మ్యూచువల్ ఫండ్ అంటే ఏమిటి?
నిర్వచనం ప్రకారం మ్యూచువల్ ఫండ్ అంటే డబ్బును ఆదా చేసి మంచి రాబడులను పొందాలనుకునే పెట్టుబడిదారుల నుండి సేకరించిన నిధుల మొత్తం అని అర్థం. వ్యక్తిగతంగా బాండ్లు, స్టాక్‌లలో ట్రేడింగ్ చేయడం కంటే కూడా మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి చేయడం చాలా సులభం.
వృత్తినిపుణుల చేత పెట్టుబడుల నిర్వహణ: అన్ని మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు వృత్తిపరమైన అర్హత కలిగిన వ్యక్తుల చేత ఎంపిక చేయబడతాయి మరియు పర్యవేక్షించబడతాయి, వీరు ఈ పెట్టుబడులతో జాగ్రత్తగా ప్రణాళిక వేయబడిన మరియు ఎంపిక చేయబడిన పోర్ట్‌ఫోలియోని సృష్టించవచ్చు. ఈ పోర్ట్‌ఫోలియోలో బాండ్లు, స్టాక్లు మరియు ఇతర సాధనాలు లేదా వీటన్నింటి కలయిక అయి ఉంటుంది.
ఫండ్ యాజమాన్యం: పెట్టుబడిదారు
మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి యొక్క షేర్లను కలిగి ఉంటాడు మరియు విడి సెక్యూరిటీల యాజమాన్యాన్ని కలిగి ఉండడు. ఈ ఫండ్‌లు ఒక పెట్టుబడిదారునికి వారి స్వంత పరిమితుల ప్రకారం చిన్న లేదా పెద్ద మొత్తాలలో డబ్బును పెట్టుబడి పెట్టడానికి అనుమతిస్తాయి మరియు ఇతర వ్యక్తులు చేసిన పెద్ద మొత్తంలోని పెట్టుబడులలో పాల్గొనడం ద్వారా లాభాలను అర్జిస్తాయి. అన్ని లాభాలు మరియు నష్టాలను ఫండ్‌లోని పెట్టుబడిదారులందరూ వారు పెట్టుబడి పెట్టిన మొత్తానికి తగినట్లుగా సమానంగా పంచుకుంటారు.
మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో ఎందుకు పెట్టుబడి పెట్టాలి
- వృత్తినిపుణుల చేత నిర్వహణ:
మ్యూచువల్ ఫండ్స్ అనేవి అత్యధిక వృత్తి నైపుణ్యం కలిగిన రీసెర్చ్ బృందాల చేత నిర్వహించబడతాయి, ఈ బృందాలు అందుబాటులో ఉన్న అవకాశాలు మరియు పనితీరు ఆధారంగా ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి పెట్టుబడిదారులకు ఉత్తమ సేవలు అందించడానికి మరియు మీ పెట్టుబడుల పై సాధ్యమైనంత ఉత్తమ రిటర్న్స్ అంకితం అయ్యాయి.
- సౌలభ్యం: క్యాపిటల్ మార్కెట్‌లో పెట్టుబడులు చేసే, సమయం లేదా తగిన నైపుణ్యం లేని పెట్టుబడిదారుల కోసం మ్యూచువల్ ఫండ్‌లు గొప్ప పెట్టుబడి ఎంపికగా నిరూపించబడ్డాయి. ఒక పెట్టుబడిదారు తన పెట్టుబడుల గురించి చింతించకుండా జీవితంలోని ఇతర ముఖ్యమైన విషయాలకు సమయం కేటాయించేందుకు మ్యూచువల్ ఫండ్స్ తోడ్పడతాయి.
- డైవర్సిఫికేషన్: ఒక ఆంగ్ల సామెతలో చెప్పినట్లుగా మీ అన్ని పెట్టుబడులను ఒకే చోట చేయవద్దు, విస్తృత శ్రేణిలో ఉన్న అసెట్లలో పెట్టుబడి చేయడం ద్వారా మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిదారుకి రిస్కుని తప్పించుకునే అవకాశం అందిస్తుంది. పరిమిత స్థాయిలో మూలధనం ఉన్న వ్యక్తులకు ఇవి గొప్ప ఎంపిక.
- పారదర్శకత మరియు భద్రత: ఫండ్ హౌస్‌లు వాటి పెర్ఫార్మెన్స్ వ్యూహంతో పెట్టుబడి యొక్క ప్రస్తుత విలువ గురించి క్రమం తప్పకుండా సమాచారాన్ని అందిస్తాయి. ఇది పెట్టుబడిదారులకు వారి పెట్టుబడులు పనితీరు గురించి ఒక స్పష్టమైన అవగాహనను అందిస్తుంది. అలాగే, అవి సెబీ ఆధ్వర్యంలో నిర్వహించబడతాయి, అయితే, ఏదైనా పెట్టుబడిలో రిస్క్ అనేది ఉంటుంది, నైపుణ్యం కలిగిన సిబ్బంది, జాగ్రత్తగా ఎంపిక చేయడం, డైవర్సిఫికేషన్ అనేవి రిస్కులను తగ్గించడంలో మరియు నిర్ధిష్ట వ్యవధిలో రిటర్న్స్ పెంచడంలో సహాయపడతాయి.
డిస్‌క్లెయిమర్లు
ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు వ్యక్తం చేయబడుతున్న ఉద్దేశాలు కేవలం అభిప్రాయాలను మాత్రమే కలిగి ఉంటాయి. అందువల్ల వీటిని పాఠకుల కోసం మార్గదర్శకాలు లేదా సిఫార్సులు లేదా ప్రొఫెషనల్ గైడ్‌గా పరిగణించకూడదు. పరిశ్రమ మరియు మార్కెట్లకు సంబంధించిన నిర్దిష్ట వాస్తవిక మరియు గణాంక సమాచారం (చారిత్రాత్మకమైన మరియు అంచనా వేయబడిన) స్వతంత్ర థర్డ్ పార్టీ వనరుల నుండి సేకరించబడింది, ఇవి విశ్వసనీయమైనవిగా పరిగణించబడ్డాయి. ఎన్ఎఎం ఇండియా (రిలయన్స్ నిప్పాన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్) అటువంటి సమాచారం లేదా డేటా యొక్క ఖచ్చితత్వం లేదా ప్రామాణికతను, లేదా అటువంటి డేటా మరియు సమాచారం ప్రాసెస్ చేయబడిన లేదా అంచనా వేయబడిన ఊహల యొక్క సహేతుకతను స్వతంత్రంగా ధృవీకరించలేదు; ఎన్ఎఎం ఇండియా (గతంలో రిలయన్స్ నిప్పాన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ అని పేర్కొనబడేది) అటువంటి డేటా మరియు సమాచారం యొక్క ఖచ్చితత్వం లేదా ప్రామాణికతకు ఏ విధంగానూ హామీ ఇవ్వదు. ఈ మెటీరియల్స్‌లో ఉన్న కొన్ని స్టేట్‌మెంట్‌లు మరియు వాదనలు ఎన్ఎఎం ఇండియా యొక్క (గతంలో రిలయన్స్ నిప్పాన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ అని పేర్కొనబడేది) ఉద్దేశాలు లేదా అభిప్రాయాలను ప్రతిబింబిస్తాయి, ఇవి అటువంటి డేటా లేదా సమాచారం ఆధారంగా ఏర్పడి ఉండవచ్చు.
ఏవైనా పెట్టుబడులు పెట్టడానికి ముందు, ఒక వ్యక్తిగత నిపుణుడి సలహా తీసుకోవాల్సిందిగా పాఠకులకు సూచించడమైనది, ఒక తెలివైన పెట్టుబడి నిర్ణయం తీసుకోవడానికి విషయాలను ధృవీకరించుకోవాలి. స్పాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, ట్రస్టీ, వారి సంబంధిత డైరెక్టర్లు, ఉద్యోగులు, అనుబంధ సంస్థలు లేదా ప్రతినిధులు ఎవరూ కూడా ఈ మెటీరియల్‌లో ఉన్న సమాచారం కారణంగా ఉత్పన్నమయ్యే నష్టాలకు ప్రత్యక్ష, పరోక్ష, ప్రత్యేక, యాదృచ్ఛిక, పర్యవసాన, శిక్షణాత్మక లేదా దండనాత్మక నష్టాలకు ఏ విధంగానూ బాధ్యత వహించరు.
మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి, స్కీమ్ సంబంధిత అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి.