Sign In

మహిళలు, అందుకే మీరు మీ ఆర్థిక బాధ్యతలను స్వీకరించాలి!

మీరు చిన్నతనం నుండి, మీ తల్లి మరియు కుటుంబంలోని ఇతర మహిళలు ప్రతి చివరి పైసాను ఆదా చేయడం మరియు వాటిని అవసరమైన సమయంలో ఖర్చు కోసం అందించడాన్ని గుర్తుంచుకొని ఉంటారు. వారికి ఇంటికి సంబంధించిన రోజువారీ ఖర్చుల గురించి పూర్తిగా తెలుసు. కావున, వారిని వివేక వంతులు మరియు ప్రాక్టికల్ మనీ మేనేజర్‌లు అని అనడంలో సందేహం లేదు.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, చాలా మంది విద్యావంతులైన స్వతంత్ర మహిళలు కూడా, కొన్నిసార్లు, తమ సొంత ఆర్థిక బాధ్యతలను స్వీకరించడానికి ఆసక్తి చూపరు. వాస్తవానికి, 2019 లో చేసిన సర్వే ప్రకారం, కేవలం 33% మహిళలు మాత్రమే స్వతంత్రంగా పెట్టుబడి నిర్ణయాలు తీసుకుంటారు. ఇది సాధారణంగా వారి ​తండ్రి లేదా భర్త, వారి కోసం వారి డబ్బును నిర్వహిస్తున్నారనే విషయాన్ని వెల్లడిస్తుంది. డబ్బు నిర్వహణలో ఇలాంటి ఒక స్టీరియోటైపికల్ విధానాన్ని బ్రేక్ చేయడానికి మరియు డబ్బుని నిర్వహించడంలో స్వతంత్రంగా మారడానికి ఒక సాంస్కృతిక మరియు మానసిక మార్పు చాలా అవసరం.

ఇప్పటికీ నమ్మలేరా? మీ నిర్ణయాన్ని పునరాలోచించుకోవడానికి మరియు నేడే ప్రారంభించడానికి మేము మీకు 5 కారణాలను అందిస్తాము!

మీరు ఎక్కువ కాలం జీవించవచ్చు

మహిళల ఆయుర్దాయం పురుషుల కంటే ఎక్కువగా ఉంటుంది. ఇది మీకు అధిక రిటైర్‌మెంట్ కార్పస్ మరియు మరింత వివరణాత్మక ప్లాన్ అవసరమని సూచిస్తుంది. సుదీర్ఘమైన జీవితం అంటే మరింత ఆరోగ్య సంరక్షణ ఖర్చులు మరియు జీవనశైలి ఖర్చులు అని అర్థం. మహిళలకు క్యాన్సర్ వంటి క్లిష్టమైన అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కావున, రిటైర్‌మెంట్ కోసం, మీకు నచ్చిన ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఒక సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌ (ఎస్ఐపి)ను ప్రారంభించడం పెట్టుబడి పెట్టడానికి ఉత్తమ మార్గం. ఏదైనా ముందుగా నిర్వచించిన విరామంలో ఎస్ఐపి రూపంలో చెల్లించిన చిన్న మొత్తం కూడా మీకు సౌకర్యవంతమైన రిటైర్‌మెంట్ పొందడానికి, పెద్ద మొత్తాన్ని అర్జించడానికి సహాయపడుతుంది. చిన్న వయస్సులో ఎస్ఐపిని ప్రారంభించడం వల్ల మీరు కాంపౌండింగ్ శక్తి నుండి ప్రయోజనం పొందడం వలన దీర్ఘకాలంలో మెరుగైన రాబడులను పొందడంలో సహాయపడుతుంది.

మీరు కెరీర్ బ్రేక్స్ తీసుకోవచ్చు

మీ జీవితంలో మీరు కెరీర్‌ బ్రేక్స్ తీసుకోవాల్సిన సందర్భాలు ఉండవచ్చు, మరియు ఆ నెలలు లేదా సంవత్సరాలలో, మీరు ఆర్థికంగా స్వయం సమృద్ధిగా ఉండాలనుకోవచ్చు. మీరు ఈ బ్రేక్స్ గురించి ఊహించినా లేదా ఊహించకపోయినా, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి ఈ పరిస్థితులకు సిద్ధంగా ఉండడంలో మీకు సహాయపడుతుంది. సిస్టమాటిక్ విత్‌డ్రావల్ ప్లాన్ (ఎస్‌డబ్ల్యుపి) సహాయంతో, మీరు మ్యూచువల్ ఫండ్ స్కీమ్ నుండి నెలవారిగా కొంత మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునే ప్లాన్ కూడా ఎంచుకోవచ్చు.

