తక్షణ నిధులు లేదా నగదు అవసరమయ్యే ఆర్థిక అత్యవసర పరిస్థితులు మీకు తరచుగా ఎదురవుతుంటాయి. అటువంటి పరిస్థితులలో, మీరు మీ సేవింగ్స్ నుండి తక్షణ నగదు అవసరాలను తీర్చుకోవచ్చు. అయితే, మీ సేవింగ్స్ వివిధ పెట్టుబడులలో లాక్ చేయబడితే, వాటి నుండి డబ్బును విత్ డ్రా చేయడం వల్ల పెనాల్టీ ఛార్జీలు వర్తిస్తాయి. అంతేకాకుండా, మీ స్టాక్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్‌ను రీడీమ్ చేయడానికి మీరు వెనుకాడవచ్చు. ఎందుకనగా, ఇది మీ ఆర్థిక లక్ష్యాలకు భంగం కలిగించవచ్చు లేదా దీర్ఘకాలిక సంపదను అర్జించే సామర్థ్యాన్ని కోల్పోవచ్చు.
అందువల్ల, మీ ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించడానికి మరొక ఆప్షన్ లోన్స్ పొందడం. మీరు సెక్యూర్డ్ లేదా అన్‌సెక్యూర్డ్ లోన్స్‌ని ఎంచుకోవచ్చు. సెక్యూర్డ్ లోన్స్ కోసం మీరు మ్యూచువల్ ఫండ్‌లను తనఖాగా ఉపయోగించవచ్చు.
మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులపై లోన్స్ గురించి మరికొన్ని విషయాలు:
1 మ్యూచువల్ ఫండ్స్‌లోని మీ ప్రస్తుత మొత్తం లేదా
ఎస్ఐపి పెట్టుబడులు ప్రభావితం కావు.
మీరు మీ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను అలాగే ఉంచవచ్చు మరియు లోన్ పొందడానికి వాటిని బ్యాంక్ లేదా ఎన్‌బిఎఫ్‌ఎస్ తో తాకట్టు పెట్టవచ్చు. మీ మ్యూచువల్ ఫండ్ యొక్క ప్రస్తుత విలువ మరియు పెట్టుబడి యొక్క కాలపరిమితి ఆధారంగా, మీకు లోన్ మంజూరు చేయబడుతుంది.
అయితే, లోన్ డిఫాల్ట్ అయినప్పుడు, బ్యాంక్ దాని హక్కును వినియోగించుకుంటుంది, ఫండ్ హౌస్ ద్వారా మ్యూచువల్ ఫండ్ యూనిట్‌లను రీడీమ్ చేస్తుంది. రిడింప్షన్ చేయగా వచ్చిన మొత్తం మీ లోన్‌పై ఉపయోగించబడుతుంది. దీనికి విరుద్ధంగా, మీరు మీ లోన్‌ని తిరిగి చెల్లిస్తే, ఫండ్ హౌస్, తాకట్టు పెట్టిన మ్యూచువల్ ఫండ్‌పై బ్యాంకు హక్కుని రద్దు చేస్తుంది మరియు బ్యాంకు నుండి ధృవీకరణ వచ్చిన వెంటనే ఆ తనఖాను మీకు తిరిగి ఇస్తుంది.
క్లుప్తంగా చెప్పాలంటే, మ్యూచువల్ ఫండ్స్‌పై లోన్ అనేది మ్యూచువల్ ఫండ్ యూనిట్లపై మీ యాజమాన్య హక్కులను ప్రభావితం చేయదు. మీరు మీ లోన్‌ని సకాలంలో చెల్లించడంలో విఫలమైతే మాత్రమే బ్యాంక్ వాటిని విక్రయిస్తుంది.
2 లోన్ మొత్తం
అనేక బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్‌పై మీరు ఋణంగా తీసుకోగలిగే కనీస మరియు గరిష్ట మొత్తాన్ని తెలియజేస్తాయి. అయితే, లోన్ పరిమితులు బ్యాంకు నుండి బ్యాంకుకు మారుతూ ఉంటాయి. సాధారణంగా, మీరు తాకట్టు పెట్టిన ఈక్విటీ ఫండ్ యూనిట్‌ల విలువలో 50% మరియు తాకట్టు పెట్టిన
డెట్ ఫండ్ యూనిట్‌ల విలువలో 70%- 80% వరకు లోన్స్ పొందవచ్చు.
3 వడ్డీ రేటు
అసెట్-బ్యాకప్‌తో ఉన్నందున సెక్యూర్డ్ లోన్స్, అన్‌సెక్యూర్డ్ లోన్స్ కంటే కూడా తక్కువ వడ్డీ రేట్లను కలిగి ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్‌పై లోన్స్ కూడా అసెట్-బ్యాకప్‌తో కూడినవి. కావున, అవి నామమాత్రపు వడ్డీ రేటును కలిగి ఉంటాయి (అప్పటి మార్కెట్ పరిస్థితుల ప్రకారం). మీకు మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే, మీరు తక్కువ రేట్లకు లోన్‌లు పొందవచ్చు.
4 లోన్ అప్లికేషన్ విధానం
ముందుగా, మీరు ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయంతో కరెంట్ అకౌంట్‌ను తెరవాలి. మీ మ్యూచువల్ ఫండ్ యూనిట్‌లను తాకట్టు పెట్టడం ద్వారా మీరు నిర్దేశించిన ఓవర్‌డ్రాఫ్ట్ పరిమితి వరకు లోన్‌ను పొందవచ్చు.
