Sign In

Content Editor

SIP (సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) - SIP అర్థం మరియు SIP యొక్క ప్రయోజనాలు | నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్

ఎస్ఐపి (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్): ఎస్ఐపి ఇన్వెస్ట్‌మెంట్ యొక్క అర్థం మరియు ప్రయోజనాలు

అభినందనలు! మీరు ఇప్పుడే ఆర్థికంగా సురక్షితమైన భవిష్యత్తు కోసం మొదటి మరియు అత్యంత ముఖ్యమైన అడుగు వేశారు. అనేక మంది విస్మరించే పెట్టుబడి యొక్క ప్రాముఖ్యతను మీరు గుర్తించినందుకు మేము దానిని ముఖ్యమైన అడుగుగా పేర్కొంటున్నాము.

ఇప్పుడు, మీరు చేసిన మరొక మంచి పని, సిప్ పై ఆసక్తి కనబరచడం. భవిష్యత్తు కోసం ఆర్థిక మూల నిధిని ఏర్పాటు చేసుకోవడం అనేది నిస్సందేహంగా ఒక తెలివైన పని. దీని కోసం పెట్టుబడి చేయడానికి తెలివైన మార్గం అయిన సిప్ కంటే మెరుగైన విధానం ఇంకేం ఉంటుంది.

ఇది సౌకర్యవంతమైనది, పెట్టుబడి పెట్టడానికి సులభమైనది మరియు ద్రవ్యోల్బణాన్ని అధిగమించే ఫలితాలను అందిస్తుంది కాబట్టి పెట్టుబడి పెట్టడానికి మేము దీనిని తెలివైన మార్గంగా పేర్కొంటాము. ఈ అంశాలు మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడాన్ని సులభతరం చేస్తాయి.

ఇప్పుడు మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మీకు ఆసక్తి కలుగుతుంది అని మేము ఖచ్చితంగా చెప్పగలం. అందుకే, ఇక ఆలస్యం చేయకుండా, ఎస్ఐపి గురించి మరింత తెలుసుకుందాం.

ఎస్ఐపి అంటే ఏమిటి?

ఒక ఎస్ఐపి లేదా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ అనేది సంపదను సృష్టించడానికి ఉన్న ఒక పద్ధతి. అయితే, ఇతర మార్గాల లాగా కాకుండా, ఇది మరింత సౌకర్యవంతమైనది.

ఎస్ఐపి ద్వారా మీరు ఒకేసారి భారీ మొత్తాన్ని పెట్టుబడి పెట్టకుండా, ముందుగా నిర్ణయించబడిన మొత్తాన్ని క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టవచ్చు. ఇది ప్రతి వారం, ప్రతి నెలా లేదా త్రైమాసికంగా ఉండవచ్చు, మీకు ఏ విధంగా అనుకూలంగా ఉంటే ఆ విధంగా చేయవచ్చు.

కానీ అటువంటి నియమితకాలపు పెట్టుబడి పద్ధతి ఎందుకు సహాయపడుతుంది?

వివరాలు తెలుసుకుందాం:
a) ఇది ఆర్థిక క్రమశిక్షణ మరియు క్రమబద్ధమైన పొదుపు అలవాట్లను అలవరుస్తుంది.
b) ఇది మార్కెట్ హెచ్చుతగ్గుల ప్రకారం వ్యవహరించే ఇబ్బందిని తొలగిస్తుంది.
c) రెగ్యులర్ ఇంటర్వెల్స్ వద్ద మీ పెట్టుబడులు ఆటోమేటిక్‌గా చేయబడతాయి. అదనపు ప్రయత్నం ఏదీ అవసరం లేదు.

ఎస్ఐపి ని ఆకర్షణీయమైన పెట్టుబడి పద్ధతిగా మార్చే మరికొన్ని అంశాలు ఇక్కడ వివరించబడ్డాయి.

ఎస్ఐపి యొక్క ప్రయోజనాలు ఏమిటి?

కొత్త మరియు అనుభవజ్ఞులైన పెట్టుబడిదారులు ఇద్దరూ ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి ఎస్ఐపి ని ఒక సౌకర్యవంతమైన పద్ధతిగా పరిగణిస్తున్నారు.

కారణాలు ఇక్కడ ఉన్నాయి:

కాంపౌండింగ్ యొక్క శక్తి

ఎస్ఐపి ద్వారా ఒక చిన్న పెట్టుబడి కూడా కాంపౌండింగ్ శక్తితో ఒక పెద్ద మొత్తంలోకి పెరగవచ్చు. అందుకే, సంవత్సరాలు గడిచే కొద్దీ మీ పెట్టుబడి మరింత వడ్డీని సంపాదిస్తుంది, మీ ఆర్థిక లక్ష్యాల కోసం తగిన మొత్తాన్ని జమ చేయడానికి ఇది అనుమతిస్తుంది. కాంపౌండింగ్ శక్తి గురించిన మరిన్ని వివరాలను మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు.

రూపీ కాస్ట్ యావరేజింగ్

ఈ పదం ఏదైనా గణిత పాఠ్యపుస్తకంలోని అంశం లాగా అనిపించినప్పటికీ, దీని పాత్ర చాలా ముఖ్యం. మార్కెట్ అస్థిరత రిస్కును తగ్గించడానికి రూపీ కాస్ట్ యావరేజింగ్ సహాయపడుతుంది. అంటే దీని అర్థం, మార్కెట్ ప్రభావితం అయినప్పుడు, మీ పూర్తి పెట్టుబడికి సాధ్యమమైనంత ఉత్తమ రక్షణ అందించబడుతుంది. మీరు మరింత తెలుసుకోవాలనుకుంటే, ఇక్కడ క్లిక్ చేయండి.

సులభమైన పెట్టుబడి

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడానికి సులభమైన విధానాల్లో ఒకటిగా ఎస్ఐపి నిలుస్తుంది. మీరు చేయవలసిందల్లా మీ అకౌంట్ నుండి ఆటో-డెబిట్లను ప్రారంభించడానికి మీ బ్యాంకుకు సూచనను అందించడం. మీరు ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా సులభంగా పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు.

క్రమశిక్షణ

పొదుపు చేయడం సులభమైన పని కాదు. ఊహించని ఖర్చులు ఉంటాయి మరియు చాలా మంది "తరువాత చేద్దాం" అని చెప్తారు. ఎస్ఐపి ఉపయోగించి పెట్టుబడి పెట్టడం ద్వారా, మీరు క్రమం తప్పకుండా ఆదా చేయడానికి కట్టుబడి ఉన్నారు. ఈ విధంగా, మీరు మీ ఆర్థిక లక్ష్యాలను సాధించవచ్చు. మీరు ఎస్ఐపి కాలిక్యులేటర్ సహాయంతో మీ లక్ష్యాల ఆధారంగా కూడా మీ పెట్టుబడిని ప్లాన్ చేసుకోవచ్చు.

సులభంగా ప్రారంభించండి

భారీ పెట్టుబడి చేయవలసిన అవసరం లేకపోవడం ఎస్ఐపి లో ఉన్న సౌకర్యం. మీరు చిన్న మొత్తంతో ప్రారంభించి, మీ సౌలభ్యం ప్రకారం మీ పెట్టుబడిని పెంచుకోవచ్చు.

ఎస్ఐపి లో ఎలా పెట్టుబడి పెట్టాలి

ఒక ఎస్ఐపి లో పెట్టుబడి పెట్టడం చాలా సులభం మరియు సరళమైనది అయినప్పటికీ, అనుసరించవలసిన కొన్ని దశలు ఉన్నాయి.


మీ లక్ష్యాన్ని సెట్ చేయండి ప్రతి పెట్టుబడికి ఒక నిర్దిష్ట లక్ష్యం లేదా ప్రయోజనం ఉండాలి. ఒక లక్ష్యాన్ని నిర్వచించడం అనేది మీరు ఊహించిన కార్పస్, దానిని జమ చేయవలసిన సమయం మరియు మీరు పెట్టుబడి పెట్టవలసిన మొత్తం గురించి అవగాహన పొందడానికి మీకు సహాయపడుతుంది. అది తెలుసుకోవడానికి మీరు ఒక ఎస్ఐపి కాలిక్యులేటర్‌ను ఉపయోగించవచ్చు లేదా మమ్మల్ని సంప్రదించండి.

సరైన ఫండ్ మరియు ఎస్ఐపి ఎంచుకోండి సరైన ఫండ్ ఎంచుకోవడం చాలా ముఖ్యం మరియు అది ఒక వివేకవంతమైన నిర్ణయం అయి ఉండాలి. మీ కోసం ఉత్తమమైన ‌మ్యూచువల్ ఫండ్ మరియు సరైన ఎస్ఐపి ఎంచుకోవడంలో మా బృందం మీకు సంతోషంగా సహకరిస్తుంది.

