చాలా సార్లు డెట్, ఈక్విటీల మధ్యన ఎంచుకోవడానికి తీసుకునే నిర్ణయం కష్టంగా ఉంటుంది. ఈ సమస్యను అధిగమించడానికి, పెట్టుబడిదారు వారి వయస్సు, ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పెట్టుబడి పెట్టాలనేది చాలా మంది నిపుణుల సలహా.
అయితే, మీరు క్రమం తప్పకుండా రీబ్యాలెన్స్ చేస్తూ మీ పెట్టుబడి పోర్ట్‌ఫోలియోని డైవర్సిఫై చేయాలని అనుకుంటే మీరు హైబ్రిడ్ లేదా బ్యాలెన్స్‌డ్ ఫండ్స్ ఎంచుకోవచ్చు. ఈ ఫండ్స్ మిమ్మల్ని డెట్ మరియు ఈక్విటీ కాంబినేషన్‌లో పెట్టుబడి చేసే ఎంపికను అందిస్తుంది.
పెట్టుబడిదారునికి రెండు విధాల ప్రయోజనాలను అందించడమే ఈ ఫండ్స్ యొక్క ప్రధాన లక్ష్యం. అయితే ఎవరైనా బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌లో ఎందుకు పెట్టుబడి చేయాలి అనే దాని గురించిన కొన్ని అంశాలను విశ్లేషిద్దాం:
-
బ్యాలెన్స్‌డ్ ఫండ్స్ యొక్క ప్రాథమిక ప్రయోజనం డైవర్సిఫికేషన్‌ను సాధించడం. ఫండ్ మేనేజర్ అసెట్ కేటాయింపు బాధ్యతను చేపడతారు, అలాగే అవసరాన్ని బట్టి ఫండ్‌ను రీబ్యాలెన్స్ కూడా చేస్తారు. స్టాక్ మార్కెట్ అస్థిరతను భరించే శక్తి లేని, కానీ స్టాక్ మార్కెట్ నుండి ప్రయోజనం పొందాలని అనుకునే పెట్టుబడిదారుల కోసం ఇవి ఉత్తమం. అన్ని రకాల పెట్టుబడిదారులు తమ పెట్టుబడులలో కొంత భాగాన్ని బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌లో పెట్టుబడి చేయాలి.
- బ్యాలెన్స్‌డ్ ఫండ్‌లో పెట్టుబడి వల్ల కలిగే అత్యుత్తమైన ప్రయోజనం ఏమిటంటే, పెట్టుబడిదారులు సాధారణంగా గురయ్యే ఆకస్మిక ఆనందం లేదా భయాందోళన వంటి పరిస్థితులను నివారించగలిగే ఆకర్షణీయమైన అసెట్ కేటాయింపును నిర్ధారిస్తుంది. బాలెన్స్‌డ్ ఫండ్‌లు వాటి విలువను అనేక సార్లు రుజువు చేశాయి, పెట్టుబడిదారులకు మంచి రిటర్న్స్ మరియు స్థిరత్వాన్ని అందించాయి. డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్ లాగా రిటర్న్స్ మెరుగ్గా ఉండకపోవచ్చు, అయితే రిస్క్ తీసుకోని పెట్టుబడిదారులకు దీర్ఘకాలంలో వృద్ధి కోసం బ్యాలెన్స్‌డ్ ఫండ్స్ మంచి ఎంపిక. అవి రిస్కుని తగ్గించి ప్రశాంతతతో పాటు మంచి రాబడులను కూడా అందిస్తాయి.
- బ్యాలెన్స్ ఫండ్ అందించే మరొక ప్రయోజనం రిస్క్ అడ్జెస్టెడ్ రిటర్న్స్. ఈక్విటీ ఫండ్స్ కంటే ఈక్విటీ ఆధారిత బ్యాలెన్స్‌డ్ ఫండ్స్ అత్యుత్తమ ప్రదర్శన చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి, ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే ఈక్విటీ ఆధారిత బ్యాలన్స్‌డ్ ఫండ్ డెట్ పెట్టుబడులలో 30-35% కేటాయింపును కలిగి ఉంటుంది. దీని కోసం కొన్ని వివరణలు కూడా ఉంటాయి. అందులో ఒకటి, ఫండ్ మేనేజర్ ఈక్విటీ భాగంలో దూకుడుగా వ్యవహరిస్తూ మిడ్ క్యాప్ మరియు స్మాల్ క్యాప్ లో అధిక ఎక్స్‌పోజర్ కలిగి ఉంటారు. ఇంకా, ఇడి ఫండ్ మేనేజర్ యొక్క స్టాక్ ఎంపిక మరియు పోర్ట్‌ఫోలియో నిర్వహణ సామర్థ్యం యొక్క కొలమానం కూడా అవ్వచ్చు.
డిస్‌క్లెయిమర్లు
ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు వ్యక్తం చేయబడుతున్న ఉద్దేశాలు కేవలం అభిప్రాయాలను మాత్రమే కలిగి ఉంటాయి. అందువల్ల వీటిని పాఠకుల కోసం మార్గదర్శకాలు లేదా సిఫార్సులు లేదా ప్రొఫెషనల్ గైడ్‌గా పరిగణించకూడదు. పరిశ్రమ మరియు మార్కెట్లకు సంబంధించిన నిర్దిష్ట వాస్తవిక మరియు గణాంక సమాచారం (చారిత్రాత్మకమైన మరియు అంచనా వేయబడిన) స్వతంత్ర థర్డ్ పార్టీ వనరుల నుండి సేకరించబడింది, ఇవి విశ్వసనీయమైనవిగా పరిగణించబడ్డాయి. ఎన్ఎఎం ఇండియా (రిలయన్స్ నిప్పాన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్) అటువంటి సమాచారం లేదా డేటా యొక్క ఖచ్చితత్వం లేదా ప్రామాణికతను, లేదా అటువంటి డేటా మరియు సమాచారం ప్రాసెస్ చేయబడిన లేదా అంచనా వేయబడిన ఊహల యొక్క సహేతుకతను స్వతంత్రంగా ధృవీకరించలేదు; ఎన్ఎఎం ఇండియా (గతంలో రిలయన్స్ నిప్పాన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ అని పేర్కొనబడేది) అటువంటి డేటా మరియు సమాచారం యొక్క ఖచ్చితత్వం లేదా ప్రామాణికతకు ఏ విధంగానూ హామీ ఇవ్వదు. ఈ మెటీరియల్స్‌లో ఉన్న కొన్ని స్టేట్‌మెంట్‌లు మరియు వాదనలు ఎన్ఎఎం ఇండియా యొక్క (గతంలో రిలయన్స్ నిప్పాన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ అని పేర్కొనబడేది) ఉద్దేశాలు లేదా అభిప్రాయాలను ప్రతిబింబిస్తాయి, ఇవి అటువంటి డేటా లేదా సమాచారం ఆధారంగా ఏర్పడి ఉండవచ్చు.
ఏవైనా పెట్టుబడులు పెట్టడానికి ముందు, ఒక వ్యక్తిగత నిపుణుడి సలహా తీసుకోవాల్సిందిగా పాఠకులకు సూచించడమైనది, ఒక తెలివైన పెట్టుబడి నిర్ణయం తీసుకోవడానికి విషయాలను ధృవీకరించుకోవాలి. స్పాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, ట్రస్టీ, వారి సంబంధిత డైరెక్టర్లు, ఉద్యోగులు, అనుబంధ సంస్థలు లేదా ప్రతినిధులు ఎవరూ కూడా ఈ మెటీరియల్‌లో ఉన్న సమాచారం కారణంగా ఉత్పన్నమయ్యే నష్టాలకు ప్రత్యక్ష, పరోక్ష, ప్రత్యేక, యాదృచ్ఛిక, పర్యవసాన, శిక్షణాత్మక లేదా దండనాత్మక నష్టాలకు ఏ విధంగానూ బాధ్యత వహించరు.
మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి, స్కీమ్ సంబంధిత అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి.