Sign In

మీరు సెక్టార్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడానికి ముందు పరిగణించవలసిన అంశాలు

సెక్టార్ ఫండ్స్ అంటే ఏమిటి?

సెక్టార్ ఫండ్స్ అనేవి నిర్దిష్ట రంగాలలో పెట్టుబడి పెట్టే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ యొక్క ఒక ప్రత్యేక కేటగిరి. ఎఫ్ఎంసిజి, ఐటి, బ్యాంకింగ్, ఫార్మాస్యూటికల్స్ వంటి రంగాలలో పెట్టుబడులు ఈ ఫండ్స్ ద్వారా సులభతరం అవుతాయి.సెబి ప్రకారం, ఒక ఫండ్ సెక్టార్ ఫండ్‌గా వర్గీకరించడానికి తన అసెట్స్‌లో కనీసం 80% ఒక నిర్దిష్ట రంగంలోని స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టాలి.

ఈక్విటీ ఫండ్‌లు విభిన్న సెగ్మెంట్లు మరియు కంపెనీలలో పెట్టుబడి పెడతాయి, సెక్టోరల్ ఫండ్ ఒక నిర్దిష్ట రంగంపై మాత్రమే దృష్టి పెడుతుంది.

సెక్టోరల్ ఫండ్స్‌లో ఎందుకు పెట్టుబడి చేయాలి?

మ్యూచువల్ ఫండ్స్ మీ డబ్బుని డైవర్సిఫై చేయడానికి రూపొందించబడినప్పటికీ, ఈ ఫండ్‌లు ఆ డబ్బును ఒక నిర్దిష్ట విభాగంలో కేంద్రీకరిస్తాయి. అవి సెక్టార్-లెవల్ డైవర్సిఫికేషన్ కాకుండా స్టాక్-లెవల్ డైవర్సిఫికేషన్‌ను అందిస్తాయి. మీరు ఒక నిర్దిష్ట రంగంలోని పెరుగుదల నుండి ప్రయోజనం పొందేందుకు ఇవి రూపొందించబడ్డాయి. మీరు ప్రతి రకాన్ని అర్థం చేసుకుని, మరింతగా తెలుసుకున్నప్పుడు సెక్టోరల్ ఫండ్స్ కోసం చూడవచ్చు.

మీరు సెక్టోరల్ ఫండ్స్‌లో పెట్టుబడి చేసే ముందు తెలుసుకోవలసిన కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి.

సెక్టోరల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడానికి ముందు అంచనా వేయవలసిన విషయాలు

కొత్తగా పెట్టుబడి చేసే వారికి కాదు: మ్యూచువల్ ఫండ్స్ అనేవి అన్ని రకాల పెట్టుబడిదారుల కోసం సిఫారసు చేయబడినప్పటికీ, ముఖ్యంగా ఫైనాన్షియల్ మార్కెట్‌లకు కొత్తగా వచ్చినవారు, సెక్టార్ ఫండ్స్ కోవలోకి రారు. సెక్టార్ ఫండ్ కొనడం అంటే సెక్టార్ అవకాశాలపై పందెం కాసినట్టు, అలాంటి ఫండ్‌లు నూతన పెట్టుబడిదారులకు అనువైనవి కాకపోవచ్చు. ఒకవేళ మీరు నిర్ణయించుకున్నట్లయితే, దానిని అనుభవజ్ఞుల పరిశోధనల ఆధారంగా పరిగణలోకి తీసుకోండి.

సెక్టార్ డ్రైవర్లను అర్థం చేసుకోవడం: అన్ని సెక్టార్లు సమానంగా లేదా ఒకేలా ఉండవు. ఒక సెక్టోరల్ ఫండ్‌లో పెట్టుబడులు పెట్టడం అనేది వేరొక సెక్టార్‌ని లక్ష్యంగా చేసుకుని మరొకదానిలో పెట్టుబడి పెట్టడం లాంటిది కాదు. ఒక రంగంలో పెట్టుబడి పెట్టడానికి ముందు మీరు దానిని నడిపించే అంశాలను తెలుసుకోవడం ముఖ్యం. ఒక సెక్టార్‌ని నడిపించే కీ డ్రైవర్లు మరియు మెట్రిక్‌ల గురించి మీకు పరిజ్ఞానం లేకపోతే, మీరు మీ డబ్బుతో అనవసరమైన రిస్క్ తీసుకున్నట్లే.

ఒక ఉద్దేశ్యంతో డైవర్సిఫికేషన్: సెక్టార్ నిధులు వాటి మూలం ఆధారంగా కేంద్రీకృతమై ఉన్నప్పటికీ, వాటిని డైవర్సిఫికేషన్ కోసం ఉపయోగించవచ్చు. అయితే, మీ ఉద్దేశ్యం అనేది స్పష్టంగా ఉండాలి - ఏ రంగంలో పెట్టుబడి పెట్టాలి మరియు మొత్తం పోర్ట్‌ఫోలియోలో ఎంత శాతాన్ని అటువంటి ఫండ్‌లో పెట్టాలి అనే ప్రశ్నలకు మీరు స్పష్టమైన సమాధానాలను కలిగి ఉండాలి.

