Sign In

For Suspension of fresh subscription in certain schemes of NIMF, kindly refer to ADDENDUM

రిటైర్మెంట్ కోసం ఫైనాన్షియల్ ప్లాన్ ఎలా సృష్టించాలి?

మీరు మీ రిటైర్‌మెంట్ కోసం గోవా వెళ్లాలని కలలు కని ఉంటారు. లేదా ప్రపంచాన్ని అన్వేషిస్తూ మీ రోజులను గడపాలనుకుంటారు. లేదా మీరు 50 ఏళ్ల వయసులోనే రిటైర్ అవ్వాలని కూడా ప్లాన్ చేసుకొని ఉండవచ్చు. అయితే, మీ ప్లాన్స్ ఏవైనా, మీరు వాటికి ఆర్థికంగా సిద్ధం అవ్వాలి. సమయం గడిచిపోతుంది, మీకు తెలియకుండారిటైర్మెంట్ కోసం ఫైనాన్షియల్ ప్లాన్ ఎలా సృష్టించాలి?నే మీరు రిటైర్‌మెంట్ వయస్సుకి చేరుకుంటారు. ఆ తరువాతి సంవత్సరాల్లో, మీరు నిస్సహాయులుగా మిగిలిపోకూడదు.

మీ రిటైర్‌మెంట్ కోసం ఒక ఆర్థిక ప్రణాళికను ఎలా సృష్టించాలో ఇక్కడ ఒక చిన్న గైడ్‌లో ఇవ్వబడింది.

జీవిత ఆయుర్ధాయం మరియు ద్రవ్యోల్బణం యొక్క ప్రభావం

లాన్‌సెట్ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, భారతదేశంలో ఆయుర్దాయం 1990 లో 59.6 సంవత్సరాల నుండి 2019 లో 70.8 సంవత్సరాలకు పెరిగింది. దీని అర్థం మీరు ఊహించిన దాని కంటే చాలా ఎక్కువ సమయం కోసం రిటైర్‌మెంట్ కాలానికి ప్లాన్ చేసుకోవాలి.

ద్రవ్యోల్బణం అనేది ఒక ముఖ్యమైన అంశం, ఎందుకనగా ఇది మన డబ్బు విలువను తగ్గిస్తుంది. అతి తక్కువ ద్రవ్యోల్బణ రేటు కూడా మన ఖర్చు సామర్థ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఈరోజు ₹ 120 ఖరీదు చేసే ఒక ప్రోడక్ట్ తీసుకోండి. 25 సంవత్సరాలలో 6% ద్రవ్యోల్బణం రేటుతో, అదే ప్రోడక్ట్ ధర సుమారు ₹ 515 గా ఉంటుంది. కావున, దీనికి మీ మనసులో ఊహించుకున్న ఒక మొత్తం సరిపోదు. రిటైర్‌మెంట్ సంవత్సరాల్లో, రిటైర్‌మెంట్ పరిస్థితుల్లో ఇది మీకు ఆర్థిక మద్దతునిస్తుందని నిర్ధారించుకోవాలి.

ఆదాయ వనరులను గుర్తించండి

రిటైర్‌మెంట్ ప్లాన్ విషయానికి వస్తే చాలా మంది భారతీయులు సాంప్రదాయ పొదుపు సాధనాలపై ఆధారపడుతున్నారు. ఇవే కాకుండా, మ్యూచువల్ ఫండ్‌లు కూడా ఇందుకు సహాయపడతాయిని మీరు గమనించాలి. మ్యూచువల్ ఫండ్స్ డైరెక్ట్ మార్కెట్ ట్రేడింగ్ కంటే తక్కువ రిస్క్‌తో మంచి రిటర్న్స్ అందిస్తాయి

https://www.businesstoday.in/current/economy-politics/india-gained-over-a-decade-of-life-expectancy-in-30-years-lancet/story/419199.html

మ్యూచువల్ ఫండ్స్‌తో, ప్రతి నెలా పెట్టుబడి పెట్టే ఒక చిన్నమొత్తం కాంపౌండింగ్ శక్తిని ఉపయోగించుకొని మీ డబ్బును పెద్దమొత్తంలో కూడబెడుతుంది. మీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియో ఈక్విటీ మరియు డెట్ ఫండ్స్ వంటి పెట్టుబడి సాధనాల కలయికతో విభిన్నంగా ఉండాలి.

