బాండ్లు అనేవి ఆర్థిక మార్కెట్లో ముఖ్యమైన భాగం, అలాగే అవి కార్పొరేట్లు, ప్రభుత్వం కోసం మూలధనం యొక్క ముఖ్యమైన వనరుగా పనిచేస్తాయి. స్థిర-ఆదాయ సెక్యూరిటీలలో ట్రేడింగ్ విషయానికొస్తే, బాండ్ ఆదాయం అనే భావనను అర్థం చేసుకోవడం ముఖ్యం.
మ్యూచువల్ ఫండ్ లలో,
షార్ట్ టర్మ్ మ్యూచ్యువల్ ఫండ్స్ వంటి డెట్-ఆధారిత ఫండ్స్, బాండ్‌లలో పెట్టుబడి పెట్టడం ద్వారా పెట్టుబడిదారులకు స్వల్ప, మధ్య కాలిక పెట్టుబడులతో మంచి లాభాలను సంపాదించడానికి అవకాశం కల్పిస్తాయి.
బాండ్‌లు, అలాగే వాటిని ప్రభావితం చేసే అంశాల గురించి మరింత తెలుసుకోండి.
బాండ్ అంటే ఏమిటి?
ఇది పెట్టుబడిదారులకు వడ్డీ చెల్లింపుల ద్వారా స్థిరమైన ఆదాయాన్ని అందించే, అలాగే ముందుగా నిర్వచించబడిన మెచ్యూరిటీ తేదీన అసలు మొత్తాన్ని తిరిగి చెల్లించే ఒక డెట్ ఇన్స్ట్రుమెంట్.
మీరు తెలుసుకోవలసిన నియమాలు
1 బాండ్ ధర:
ఇది బాండ్‌కు సంబంధించిన భవిష్యత్తు నగదు ప్రవాహాల ప్రస్తుత విలువ. బాండ్స్ సరఫరా, డిమాండ్ ప్రకారం బాండ్ ధరలు పెరుగుతాయి లేదా తగ్గుతాయి.
2 కూపన్ రేట్:
ఇది బాండ్ ఫేస్ వాల్యూ ఆధారంగా జారీ చేసిన వారి ద్వారా కొనుగోలుదారులకు చెల్లించబడే సమయానుగుణ వడ్డీ రేటు.
3 ఫేస్ వాల్యూ:
దీన్ని సమాన విలువ అని కూడా పిలుస్తారు, దీనర్థం బాండ్ మెచ్యూరిటీ సమయంలో బాండ్ జారీ చేసిన వారు చెల్లించే ధర
4 బాండ్ ఆదాయం:
ఇది కొంత సమయానికి అంచనా వేయబడిన ఆదాయాలు, శాతం ద్వారా తెలియజేయడం జరుగుతుంది.
5
Yield to maturity:
బాండ్‌ను మెచ్యూరిటీ అయ్యే వరకు ఉంచినట్లయితే అంచనా వేయబడే మొత్తం లాభం.
బాండ్ ధర, ఆదాయం యొక్క సంబంధం
ఆదాయం, బాండ్ ధరకు మధ్య ముఖ్యమైన విలోమానుపాత సంబంధం ఉంటుంది. బాండ్ ధర అనేది ఫేస్ వాల్యూ కంటే తక్కువగా ఉంటే, బాండ్ ఆదాయం అనేది కూపన్ రేట్ కంటే ఎక్కువగా ఉంటుంది. బాండ్ ధర అనేది ఫేస్ వాల్యూ కంటే ఎక్కువగా ఉంటే, బాండ్ ఆదాయం అనేది కూపన్ రేట్ కంటే తక్కువగా ఉంటుంది. కాబట్టి, బాండ్ ఆదాయం లెక్కింపు బాండ్ ధర మరియు బాండ్ కూపన్ రేటుపై ఆధారపడి ఉంటుంది. బాండ్ ధర తగ్గితే, ఆదాయం పెరుగుతుంది, మరియు బాండ్ ధర పెరిగితే, ఆదాయం తగ్గుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందో మనం తెలుసుకుందాం:
1 వడ్డీ రేట్లు తగ్గినప్పుడు, ఇది సంబంధిత పెట్టుబడుల యొక్క విలువను తగ్గిస్తుంది. అయితే, జారీ చేయబడిన బాండ్లు అటువంటి సందర్భంలో ఎక్కువగా ప్రభావితం కావు. వారు ప్రారంభం నుండి జారీ చేసిన అదే కూపన్ రేటును చెల్లిస్తూ ఉంటారు, ఇప్పుడు ప్రస్తుత వడ్డీ రేటు కంటే అది ఎక్కువ రేటుతో ఉంటుంది. ఈ అధిక కూపన్ రేటు ఈ బాండ్లను ప్రీమియం వద్ద కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్న పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైనదిగా మారుతుంది.