మీరు ఒక రోల్ మోడల్ అవ్వాలని ఉండవచ్చు

అనేక ఇతర మహిళల కోసం, రోల్ మోడల్‌గా ఉండాలనుకోవచ్చు. అయితే, మీ పెట్టుబడులు మరియు ఫైనాన్సులను ప్లాన్ చేయడం ద్వారా మీరు ఒక రోల్ మోడల్‌గా ఎదగవచ్చు. ఇది ఒక ఆరోగ్యకరమైన మనస్తత్వాన్ని ప్రోత్సహిస్తుంది మరియు స్వతంత్రతను గురించి ఎదుటివారికి నేర్పిస్తుంది, అలాగే మహిళలు ఆర్థికపరమైన మెచ్యూరిటీని పొందుతారు.

మీరు వివిధ లక్ష్యాల కోసం ఆర్థిక భద్రతను కోరుకోవచ్చు

జీవితంలో ఎలాంటి నిస్సహాయ పరిస్థితి నుండి అయినా మిమ్మల్ని మీరు కాపాడుకోవడం ఉత్తమం. రిస్క్ తీసుకోగలిగే మీ సామర్థ్యాన్ని బట్టి, మీ జీవితంలోని వివిధ లక్ష్యాలను తీర్చుకోవడానికి, మీరు వివిధ పెట్టుబడుల కలయికతో కూడిన మీ స్వంత పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోను కలిగి ఉండటం మంచిది. ఉదాహరణకు, మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలని ఎంచుకుంటే, మీ ట్యాక్స్ సేవింగ్ అవసరాల కోసం ఇఎల్ఎస్ఎస్‌లో పెట్టుబడి పెట్టవచ్చు (ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్), మీ అత్యవసర నిధి అవసరాల కోసం లిక్విడ్ నిధులలో, మీకు రిస్క్ తీసుకునే సామర్థ్యం తక్కువగా ఉన్నట్లయితే డెట్ మ్యూచువల్ ఫండ్‌లు మొదలైనవి ఎంచుకోవచ్చు. ఈ విధంగా, ఏదైనా పరిస్థితిని ఎదుర్కోవడానికి మీకంటూ ఒక స్వంత ఆర్థిక ప్రణాళిక ఉండాలి.

సరైన మార్గదర్శకంతో పెట్టుబడి సులువుగా ఉంటుంది. ఒకవేళ మీరు గందరగోళానికి గురైనట్లయితే లేదా మార్గదర్శకత్వం అవసరమైతే, మరింత సమాచారం, సంప్రదింపుల కోసం మీరు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్‌ని సంప్రదించవచ్చు.

మూలం

ఎకనామిక్ టైమ్స్: ఆర్టికల్ తేదీ: మే 30, 2019 (33 % మహిళలు)

ఆరోగ్యం/మరణాలు/ఆయుర్దాయంపై గ్లోబల్ హెల్త్ అబ్జర్వేటరీ (జిహెచ్ఓ) డేటా/

ఏగాన్ లైఫ్: జూలై 2, 2018 తేదీ నాటి ఆర్టికల్ (మహిళలకు కలిగే అనారోగ్యం)

"పైన పేర్కొన్న సమాచారం కేవలం అర్థం చేసుకోవడానికి మాత్రమే, ఇది నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ యొక్క ఏదైనా స్కీమ్‌కు సంబంధించిన ప్రత్యక్ష లేదా పరోక్ష సమాచారం కాదు. ఇక్కడ వ్యక్తీకరించబడిన విషయాలు కేవలం అభిప్రాయాలు మాత్రమే. రీడర్ ద్వారా అనుసరించబడే విధంగా ఎలాంటి మార్గదర్శకాలు లేదా సిఫారసులు చేయవద్దు. ఈ సమాచారం సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు రీడర్స్ కోసం ఒక ప్రొఫెషనల్ గైడ్‌గా సర్వ్ చేయడానికి ఉద్దేశించబడినది కాదు."

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి, స్కీమ్ సంబంధిత అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి.


Get the app