Sign In

మార్కెట్ గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు మీరు నగదు కేటాయింపును పెంచాలా?

మార్కెట్ ట్రెండ్లను ఖచ్చితంగా అంచనా వేయడం వలన మార్కెట్ లాభంలో లేదా నష్టంలో ఉన్నప్పుడు లాభాలను పొందవచ్చని పెట్టుబడిదారులు నమ్ముతారు. కాబట్టి, వారు మార్కెట్ లాభాలను గడిస్తుందని ఊహిస్తే, వారు తమ ఈక్విటీ కేటాయింపును తగ్గిస్తారు మరియు నగదు కేటాయింపును పెంచుతారు, అలాగే నష్టాన్ని ఊహిస్తే దీనికి వ్యతిరేకంగా చేస్తుంటారు. కానీ ఇది సరైన పెట్టుబడి వ్యూహం అని భావిస్తున్నారా? మీ మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియో పై పెరుగుతున్న నగదు కేటాయింపు ఎలాంటి ప్రభావాన్ని కలిగి ఉంటుంది? అనే అంశాల గురించి తెలుసుకోవడానికి చదవండి.

మార్కెట్ ట్రెండ్లను అంచనా వేయడం

‘గతాన్ని చూసి అడుగెయ్యడం ఒక మంచి నిర్ణయం'— ఈ సామెత పెట్టుబడిదారు మార్కెట్ గురించి మాట్లాడినప్పుడు సరిపోయినంతగా ఎన్నడూ సరిపోదు. సత్యం ఏమిటంటే ఎవరూ కూడా మార్కెట్ ట్రెండ్‌ల గురించి ఊహించిన విషయాలు విజయవంతం కాలేదు. మార్కెట్ లాభాలలో ఉన్నప్పుడు సూచిక అనేది పైవైపుకు సూచిస్తుంది. అదేవిధంగా, మార్కెట్ పతనాన్ని కూడా ఎవరూ సరిగ్గా అంచనా వేయలేరు. మార్కెట్ లాభాల తర్వాత మార్కెట్ దిద్దుబాటు కేవలం కొన్ని నెలలు మాత్రమే కొనసాగవచ్చు, 2020 మార్చిలో జరిగిన పతనం తర్వాత మార్కెట్లు లాభాలు గడించినప్పుడు ఇది జరిగింది; లేదా అది సంవత్సరాల పాటు దిద్దుబాటుకు గురవుతుంది.

ఒక పెట్టుబడి వ్యూహంగా నగదు కేటాయింపును పెంచడం

ఒక పెట్టుబడి అసెట్‌గా ఉన్న సందర్భంలో నగదు రెండు ప్రయోజనాలను అందిస్తుంది- ఇది ఆకస్మిక వైద్య అత్యవసర పరిస్థితి లేదా ఉద్యోగ నష్టం వంటి ఆర్థిక కష్టాల నుండి గట్టెక్కించే ఒక సహాయకారిగా పని చేస్తుంది. ఇది అనుకూలమైన పెట్టుబడులను పెట్టే అవకాశాన్ని కూడా అందిస్తుంది. మార్కెట్ గరిష్ట స్థాయికి చేరుకున్న తరువాత దిద్దుబాటు జరుగుతుంది అన్న అంచనాతో పెట్టుబడిదారులు తమ ఈక్విటీ సెక్యూరిటీలను విక్రయించి దిద్దుబాటు సమయంలో ధర తగ్గినప్పుడు తిరిగి నూతన పెట్టుబడులు చేస్తారు. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం 'స్పష్టంగా' పేర్కొనబడింది. ముందుగానే పేర్కొన్నట్లు, చరిత్రను గమనించినప్పుడు మాత్రమే మార్కెట్ లాభాలు ఖచ్చితంగా గుర్తించవచ్చు.

ఒక ఊహాజనిత పరిస్థితిని పరిగణనలోకి తీసుకుందాం. మీరు ఈక్విటీ మ్యూచ్యువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టారని అనుకుంటే, ఇవి మీకు గొప్ప లాభాలను ఇస్తున్నాయి. కానీ మార్కెట్ గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు మీరు ఆ ఫండ్స్‌ని రిడీమ్ చేసుకోవడానికి లేదా మూసివేయడానికి ఎంచుకుంటారు. అయితే, మీరు తప్పు పని చేశారు, అలాగే మార్కెట్ మరొక 8–9 నెలల వరకు లాభాలను గడిస్తూ ముందుకు కొనసాగుతుంది. విక్రయించాలన్న మీ నిర్ణయం వలన మీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పై అద్భుతమైన వృద్ధిని పొందే అవకాశాన్ని మీరు కోల్పోయారు. ఒక దానికి ప్రత్యామ్నాయంగా మరొక దానిని ఎంచుకున్నప్పుడు కలిగే సంభావ్య నష్టాలను ఆపర్చ్యూనిటీ కాస్ట్‌గా పేర్కొనబడుతుంది. ఇక్కడ, ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్లను విక్రయించిన తరువాత మీరు కోల్పోయిన రాబడిని ఆపర్చ్యూనిటీ కాస్ట్‌గా పేర్కొంటారు.

మీరు ఏమి చేయాలి

మార్కెట్‌ని అంచనా వేసి కొనుగోళ్లు విక్రయాలు చేయడం పని చేయదు. అయితే, ఏమి పని చేస్తుంది? మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులలో విజయవంతం అవ్వడానికి క్రమశిక్షణతో సిస్టమాటిక్ పెట్టుబడి చేసి వాటిని కొనసాగించడం కీలకం. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ విషయంలో ఇది పూర్తిగా వాస్తవం. మీ మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియో నుండి అధిక లాభాలు పొందడానికి, ఈ క్రింది దశలను అనుసరించండి:

1. దీర్ఘకాలిక హారిజాన్ కలిగి ఉండండి:

మీ మ్యూచువల్ ఫండ్ నుండి ఎక్కువ లాభాలు పొందడానికి సరైన పెట్టుబడి వ్యవధి 7-10 సంవత్సరాల ఉంటుంది. అయితే, స్వల్పకాలిక లక్ష్యాల కోసం, ఒకరు 3-5 సంవత్సరాల వ్యవధి పాటు పెట్టుబడి పెట్టాలి.

2. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (ఎస్ఐపి) ఉపయోగించండి:

అన్ని మార్కెట్ దశలలో ఒక ఎస్ఐపి ప్రయోజనకరంగా ఉండవచ్చు. ఇది బుల్ మార్కెట్ దశలో కొన్ని యూనిట్లను కొనుగోలు చేసేటప్పుడు ఒక బేర్ మార్కెట్ దశలో మరిన్ని యూనిట్లను కొనుగోలు చేస్తుంది, అలాగే సేకరిస్తుంది, ఇది లాభాలను అనుకూలంగా మార్చడానికి సహాయపడగలదు.

3. మీ మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియోను క్రమానుగతంగా తిరిగి అంచనా వేయండి మరియు రీబ్యాలెన్స్ చేయండి:

బుల్ మార్కెట్ దశలలో, మీ పోర్ట్‌ఫోలియోలో ఈక్విటీ పెట్టుబడులు ఎక్కువగా ఉండవచ్చు. కానీ దానిని బ్యాలెన్స్ చేయడానికి కొంత డెట్ పెట్టుబడి ఉండేటట్లు చూసుకోవాలి. మీకు భారీ రిస్కు తీసుకునే సామర్థ్యం లేకపోతే ఇది ప్రత్యేకంగా అవసరం. మీ పోర్ట్‌ఫోలియో మీ ప్రస్తుత రిస్క్ సామర్థ్యాన్ని ఖచ్చితంగా ప్రతిబింబిస్తుందని మీరు నిర్ధారించుకోవాలి.

4. డైవర్సిఫై:

అసెట్ తరగతులు, మార్కెట్ క్యాపిటలైజేషన్లు మరియు రిస్క్ సామర్థ్యం వ్యాప్తంగా మీ మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌పోలియోను వైవిధ్యంగా ఉంచడానికి ప్రయత్నించండి. ఇది ఒక రకం మ్యూచువల్ ఫండ్ మంచి పనితీరు కనబర్చకపోతే, మీ పోర్ట్‌ఫోలియో కోసం బఫర్‌గా పని చేసే కనీసం ఒక ఇతర రకం ఉందని నిర్ధారిస్తుంది.

5. లక్ష్యాలను సెట్ చేయండి:

ఒక గోల్ ప్లానర్‌ను ఉపయోగించడం, అలాగే ఒక ప్రత్యేక పెట్టుబడి పోర్ట్‌పోలియోను కలిగి ఉండటం భవిష్యత్తు ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి ఒక మంచి మార్గం. అటువంటి వ్యూహం అనేది ప్రతి లక్ష్యం, సమయ పరిధి కోసం సరైన మ్యూచ్యువల్ ఫండ్ పెట్టుబడులను పెట్టడానికి మీకు సహాయపడుతుంది.

సంక్షిప్తంగా

మార్కెట్ గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు మీ మ్యూచ్యువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియోలో అనేక మార్పులు చేయాలి అని అది సూచించదు . మార్కెట్ లాభాలు, అలాగే నష్టాలు మీకు ఇబ్బంది కలిగించకుండా చూసుకోండి. బదులుగా, మీ ఆర్థిక లక్ష్యాలపై అవగాహనతో లాంగ్ టర్మ్ కోసం పెట్టుబడి పెట్టండి.

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి, స్కీమ్ సంబంధిత అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి.

ఇక్కడ ఇవ్వబడిన సమాచారం/వివరణ సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు ఇక్కడ ఇవ్వబడిన విషయాలు అభిప్రాయాలను మాత్రమే వ్యక్తపరుస్తాయి మరియు అందువల్ల దీనిని మార్గదర్శకాలు, సిఫార్సులు లేదా పాఠకుల కోసం ప్రొఫెషనల్ గైడ్‌గా పరిగణించకూడదు. బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారం, అంతర్గతంగా అభివృద్ధి చేయబడిన డేటా మరియు విశ్వసనీయమైన ఇతర వనరుల ఆధారంగా తయారు చేయబడింది. స్పాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, ట్రస్టీ లేదా వారి డైరెక్టర్లు, ఉద్యోగులు, అనుబంధ సంస్థలు లేదా ప్రతినిధులు ("సంస్థలు మరియు వారి అనుబంధ సంస్థలు") అటువంటి సమాచారం యొక్క ఖచ్చితత్వం, పరిపూర్ణత, సమగ్రత మరియు విశ్వసనీయతకు ఎలాంటి బాధ్యత వహించరు. ఈ సమాచారాన్ని స్వీకరించేవారు తమ సొంత విశ్లేషణ, వివరణలు మరియు పరిశోధనలపై ఆధారపడాలని సూచించబడుతుంది. తెలివైన పెట్టుబడి నిర్ణయానికి రావడానికి పాఠకులు వృత్తిపరమైన నిపుణుల సలహాలను కూడా పొందాలని సూచించబడుతుంది. ఈ మెటీరియల్ తయారీ లేదా జారీలో పాల్గొన్న వ్యక్తులతో సహా సంస్థలు, వారి అనుబంధ సంస్థలు ఏవైనా ప్రత్యక్ష, పరోక్ష, ప్రత్యేక, యాదృచ్ఛిక, పర్యవసానమైన, శిక్షాత్మక లేదా దండనాత్మక నష్టాలకు సంబంధించిన, ఇందులో ఉన్న సమాచారం నుండి ఉత్పన్నమైన లాభాలు, నష్టంతో సహా దేనికి బాధ్యత వహించవు. ఈ డాక్యుమెంట్ ఆధారంగా తీసుకునే ఏ నిర్ణయానికైనా స్వీకర్త మాత్రమే పూర్తి బాధ్యత వహించాలి.


Get the app