మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల వెనుక గల ప్రధాన కారణాల్లో ఒకటి ద్రవ్యోల్బణాన్ని అధిగమించే రిటర్న్స్‌ను ఆశించడం. అయితే, భారతదేశంలో మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఆర్జించిన నిర్దిష్ట రాబడి గురించి ప్రజలు విన్నప్పుడల్లా, దిగువ ఇవ్వబడిన ఉదాహరణలో సాహెబ్ మాదిరిగా వారు ఏమి ఆశించాలనే సందేహాన్ని కలిగి ఉంటారు:
సాహెబ్ తగిన మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లలో పెట్టుబడి పెట్టాలని కోరుకున్నారు మరియు ఊహించిన రిటర్న్స్ కోసం శోధించడం ప్రారంభించారు. మరింత లోతుగా అధ్యయనం చేసిన తర్వాత కొన్ని ప్రత్యేక స్కీమ్‌లు ఐదు సంవత్సరాలకు 10% రిటర్న్, 3-సంవత్సరాలకు 8% రిటర్న్ మరియు మొదలైనవి అందిస్తున్నట్లు కనుగొన్నారు. ఈ సంఖ్యలు అతనిని అయోమయానికి గురిచేశాయి మరియు రిటర్న్స్ పక్కన రాసిన సిఎజిఆర్ మరియు ఎక్స్‌ఐఆర్ఆర్ లాంటి పదాలు గందరగోళాన్ని పెంచాయి.
సాహెబ్ వంటి చాలా మంది వ్యక్తులు అలాంటి నిబంధనలను అర్థం చేసుకోవడం సవాలుగా భావిస్తారు. ఇక్కడ, రెండింటి మధ్య తేడాలను అర్థం చేసుకోవడంలో మీకు సహాయపడటానికి మేము సిఎజిఆర్ మరియు ఎక్స్ఐఆర్ఆర్‌ని పూర్తిగా కవర్ చేస్తాము.
సిఎజిఆర్ అంటే ఏమిటి?
సిఎజిఆర్ అనేది సమ్మేళన వార్షిక వృద్ధి రేటు మరియు మ్యూచువల్ ఫండ్ స్కీమ్ ద్వారా ఆర్జించిన రిటర్న్‌లను అంచనా వేయడానికి ఇది ప్రత్యేక సాధనం. ప్రతి సంవత్సరం రిటర్న్స్ సమ్మేళనం చేయబడతాయని భావించి నిర్దిష్ట వ్యవధిలో ఇది ఫండ్ యొక్క సగటు వార్షిక రాబడిని చూపుతుంది. ఇది మీ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల సమ్మేళన వృద్ధిని లేదా తగ్గుదలను సూచిస్తుంది.
సిఎజిఆర్ ఈ విధంగా లెక్కించబడుతుంది:
సిఎజిఆర్ = (పెట్టుబడి యొక్క తుది విలువ / పెట్టుబడి యొక్క ప్రారంభ విలువ) ^1/n – 1 ( n = పెట్టుబడి వ్యవధి)
ఉదాహరణ: మీరు భారతదేశంలోని అత్యుత్తమ మ్యూచువల్ ఫండ్స్‌లో ఐదేళ్ల క్రితం ₹1,00,000 పెట్టుబడి చేశారనుకుందాం. ఒకవేళ, మీ పెట్టుబడి ప్రస్తుత విలువ ₹1,51,000 అయితే అప్పుడు, పైన పేర్కొన్న ఫార్ములా ప్రకారం సిఎజిఆర్ 8.59% అవుతుంది. మీ పెట్టుబడి ₹1,00,000 అనేది ఐదేళ్ల తర్వాత సగటు వార్షిక రాబడి 8.59% నుండి ₹1,51,000 ఆర్జించింది.
సిఎజిఆర్ పరిమితులు
పైన వివరించిన విధంగా, వివిధ స్కీమ్స్‌లో ప్లాన్ చేసిన పెట్టుబడులకు రిటర్న్స్ చెక్ చేయడానికి సిఎజిఆర్ ఒక త్వరిత మార్గమని మీరు భావించి ఉండవచ్చు. అయితే, నిర్దిష్ట కాలవ్యవధిలో (ఎస్‌ఐపి మార్గం) బహుళ పెట్టుబడుల విషయంలో ఇది ఖచ్చితమైన రాబడిని అందించదు. పై ఉదాహరణలో 8.59% సిఎజిఆర్ అంటే మీ మూలధనంపై వాస్తవ రాబడి సంవత్సరానికి 8.59% అని కాదు. ఇది మొదటి కొన్ని సంవత్సరాల్లో ఎక్కువగా ఉండవచ్చు. అయితే, ఇతర వాటిల్లో తక్కువగా ఉండవచ్చు లేదా దీనికి విరుద్ధంగా ఉండవచ్చు.
ఎక్స్ఐఆర్ఆర్ అంటే ఏమిటి?
దీనినే ఎక్స్‌టెండెడ్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అని కూడా పిలుస్తారు, మీరు సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లు (ఎస్ఐపి అని కూడా పిలుస్తారు) లేదా నిర్ధిష్ట వ్యవధిలో విస్తరించిన బహుళ పెట్టుబడుల ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టినప్పుడు ఎక్స్ఐఆర్ఆర్ వర్తిస్తుంది. ఇక్కడ, ప్రతి వాయిదా యొక్క సిఎజిఆర్, మొత్తం సగటు రాబడి రేటును పొందేందుకు లెక్కించబడుతుంది.
