Sign In

మ్యూచువల్ ఫండ్ ఆఫర్ డాక్యుమెంట్‌ను జాగ్రత్తగా పరిశీలించండి

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవని మనందరికీ తెలుసు అయితే ఆ డాక్యుమెంట్‌లో ఏముందనే విషయాన్ని చాలా జాగ్రత్తగా చదవాలి, పెట్టుబడిదారుగా మనం దానిని తప్పక అర్థం చేసుకోవాలి మరియు నిధులను పెట్టుబడి చేయడానికి ముందు ఖచ్చితత్వాన్ని కలిగి ఉండాలి? మిస్టరీని క్రమబద్ధీకరించడంలో మీకు సహాయపడే కొన్ని పాయింట్ల గురించి ఇక్కడ చిన్న సమాచారం ఉంది:

  • రిస్క్ - ఇది పెట్టుబడి చేసేటప్పుడు ఉంటుందని మనకు తెలుసు, కానీ ఆలోచించి చేసిన లెక్కలు మరియు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న అనేక క్యాలిక్యులేటర్‌ల ద్వారా మీరు స్కీమ్ మరియు దాని ప్రయోజనాలను అంచనా వేయవచ్చు, నిర్ణయించవచ్చు.
  • అంచనా - పెట్టుబడి అనేది పూర్తిగా ఒక అంచనా ప్రక్రియ.. మీ వయస్సు, ఫైనాన్స్ నిధులు, ఆర్థిక లక్ష్యాలు, ఆదాయ వనరులు మరియు ఫ్లో, పెట్టుబడులు పెట్టడానికి సమయ వ్యవధి, ఇప్పటికే ఉన్న ఆస్తులు మరియు రిస్క్ తీసుకునే సామర్థ్యం. వీటన్నింటినీ క్రమబద్ధీకరించడం అనేది అవసరమైన విధానంలో వీటిని పరిష్కరించడానికి మరియు స్పష్టంగా ఉండడంలో మీకు సహాయపడుతుంది.
  • పనితీరు - రిటర్న్స్ విషయానికి వస్తే గతంలోని పనితీరును మరియు స్కీమ్ యొక్క ట్రాక్ రికార్డ్‌ను పరిశీలించడం చాలా అవసరం. అలాగే అలాంటి ఇతర ఫండ్స్ స్కీమ్స్ మరియు వాటి రిటర్న్స్‌తో పోల్చడం కూడా ముఖ్యమైన అంశం.. అధిక మరియు స్థిరమైన రిటర్న్ కోసం ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం ఉత్తమం. అయితే, భవిష్యత్తు ఊహించదగినది కావచ్చు లేదా కాకపోవచ్చు, అలాగే గతంలోని పనితీరు కూడా భవిష్యత్తులో నిలకడగా ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు.
  • డైవర్సిఫికేషన్ - నిధులను ఒకే చోట పెట్టుబడి పెట్టడం అనేది ఒక జూదం లాంటిది. కావున, మీ అసెట్స్‌ని వివిధ స్కీమ్స్‌లో కేటాయించడం మంచిది.
  • పెట్టుబడి లక్ష్యం - ఇది లక్ష్యాన్ని నిర్వచించడంలో మరియు ఒక స్థానంలో పెట్టుబడి పెట్టే లాజిక్‌ను అర్థంచేసుకోవడంలో మీకు సహాయపడుతుంది. నిర్వచించేటప్పుడు మీ ఫండ్స్‌ ఈక్విటీ, డెట్ లేదా ఈ రెండింటిలో పెట్టుబడి చేయబడతాయో లేదో పేర్కొనండి. మీ లక్ష్యాన్ని సాధించడానికి మీ లక్ష్యం మరియు దాని వ్యూహం ఏమిటి?
  • ఎగ్జిట్ లోడ్- ఇది రిడెంప్షన్ సమయంలో లేదా స్కీమ్స్ మధ్య బదిలీ సమయంలో వసూలు చేయబడే ఛార్జ్. ఎగ్జిట్ లోడ్ శాతం ఎన్ఏవి నుండి మినహాయించబడుతుంది. మీరు పెట్టుబడి పెట్టినప్పుడు ఈ ఖర్చు మీ కోసం ఉందో లేదో తెలుసుకోండి మరియు విచారించండి. ఇటువంటి ఛార్జీలు లేని స్కీంలను 'నో లోడ్ స్కీంలు' అని పేర్కొంటారు.

డిస్‌క్లెయిమర్లు
ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు వ్యక్తం చేయబడుతున్న ఉద్దేశాలు కేవలం అభిప్రాయాలను మాత్రమే కలిగి ఉంటాయి. అందువల్ల వీటిని పాఠకుల కోసం మార్గదర్శకాలు లేదా సిఫార్సులు లేదా ప్రొఫెషనల్ గైడ్‌గా పరిగణించకూడదు. పరిశ్రమ మరియు మార్కెట్లకు సంబంధించిన నిర్దిష్ట వాస్తవిక మరియు గణాంక సమాచారం (చారిత్రాత్మకమైన మరియు అంచనా వేయబడిన) స్వతంత్ర థర్డ్ పార్టీ వనరుల నుండి సేకరించబడింది, ఇవి విశ్వసనీయమైనవిగా పరిగణించబడ్డాయి. ఎన్ఎఎం ఇండియా (రిలయన్స్ నిప్పాన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్) అటువంటి సమాచారం లేదా డేటా యొక్క ఖచ్చితత్వం లేదా ప్రామాణికతను, లేదా అటువంటి డేటా మరియు సమాచారం ప్రాసెస్ చేయబడిన లేదా అంచనా వేయబడిన ఊహల యొక్క సహేతుకతను స్వతంత్రంగా ధృవీకరించలేదు; ఎన్ఎఎం ఇండియా (గతంలో రిలయన్స్ నిప్పాన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ అని పేర్కొనబడేది) అటువంటి డేటా మరియు సమాచారం యొక్క ఖచ్చితత్వం లేదా ప్రామాణికతకు ఏ విధంగానూ హామీ ఇవ్వదు. ఈ మెటీరియల్స్‌లో ఉన్న కొన్ని స్టేట్‌మెంట్‌లు మరియు వాదనలు ఎన్ఎఎం ఇండియా యొక్క (గతంలో రిలయన్స్ నిప్పాన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ అని పేర్కొనబడేది) ఉద్దేశాలు లేదా అభిప్రాయాలను ప్రతిబింబిస్తాయి, ఇవి అటువంటి డేటా లేదా సమాచారం ఆధారంగా ఏర్పడి ఉండవచ్చు.

ఏవైనా పెట్టుబడులు పెట్టడానికి ముందు, ఒక వ్యక్తిగత నిపుణుడి సలహా తీసుకోవాల్సిందిగా పాఠకులకు సూచించడమైనది, ఒక తెలివైన పెట్టుబడి నిర్ణయం తీసుకోవడానికి విషయాలను ధృవీకరించుకోవాలి. స్పాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, ట్రస్టీ, వారి సంబంధిత డైరెక్టర్లు, ఉద్యోగులు, అనుబంధ సంస్థలు లేదా ప్రతినిధులు ఎవరూ కూడా ఈ మెటీరియల్‌లో ఉన్న సమాచారం కారణంగా ఉత్పన్నమయ్యే నష్టాలకు ప్రత్యక్ష, పరోక్ష, ప్రత్యేక, యాదృచ్ఛిక, పర్యవసాన, శిక్షణాత్మక లేదా దండనాత్మక నష్టాలకు ఏ విధంగానూ బాధ్యత వహించరు.

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి, స్కీమ్ సంబంధిత అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి.


Get the app