ఒక రిటైర్‌మెంట్ కాలిక్యులేటర్‌ని ఉపయోగించండి మరియు త్వరగా పెట్టుబడి చేయడం మొదలుపెట్టండి

సరైన ప్రణాళిక వేయడానికి, మీరు ఒక నిర్దిష్ట రిటైర్‌మెంట్ మొత్తాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మీ జీవనశైలిని కొనసాగించడానికి మరియు అవసరమైన మొత్తాన్ని అంచనా వేయడానికి రిటైర్‌మెంట్ కాలిక్యులేటర్‌ని ఉపయోగించండి.

నిప్పాన్ రిటైర్‌మెంట్ కాలిక్యులేటర్‌ సహాయంతో, వేర్వేరు వయస్సులో ఉన్న ముగ్గురు వ్యక్తులు మరియు వారి రిటైర్‌మెంట్ వయస్సు లక్ష్యాలను వివరించే ఒక పట్టిక ఇవ్వబడింది. వారందరి జీవితకాలం 85 సంవత్సరాలు. ఊహించిన ద్రవ్యోల్బణం రేటు 6% రిటైర్‌మెంట్‍‌కు ముందు పెట్టుబడిపై ఊహించిన రిటర్న్స్ రేటు 15%, మరియు రిటైర్‌మెంట్‍‌ తర్వాత రేటు 10%

పేరువయస్సురిటైర్‌మెంట్‌ వయస్సురిటైర్‌మెంట్ కోసం మిగిలి ఉన్న సంవత్సరాల సంఖ్యప్రస్తుత నెలవారీ ఖర్చులురిటైర్‌మెంట్ పై నెలవారీ ఖర్చురిటైర్‌మెంట్ సమయంలో అవసరమయ్యే నిధినెలవారీ పెట్టుబడిఏకమొత్తంలో పెట్టుబడి
రీనా27 సంవత్సరాలు65 సంవత్సరాలు38 సంవత్సరాలు₹ 30,000₹ 2,91,639₹ 3.02 కోట్లు₹ 1314ఏవీ ఉండవు
లోకేష్37 సంవత్సరాలు60 సంవత్సరాలు23 సంవత్సరాలు₹ 43,000₹ 1,70,334₹ 1.87 కోట్లు₹ 7208₹ 50,000
గిరీశ్30 సంవత్సరాలు50 సంవత్సరాలు20 సంవత్సరాలు₹ 40,000₹ 1, 32,408₹ 1.54 కోట్లు₹ 9102₹ 90,000

పై ఉదాహరణలో, రీనా ఏకమొత్తంలో పెట్టుబడి పెట్టకూడదని ఎంచుకుంది, బదులుగా తాను లక్ష్యంగా ఎంచుకున్న మొత్తాన్ని చేరుకోవడానికి ప్రతి నెలా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (ఎస్ఐపి) ఉపయోగించి పెట్టుబడి పెడుతుంది. మరోవైపు, లోకేష్ మరియు గిరీష్ తమ లక్ష్యాలను సాధించడానికి ఏకమొత్తంలో మరియు ఎస్ఐపి ద్వారా పెట్టుబడులు పెట్టడాన్ని ఎంచుకున్నారు. కానీ, వాస్తవానికి, మీరు ఎలా పెట్టుబడి పెట్టాలనేది మీ ఆర్థిక సమస్యలు మరియు జీవిత పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. అయినప్పటికీ, మీరు కూడా మీ జీవితంలో రిటైర్‌మెంట్ ప్లాన్‌ను మొదలుపెట్టాలని సిఫార్సు చేయబడుతుంది, ఎందుకనగా వయస్సుతో పాటు, మీ బాధ్యతలు మరియు ఆర్థిక భారాలు కూడా పెరుగుతాయి. మ్యూచువల్ ఫండ్ వీలైనంత త్వరగా రిటైర్‌మెంట్ అమౌంట్‌ మొత్తాన్ని కూడబెట్టుకోవడాన్ని మొదలుపెట్టడంలో సహాయపడుతుంది.

