Sign In

For Suspension of fresh subscription in certain schemes of NIMF, kindly refer to ADDENDUM

 మీ మొదటి పేచెక్ వచ్చిందా? మీరు ప్రారంభించగల కొన్ని విషయాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి​​

తన మొదటి జీతం అందుకున్న రోజున నిధి ఆనందానికి అవధులు లేవు. ఆమె వెంటనే తను కొనుగోలు చేయాలనుకునే వస్తువులు మరియు తీర్చుకోవాలనుకుంటున్న సరదాలను గురించి కలలు కనడం ప్రారంభించింది. అయితే, నిధిని ఎవరూ దిక్కరించలేరు; తన మొదటి పే చెక్కును అందుకున్నాక సంతోషించని వారెవరుంటారు? ఇది ఆర్థిక స్వేచ్ఛ వైపు మీ మొదటి అడుగు మరియు మీరు మీ తదుపరి ఉద్యోగంలో రెండింతలు సంపాదించినప్పటికీ, మీ మొదటి ఉద్యోగ జీతం ఇప్పటికీ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అయితే. సంపాదించినదంతా ఖర్చు చేయడం ఒక తెలివైన పనేనా? మీ మొదటి జీతంతో పూర్తి చేయాల్సిన కొన్ని విషయాలను తెలుసుకోవడానికి చదవండి:

రుణ విముక్తులుగా ఉండండి

అన్ని బకాయిలను క్లియర్ చేయడం ప్రశాంతమైన జీవితానికి తొలి మెట్టు. వడ్డీ పెరగకుండా ఉండేందుకు వీలైనంత త్వరగా మీ రుణ భారాన్ని చెల్లించడాన్ని ప్రారంభించడం మంచిది. అది విద్యా రుణాలు లేదా తెలిసిన వారి నుండి తీసుకున్న డబ్బు లేదా మరేదైనా రుణ భారం కావచ్చు, మీరు సంపాదించడం ప్రారంభించిన వెంటనే దాన్ని క్లియర్ చేయడం ప్రారంభించండి. మీ మొదటి జీతం వాటన్నింటినీ నెరవేర్చడానికి సరిపోకపోయినా, మీ ఖర్చులన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాత మీరు ప్రతి నెలా ఎంత చెల్లించాలో ప్లాన్ చేసుకోవచ్చు.

మనీ మేనేజ్‌మెంట్ గురించి తెలుసుకోవడం

మనీ మేనేజ్‌మెంట్ అనేది ఒక టెక్నిక్, ఇది అందుబాటులో ఉన్న విభిన్న పెట్టుబడి ఆప్షన్ల నుండి మీ డబ్బును వృద్ధి చేసుకోవడానికి పలు మార్గాలను నిర్దేశిస్తుంది. ఈ కళను గురించి మీరు ముందుగానే తెలుసుకోవడం మరియు మీ కెరీర్ ప్రారంభంలో దీనిని అమలు చేయడం అనేది భవిష్యత్తులో మీకు సహాయపడుతుంది. ఇది మొదటి జీతం నుండి మీ ఆదాయాన్ని నిర్వహించుకోవడంలో మీకు సహాయపడుతుంది మరియు మీ తప్పుల నుండి నేర్చుకోవడానికి మీకు తగినంత సమయం లభిస్తుంది. ఎందుకనగా, మీ జీవితంలో రాబోయే దశలతో పోల్చుకుంటే, ఇప్పుడున్న ఈ తప్పుల ఆర్థిక చిక్కులు తక్కువగా ఉంటాయి.

మీ పెట్టుబడి ప్రయాణాన్ని వెంటనే మొదలుపెట్టండి

డబ్బుతో ఒక బాధ్యత ఏర్పడుతుంది, తెలివైన నిర్ణయాలు తీసుకోవడం మరియు మీ పెట్టుబడి ప్రయాణాన్ని ప్రారంభించడం మంచిది. మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడాన్ని ప్రారంభించవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి, అవి ఎలా పనిచేస్తాయి అనే దాని గురించి మరింత తెలుసుకోవడానికి చదవండి.

మీ పెట్టుబడి నిర్ణయాలు అనేవి మీ లక్ష్యాలు, పెట్టుబడి పరిధి మరియు రిస్క్ తీసుకునే సామర్థ్యంపై ఆధారపడి ఉంటాయి. మీరు ఇంకా యుక్త వయస్సులోనే ఉన్నారు కనుక మీకు ఆర్థిక భారాలు తక్కువగా ఉండవచ్చు, అప్పుడు మీరు దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం చూడవచ్చు మరియు మెరుగైన సంభావ్య రాబడి కోసం అధిక రిస్క్ ఆకలిని ప్రదర్శించవచ్చు. మీరు ఖర్చు, పొదుపు మరియు పెట్టుబడిగా పెట్టాలనుకునే మీ ఆదాయాల వాటా కోసం ఒక ప్రత్యేక ప్లాన్ చేసుకోవాలి.

