Sign In

Content Editor

డెట్ ఫండ్‌లో ఎవరు పెట్టుబడి పెట్టాలి?

If you are wondering whether debt mutual funds are the right choice for you, then let us start by saying, yes! Debt mutual funds have something for every kind of investor. The more relevant questions here will be - whether it is the right time to invest in debt funds for you? Or what kind of debt funds to invest in? Or are the debt funds you are choosing, in alignment with your financial goals?

     
    


వివిధ పెట్టుబడిదారుల రకాలు మరియు డెట్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం వారికి ఏ విధంగా సహాయపడుతుందో ఇక్కడ ఇవ్వబడింది

అనుభవం లేని పెట్టుబడిదారు

మీరు ఇంతకు ముందు ఎన్నడూ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టకపోతే, డెట్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం మంచి ప్రవేశ స్థాయి కావచ్చు, ఎందుకంటే ఇందులో రిస్కులు తక్కువగా ఉన్నాయి మరియు అందించబడే పెట్టుబడి యొక్క స్థిరత్వం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కంటే సాపేక్షంగా ఎక్కువగా ఉంటుంది. సాంప్రదాయక పెట్టుబడి సాధనాల నుండి మ్యూచువల్ ఫండ్స్‌కి మారుతున్న ఎవరికైనా, సాంప్రదాయ పెట్టుబడి సాధనాల కంటే మెరుగైన రాబడులను అందిస్తూనే మ్యూచువల్ ఫండ్స్ పని చేసే విధానానికి డెట్ ఫండ్స్ అనేవి అలవాటు చేస్తాయి.

ఈక్విటీ పెట్టుబడిదారు

ఈక్విటీ ఇన్వెస్టింగ్ చేసే పెట్టుబడిదారులు సాదరంగా దీర్ఘ కాలిక పెట్టుబడిదారులు. మీరు వారిలో ఒకరు అయినట్లయితే, మీ పోర్ట్‌ఫోలియోలో డెట్ ఫండ్స్ ఉండకూడదు అని అర్థం కాదు. బహుశా మార్కెట్ పెట్టుబడి కోసం అనుకూలంగా లేనప్పుడు, డెట్ మ్యూచువల్ ఫండ్స్ మీ ఫండ్స్ యొక్క స్వల్పకాలిక పెట్టుబడి కోసం మీకు సహాయపడగలవు. స్వల్పకాలిక లక్ష్యాల కోసం కూడా, మీ పోర్ట్‌ఫోలియోలో మీకు తగిన డైవర్సిఫికేషన్ అందించడానికి డెట్ ఫండ్స్ ప్రయోజనకరంగా ఉండవచ్చు.

అనుభవజ్ఞులైన పెట్టుబడిదారులు

జీవితంలో తరువాతి దశలో, మీ లక్ష్యాలను నిర్దేశించుకున్న తరువాత, మరియు మీరు కొంత కాలం పాటు పెట్టుబడి పెట్టిన మీదట, ఈక్విటీ లేదా బంగారం, రియల్ ఎస్టేట్ మొదలైన ఇతర ఆస్తి వర్గాలకు సంబంధించిన రిస్కులను సమతుల్యం చేయడానికి మీకు మీ పోర్ట్‌ఫోలియోలో డెట్ ఫండ్స్ అవసరం కావచ్చు. ఈ దశలో, ఈక్విటీ పోర్ట్‌ఫోలియోతో పోలిస్తే డెట్ ఫండ్స్ మీ పోర్ట్‌ఫోలియోకు స్థిరత్వాన్ని అందిస్తాయి; మీరు మీ ఈక్విటీ ఫండ్స్‌కు సిస్టమాటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్ ప్రారంభించడానికి ముందు ఏకమొత్తంలో మీ డబ్బును రిజర్వ్ చేయడానికి కూడా ఇది మీకు సహాయపడగలదు.

