Sign In

For Suspension of fresh subscription in certain schemes of NIMF, kindly refer to ADDENDUM

మ్యూచ్యువల్ ఫండ్స్ పనితీరు అంచనా వేయడానికి తాజా ఎన్ఏవిలను ట్రాక్ చేయండి

సారాంశము: మన డబ్బు పెరగాలని మనమందరం కోరుకుంటాము మరియు ఆ ఉద్దేశంతోనే పెట్టుబడి పెడతాము. అయితే, ఎవరైనా ఒక వాహనం పనితీరును అంచనా వేయాలని భావిస్తే, ఆ వాహనం అనేది మ్యూచ్యువల్ ఫండ్ అయితే, అప్పుడు తాజా ఎన్ఎవిలు ట్రాక్ చేయడమనేది సరైన సూచీ కాగలదు. ఎన్ఎవి అనేది మార్కెట్ పనితీరు ద్వారా ప్రత్యక్షంగా ప్రభావితమవుతుంది మరియు స్కీం మరియు ఫండ్ రకం గురించి సరైన నిర్ణయం తీసుకోవాలంటే, మనం తప్పనిసరిగా ఒక పెట్టుబడి కంపెనీతో ఎన్‌రోల్ చేసుకోవాలి మరియు ఈ రంగంలోని ప్రొఫెషనల్స్‌ నుండి సహాయం కోరాలి

​​

లాభాలను పొందని పెట్టుబడులు మంచివి కావు మరియు మీ పెట్టుబడులను ప్లాన్ చేసేటప్పుడు, దాని పనితీరును విశ్లేషించాలి. కాబట్టి, మీరు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి చేసేటప్పుడు క్రమం తప్పకుండా వాటి ఎన్ఎవి ని ట్రాక్ చేయాలి. ఎన్ఏవి అనేది నెట్ అసెట్ వాల్యూ, ఇది మీ ఫండ్స్ యొక్క ప్రతి షేర్ విలువగా ఉంటుంది. ఒక వ్యక్తి తాజా ఎన్ఏవి ప్రతి యూనిట్ కోసం, ఇది మొత్తం పునరావృత ఖర్చు తగ్గించిన స్కీం సెక్యూరిటీల మార్కెట్ విలువ కాగలదు మరియు స్కీం అనేది ఏదైనా నిర్ధిష్ట తేదీకి సంబంధించినది అయితే, మొత్తం యూనిట్ల సంఖ్యతో భాగించబడిన మొత్తం అవుతుంది. లేదా మరింత సాంకేతిక భాషలో చెప్పాలంటే, ఒక నిర్ధిష్ట రోజున మార్కెట్‌లో ప్రదర్శించిన ఫండ్స్ యొక్క ప్రతి షేర్ విలువ అవుతుంది. దీని లెక్కింపు అనేది వాస్తవం కాగల అసెట్ విలువ నుండి ఫండ్ యొక్క అప్పులు (యూనిట్ మూలధనం తప్ప) తగ్గించడం మరియు ఔట్‌స్టాండింగ్ షేర్ల సంఖ్యతో భాగించడం అనే వాటితో ముడిపడి ఉంటుంది.

ఎన్ఎవి = [మార్కెట్ /స్కీమ్ యొక్క పెట్టుబడుల సరసమైన విలువ + రిసీవబుల్స్ + సంపాదించిన ఆదాయం + ఇతర అసెట్స్ - ఖర్చులు - పేయబుల్స్ - ఇతర లయబిలిటీలు] / అవుట్‌స్టాండింగ్ యూనిట్‌ల సంఖ్య

ఎన్ఎవి నాలుగు దశాంశ స్థానాల వరకు లెక్కించబడుతుంది.

సెక్యూరిటీల మార్కెట్ విలువ ప్రతిరోజూ మారుతుంది కాబట్టి, స్కీమ్ యొక్క ఎన్ఎవి కూడా మారుతుంది.

ఏదైనా మ్యూచ్యువల్ ఫండ్ పనితీరును నిర్ధారించే తాజా ఎన్ఎవి ఇది. భారతదేశంలో, చాలావరకు పెట్టుబడి కంపెనీలు వారి మ్యూచ్యువల్ ఫండ్ స్కీంలను వాటి ప్రోడక్ట్‌ యొక్క తాజా ఎన్ఎవి ఆధారంగా ప్రచారం చేస్తుంటాయి. ఇది ఫండ్ పనితీరు యొక్క సూచీ కాబట్టి, దీని విలువను ట్రాక్ చేస్తూ ఉండడం ముఖ్యం. మీ డబ్బుని సెక్యూరిటీల స్కీంలో పెట్టుబడి పెట్టిన తర్వాత మాత్రమే కాకుండా, దానికి ముందు కూడా ఈ పని తప్పక చేయాలి. మార్కెట్‌లో రోజువారీ హెచ్చుతగ్గులు అనేవి వివిధ పెట్టుబడి రకాల మీద ప్రభావం చూపుతాయి. మ్యూచ్యువల్ ఫండ్ ఎన్ఎవి అనేది ఒక పెట్టుబడి ప్రోడక్ట్ యొక్క పనితీరును సూచించడం మాత్రమే కాకుండా, పెట్టుబడి కంపెనీ పనితీరును కూడా అంచనా వేయడానికి ఇన్వెస్టర్‌కి సహాయం చేస్తుంది.