రెండవది, మీరు లోన్ దరఖాస్తు ఫారమ్‌ను పూరించాలి మరియు తనఖా పెట్టిన మ్యూచువల్ ఫండ్ యూనిట్‌లపై బ్యాంకుకు హక్కును మంజూరు చేయాలి. అలాగే, తప్పనిసరిగా మీ పోర్ట్‌ఫోలియో నంబర్, యూనిట్ల సంఖ్య, మ్యూచువల్ ఫండ్ పేరు, స్కీమ్ మొదలైన వివరాలను అందించాలి.
మూడవది, పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్ అవసరమైన డాక్యుమెంట్‌లతో పాటు మ్యూచువల్ ఫండ్ రిజిస్ట్రార్‌కు పంపబడుతుంది. తనఖా పెట్టిన మ్యూచువల్ ఫండ్ యూనిట్లపై రిజిస్ట్రార్, బ్యాంక్ లియన్‌ను మార్క్ చేస్తారు.
పైన పేర్కొన్న ఫార్మాలిటీలు పూర్తయిన తర్వాత, బ్యాంక్ మీకు ఆమోదించబడిన లోన్ మొత్తాన్ని పంపిణీ చేస్తుంది.
5 మ్యూచువల్ ఫండ్స్‌పై లోన్స్ సేకరించడం అనేది చివరి ఎంపికగా ఉండాలి
మ్యూచువల్ ఫండ్స్ చుట్టూ ఉన్న పెట్టుబడి ప్రయోజనాలతో ఒకటి ఏదైనా మార్కెట్ స్థితిలో వాటిపై లోన్స్ పొందడం. అయితే, మ్యూచువల్ ఫండ్‌లు మార్కెట్ హెచ్చుతగ్గులకు లోబడి ఉంటాయి కాబట్టి, మార్కెట్లు క్షీణిస్తున్న దశలో ఉన్నప్పుడు మాత్రమే మీరు వాటిపై లోన్స్ తీసుకోవచ్చు. పెరుగుతున్న మార్కెట్ దశలలో, లోన్ పొందడం కంటే మీ నిధులను రీడీమ్ చేయడం మంచిది.
ముగింపు
ఇవి మ్యూచువల్ ఫండ్స్‌పై లోన్స్ గురించిన కొన్ని వాస్తవాలు మరియు పెట్టుబడి అపోహలు. రుణదాతకు వాటిపై తాత్కాలిక హక్కు ఉన్నందున మీ అప్పులు తీర్చే వరకు మీ మ్యూచువల్ ఫండ్‌లను రీడీమ్ చేయలేరని గమనించగలరు. ఏదైనా లోన్ సంస్థతో లోన్ కోసం దరఖాస్తు చేయడానికి ముందు మీరు ఆమోదించబడిన ఫండ్ హౌస్‌ల జాబితాను చెక్ చేయవచ్చు.
ఇక్కడ అందించిన సమాచారం సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు పేర్కొనబడిన విషయాలు అభిప్రాయాలను మాత్రమే కలిగి ఉంటుంది మరియు అందువల్ల వీటిని మార్గదర్శకాలు, సిఫార్సులు లేదా పాఠకులకు ప్రొఫెషనల్ గైడ్‌గా పరిగణించలేము. ఈ డాక్యుమెంట్ బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారం, అంతర్గతంగా అభివృద్ధి చేయబడిన డేటా మరియు విశ్వసనీయమైనదిగా విశ్వసించే ఇతర వనరుల ఆధారంగా తయారు చేయబడింది. స్పాన్సర్స్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, ట్రస్టీ లేదా వారి డైరెక్టర్లు, ఉద్యోగులు, అనుబంధ సంస్థలు లేదా ప్రతినిధులు ("సంస్థలు మరియు వారి అనుబంధ సంస్థలు") అటువంటి సమాచారం యొక్క ఖచ్చితత్వం, పరిపూర్ణత, సమగ్రత మరియు విశ్వసనీయతకు ఎలాంటి బాధ్యత వహించరు. ఈ సమాచారాన్ని స్వీకరించేవారు తమ సొంత విశ్లేషణ, వివరణలు మరియు పరిశోధనలపై ఆధారపడాలని సూచించబడుతుంది. అందిన సమాచారంతో పెట్టుబడి నిర్ణయానికి రావడానికి పాఠకులు వృత్తిపరమైన నిపుణుల సలహాలను కూడా పొందాలని సూచించబడుతుంది. ఈ మెటీరియల్ తయారీ లేదా జారీలో పాల్గొన్న వ్యక్తులతో సహా సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు ఏవైనా ప్రత్యక్ష, పరోక్ష, ప్రత్యేక, యాదృచ్ఛిక, పర్యవసాన, శిక్షాత్మక లేదా దండనాత్మక నష్టాలు సహా ఈ మెటీరియల్‌లో ఉన్న సమాచారం వల్ల కోల్పోయిన లాభాలకు, వాటికి సంబంధించిన వాటికి బాధ్యత వహించవు. ఈ డాక్యుమెంట్ ఆధారంగా తీసుకునే ఏ నిర్ణయానికైనా స్వీకర్త మాత్రమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది.
మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి, స్కీమ్ సంబంధిత అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి.