Sign In

For Suspension of fresh subscription in certain schemes of NIMF, kindly refer to ADDENDUM

నిప్పాన్ ఇండియా బ్యాంకింగ్ ఫండ్ గురించి వివరణ

-బ్యాంకింగ్ రంగంలో పెట్టుబడి పెట్టడానికి ఒక ఓపెన్-ఎండెడ్ ఈక్విటీ స్కీం

సెక్టార్ ఫండ్స్ గురించి మీరు విని ఉంటారని మాకు ఖచ్చితంగా తెలుసు. ఇవి ఒక నిర్దిష్ట రకం రంగం మీద దృష్టి కేంద్రీకరించడం ద్వారా, అందులో వృద్ధిని సాధించే ప్రయత్నం చేస్తాయి. ప్రత్యేకించి, బ్యాంకింగ్ అనేది అలాంటి ఒక ఎవర్-గ్రీన్ రంగం. ఎందుకంటే, నిరంతరంగా మారే ఈ ప్రపంచంలో, బ్యాంకులు, క్రెడిట్ మరియు సంబంధిత సేవల అవసరం ఎల్లప్పుడూ ఉంటుంది.

బ్యాంకింగ్ రంగం ఎందుకు? ఎందుకంటే, బ్యాంకింగ్ అనేది ఏ దేశానికైనా వెన్నెముక లాంటిది అని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆర్థిక వ్యవస్థ రికవరీకి ఇది ఉత్ప్రేరకంలా పనిచేస్తుంది మరియు ద్రవ్యోల్బణం, అకౌంట్ లోటు లాంటి సూక్ష్మ ఆర్థిక వ్యవస్థతో కూడా కలసి పనిచేస్తుంది. ప్రాజెక్టులను వేగంగా క్లియర్ చేయడం లేదా భారీ ప్రాజెక్టుల కోసం దీర్ఘ-కాలిక రీపేమెంట్ సైకిల్ లాంటి అనేక అంశాలతో, ఇది ఆస్తి నాణ్యత మెరుగ్గా చేస్తుందని అంచనా వేయబడుతోంది. ఇది ఈ రంగాన్ని అనుకూలంగా కూడా ప్రభావితం చేస్తుంది. అలాగే, మధ్యస్థం నుండి దీర్ఘ-కాలంలో దేశీయ రికవరీ నుండి ఈ రంగం చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రయోజనం సాధిస్తుందని ఊహించబడుతోంది.

నిప్పాన్ ఇండియా మ్యూచ్యువల్ ఫండ్ బ్యాంకింగ్ సెక్టార్ ఫండ్ గురించి వివరంగా తెలుసుకుందాం.

నిప్పాన్ ఇండియా బ్యాంకింగ్ ఫండ్ అంటే ఏమిటి?

ఈ ఫండ్ ప్రాథమికంగా బ్యాంకింగ్ రంగంలోని కంపెనీలు మరియు బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన అనుబంధ కార్యకలాపాల్లో పాల్గొనే సంస్థల యొక్క ఈక్విటీ మరియు ఈక్విటీ సంబంధిత సెక్యూరిటీలలో పెట్టుబడులు పెడుతుంది. దీర్ఘ కాలంలో సంపద సృష్టించడం మరియు అదే సమయంలో మెరుగైన రిస్క్-సర్దుబాటు చేయబడిన లాభాలు జనరేట్ చేయడం దీని లక్ష్యంగా ఉంటుంది.

పెట్టుబడి తర్కము

నిప్పాన్ ఇండియా బ్యాంకింగ్ ఫండ్ అనేది బ్యాంకింగ్ మరియు ఫైనాన్షియల్ సర్వీస్ రంగాల మీద దృష్టి పెట్టిన ఒక సెక్టార్ ఫండ్. ప్రైవేట్ బ్యాంకులు, పిఎస్‌యులు, ఎన్‌బిఎఫ్‌సిలు, బ్రోకింగ్ హౌసులు మొదలైన వాటిలో వైవిధ్యంగా పెట్టుబడులు పెట్టడం దీని లక్ష్యం.

బ్యాంకింగ్ రంగంలోని కంపెనీలు మరియు బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన అనుబంధ కార్యకలాపాల్లో భాగమైన కంపెనీల ఈక్విటీ మరియు ఈక్విటీ సంబంధిత సెక్యూరిటీలలో క్రియాశీలకంగా పెట్టుబడులు పెట్టడం ద్వారా నిరంతర లాభాలు జనరేట్ చేయడం ఈ స్కీం యొక్క ప్రాథమిక పెట్టుబడి లక్ష్యం. లాభాలను గరిష్ట స్థాయికి చేర్చడం లేదా రక్షణాత్మక అంశాలను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా పైన పేర్కొన్న ఏదైనా రకం సెక్యూరిటీలలో ఎఎంసి తన విచక్షణ మేరకు పూర్తిగా లేదా పాక్షికంగా పెట్టుబడులు పెడుతుంది. అయితే, ఊహించిన ట్రెండ్స్‌తో వాస్తవ మార్కెట్ కదలికలు విభిన్నంగా ఉంటాయి కాబట్టి, ఈ స్కీం పెట్టుబడి లక్ష్యం వాస్తవం అవుతుందని చెప్పడానికి ఎలాంటి భరోసా ఉండదు.

ఫండ్ ఫీచర్‌లు

ఫండ్ గురించి సంక్షిప్తంగా -
కనీస పెట్టుబడి ₹ 5000 మరియు ఆ తర్వాత ₹ 1 యొక్క మల్టిపుల్స్
అదనపు కొనుగోలు మొత్తం ₹ 1000 మరియు ఆ తర్వాత ₹ 1 యొక్క మల్టిపుల్స్
ప్రారంభ తేదీ 26-May-03
లంప్‌సమ్/సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (ఎస్ఐపి) రెండు ఎంపికలూ అందుబాటులో ఉన్నాయి. పూర్తి వివరాల కోసం, దయచేసి స్కీం సంబంధిత డాక్యుమెంట్‌లు చూడండి,
ఎగ్జిట్ లోడ్ 1% యూనిట్ల కేటాయించబడిన తేదీ నుండి 1 సంవత్సరం పూర్తి అయ్యే సమయంలో లేదా అంతకంటే ముందుగా రిడీమ్ చేయబడితే లేదా మార్చబడితే. ఆ తర్వాత శూన్యం

పెట్టుబడిదారులు క్రింది వాటిని లక్ష్యంగా ఎంచుకోవచ్చు 

  • దీర్ఘ-కాలిక వృద్ధి
  • రిస్క్-సర్దుబాటు చేయబడిన లాభాలు
  • బ్యాంకింగ్ రంగం యొక్క రంగం-నిర్దిష్ట వృద్ధి సామర్థ్యం

ఒక పెట్టుబడిదారుకి ఉండగల వివిధ అవసరాలను మేము అర్థం చేసుకున్నాము మరియు వాటిని పూర్తి చేయడానికి మేము ఉత్తమంగా ప్రయత్నిస్తాము. దయచేసి, ఈ రోజే మీ ఆర్థిక సలహాదారుకు కాల్ చేయండి!

నిప్పాన్ ఇండియా బ్యాంకింగ్ ఫండ్ (బ్యాంకింగ్ రంగంలో పెట్టుబడి పెట్టడానికి ఒక ఓపెన్-ఎండెడ్ ఈక్విటీ స్కీం)

వీటిని కోరుకునే పెట్టుబడిదారులకు ఈ ప్రోడక్ట్ అనుకూలంగా ఉంటుంది*

  • దీర్ఘకాలిక మూలధన వృద్ధి.
  • బ్యాంకింగ్ రంగంలోని కంపెనీలు మరియు బ్యాంకింగ్ రంగంతో సంబంధం కలిగిన కార్యకలాపాలలో నిమగ్నమైన కంపెనీల ఈక్విటీ మరియు ఈక్విటీ సంబంధిత సెక్యూరిటీలలో పెట్టుబడి

*ప్రోడక్ట్ తమకు అనుకూలంగా ఉందా అనే సందేహం ఉంటే పెట్టుబడిదారులు తమ ఆర్థిక సలహాదారులను సంప్రదించాలి.

riskometer  

రిస్క్ ఫ్యాక్టర్ మరియు డిస్‌క్లెయిమర్: ట్రేడింగ్ పరిమాణాలు మరియు సెటిల్‌మెంట్ వ్యవధులు అనేవి ఈక్విటీ మరియు డెట్ పెట్టుబడుల్లో లిక్విడిటీని పరిమితం చేయవచ్చు. డెట్‌లో పెట్టుబడి అనేది ధర, క్రెడిట్, మరియు వడ్డీ రేటు రిస్క్‌కు లోబడి ఉంటుంది. మార్కెట్ పరిస్థితులు, వడ్డీ రేట్లు, ట్రేడింగ్ పరిమాణాలు, సెటిల్‌మెంట్ వ్యవధులు మరియు బదిలీ విధానాలలో మార్పులు, ఇతర అంశాల కారణంగా స్కీం యొక్క ఎన్ఎవి ప్రభావితం కావచ్చు. స్కీం సమాచార డాక్యుమెంట్ ద్వారా అనుమతించబడే డెరివేటివ్‌లు, విదేశీ సెక్యూరిటీలు లేదా స్క్రిప్ట్ లెండింగ్‌లో పెట్టుబడికి సంబంధించిన రిస్క్‌కి కూడా ఎన్ఎవి లోబడి ఉండవచ్చు. మరిన్ని వివరాల కోసం, దయచేసి స్కీం ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్ (ఎస్ఐడి) పరిశీలించండి.

ఇక్కడ వ్యక్తీకరించబడిన విషయాలు కేవలం అభిప్రాయాలను మాత్రమే కలిగి ఉంటాయి, అందువల్ల వీటిని మార్గదర్శకాలు, సిఫారసులు లేదా పాఠకులకు ఒక ప్రొఫెషనల్ గైడ్‌గా పరిగణించకూడదు. ఏదైనా పెట్టుబడులు పెట్టడానికి ముందు, పాఠకులు స్వయంగా వృత్తిపరమైన నిపుణులను సలహాలను కోరాలని, సమాచార పెట్టుబడి నిర్ణయానికి రావడానికి దాని కంటెంట్‌ని ధృవీకరించాలని సూచించబడుతుంది. స్పాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, ట్రస్టీ, వారి సంబంధిత డైరెక్టర్లు, ఉద్యోగులు, అనుబంధ సంస్థలు లేదా ప్రతినిధులు ఈ మెటీరియల్‌లో ఉన్న సమాచారం నుండి ఉద్భవించిన లేదా కోల్పోయిన లాభాల ఖాతాతో సహా ఏదైనా ప్రత్యక్ష, పరోక్ష, ప్రత్యేక, యాదృచ్ఛిక, పర్యవసాన, శిక్షణాత్మక లేదా దండనాత్మక నష్టాలకు ఏ విధంగానూ బాధ్యత వహించరు.


మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి, స్కీమ్ సంబంధిత అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి.


Get the app