కెవైసి అన్ని మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల కోసం మీరు కెవైసి రిజిస్ట్రేషన్ చేయవలసి ఉంటుంది. ఇది మీ సౌకర్యం ప్రకారం సులభంగా ఆన్‌లైన్‌లో చేయవచ్చు. ఇక్కడ క్లిక్ చేయండి మరియు ఎలాగో తెలుసుకోండి. ఆన్‌లైన్ కెవైసి ప్రక్రియ అనేది మీ ఆధార్ నంబర్‌ను ఉపయోగిస్తుంది, ఇది క్రాస్-వెరిఫికేషన్ కోసం మీ పాన్ నంబర్‌తో సరిపోల్చి తనిఖీ చేయబడుతుంది.

కెవైసి విధానాన్ని ఆఫ్‌లైన్‌లో చేయడానికి, దయచేసి మమ్మల్ని సంప్రదించండి మరియు మేము మీకు సంతోషంగా మార్గనిర్దేశం చేస్తాము. మీరు ఎలా పెట్టుబడి పెట్టాలో మరిన్ని వివరాలు కావాలనుకుంటే, ఇక్కడ క్లిక్ చేయండి.

ఎస్ఐపి లో ఎప్పుడు పెట్టుబడి పెట్టాలి

దానికి ఒక స్ట్రెయిట్-అప్ సమాధానం, ఇంతకు ముందు మెరుగైనది. ఎస్ఐపిలో పెట్టుబడి పెట్టడం అనేది ఒక నిరంతర మరియు అభివృద్ధి చెందుతున్న ప్రక్రియ, ఇది నేరుగా ఒక వ్యక్తి యొక్క ఆర్థిక లక్ష్యానికి సంబంధించినది. ఎందుకంటే, వయస్సు లేదా ఇతర అవసరాల కారణంగా ఫైనాన్షియల్ లక్ష్యాలు మారవచ్చు, కాబట్టి పెట్టుబడి వ్యూహం కూడా మారవచ్చు.

20 లలో ఎస్ఐపి

ఇది ఒకరి కెరీర్ యొక్క ప్రారంభ కాలం మరియు పెట్టుబడి గురించి నేర్చుకోవడానికి మరియు పొదుపు అలవాటును అలవరచుకోవడానికి సరైన సమయం. సాధారణంగా ఈ వయస్సులో ఆదాయం తక్కువగా ఉంటుంది కనుక, తక్కువ మొత్తంతో ఎస్ఐపి ప్రారంభించవచ్చు. మరింత తెలుసుకోండి.

చదవడానికి క్లిక్ చేయండి

30 లలో ఎస్ఐపి

ఒక ఇల్లు లేదా వివాహ ఖర్చులు వంటి ఆర్థిక లక్ష్యాల కోసం ప్రణాళిక వేయవలసిన సమయం ఇది. ఎస్ఐపి యొక్క ప్రయోజనం ఉపయోగించుకోవడానికి మరియు క్రమంగా అవసరం అయిన కార్పస్ నిర్మించుకోవడానికి ఇది సరైన సమయం. మరింత తెలుసుకోండి.

చదవడానికి క్లిక్ చేయండి

40 లలో ఎస్ఐపి

ఈ సమయంలో కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. పిల్లల విద్య లేదా పదవీవిరమణ కోసం ప్లాన్ చేసుకోవడానికి ఎస్ఐపి అనేది ఒక గొప్ప మార్గం. మరింత తెలుసుకోండి.

చదవడానికి క్లిక్ చేయండి

50లలో మరియు ఆ పై వయస్సులో ఎస్ఐపి

మీరు పదవీ విరమణకి చేరువవుతున్నప్పుడు లేదా ఇప్పటికే రిటైర్ అయినా, మీరు కోరుకున్న జీవనశైలిని అనుభవించడానికి మరియు మీ భద్రత కోసం ఒక ధృడమైన ఆర్థిక ప్రణాళికను రూపొందించుకోవాలి. మరింత తెలుసుకోండి.

చదవడానికి క్లిక్ చేయండి

ఎస్ఐపి మరియు ఏకమొత్తం పెట్టుబడి మధ్య ఎంచుకోవడానికి కొందరికి ఇప్పటికే సందేహాలు ఉండవచ్చు. ఒక నిర్ణయం తీసుకోవడంలో మీకు సహాయపడటానికి మరింత సమాచారం ఇక్కడ ఇవ్వబడింది.


ఏకమొత్తం పెట్టుబడి నుండి ఎస్ఐపి ఎలా భిన్నంగా ఉంటుంది?

ఎస్ఐపి లు మరియు ఏకమొత్తంలో పెట్టుబడుల మధ్య వ్యత్యాసాలు ఉన్నప్పటికీ, మీ పెట్టుబడి విధానం మీ లక్ష్యం మరియు రిస్క్ తీసుకునే సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది.

కారకాలు ఎస్ఐపి లు ఏకమొత్తం
ఇన్వెస్ట్‌మెంట్ మొత్తం • తక్కువ పెట్టుబడి ఎంపిక
• మొదటిసారి పెట్టుబడి చేసే వారికి గొప్ప ఎంపిక
• ఎస్ఐపి లతో పోలిస్తే పెట్టుబడి మొత్తం ఎక్కువగా ఉంటుంది
పెట్టుబడి ఫ్రీక్వెన్సీ • మీ సౌలభ్యం ప్రకారం ప్రతి నెలా/ప్రతి వారం/త్రైమాసికం • పెట్టుబడి పెట్టే సమయంలో ప్రస్తుత మార్కెట్ పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవాలి
మార్కెట్ అవగాహన • మార్కెట్ పరిస్థితుల గురించి ఆందోళన చెందకుండా రూపీ కాస్ట్ యావరేజింగ్ అనేది సగటు ఖర్చును తగ్గించడానికి సహాయపడుతుంది
• మార్కెట్ పరిస్థితుల ప్రకారం పెట్టుబడి చేయవలసిన అవసరం లేదు
• పెట్టుబడి పెట్టే సమయంలో ప్రస్తుత మార్కెట్ పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవాలి
సౌలభ్యం • అధికం • కనిష్టం
పెట్టుబడి హారిజాన్ • 3-5 సంవత్సరాలు సలహా ఇవ్వబడుతుంది • 5-7 సంవత్సరాలు సలహా ఇవ్వబడుతుంది
చిట్కా: మీకు స్థిరమైన ఆదాయ వనరు లేకపోతే, క్రమబద్ధమైన ప్రాతిపదికన పెట్టుబడి పెట్టడం కష్టం అటువంటి సందర్భాల్లో, ఏకమొత్తంలో పెట్టుబడులు మెరుగైన ఎంపిక.

ఇఎల్ఎస్ఎస్ మరియు ఎస్ఐపి

ఒక ఈక్విటీ-లింక్డ్ సేవింగ్స్ స్కీం లేదా ఇఎల్ఎస్ఎస్ అనేది ఒక రకమైన మ్యూచువల్ ఫండ్. ఇది ప్రాథమికంగా ఈక్విటీలలో పెట్టుబడి పెడుతుంది. ఒక ఎస్ఐపి అనేది మ్యూచువల్ ఫండ్ యొక్క యూనిట్లను కొనుగోలు చేయడానికి మీరు ప్రతి నెలా చిన్న మొత్తాన్ని పెట్టుబడి పెట్టే ఒక పెట్టుబడి విధానం. కాబట్టి ఎస్ఐపి ద్వారా ఇఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి అనేది ఒక పెట్టుబడి విధానంగా ఉపయోగించవచ్చు.

ఎస్ఐపి ఇన్సూర్

జీవితం అనిశ్చిత పరిస్థితులతో నిండి ఉంటుంది, అందుకే మీ ఎస్ఐపి పెట్టుబడి కోసం కూడా ఒక బ్యాకప్ ప్లాన్ కలిగి ఉండటం ఎల్లప్పుడూ మంచిది.

ఎస్ఐపి ఇన్సూర్ అనేది వ్యక్తిగత పెట్టుబడిదారులకు గ్రూప్ టర్మ్ ఇన్సూరెన్స్ కింద లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ అందిస్తుంది. ఇది నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ యొక్క కొన్ని నిర్దిష్ట పథకాల్లో ఎస్ఐపి తీసుకునే వారికి ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా అందుబాటులో ఉంటుంది.

దురదృష్టవశాత్తు ఒక పెట్టుబడిదారు మరణిస్తే, వారి ఎస్ఐపి పెట్టుబడి కొనసాగుతుంది, మరియు ఎస్ఐపి ఇన్సూర్ కవర్ మిగిలిన వాయిదాలను చెల్లిస్తుంది.

మీ జీవిత లక్ష్యాలను నెరవేర్చడంలో మీకు సహాయపడటానికి ఇది ఒక గొప్ప మార్గం.

ఎస్ఐపి గురించి మీరు అనేక విషయాలను తెలుసుకున్నారు అని మరియు మీ సందేహాలను ఈ సమాచారం నివృత్తి చేసింది అని మేము ఆశిస్తున్నాము. మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీరు ఎప్పుడైనా మమ్మల్ని సంప్రదించవచ్చు మరియు మా నిపుణులు మీకు సంతోషంగా మార్గనిర్దేశం చేస్తారు.

ఎస్ఐపి ద్వారా పెట్టుబడి పెట్టడం గురించి మీకు నమ్మకం ఉంటే, మీరు ఇప్పుడే పెట్టుబడి పెట్టవచ్చు.

Get the app