ఇక్కడ పరిగణించవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు కాలానుగుణంగా వేరే ధరలో (ఎన్ఎవి అని కూడా పిలుస్తారు) డబ్బును పెట్టుబడిగా పెట్టాలి మరియు ప్రతి పెట్టుబడి వేర్వేరు వ్యవధుల కోసం నిర్వహించబడుతుంది. రిటర్న్స్ లెక్కించడానికి, ఎక్స్ఐఆర్ఆర్ మరియు సిఎజిఆర్ మధ్య వ్యత్యాసాన్ని మెరుగ్గా అర్థం చేసుకోవడానికి మీరు ఎక్స్ఐఆర్ఆర్ ఫార్ములాను ఉపయోగించవచ్చు.
ఎక్స్ఐఆర్ఆర్ మరియు సిఎజిఆర్ మధ్య వ్యత్యాసాలు
ఎక్స్ఐఆర్ఆర్ మరియు సిఎజిఆర్ అనేవి మీ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల నుండి రాబడిని సూచిస్తాయి, కానీ వాటి అప్లికేషన్లు విభిన్నంగా ఉంటాయి. ఆ వ్యత్యాసాలను తెలియజేసే శీఘ్ర సిఎజిఆర్ మరియు ఎక్స్ఐఆర్ఆర్ పోలిక పట్టిక ఇక్కడ ఇవ్వబడింది:
సిఎజిఆర్ |
ఎక్స్ఐఆర్ఆర్ |
ఏకమొత్తంలో పెట్టుబడులకు సగటు సమ్మేళన రాబడి | ఒక వ్యవధిలో చేసిన బహుళ
మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల యొక్క మొత్తం సిఎజిఆర్ |
ఏకమొత్తంలో పెట్టుబడులకు అనుకూలం | ఎస్ఐపి పెట్టుబడులకు అనుకూలంగా ఉంటాయి/ బహుళ పెట్టుబడులు కాలక్రమేణా విస్తరిస్తాయి |
తరచుగా అడిగే ప్రశ్నలు
మ్యూచువల్ ఫండ్ అంటే ఏమిటి?
ఒక
మ్యూచువల్ ఫండ్ అనేది వివిధ పెట్టుబడిదారుల నుండి డబ్బును సేకరించే ఒక పెట్టుబడి సాధనం. సంపాదించిన మొత్తం ఫండ్ యొక్క లక్ష్యాల ఆధారంగా వివిధ అసెట్‌లలో పెట్టుబడి పెట్టబడుతుంది.
నేను మ్యూచువల్ ఫండ్స్‌లో ఎలా పెట్టుబడి పెట్టగలను?
మీ ప్రస్తుత ఆర్థిక ప్రొఫైల్ మరియు లక్ష్యాలను పరిగణించండి, ఆపై మీ లక్ష్యాలకు సరిపోయే సరైన నిధుల కోసం శోధించండి. మీరు ఒకేసారి పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా లేదా ఎస్‌ఐపి మార్గంలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా అనేది మీ ఇష్టం.
మ్యూచువల్ ఫండ్స్ నుండి వచ్చే నా ఆదాయం ఆదాయపు పన్ను నుండి మినహాయించబడుతుందా?
భారతదేశంలో మ్యూచువల్ ఫండ్‌లకు సంబంధించిన పన్ను నియమాలు మీరు ఎంచుకున్న ఫండ్‌ల రకం మరియు మూలధన లాభాలపై ఆధారపడి ఉంటాయి.
ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు పేర్కొన్న వివరణలు కేవలం అభిప్రాయాలను మాత్రమే కలిగి ఉంటాయి కావున, వీటిని ప్రత్యేక మార్గదర్శకాలు, సిఫార్సులు లేదా పాఠకుల కోసం ఉద్దేశించిన నిపుణుల సలహాలుగా పరిగణించకూడదు. ఈ డాక్యుమెంట్ బాహ్య మూలాల నుండి సేకరించిన సమాచారం, అంతర్గతంగా అభివృద్ధి చేయబడిన డేటా మరియు విశ్వసనీయమైనదిగా భావించే ఇతర వనరుల ఆధారంగా తయారు చేయబడింది. స్పాన్సర్లు, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, ట్రస్టీ లేదా వారి డైరెక్టర్లు, ఉద్యోగులు, అనుబంధ సంస్థలు లేదా ప్రతినిధులు ("సంస్థలు మరియు వారి అనుబంధ సంస్థలు") అలాంటి సమాచారం యొక్క ఖచ్చితత్వం, పరిపూర్ణత, సమగ్రత మరియు విశ్వసనీయతకు ఎలాంటి బాధ్యత వహించరు. ఈ సమాచారాన్ని స్వీకరించేవారు తమ విశ్లేషణ, వివరణలు మరియు పరిశోధనలపై ఆధారపడాలని సూచించడమైనది. ఒక తెలివైన పెట్టుబడి నిర్ణయానికి రావడానికి పాఠకులు వృత్తిపరమైన నిపుణుల సలహాలను కూడా పొందాలని సూచించడమైనది. ఈ మెటీరియల్ తయారీ లేదా జారీలో పాల్గొన్న వ్యక్తులతో సహా సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు ఏవైనా, ఈ మెటీరియల్‌లోని సమాచారం వల్ల పొందిన ప్రత్యక్ష, పరోక్ష, ప్రత్యేక, యాదృచ్ఛిక, పర్యవసాన, శిక్షాత్మక లేదా దండనాత్మక నష్టాలకు, లాభాలకు ఎలాంటి బాధ్యత వహించవు. ఈ సమాచారం ఆధారంగా తీసుకున్న ఏదైనా నిర్ణయానికి స్వీకర్త మాత్రమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది.
మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి, స్కీమ్ సంబంధిత అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి.