Sign In

For Suspension of fresh subscription in certain schemes of NIMF, kindly refer to ADDENDUM

పన్ను ఆదా చేసే మ్యూచువల్ ఫండ్స్: అవి నిజమా?

మీకు ఆర్థిక రంగం గురించి బాగా తెలిసి ఉంటే, జీవితంలో ఏవైనా లక్ష్యాలను కలిగి ఉంటే మరియు మీ డబ్బును ఆదా చేసుకోవడానికి, వృద్ధి చేయడానికి ఏవైనా ప్లాన్‌లను కలిగి ఉంటే తప్పనిసరిగా పెట్టుబడుల గురించి చదివి లేదా విని ఉండాలి. భారతదేశంలో పెట్టుబడుల విలువ గురించి అవగాహన పెంచడానికి అనేక అంశాలు దోహదపడినప్పటికీ, మ్యూచువల్ ఫండ్‌లు ఒక ప్రత్యేక పాత్రను పోషిస్తాయి. అవి కాంపౌండింగ్ శక్తి ప్రయోజనం ద్వారా ప్రాముఖ్యత పొందింది, ఇది ప్రజలను వారి సంపదను పెంచుకోవడానికి ప్రణాళికలు చేసింది.

చాలా మంది ప్రజలు నిర్దిష్ట రకాల మ్యూచువల్ ఫండ్‌ల పన్ను సామర్థ్యానికి కూడా ఆకర్షితులయ్యారు. భారతదేశంలోని చాలా మంది పెట్టుబడిదారులకు పన్నును ఆదా చేయడం చాలా ముఖ్యం, మ్యూచువల్ ఫండ్‌లలో ఇన్వెస్ట్‌మెంట్ అందుకు సరైన ఎంపికగా మారింది.

మూస పద్ధతులను అనుసరించడం లేదు

గతంలో పెట్టుబడిదారులకు పన్ను ఆదా చేసే పెట్టుబడి సాధనాల గురించి ఆలోచించినప్పుడు మొదట మ్యూచువల్ ఫండ్స్ అనే విషయం గుర్తుకు వచ్చేది కాదు. దీర్ఘకాలిక సంపద సృష్టి, క్యాపిటల్‌లో వృద్ధి మరియు మంచి రిటర్న్స్ కోసం అవకాశాలు లాంటివి పెట్టుబడిదారులు మ్యూచువల్ ఫండ్‌లు ఎంచుకోవడానికి గల ప్రధాన కారణాలు. అయితే, గత కొన్ని సంవత్సరాల్లో టాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్‌లు అసెట్ క్లాజ్ కోసం మరో కీలకమైన మరియు సహాయకరమైన అవకాశాన్ని వెల్లడించాయి.

మ్యూచువల్ ఫండ్‌లతో పన్నును ఆదా చేయడం వాస్తవమైనది మరియు సమర్థవంతమైనది. టాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్‌లు ఇటీవల వాటి విలువను నిరూపించాయి, ఇవి కేవలం పన్ను ప్రయోజనాల కోసం సంప్రదాయ పెట్టుబడి సాధనాల్లో పెట్టుబడులను డిమాండ్ చేసే మూస పద్ధతుల నుండి వైదొలగడం ద్వారా పెట్టుబడిదారులకు పన్ను ఆదా చేయడంలో సహాయపడతాయి.

ఇఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవింగ్స్ ఫండ్స్ అంటే ఏమిటి?

ఈక్విటీ-లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఇఎల్ఎస్ఎస్) పన్ను ప్రయోజనాలను అందించే ఏకైక మ్యూచువల్ ఫండ్. ఇఎల్ఎస్ఎస్ ఫండ్ పెట్టుబడిదారులకు ఆదాయ చట్టం 1961 సెక్షన్ 80C కింద వారి స్థూల ఆదాయం నుండి ₹1,50,000 వరకు పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయడానికి సహాయపడుతుంది. ఇది గణనీయమైన పొదుపులకు కారణమవుతుంది, ఇఎల్ఎస్ఎస్ ఫండ్‌ల కోసం పెరుగుతున్న ప్రజాదరణకు ఇది ప్రత్యేక కారణం.

అయితే, పెట్టుబడిదారులు ఇఎల్ఎస్ఎస్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టడానికి ముందు అది ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి. ఒక ఇఎల్ఎస్ఎస్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టిన డబ్బులో దాదాపు 80% ఈక్విటీలు మరియు ఈక్విటీ-సంబంధిత సాధనాల కొనుగోలు, అమ్మకం కోసం రిజర్వ్ చేయబడుతుంది.

ఇఎల్ఎస్ఎస్ యొక్క ఇతర ముఖ్యమైన ప్రయోజనాల్లో ఇవి ఉంటాయి:

• సౌలభ్యం

ఇఎల్ఎస్ఎస్ ఫండ్‌లు ప్రతి ఇతర మ్యూచువల్ ఫండ్‌ల మాదిరిగానే ప్రత్యేక సౌకర్యాన్ని అందిస్తాయి. పెట్టుబడిదారులు వారి పెట్టుబడి మొత్తాన్ని అవసరమైనప్పుడు పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. వారు తక్కువలో తక్కువగా ₹500 నుండి ప్రారంభించవచ్చు మరియు వారి ఆదాయానికి అనుగుణంగా దానిని పెంచుకోవచ్చు. వారు ఎస్ఐపి మార్గం లేదా ఏకమొత్తంలో పెట్టుబడి పెట్టడాన్ని ఎంచుకోవచ్చు.