పోర్ట్‌ఫోలియో కంపోజిషన్‌ను చెక్ చేయండి: అన్ని సెక్టోరల్ ఫండ్‌లు ఒకే విధంగా నిర్మించబడవు. ఒకే రంగంలో పెట్టుబడులు పెట్టే వారిలో కూడా, పెట్టుబడి మరియు స్టాక్ నాణ్యత మధ్య ముఖ్యమైన తేడాలు ఉన్నాయి. మీరు కష్టపడి సంపాదించిన డబ్బును పెట్టుబడి చేయాలని నిర్ణయించుకునే ముందు మీరు ఇతర అంశాలను విశ్లేషించడం కూడా చాలా ముఖ్యం.

అధిక స్థాయి రిస్కుతో సౌకర్యం: సెక్టార్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టడానికి ముందు, అవి అధిక స్థాయి రిస్క్‌ను కలిగి ఉంటాయి అని తెలుసుకోండి - బహుశా, సాధారణ డైవర్సిఫైడ్ ఫండ్ కంటే ఎక్కువగా ఉండొచ్చు. అస్థిరత, ఆందోళన కలిగించే సందర్భాలు కూడా ఉండవచ్చు, కావున, దానిని ఎదుర్కొనడానికి మీకు తగిన రిస్క్ తీసుకునే సామర్థ్యం ఉందో లేదో చూడండి.

ఫ్యాడ్ సెక్టార్‌లను అనుసరించవద్దు – వివిధ సెక్టార్‌లను గురించి పూర్తిగా అధ్యయనం చేయండి మరియు గుడ్డిగా సిఫారసు చేసిన వాటి కోసం వెళ్లడం కంటే అవి ఎలా పెరుగుతున్నాయో, తగ్గుతున్నాయో తెలుసుకోండి. అత్యంత సిఫార్సు చేయబడిన రంగం మీకు అనుకూలంగా ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు; అందువల్ల, తగిన శ్రద్ధ వహించాలని సూచించడమైనది.



సెక్టార్ మ్యూచువల్ ఫండ్స్ ఒక పోర్ట్‌ఫోలియోలో ఒక ముఖ్యమైన వెలితిని తీర్చగలవు, కానీ మీరు వాటిని సరిగ్గా ఉపయోగించినపుడు మాత్రమే అవి మీ కోసం పనిచేస్తాయి. లేకపోతే, మీరు ఒక డైవర్సిఫైడ్ మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టడం మంచిది



మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి, స్కీమ్ సంబంధిత అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి


ఇక్కడ ఉన్న సమాచారం సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు పేర్కొన్న వివరణలు కేవలం అభిప్రాయాలను మాత్రమే సూచిస్తాయి, కావున వీటిని, పాఠకులకు మార్గదర్శకాలు, సిఫార్సులు లేదా నిపుణుల సలహాలుగా పరిగణించకూడదు. బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారం, అంతర్గతంగా అభివృద్ధి చేయబడిన డేటా మరియు ఇతర విశ్వసనీయమైన మూలాల ఆధారంగా ఈ డాక్యుమెంట్ తయారు చేయబడింది. స్పాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, ట్రస్టీ లేదా వారి డైరెక్టర్లు, ఉద్యోగులు, అనుబంధ సంస్థలు లేదా ప్రతినిధులు ("సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు") అటువంటి సమాచారం యొక్క ఖచ్చితత్వం, పరిపూర్ణత, సమగ్రత మరియు విశ్వసనీయతకు ఎలాంటి బాధ్యత వహించరు. ఈ సమాచారాన్ని స్వీకరించే వారు తమ సొంత విశ్లేషణ, వివరణలు మరియు పరిశోధనలపై ఆధారపడాలని సూచించడమైనది. తెలివైన పెట్టుబడి నిర్ణయం తీసుకోవడానికి, వృత్తిపరమైన నిపుణుల సలహా తీసుకోవాలని పాఠకులకు సలహా ఇవ్వడమైనది. ఈ మెటీరియల్ తయారీ లేదా జారీలో భాగంగా ఉన్న వ్యక్తులతో సహా సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు, ఈ మెటీరియల్‌లో ఉన్న సమాచారం ఆధారంగా పొందిన లాభాలు, నష్టాలతో సహా ఏదైనా ప్రత్యక్ష, పరోక్ష, ప్రత్యేక, అనుకోని, పర్యవసాన, శిక్షణాత్మక లేదా దండనాత్మక నష్టాలకు బాధ్యత వహించవు. ఈ డాక్యుమెంట్ ఆధారంగా తీసుకునే ఏ నిర్ణయానికైనా స్వీకర్త మాత్రమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది.

Get the app