ఒక ఎస్ఐపి (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్)ని ప్రారంభించండి

ఒకవేళ మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకుంటే మరియు వాటి గురించి మీకు పెద్దగా తెలియకపోతే, మీరు అందులో ఏకమొత్తంలో పెట్టుబడి పెట్టి రిస్క్ తీసుకోవాలనుకోరు; కనుక మీరు సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (ఎస్ఐపి)తో ప్రారంభించవచ్చు. ఎస్ఐపి కోసం సైన్ అప్ చేసి మీరు మీకు నచ్చిన నిర్ణీత మొత్తాన్ని (₹500 కంటే తక్కువ) కాలానుగుణంగా (నెలవారీ లేదా వారానికోసారి) పెట్టుబడి పెట్టవచ్చు. తక్కువ మొత్తంతో ప్రారంభించడం ద్వారా మీరు ఖర్చు (యుటిలిటీలు లేదా లగ్జరీ) కోసం కొంత డబ్బును పక్కన పెట్టవచ్చు, అంతేకాకుండా పెట్టుబడిని కూడా ప్రారంభించవచ్చు.

అలాగే, మీరు యవ్వనంగా ఉన్నారని ఊహిద్దాం, అప్పుడు ఇది మీ జీవితంలో ప్రారంభంలోనే ఆర్థిక క్రమశిక్షణ మరియు లక్ష్య ప్రణాళికను అలవాటు చేస్తుంది. మీరు 3-4 సంవత్సరాల్లో కారును కొనుగోలు చేయాలనుకుంటే ఎస్‌ఐపిలో పొదుపు చేయడం ప్రారంభించవచ్చు మరియు తగినంత ఆదా చేసిన తర్వాత మీ లక్ష్యాన్ని చేరుకోవచ్చు. ఏ లక్ష్యాన్ని సాధించడానికి మీరు ఎంత పెట్టుబడి పెట్టాలి అని తెలుసుకోవడానికి ఆన్‌లైన్ ఎస్‌ఐపి కాలిక్యులేటర్‌ను కూడా ఉపయోగించవచ్చు.

మీరు ఒక హెల్త్ ఇన్సూరెన్స్‌ను కలిగి ఉండండి

ఆకస్మిక హాస్పిటలైజెషన్ లేదా ఆరోగ్యానికి సంబంధించిన ఇతర ఖర్చులు మీ పొదుపులను హరించివేస్తాయి మరియు కొన్నిసార్లు మీ ఆర్థిక లక్ష్యాలను కూడా ప్రభావితం చేయగలవు. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మెడికల్ ఖర్చులకు సంబంధించిన ఒక ప్రత్యేక కవర్. చిన్న వయస్సులోనే హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీని తీసుకోవడం వల్ల వయస్సు పరంగా మంచి బేరాన్ని పొందడంతో పాటు అధిక ప్రీమియంను ఆదా చేయడంలో కూడా మీకు సహాయపడుతుంది. అలాగే, మీరు ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80D కింద పన్ను మినహాయింపును కూడా క్లెయిమ్ చేయవచ్చు.

ఒక ఎమర్జెన్సీ ఫండ్ నిర్మించడం

జీవితం ఊహించలేనిది. ప్రధాన గృహ మరమ్మతులు, వాహనం బ్రేక్‌డౌన్లు, ఆరోగ్య అత్యవసర పరిస్థితులు లేదా ఇతర ఊహించని సంఘటనలు వంటి అనిశ్చిత సంఘటనలు ఏ సమయంలోనైనా జరగవచ్చు. అందువల్ల, మీరు తదుపరి ఆరు నెలల కోసం మీ జీవిత ఖర్చులను కవర్ చేసే అత్యవసర ఫండ్‌ను సృష్టించాలి. మీరు లిక్విడ్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టవచ్చు, ఇవి వ్యక్తిగత సెక్యూరిటీల కోసం 91 రోజుల వరకు మిగిలిన మెచ్యూరిటీతో ఓపెన్-ఎండెడ్ డెట్ ఫండ్స్. మీరు ఈ ఫండ్స్‌ను ఎప్పుడైనా రీడీమ్ చేసుకోవచ్చు మరియు అత్యవసర పరిస్థితుల్లో వాటిని ఉపయోగించవచ్చు.

ముగింపు

సరైన వయస్సులో సరైన పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడం భవిష్యత్తులో మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. అయితే, మీ మొదటి జీతాన్ని పెట్టుబడిగా పరిగణించేటప్పుడు కొంచెం పరిశోధన మరియు మార్గదర్శకత్వాన్ని పొందడం అనేది దీర్ఘకాలంలో మీకు మంచి ఫలితాలను అందిస్తుంది.