కాబట్టి, ఒక మ్యూచ్యువల్ ఫండ్ యొక్క ఎన్ఎవిని మీరు అంచనా వేసే సమయంలో, దాని విలువ అనేది మార్కెట్‌లోని హెచ్చు, తగ్గుల ద్వారా ప్రభావితం అవుతుందని ముందుగా అర్థం చేసుకోవాలి. మ్యూచ్యువల్ ఫండ్స్ యొక్క ఎన్ఎవి పనితీరు యొక్క ప్రాథమిక అంశాన్ని విశ్లేషించే సమయంలో ఇది గుర్తుంచుకోండి- ఎన్ఎవి ఎక్కువగా ఉన్నప్పుడు, మ్యూచ్యువల్ ఫండ్స్ మంచి పనితీరు ప్రదర్శిస్తాయి; ఒక నిర్ధిష్ట కాలానికి ఎన్ఎవి తక్కువగా ఉన్నప్పుడు, ఆ ప్రోడక్ట్ అనేది మంచి పనితీరు ప్రదర్శించదు; అలాగే, ఒక మ్యూచ్యువల్ ఫండ్ యొక్క ఎన్ఎవి తక్కువగా ఉన్నప్పుడు పనితీరు తగ్గడం, ఎన్ఎవి అధికంగా ఉన్నప్పుడు అధిక ఆదాయం ప్రతిఫలంగా లభించడం అనేది తప్పనిసరి కాదు.

సంపదను వృద్ధి చేసుకొని ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడిని ఒక ప్రధాన మరియు ప్రముఖ సాధనంగా పరిగణిస్తున్నప్పటికీ, తాజా ఎన్‌ఏవి లను క్రమం తప్పకుండా ట్రాక్ చేయమని సలహా ఇవ్వబడుతుంది. మీకు ప్రయోజనాన్ని అందించే ఫండ్స్‌లో పెట్టుబడి చేసి మీ ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి మంచి రాబడులను పొందడానికి వివేకంతో కృషి చేయండి. అందుకనే, మీ మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకోండి మరియు తెలివిగా పెట్టుబడి చేయండి. మీ ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి మీకు ఇప్పటికీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఎలా పెట్టుబడి చేయాలి మరియు ఎలాంటి ఫండ్‌ని ఎంచుకోవాలి మొదలైన వాటిలో సందేహాలు ఉంటే, మీ డబ్బును మేనేజ్ చేసే ఒక ప్రముఖ సంస్థ పై ఆధారపడండి

డిస్‌క్లెయిమర్లు
ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు వ్యక్తం చేయబడుతున్న ఉద్దేశాలు కేవలం అభిప్రాయాలను మాత్రమే కలిగి ఉంటాయి. అందువల్ల వీటిని పాఠకుల కోసం మార్గదర్శకాలు లేదా సిఫార్సులు లేదా ప్రొఫెషనల్ గైడ్‌గా పరిగణించకూడదు. పరిశ్రమ మరియు మార్కెట్లకు సంబంధించిన నిర్దిష్ట వాస్తవిక మరియు గణాంక సమాచారం (చారిత్రాత్మకమైన మరియు అంచనా వేయబడిన) స్వతంత్ర థర్డ్ పార్టీ వనరుల నుండి సేకరించబడింది, ఇవి విశ్వసనీయమైనవిగా పరిగణించబడ్డాయి. ఎన్ఎఎం ఇండియా (రిలయన్స్ నిప్పాన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్) అటువంటి సమాచారం లేదా డేటా యొక్క ఖచ్చితత్వం లేదా ప్రామాణికతను, లేదా అటువంటి డేటా మరియు సమాచారం ప్రాసెస్ చేయబడిన లేదా అంచనా వేయబడిన ఊహల యొక్క సహేతుకతను స్వతంత్రంగా ధృవీకరించలేదు; ఎన్ఎఎం ఇండియా (గతంలో రిలయన్స్ నిప్పాన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ అని పేర్కొనబడేది) అటువంటి డేటా మరియు సమాచారం యొక్క ఖచ్చితత్వం లేదా ప్రామాణికతకు ఏ విధంగానూ హామీ ఇవ్వదు. ఈ మెటీరియల్స్‌లో ఉన్న కొన్ని స్టేట్‌మెంట్‌లు మరియు వాదనలు ఎన్ఎఎం ఇండియా యొక్క (గతంలో రిలయన్స్ నిప్పాన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ అని పేర్కొనబడేది) ఉద్దేశాలు లేదా అభిప్రాయాలను ప్రతిబింబిస్తాయి, ఇవి అటువంటి డేటా లేదా సమాచారం ఆధారంగా ఏర్పడి ఉండవచ్చు.

ఏవైనా పెట్టుబడులు పెట్టడానికి ముందు, ఒక వ్యక్తిగత నిపుణుడి సలహా తీసుకోవాల్సిందిగా పాఠకులకు సూచించడమైనది, ఒక తెలివైన పెట్టుబడి నిర్ణయం తీసుకోవడానికి విషయాలను ధృవీకరించుకోవాలి. స్పాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, ట్రస్టీ, వారి సంబంధిత డైరెక్టర్లు, ఉద్యోగులు, అనుబంధ సంస్థలు లేదా ప్రతినిధులు ఎవరూ కూడా ఈ మెటీరియల్‌లో ఉన్న సమాచారం కారణంగా ఉత్పన్నమయ్యే నష్టాలకు ప్రత్యక్ష, పరోక్ష, ప్రత్యేక, యాదృచ్ఛిక, పర్యవసాన, శిక్షణాత్మక లేదా దండనాత్మక నష్టాలకు ఏ విధంగానూ బాధ్యత వహించరు.

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి, స్కీమ్ సంబంధిత అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి.




Get the app