Sign In

For Suspension of fresh subscription in certain schemes of NIMF, kindly refer to ADDENDUM

ఎస్ఐపి ఇన్వెస్ట్‌మెంట్‌ యొక్క ప్రాథమిక విషయాలు - ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు

మ్యూచువల్ ఫండ్స్‌ కింద సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (ఎస్‌ఐపి) అందించే సౌకర్యాలు ఏమిటి?

సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (ఎస్ఐపి) సౌకర్యం ద్వారా మీరు మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లలో పెట్టుబడి పెట్టవచ్చు, దీనిలో మీరు ప్రతి నెలా/ త్రైమాసికం/ అర్ధ సంవత్సరానికి నిర్ణీత మొత్తాన్ని చెల్లించవచ్చు. ఉదాహరణకు, మీరు జనవరి 1, 2014 న, 1 సంవత్సరం వ్యవధి కోసం ₹8,000 చొప్పున ఎస్ఐపి తీసుకుంటే, తదుపరి 12 నెలల కోసం ప్రతి నెలా ₹8,000 చొప్పున చెల్లిస్తారు.

"చిన్నగా ఉన్నవి శక్తివంతమైనవి" అనే వాక్యము ఎస్ఐపి ఆలోచనను మరింత విస్తరించడానికి ఉద్దేశించబడింది, ఇది నిర్ణీత వ్యవధిలో చిన్న పెట్టుబడులను పెద్ద పెట్టుబడులుగా మార్చాలనే లక్ష్యాన్ని కలిగి ఉంది. నిర్ణీత మొత్తాన్ని క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం మరియు స్థిరంగా ఉంచడం వల్ల, మీరు పతనం అవుతున్న మార్కెట్‌లో అదనపు యూనిట్‌లను మరియు విలువ ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువ యూనిట్లను పొందుతారు. ఇది మార్కెట్ హెచ్చుతగ్గుల ప్రభావాన్ని సర్దుబాటు చేసుకోవడంలో మీకు సహాయపడుతుంది. అందువల్ల, కొంత కాలానికి పెట్టుబడులు తక్కువ ఖర్చుతో ఉంటాయి.

మీరు ఎస్ఐపి ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో ఎప్పుడు పెట్టుబడి పెట్టాలి?

ఎస్ఐపి అనేది, మీరు ఇన్వెస్ట్‌ పెట్టిన తర్వాత మార్కెట్లు అస్థిరమైనవిగా లేదా తగ్గుతున్నవిగా ఉన్నంత కాలమూ ప్రయోజనకరంగా ఉంటుంది. ఒకవేళ, మార్కెట్లు బుల్లిష్‍గా మారి పెరుగుదలకు తిరగడం ప్రారంభిస్తే, ఎస్ఐపి ప్రయోజనకరంగా ఉండదు, మరియు ఏకమొత్తం ఇన్వెస్ట్‌మెంట్‌‌లతో పోలిస్తే తక్కువ రాబడులను ఇవ్వవచ్చు. ఎస్ఐపి అనేది ఒక సాధారణ భావన మరి అందువల్ల అది చాలా శక్తివంతమైనది. దీని ద్వారా ఇన్వెస్ట్‌ చేయడం ఎందుకు విలువైనది అనే కొన్ని అంశాలను చూద్దాం ఎస్‌ఐపి మ్యూచువల్ ఫండ్.

మీరు ఎస్‌ఐపి లో ఎందుకు పెట్టుబడి పెట్టాలి?

  • ఒకేసారి పెద్ద మొత్తానికి బదులుగా ఒక వ్యక్తి, ప్రతి నెలా చిన్న మొత్తాన్ని కూడబెట్టడం చాలా సులభం. ఎస్ఐపి ద్వారా పెట్టుబడి పెట్టడం వలన ఆర్ధిక భారం ఎక్కువగా ఉండదు. ఒకేసారి ₹96,000 పెట్టుబడి పెట్టడానికి బదులుగా నెలకు ₹8,000 చెల్లించడం సులభం.
  • ఎస్ఐపి అందించే ప్రధాన ప్రయోజనం రూపీ-కాస్ట్ యావరేజింగ్ కాన్సెప్ట్. మార్కెట్ పతనం అవుతున్నప్పుడు అధిక యూనిట్లు కొనుగోలు చేయడానికి మరియు మార్కెట్ పెరుగుతున్నప్పుడు తక్కువ యూనిట్లు కొనుగోలు చేయడానికి ఎస్ఐపి మిమ్మల్ని అనుమతిస్తుంది.
  • ఎస్ఐపి అందించే ఇతర ప్రయోజనం ఏమిటంటే, ఇది ఒక క్రమశిక్షణ కలిగిన పెట్టుబడిదారుగా మారడానికి మీకు శిక్షణను ఇస్తుంది. ఒకసారి, మీరు ఎస్ఐపి ప్రారంభించిన తర్వాత ప్రతి నెలా మ్యూచువల్ ఫండ్‌ కోసం కొంత డబ్బును కేటాయించాలి మరియు దానిని అలవరచుకోవాలి.
  • పెట్టుబడి కోసం ఎస్ఐపి చాలా అనుకూలమైన మార్గాన్ని అందిస్తుంది. దీనికి కేవలం ఒక చెక్కుతో పాటు సరిగ్గా పూరించిన ఎన్‌రోల్‌మెంట్ ఫారమ్‌ అవసరం. మ్యూచువల్ ఫండ్ అభ్యర్థించిన తేదీన చెక్కును డిపాజిట్ చేయాలి. ఆ తర్వాత, యూనిట్లు మీ అకౌంట్‌కు క్రెడిట్ అవుతాయి, అలాగే దానికి సంబంధించిన ఒక నోటిఫికేషన్ మీకు అందుతుంది.
  • ఒక వేళ వర్తిస్తే, ఫస్ట్-ఇన్, ఫస్ట్-అవుట్ ప్రాతిపదికన క్యాపిటల్ గెయిన్స్ పై పన్ను విధించబడుతుంది.