వివరంగా చెప్పాలంటే, రిటైర్‌మెంట్ కోసం ప్లాన్ చేసేటప్పుడు పరిగణలోకి తీసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు ఇవి:

⮚ మీ ప్రస్తుత వయస్సు మరియు మీ రిటైర్‌మెంట్ వయస్సు
⮚ జీవిత ఆయుర్దాయం
⮚ మీ ప్రస్తుత మరియు ఊహించిన రిటైర్‌మెంట్-తరువాతి ఖర్చుల అంచనా
⮚ ద్రవ్యోల్బణం

రిటైర్‌మెంట్ ప్లాన్ ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియోని సృష్టించండి

మీ రిటైర్‌మెంట్‌ కార్పస్ మరియు అందుబాటులో ఉన్న ఇతర వివరాలతో, మీరు పెట్టుబడి చేయడం ప్రారంభించవచ్చు. రిటైర్‌మెంట్‌ ప్లానింగ్‌ని దృష్టిలో పెట్టుకొని మీరు ఒక ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియోను సృష్టించి, దానిని నిర్వహించవచ్చు. మీరు వయస్సులో ఉన్నప్పుడు మీ పోర్ట్‌ఫోలియోలో ఎక్కువగా ఈక్విటీని కలిగి ఉండండి, ఇది సంపదను వేగంగా వృద్ధి చేస్తుంది. మీ పోర్ట్‌ఫోలియోలో ద్రవ్యోల్బణం నుండి రక్షణ కలిపించే పెట్టుబడులు ఉండాలి. అవి రిస్క్-రాబడిని సమతుల్యం చేయాలి. మీ వయస్సు మరియు బాధ్యతలు పెరిగే కొద్దీ రిస్క్ స్థాయిని తగ్గించడానికి మీరు మరిన్ని డెట్ ఇన్‌స్ట్రుమెంట్లను జత చేయాలి. నిర్ణీత కాలంలో మీ రిస్క్ సామర్థ్యాన్ని అంచనా వేసుకొని మీ పోర్ట్‌ఫోలియోలో తదనుగుణంగా మార్పులు చేయండి.

ముగింపు

రిటైర్‌మెంట్ కోసం వీలైనంత త్వరగా ప్రణాళిక వేయాలి. కానీ, ఇప్పటికే ఆలస్యం జరిగిందని మీరు భావిస్తే, నిరాశ పడకండి. రిటైర్‌మెంట్ కాలిక్యులేటర్‌ని ఉపయోగించండి, పెట్టుబడి ప్రణాళికను రూపొందించండి మరియు శాంతియుత, ఒత్తిడి లేని రిటైర్‌మెంట్ కోసం నేడే పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి.