సురక్షితమైన పెట్టుబడులు చేసేవారు

సురక్షితమైన పెట్టుబడులు చేసే వారు తమ డబ్బుతో ఎటువంటి ప్రధాన రిస్కులను తీసుకోరు మరియు వారి ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి తగిన ఎంపికలుగా డెట్ ఫండ్స్‌ని పరిగణిస్తారు. రిటైర్‌మెంట్, కార్ కొనడం మరియు విద్య వంటి స్వల్ప కాలిక మరియు దీర్ఘ కాలిక లక్ష్యాలను డెట్ మ్యూచువల్ ఫండ్స్ లేదా ఇతర సురక్షితమైన పెట్టుబడి ఎంపికల ద్వారా సాధించాలని అనుకుంటారు. రిస్క్ అంటే విముఖత ఉన్న యువ పెట్టుబడిదారులు కూడా డెట్ మ్యూచువల్ ఫండ్స్‌కు ప్రాధాన్యత ఇవ్వవచ్చు.

సీనియర్ సిటిజన్ పెట్టుబడిదారులు

చాలా మంది పెట్టుబడిదారులకు రిటైర్‌మెంట్ అనేది ప్రధాన లక్ష్యం. ఆ దశను చేరుకున్నప్పుడు, మీ రోజువారీ ఖర్చులను కొనసాగించడానికి మీకు స్థిరమైన రిటర్న్స్ అవసరం. తరచుగా రిడెంప్షన్ అవసరం అయ్యే ఇతర బాధ్యతలు ఉండవచ్చు, ఆరోగ్య సంరక్షణ అవసరాలు లేదా మీ కలలను సాకారం చేసుకోవాలని అనుకోవచ్చు. డెట్ ఫండ్స్ వాటి కోసం మీకు సహాయపడతాయి.

డెట్ ఫండ్స్‌లో ఎందుకు పెట్టుబడి పెట్టాలి?

ప్రతి పెట్టుబడిదారు ఒక అనుకూలమైన అసెట్ కేటాయింపును లక్ష్యంగా పెట్టుకుంటారు, అనగా అతని/ఆమె పోర్ట్‌ఫోలియోలోని అన్ని రకాల ఆస్తులను అంటే ఈక్విటీ, డెట్, గోల్డ్ మొదలైన ఆస్తుల సరైన కలయికను కలిగి ఉండాలనుకుంటారు. ఒకవేళ అసెట్స్‌లో ఒకదాని పనితీరు తక్కువగా ఉన్న సందర్భంలో బ్యాలెన్స్ నిర్వహించబడేలా ఇది జరుగుతుంది. ఇప్పుడు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మీకు దీర్ఘకాలంలో సంపదను సృష్టించుకోవడానికి అవకాశం ఇచ్చినప్పటికీ, డెట్ మ్యూచువల్ ఫండ్స్ మీకు ఈక్విటీ ఫండ్స్ కంటే తక్కువ రిస్క్‌తో సాపేక్షంగా స్థిరమైన రిటర్న్స్ అందించగలవు. ఇది మీ పోర్ట్‌ఫోలియో అవసరాలకు డైవర్సిఫికేషన్ కూడా అందించగలదు, ఇది మీ అసెట్ కేటాయింపును బలోపేతం చేస్తుంది.

సాంప్రదాయక పెట్టుబడి సాధనాలతో పోలిస్తే, డెట్ ఫండ్స్‌లో లిక్విడిటీ ఎక్కువ వీటిలో లాక్ ఇన్ వ్యవధి ఉండదు మరియు కేవలం కొన్ని క్లిక్‌లతో మీరు పెట్టుబడులను రిడీమ్ చేసుకోవచ్చు, అందుకనే వీటిలో లిక్విడిటీ ఎక్కువ ఇతర సాధనాలతో పోలిస్తే డెట్ మ్యూచువల్ ఫండ్స్ రిడెంప్షన్ ద్వారా వచ్చే ఆదాయం పై పన్ను కూడా తక్కువగా ఉంటుంది. ఇండెక్సేషన్ ప్రయోజనం కారణంగా, పెట్టుబడి యొక్క అసలు విలువ నుండి కాకుండా ఇండెక్స్డ్ విలువ నుండి మీ రిటర్న్స్ లెక్కించబడతాయి, తద్వారా క్యాపిటల్ గెయిన్స్ పన్ను లెక్కింపులో క్యాపిటల్ గెయిన్ తగ్గుతుంది పన్ను ఆదా గురించి మీరు మరింత చదవవచ్చు Here

డెట్ ఫండ్స్‌లో ఎప్పుడు పెట్టుబడి పెట్టాలి?

ఇది ఎక్కువగా మీరు మీ పెట్టుబడులతో సాధించడానికి ప్రయత్నిస్తున్న ఆర్థిక లక్ష్యాలు ఏమిటి అనేదానిపై ఆధారపడి ఉంటుంది. ఈక్విటీ ఫండ్ మరియు తక్కువ పన్నులతో పోలిస్తే లిక్విడిటీ మరియు స్థిరత్వం ఎల్లప్పుడూ కోరదగినవి. కానీ డెట్ ఫండ్స్ మీ పోర్ట్‌ఫోలియో కూర్పులో ఒక నిర్దిష్ట మరియు ప్రముఖ పాత్రను పోషించాలి. కాబట్టి, మీరు 20 సంవత్సరాల వయస్సులో పెట్టుబడి పెట్టేటప్పుడు, డెట్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం అనేది మీకు కాబోయే వివాహం కోసం పెట్టుబడి పెట్టడం అయి ఉండవచ్చు; మీ వయస్సు పెరిగే కొద్దీ, మీ పోర్ట్‌ఫోలియోలో డెట్ ఫండ్స్ యొక్క పాత్ర అత్యవసర ఫండ్ సృష్టించడం అయి ఉండవచ్చు. ఈ ఉదాహరణలు ఊహాజనితమైనవి, కానీ, డెట్ ఫండ్స్‌లో ఎందుకు పెట్టుబడి పెట్టాలి? అనే ఈ ప్రశ్నకు మీ స్వంత సమాధానాలను కనుగొనడంలో మీకు సహాయపడటానికి ఇవి సహాయపడతాయి

మీరు డెట్ మ్యూచువల్ ఫండ్స్ ప్రపంచాన్ని అన్వేషించడానికి సిద్ధంగా ఉంటే, మీ అవసరాలకు సరిపోయేదాన్ని ఎంచుకోవడానికి మరియు మీ ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఇక్కడ డెట్ మ్యూచువల్ ఫండ్స్ రకాలను చెక్ చేయండి.

ఇక్కడ ఉన్న సమాచారం సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు పేర్కొన్న వివరణలు కేవలం అభిప్రాయాలను మాత్రమే సూచిస్తాయి, కావున వీటిని, పాఠకులకు మార్గదర్శకాలు, సిఫార్సులు లేదా నిపుణుల సలహాలుగా పరిగణించకూడదు. బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారం, అంతర్గతంగా అభివృద్ధి చేయబడిన డేటా మరియు ఇతర విశ్వసనీయమైన మూలాల ఆధారంగా ఈ డాక్యుమెంట్ తయారు చేయబడింది. స్పాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, ట్రస్టీ లేదా వారి డైరెక్టర్లు, ఉద్యోగులు, అనుబంధ సంస్థలు లేదా ప్రతినిధులు ("సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు") అటువంటి సమాచారం యొక్క ఖచ్చితత్వం, పరిపూర్ణత, సమగ్రత మరియు విశ్వసనీయతకు ఎలాంటి బాధ్యత వహించరు. ఈ సమాచారాన్ని స్వీకరించే వారు తమ సొంత విశ్లేషణ, వివరణలు మరియు పరిశోధనలపై ఆధారపడాలని సూచించడమైనది. తెలివైన పెట్టుబడి నిర్ణయం తీసుకోవడానికి, వృత్తిపరమైన నిపుణుల సలహా తీసుకోవాలని పాఠకులకు సలహా ఇవ్వడమైనది. ఈ మెటీరియల్ తయారీ లేదా జారీలో భాగంగా ఉన్న వ్యక్తులతో సహా సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు, ఈ మెటీరియల్‌లో ఉన్న సమాచారం ఆధారంగా పొందిన లాభాలు, నష్టాలతో సహా ఏదైనా ప్రత్యక్ష, పరోక్ష, ప్రత్యేక, అనుకోని, పర్యవసాన, శిక్షణాత్మక లేదా దండనాత్మక నష్టాలకు బాధ్యత వహించవు. ఈ డాక్యుమెంట్ ఆధారంగా తీసుకునే ఏ నిర్ణయానికైనా స్వీకర్త మాత్రమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది.

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి, స్కీమ్ సంబంధిత అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి

Get the app