​ ​ ​

డిస్‌క్లెయిమర్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు పేర్కొన్న వివరణలు కేవలం అభిప్రాయాలను మాత్రమే కలిగి ఉంటాయి కావున, వీటిని ప్రత్యేక మార్గదర్శకాలు, సిఫార్సులు లేదా పాఠకుల కోసం ఉద్దేశించిన నిపుణుల సలహాలుగా పరిగణించకూడదు. ఈ డాక్యుమెంట్ బాహ్య మూలాల నుండి సేకరించిన సమాచారం, అంతర్గతంగా అభివృద్ధి చేయబడిన డేటా మరియు విశ్వసనీయమైనదిగా భావించే ఇతర వనరుల ఆధారంగా తయారు చేయబడింది. స్పాన్సర్లు, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, ట్రస్టీ లేదా వారి డైరెక్టర్లు, ఉద్యోగులు, అనుబంధ సంస్థలు లేదా ప్రతినిధులు ("సంస్థలు మరియు వారి అనుబంధ సంస్థలు") అలాంటి సమాచారం యొక్క ఖచ్చితత్వం, పరిపూర్ణత, సమగ్రత మరియు విశ్వసనీయతకు ఎలాంటి బాధ్యత వహించరు. ఈ సమాచారాన్ని స్వీకరించేవారు తమ విశ్లేషణ, వివరణలు మరియు పరిశోధనలపై ఆధారపడాలని సూచించడమైనది. ఒక తెలివైన పెట్టుబడి నిర్ణయానికి రావడానికి పాఠకులు వృత్తిపరమైన నిపుణుల సలహాలను కూడా పొందాలని సూచించడమైనది. ఈ మెటీరియల్ తయారీ లేదా జారీలో పాల్గొన్న వ్యక్తులతో సహా సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు ఏవైనా, ఈ మెటీరియల్‌లోని సమాచారం వల్ల పొందిన ప్రత్యక్ష, పరోక్ష, ప్రత్యేక, యాదృచ్ఛిక, పర్యవసాన, శిక్షాత్మక లేదా దండనాత్మక నష్టాలకు, లాభాలకు ఎలాంటి బాధ్యత వహించవు. ఈ సమాచారం ఆధారంగా తీసుకున్న ఏదైనా నిర్ణయానికి స్వీకర్త మాత్రమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది.

డిస్‌క్లెయిమర్: ఎస్ఐపి కాలిక్యులేటర్ ఫలితాలు అనేవి ఊహించిన రాబడి రేటుపై ఆధారపడి ఉంటాయి. ఒక వివరణాత్మక సూచన కోసం దయచేసి మీరు ఒక వృత్తిపరమైన నిపుణుడిని సంప్రదించండి. ఫలితాలు ఊహించిన రాబడి రేటుపై ఆధారపడి ఉంటాయి. ఈ గణనలు అనేవి భవిష్యత్తులో రుణాలు మరియు ఈక్విటీ మార్కెట్లు / సెక్టార్లు లేదా ఏదైనా వ్యక్తిగత భద్రత యొక్క భవిష్యత్తు రిటర్న్‌పై ఆధారపడి ఉండవు మరియు వీటిని కనీస రిటర్న్స్ మరియు/లేదా క్యాపిటల్ రక్షణ కోసం హామీగా పరిగణించకూడదు. కాలిక్యులేటర్‌ను తయారుచేసేటప్పుడు అత్యంత జాగ్రత్తలు పాటించినప్పటికీ ఎన్ఐఎంఎఫ్, సమగ్రతకు లేదా చేసిన గణనలు దోషరహితమైనవి మరియు/లేదా ఖచ్చితమైనవి అనే దానికి హామీ ఇవ్వదు లేదా/మరియు కాలిక్యులేటర్‌పై ఆధారపడే ఏదైనా విషయంలో అనగా దాని వినియోగం వల్ల తలెత్తే అన్ని బాధ్యతలు, నష్టాలు మరియు డ్యామేజీలను అది నిరాకరిస్తుంది. ఉదాహరణలు అనేవి ఏదైనా భద్రత లేదా పెట్టుబడుల పనితీరును సూచించవు. పన్ను పరిణామాల యొక్క వ్యక్తిగత స్వభావాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రతి పెట్టుబడిదారుడు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు స్వయంగా ఒక వృత్తిపరమైన పన్ను/ ఆర్థిక సలహాదారుని సంప్రదించాల్సిందిగా సలహా ఇవ్వడం జరుగుతుంది.

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి, స్కీమ్ సంబంధిత అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి.

Get the app