డిస్‌క్లెయిమర్: మీ రిటైర్‌మెంట్‌ను ప్లాన్ చేయడానికి మరియు రిటైర్‌మెంట్‌ ప్రయోజనం కోసం అంచనా వేయడానికి ఈ కాలిక్యులేటర్ అందించబడుతుంది. ఇది ఒక సమాచారం/ విద్యా ప్రయోజనం కోసం మాత్రమే రూపొందించబడింది. ఈ కాలిక్యులేటర్ అందించిన ఫలితాలు ఊహాజనితమైనవి మరియు ఇవి మీరు అందించిన సమాచారం/ ఇన్‌పుట్‌ల ఆధారంగా ఉంటాయి. అలాగే, ఇది మీ రిటైర్‌మెంట్‌ను ప్లాన్ చేయడానికి మార్గనిర్థేశం చేస్తుంది మరియు రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ కోసం మీ సేవింగ్స్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. దయచేసి దీనిని ఒక పెట్టుబడి సలహాగా లేదా స్కీమ్ యొక్క అభ్యర్థన లేదా దాని పనితీరు కోసం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పరిగణలోకి తీసుకోవద్దు. ఈ కాలిక్యులేటర్‌ను సిద్ధం చేయడంలో అత్యంత శ్రద్ధ వహించినప్పటికీ, నిప్పాన్ లైఫ్ ఇండియా అసెట్ మేనేజ్‌మెంట్ (ఎన్ఏఎం-ఇండియా), నిప్పాన్ ఇండియా ట్రస్టీ కో. లిమిటెడ్/ స్పాన్సర్ లేదా వారి సంబంధిత డైరెక్టర్లు, ఉద్యోగులు, అనుబంధ సంస్థలు లేదా ప్రతినిధులు దీని సంపూర్ణతకు హామీ ఇవ్వరు లేదా సమాచారం యొక్క ఖచ్చితత్వానికి హామీ ఇవ్వరు. ఈ కాలిక్యులేటర్ ద్వారా అందించిన లెక్కలు స్కీమ్ యొక్క పనితీరును ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా స్కీమ్ యొక్క అభ్యర్థనగా భావించరాదు. ఏదైనా పెట్టుబడి పెట్టడానికి ముందు మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించండి.

ఇక్కడ ఇవ్వబడిన సమాచారం/వివరణ సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు ఇక్కడ ఇవ్వబడిన విషయాలు అభిప్రాయాలను మాత్రమే వ్యక్తపరుస్తాయి మరియు అందువల్ల దీనిని మార్గదర్శకాలు, సిఫార్సులు లేదా పాఠకుల కోసం ప్రొఫెషనల్ గైడ్‌గా పరిగణించకూడదు. బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారం, అంతర్గతంగా అభివృద్ధి చేయబడిన డేటా మరియు విశ్వసనీయమైన ఇతర వనరుల ఆధారంగా తయారు చేయబడింది. స్పాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, ట్రస్టీ లేదా వారి డైరెక్టర్లు, ఉద్యోగులు, అనుబంధ సంస్థలు లేదా ప్రతినిధులు ("సంస్థలు మరియు వారి అనుబంధ సంస్థలు") అటువంటి సమాచారం యొక్క ఖచ్చితత్వం, పరిపూర్ణత, సమగ్రత మరియు విశ్వసనీయతకు ఎలాంటి బాధ్యత వహించరు. ఈ సమాచారాన్ని స్వీకరించేవారు తమ సొంత విశ్లేషణ, వివరణలు మరియు పరిశోధనలపై ఆధారపడాలని సూచించబడుతుంది. తెలివైన పెట్టుబడి నిర్ణయానికి రావడానికి పాఠకులు వృత్తిపరమైన నిపుణుల సలహాలను కూడా పొందాలని సూచించబడుతుంది. ఈ మెటీరియల్ తయారీ లేదా జారీలో పాల్గొన్న వ్యక్తులతో సహా సంస్థలు, వారి అనుబంధ సంస్థలు ఏవైనా ప్రత్యక్ష, పరోక్ష, ప్రత్యేక, యాదృచ్ఛిక, పర్యవసానమైన, శిక్షాత్మక లేదా దండనాత్మక నష్టాలకు సంబంధించిన, ఇందులో ఉన్న సమాచారం నుండి ఉత్పన్నమైన లాభాలు, నష్టంతో సహా దేనికి బాధ్యత వహించవు. ఈ డాక్యుమెంట్ ఆధారంగా తీసుకునే ఏ నిర్ణయానికైనా స్వీకర్త మాత్రమే పూర్తి బాధ్యత వహించాలి.

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి, స్కీమ్ సంబంధిత అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి.


Get the app