Sign In

ఈక్విటీ ఫండ్స్‌లో పెట్టుబడి చేయడం ద్వారా లభించే ప్రయోజనాలేమిటి?​

ఈక్విటీ ఫండ్ పెట్టుబడులు అనేవి స్టాక్స్ లేదా ఈక్విటీలలో పెట్టే పెట్టుబడులు, ఇవి కంపెనీల్లో యాజమాన్య ఈక్విటీ లేదా షేర్‌ను సూచిస్తాయి. మ్యూచ్యువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియోను వైవిధ్యంగా ఉంచడానికి ఈక్విటీ ఫండ్స్ ఉపయోగపడతాయి. అంతేకాకుండా, ఇతర ఫండ్స్ ఏవీ ఇవ్వని నిర్ధిష్ట ప్రయోజనాలను ఈక్విటీ ఫండ్స్ అందిస్తాయి. అవి ఇలా ఉన్నాయి:‌

  • వైవిధ్యమైన పోర్ట్‌ఫోలియో: ఈక్విటీ ఫండ్స్ అనేవి చాలా తక్కువ ప్రాథమిక పెట్టుబడితో విస్తృతమైన వైవిధ్యం అందిస్తాయి. అంటే, విభిన్న కంపెనీల స్టాక్‌లను విభిన్న సమయాల్లో, విభిన్న ఆర్థిక రంగాల్లో కొనుగోలు చేయడం అని అర్థం. ఎక్స్‌చేంజ్‌లో ఒక స్టాక్ విలువ పడిపోయినప్పుడు, మరొక స్టాక్ ఆ నష్టాన్ని భర్తీ చేయడమనే రూపంలో ఇది సహాయపడుతుంది.
  • మూలధనం వృద్ధి: ఈక్విటీ ఫండ్ పెట్టుబడుల ప్రాథమిక ప్రయోజనాల్లో ఇది కూడా ఒకటి. కంపెనీ వృద్ధి చెందుతున్నప్పుడు మరియు లాభం ఆర్జించినప్పుడు, ఇది సాధారణంగా మార్కెట్ వాటా, ఉత్పత్తి అభివృద్ధి మొదలైన వాటి ద్వారా లాభం పెరగడానికి తిరిగి పెట్టుబడి పెట్టడానికి ఎంచుకుంటుంది. కంపెనీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ, దాని స్టాక్ మార్కెట్ ధర పెరుగుతుంది, తద్వారా పెట్టుబడిదారుల మూలధనం కూడా పెరుగుతుంది.
  • డివిడెండ్: బ్లూ చిప్ కంపెనీలలో పెట్టుబడి పెట్టినప్పుడు, డివిడెండ్‌ల రూపంలో ఇన్వెస్టర్లకు నిరంతర ఆదాయం లభిస్తుంది. ఆర్థిక వ్యవస్థ బాగా ఉన్నప్పుడు మరియు బాగా లేనప్పుడు కూడా, ఈ కంపెనీలు క్రమం తప్పకుండా ప్రతి త్రైమాసికంలో డివిడెండ్‌లు చెల్లిస్తాయి. ఒక వైవిధ్యమైన పోర్ట్‌ఫోలియో కలిగి ఉండడం వల్ల, సంవత్సరం పొడవునా స్థిరమైన ఆదాయం లభిస్తుంది. వివిధ కంపెనీలకు వేర్వేరు సైకిల్స్ ఉంటాయి కాబట్టి, ఇన్వెస్టర్‌లకు ప్రతి నెలా ఆదాయ హామీ లభిస్తుంది.
  • లిక్విడిటీ: ప్రపంచంలోని అన్ని ప్రధాన ఎక్స్‌చేంజ్లలో స్టాక్స్ ప్రతిరోజూ ట్రేడ్ చేయబడతాయి. ఈ కారణంగా అవి అత్యధిక లిక్విడ్ ఇన్వెస్ట్‌మెంట్‌గా ఉన్నాయి. అంటే, ఇన్వెస్టర్ కోరుకున్నప్పుడల్లా వారి స్టాక్స్‌ను విక్రయించవచ్చు. అయితే. స్టాక్స్ అనేవి మీ బ్యాంక్ ఖాతాలోని పొదుపులు లాంటి లిక్విడ్ రూపంలో ఉండవు. కానీ, చాలావరకు అవి రియల్ ఎస్టేట్‌కు ఒక స్థానం ముందుగా ఉంటాయి. ఇన్వెస్టర్ సాధారణంగా తన స్టాక్ అమ్మడం ద్వారా ఒక వారంలో డబ్బు పొందవచ్చు.
  • బ్రోకరేజ్ లేదా కమిషన్లు లేవు: సాధారణంగా, ఫండ్ హౌస్‌లు వాటి సేవల కోసం బ్యాంక్ ఫీజులు, కమీషన్, బ్రోకరేజ్ మొదలైన రూపంలో కోతలు విధించడం వల్ల, చివరకు ఇన్వెస్టర్ సంపాదించిన లాభం తగ్గిపోతుంది. మీరు ఎంత ఎక్కువగా చెల్లిస్తే, మీరు అంత తక్కువగా అందుకుంటారు. బ్రోకరేజ్ ఫీజులను తరచుగా చెల్లించాల్సిన అవసరం ఇన్వెస్టర్‌కి లేకపోవడం అనేది ఈక్విటీ ఫండ్స్ ప్రధాన ప్రయోజనాల్లో ఒకటి. దీర్ఘకాలంలో, ఇందులో పెట్టుబడి పెట్టడానికి ఇదొక ప్రధాన కారణంగా ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్ రకాలు.
  • ప్రొఫెషనల్ మేనేజ్‌మెంట్: పెట్టుబడుల విషయంలో ఒక అనిశ్చితమైన పరిస్థితి ఎల్లప్పుడూ ఉంటుంది. తగినంత విషయ పరిజ్ఞానం మరియు సమయం, స్వీయ-క్రమశిక్షణ, లేదా పెట్టుబడి అనుభవం లేని కారణంగా, పెట్టుబడి పెట్టడానికి ఇన్వెస్టర్ భయపడుతూ ఉంటారు. మ్యూచువల్ ఫండ్స్‌ ఈ పరిస్థితిలో సరిగ్గా సరిపోతాయి ఎందుకంటే అవి పెట్టుబడులను నిర్వహించడానికి ప్రొఫెషనల్ నైపుణ్యాన్ని స్వాభావికంగా కలిగి ఉండటం వలన పెట్టుబడిదారుడికి ఒత్తిడిని తగ్గిస్తాయి.

డిస్‌క్లెయిమర్లు
ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు వ్యక్తం చేయబడుతున్న ఉద్దేశాలు కేవలం అభిప్రాయాలను మాత్రమే కలిగి ఉంటాయి. అందువల్ల వీటిని పాఠకుల కోసం మార్గదర్శకాలు లేదా సిఫార్సులు లేదా ప్రొఫెషనల్ గైడ్‌గా పరిగణించకూడదు. పరిశ్రమ మరియు మార్కెట్లకు సంబంధించిన నిర్దిష్ట వాస్తవిక మరియు గణాంక సమాచారం (చారిత్రాత్మకమైన మరియు అంచనా వేయబడిన) స్వతంత్ర థర్డ్ పార్టీ వనరుల నుండి సేకరించబడింది, ఇవి విశ్వసనీయమైనవిగా పరిగణించబడ్డాయి. ఎన్ఎఎం ఇండియా (రిలయన్స్ నిప్పాన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్) అటువంటి సమాచారం లేదా డేటా యొక్క ఖచ్చితత్వం లేదా ప్రామాణికతను, లేదా అటువంటి డేటా మరియు సమాచారం ప్రాసెస్ చేయబడిన లేదా అంచనా వేయబడిన ఊహల యొక్క సహేతుకతను స్వతంత్రంగా ధృవీకరించలేదు; ఎన్ఎఎం ఇండియా (గతంలో రిలయన్స్ నిప్పాన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ అని పేర్కొనబడేది) అటువంటి డేటా మరియు సమాచారం యొక్క ఖచ్చితత్వం లేదా ప్రామాణికతకు ఏ విధంగానూ హామీ ఇవ్వదు. ఈ మెటీరియల్స్‌లో ఉన్న కొన్ని స్టేట్‌మెంట్‌లు మరియు వాదనలు ఎన్ఎఎం ఇండియా యొక్క (గతంలో రిలయన్స్ నిప్పాన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ అని పేర్కొనబడేది) ఉద్దేశాలు లేదా అభిప్రాయాలను ప్రతిబింబిస్తాయి, ఇవి అటువంటి డేటా లేదా సమాచారం ఆధారంగా ఏర్పడి ఉండవచ్చు.

ఏవైనా పెట్టుబడులు పెట్టడానికి ముందు, ఒక వ్యక్తిగత నిపుణుడి సలహా తీసుకోవాల్సిందిగా పాఠకులకు సూచించడమైనది, ఒక తెలివైన పెట్టుబడి నిర్ణయం తీసుకోవడానికి విషయాలను ధృవీకరించుకోవాలి. స్పాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, ట్రస్టీ, వారి సంబంధిత డైరెక్టర్లు, ఉద్యోగులు, అనుబంధ సంస్థలు లేదా ప్రతినిధులు ఎవరూ కూడా ఈ మెటీరియల్‌లో ఉన్న సమాచారం కారణంగా ఉత్పన్నమయ్యే నష్టాలకు ప్రత్యక్ష, పరోక్ష, ప్రత్యేక, యాదృచ్ఛిక, పర్యవసాన, శిక్షణాత్మక లేదా దండనాత్మక నష్టాలకు ఏ విధంగానూ బాధ్యత వహించరు.

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి, స్కీమ్ సంబంధిత అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి.


Get the app