2 ఆ సందర్భానికి విరుద్ధంగా, వడ్డీ రేట్లు పెరిగినప్పుడు, కొత్త బాండ్లు ఇప్పటికే ఉన్న బాండ్ల కంటే మంచి వడ్డీ రేట్లను పెట్టుబడిదారులకు చెల్లిస్తాయి. ఇక్కడ, పాత బాండ్లు తక్కువ ఆకర్షణీయమైనవిగా ఉండి, వాటి ధరలను పరిహార రూపంలో తగ్గిస్తాయి, అలాగే డిస్కౌంట్ ధర వద్ద విక్రయిస్తాయి
బాండ్ ధర, ఆదాయాల మధ్య విలోమానుపాత సంబంధం యొక్క ఉదాహరణలు
ఉదాహరణ 1
₹ 5000 ధరతో, ₹ 200 కూపన్ మొత్తంతో 10 సంవత్సరాల వ్యవధితో బాండ్ ఉంది. ఈ బాండ్‌కు సంబంధించి ఆదాయం ఈ కింద ఇవ్వబడిన ఫార్ములా ప్రకారం లెక్కించబడుతుంది
● ఆదాయం = బాండ్ పై వడ్డీ / బాండ్ యొక్క మార్కెట్ ధర x 100
● కాబట్టి, ఆదాయం = (200/5000) x 100% = 4%
బలమైన పెట్టుబడిదారు డిమాండ్ కారణంగా బాండ్ ధర ₹ 5000 నుండి ₹ 5500 వరకు పెరిగిందని అనుకుందాం. కాబట్టి, ఇప్పుడు బాండ్ జారీ చేసిన ధర కంటే 10% ఎక్కువ ధర వద్ద ట్రేడ్ అవుతోంది. అయితే, కూపన్ ధర ₹ 200 వద్ద ఉంటుంది.
● ఇప్పుడు ఆదాయం (200/5500) x 100% = 3.64%కు మారుతుంది
కాబట్టి, బాండ్ ధర పెరిగింది, కావున అది బాండ్ పై వచ్చే ఆదాయాన్ని తగ్గిస్తుంది.
ఉదాహరణ 2
ఇప్పుడు పైన పరిగణనలోకి తీసుకున్న అదే బాండ్‌పై ధర తగ్గుతుందని అనుకుందాం.
● ప్రారంభ బాండ్ ధర = ₹ 5000
● కూపన్ = ₹200
● బాండ్ ధర ₹ 4300కు తగ్గుతుంది
● కూపన్ ధర ₹ 200 వద్ద ఉంటుంది
● ఇప్పుడు ఆదాయం (200/4300) x 100% = 4.65%
బాండ్ ధర మరియు బాండ్ ఆదాయం మధ్య విలోమ సంబంధం కారణంగా, ఆదాయం ఇప్పుడు పెరిగింది. మీరు ఇలాంటి ప్రయోజనాలను పొందడానికి
స్వల్పకాలిక మ్యూచువల్ ఫండ్స్ లో కూడా పెట్టుబడి చేయవచ్చు.
మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి, స్కీమ్ సంబంధిత అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి
ఇక్కడ అందించబడిన సమాచారం/వివరణలు సాధారణంగా చదవడం వంటి ప్రయోజనాల కోసమే, అలాగే ఇక్కడ వ్యక్తపరిచిన విషయాలు కేవలం అభిప్రాయాలను కలిగి ఉంటాయి, కావున వాటిని పాఠకులు మార్గదర్శకాలుగా, సిఫార్సులుగా లేదా వృత్తిపరమైన గైడ్‌గా పరిగణించకూడదు. డాక్యుమెంట్ అనేది బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారం, అంతర్గతంగా అభివృద్ధి చేయబడిన డేటా, అలాగే విశ్వసనీయమైనదిగా భావించే ఇతర వనరులను ఆధారంగా చేసుకొని తయారు చేయబడింది. స్పాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, ట్రస్టీ లేదా వారి డైరెక్టర్లు, ఉద్యోగులు, అనుబంధ సంస్థలు లేదా ప్రతినిధులు ("సంస్థలు మరియు వారి అనుబంధ సంస్థలు") ఇక్కడ అందించిన సమాచారం యొక్క ఖచ్చితత్వం, పరిపూర్ణత, తగినంత, అలాగే విశ్వసనీయతకు ఎలాంటి బాధ్యత వహించరు. ఈ సమాచారాన్ని స్వీకరించేవారు తమ సొంత విశ్లేషణ, వివరణలు, పరిశోధనలపై ఆధారపడాలని సూచించడమైనది. అందించిన పెట్టుబడి నిర్ణయానికి రావడానికి పాఠకులు స్వతంత్ర వృత్తిపరమైన నిపుణుల సలహాలను కూడా పొందాలని సూచించడమైనది. ఈ మెటీరియల్ తయారీ లేదా జారీలో పాల్గొన్న వ్యక్తులతో సహా సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు ఏవైనా ప్రత్యక్ష, పరోక్ష, ప్రత్యేక, యాదృచ్ఛిక, పర్యవసాన, శిక్షాత్మక లేదా దండనాత్మక నష్టాలకు సంబంధం లేదు. ఈ డాక్యుమెంట్ ఆధారంగా తీసుకునే ఏ నిర్ణయానికైనా స్వీకర్త మాత్రమే పూర్తి బాధ్యత వహించాలి.