులు ఎల్లప్పుడూ మీ వెన్నంటే ఉంటాయి. మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో ఎలా పెట్టుబడి పెట్టాలో మరియు మీ నమ్మకమైన స్నేహితుడితో ఎలా బంధాన్ని ఏర్పరచుకోవాలో ఇక్కడ ఇవ్వబడింది - మీ సేవింగ్స్.

  • మీ ఆర్థిక లక్ష్యాలను గుర్తించండి
    మీరు విదేశీ పర్యటనకు ప్లాన్ చేస్తున్నారా లేదా పిల్లల భవిష్యత్తు కోసం సేవింగ్ చేస్తున్నారా అనే దాని ప్రకారం మీ షార్ట్, మిడ్-టర్మ్ మరియు లాంగ్-టర్మ్ లక్ష్యాలను నిర్ణయించుకోండి. కావున, మీరు ఎంత పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు మరియు ఎంతకాలం పాటు అనేది ఖచ్చితంగా తెలుసుకోవచ్చు.
  • విభిన్న మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్‌లను అర్థం చేసుకోండి
    మ్యూచువల్ ఫండ్స్ లిక్విడ్ ఫండ్స్, స్మాల్ మరియు లార్జ్ క్యాప్ ఈక్విటీ ఫండ్స్ వంటి వివిధ ప్లాన్లను అందిస్తుంది. మీ లక్ష్యాలు మరియు రిస్క్ సహనం కోసం ఏ స్కీమ్స్ ఉత్తమంగా సరిపోతాయో అర్థం చేసుకోండి.
  • మీ లక్ష్యాల ప్రకారం పెట్టుబడి పెట్టండి
    మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడానికి ముందు పెట్టుబడిపై పనితీరు మరియు రాబడులను విశ్లేషించండి. నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్స్ వంటి భారతదేశంలోని మ్యూచువల్ ఫండ్‌లు వివిధ స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక లక్ష్యాలను చేరుకోవడానికి అనేక రకాల ఫండ్స్‌ని అందిస్తాయి.

ఈ ఫ్రెండ్‌షిప్ డే రోజు, మీరు ఆనందకరమైన క్షణాలను ఆస్వాదిస్తూ, మీ పాత స్నేహితులతో పలు జ్ఞాపకాలను పంచుకుంటారు; మ్యూచువల్ ఫండ్స్ ద్వారా సేవింగ్ చేయడంతో మీరు కొత్త స్నేహాన్ని ప్రారంభించండి. మీ స్కీమ్స్‌ను తెలివిగా ఎంచుకోండి, అది చాలా సంవత్సరాల పాటు మిమ్మల్ని కాపాడుతుంది.

​​

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి, స్కీమ్ సంబంధిత అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి.


Get the app