• అతి తక్కువ లాక్-ఇన్ పీరియడ్

సాంప్రదాయ పెట్టుబడి సాధనాలు సుదీర్ఘమైన లాక్-ఇన్ వ్యవధిని కలిగి ఉంటాయి. సరిపోల్చినప్పుడు ఇఎల్ఎస్ఎస్ ఫండ్‌లు తక్కువగా 3-సంవత్సరాల లాక్-ఇన్ వ్యవధితో వస్తాయి. పెట్టుబడిదారులు వారి పెట్టుబడిని ఇఎల్ఎస్ఎస్ ఫండ్‌లలో పెట్టుబడి పెట్టిన మూడు సంవత్సరాల నుండి రీడీమ్ చేసుకోవచ్చు. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపుకు అర్హత కలిగిన అన్ని పెట్టుబడి సాధనాల్లో ఇఎల్ఎస్ఎస్ ఫండ్‌లు అతి తక్కువ లాక్-ఇన్ వ్యవధిని కలిగి ఉంటాయి.

• సంపద సృష్టించే సామర్థ్యం

ఇఎల్ఎస్ఎస్ ఫండ్‌లు పెట్టుబడిదారుల సంపదను గుణించడానికి కాంపౌండింగ్ పవర్‌ను ఉపయోగిస్తాయి. ఇఎల్ఎస్ఎస్‌లో స్థిరంగా పెట్టుబడి పెట్టడం అనేది క్యాపిటల్ వృద్ధి ప్రోత్సహిస్తుంది, ఫలితంగా సమ్మేళనం ద్వారా సంపద సృష్టించబడుతుంది.

ముగింపు

మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లు బహుముఖ పెట్టుబడి మార్గాలు. ఇవి ఆస్తి నిబంధనల విషయంలో పెట్టుబడిదారులకు ప్రధానంగా మద్దతునిచ్చే ప్రత్యేక ప్రయోజనాలు, యూఎస్‌పిలను కలిగి ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా టాక్స్ సేవింగ్ ఇఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్‌లు పెట్టుబడిదారులకు పన్ను ప్రయోజనాలు, ఈక్విటీ ఎక్స్‌పోజర్ మరియు మంచి రాబడులను అందిస్తాయి.

డిస్‌క్లెయిమర్:
ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు పేర్కొన్న వివరణలు కేవలం అభిప్రాయాలను మాత్రమే కలిగి ఉంటాయి కావున, వీటిని ప్రత్యేక మార్గదర్శకాలు, సిఫార్సులు లేదా పాఠకుల కోసం ఉద్దేశించిన నిపుణుల సలహాలుగా పరిగణించకూడదు. ఈ డాక్యుమెంట్ బాహ్య మూలాల నుండి సేకరించిన సమాచారం, అంతర్గతంగా అభివృద్ధి చేయబడిన డేటా మరియు విశ్వసనీయమైనదిగా భావించే ఇతర వనరుల ఆధారంగా తయారు చేయబడింది. స్పాన్సర్లు, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, ట్రస్టీ లేదా వారి డైరెక్టర్లు, ఉద్యోగులు, అనుబంధ సంస్థలు లేదా ప్రతినిధులు ("సంస్థలు మరియు వారి అనుబంధ సంస్థలు") అలాంటి సమాచారం యొక్క ఖచ్చితత్వం, పరిపూర్ణత, సమగ్రత మరియు విశ్వసనీయతకు ఎలాంటి బాధ్యత వహించరు. ఈ సమాచారాన్ని స్వీకరించేవారు తమ విశ్లేషణ, వివరణలు మరియు పరిశోధనలపై ఆధారపడాలని సూచించడమైనది. ఒక తెలివైన పెట్టుబడి నిర్ణయానికి రావడానికి పాఠకులు వృత్తిపరమైన నిపుణుల సలహాలను కూడా పొందాలని సూచించడమైనది. ఈ మెటీరియల్ తయారీ లేదా జారీలో పాల్గొన్న వ్యక్తులతో సహా సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు ఏవైనా, ఈ మెటీరియల్‌లోని సమాచారం వల్ల పొందిన ప్రత్యక్ష, పరోక్ష, ప్రత్యేక, యాదృచ్ఛిక, పర్యవసాన, శిక్షాత్మక లేదా దండనాత్మక నష్టాలకు, లాభాలకు ఎలాంటి బాధ్యత వహించవు. ఈ సమాచారం ఆధారంగా తీసుకున్న ఏదైనా నిర్ణయానికి స్వీకర్త మాత్రమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది.

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి, స్కీమ్ సంబంధిత అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి.

​​

Get the app