ఏమైనా ప్రతికూలతలు ఉన్నాయా?

  • బుల్లిష్ మార్కెట్లలో లేదా కాలక్రమేణా పెరుగున్న మార్కెట్లలో ఎస్ఐపి పెట్టుబడులు పనిచేయవు. మార్కెట్ పెరిగినప్పుడు మరియు క్రమంగా పెరుగుతున్న సమయంలో, మీరు ప్రతిసారి కొనుగోలు చేసిన యూనిట్లు మునుపటి వాటి కంటే అధిక విలువను కలిగి ఉంటాయి, ఇవి ప్రారంభంలో ఏకమొత్తంగా చేసిన పెట్టుబడితో పోలిస్తే, చివరికి సగటు విలువను పెంచుతాయి.
  • ఒకసారి మీరు ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్‌ చేశారంటే, పన్ను ఆదాచేసే మ్యూచువల్ ఫండ్స్ పథకాలు మూడు సంవత్సరాలపాటు మీ డబ్బును లాక్ చేస్తాయి; ఇన్వెస్ట్‌మెంట్‌ యొక్క తేదీ నుండి మూడు సంవత్సరాలపాటు మీ ఇన్వెస్ట్‌మెంట్‌ అంతా కూడా వ్యక్తిగతంగా లాక్ చేయబడుతుంది. అందువల్ల మీరు జనవరి 2014 లో మీ మొదటి వాయిదాను చెల్లిస్తే, అది జనవరి 2017 వరకు లాక్ చేయబడుతుంది, ఆపై ఫిబ్రవరి, 2014 లో చెల్లించిన వాయిదాలు ఫిబ్రవరి, 2017 వరకు లాక్ చేయబడతాయి మరియు ఆ విధంగా ఉంటాయి.

డిస్‌క్లెయిమర్లు
ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు వ్యక్తీకరించబడిన అభిప్రాయాలు కేవలం అభిప్రాయాలను మాత్రమే కలిగి ఉంటాయి. అందువల్ల వీటిని మార్గదర్శకాలు లేదా సిఫార్సులు లేదా పాఠకుల కోసం వృత్తి నైపుణ్యమైన మార్గదర్శిగా పరిగణించలేము. పరిశ్రమ మరియు మార్కెట్లకు సంబంధించిన నిర్దిష్ట వాస్తవిక మరియు గణాంక సమాచారం (చారిత్రాత్మకమైనది మరియు అంచనా వేయబడినది) స్వతంత్ర తృతీయ-పక్ష మూలాల నుండి సేకరించబడింది, ఇవి నమ్మదగినవిగా భావించబడుతున్నాయి. నామ్ (ఎన్ఎఎం) ఇండియా అటువంటి సమాచారం లేదా డేటా యొక్క ఖచ్చితత్వం లేదా ప్రామాణికతను స్వతంత్రంగా సరిచూసుకోలేదని గమనించవచ్చు, లేదా ఆ విషయంలో అటువంటి డేటా మరియు సమాచారం ప్రక్రియ చేయబడిన లేదా భావించబడిన అంచనాల యొక్క సహేతుకతను ఎలాంటి విధంగానూ సరిచూసుకోలేదని గమనించవచ్చు; నామ్ (ఎన్ఎఎం) ఇండియా ఏ తీరులోనూ అటువంటి డేటా మరియు సమాచారం యొక్క ఖచ్చితత్వం లేదా ప్రామాణికతకు భరోసా ఇవ్వదు. ఈ మెటీరియల్స్‌లో ఉన్న కొన్ని స్టేట్‌మెంట్లు మరియు కూర్పులు నామ్ (ఎన్ఎఎం) ఇండియా యొక్క అభిప్రాయాలు లేదా భావనలను ప్రతిబింబించవచ్చు, ఉత్తరోత్తరా అవి అటువంటి డేటా లేదా సమాచారం ఆధారంగా ఏర్పడి ఉండవచ్చు.

ఏవైనా పెట్టుబడులు పెట్టడానికి ముందు, ఒక వ్యక్తిగత నిపుణుడి సలహా తీసుకోవాల్సిందిగా పాఠకులకు సూచించడమైనది, ఒక తెలివైన పెట్టుబడి నిర్ణయం తీసుకోవడానికి విషయాలను ధృవీకరించుకోవాలి. స్పాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, ట్రస్టీ, వారి సంబంధిత డైరెక్టర్లు, ఉద్యోగులు, అనుబంధ సంస్థలు లేదా ప్రతినిధులు ఎవరూ కూడా ఈ మెటీరియల్‌లో ఉన్న సమాచారం కారణంగా ఉత్పన్నమయ్యే నష్టాలకు ప్రత్యక్ష, పరోక్ష, ప్రత్యేక, యాదృచ్ఛిక, పర్యవసాన, శిక్షణాత్మక లేదా దండనాత్మక నష్టాలకు ఏ విధంగానూ బాధ్యత వహించరు.

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి, స్కీమ్ సంబంధిత అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి.

Get the app