Sign In

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టేటప్పుడు ఎన్నారైలు గుర్తుంచుకోవలసిన విషయాలు

ఎన్ఆర్ఐ లాగా విదేశాలలో స్థిరపడినప్పుడు దానికి సంబంధించిన ప్రయోజనాలు ఉంటాయి, అందులో ఇండియా వంటి మంచి వృద్ధిని సాధిస్తున్న ఆర్థిక వ్యవస్థలలో ప్రస్తుత పెట్టుబడి సందర్భం మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడానికి ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. ఎన్ఆర్‌గా, మీరు ఒక సురక్షితమైన, లాభదాయకమైన పెట్టుబడి కోసం కొన్ని పరిమితులు, అలాగే నియమాలకు కట్టుబడి ఉండాలి. ప్రధానంగా రెండు మ్యూచ్యువల్ ఫండ్‌ పెట్టుబడుల ప్రయోజనాలు ఉన్నాయి - అవి, ఫారెక్స్ లాభాలు, అలాగే ఎప్పుడైనా, ఎక్కడైనా సులభంగా ఆన్‌లైన్‌లో పెట్టుబడి పెట్టే ప్రక్రియ. మీరు ఇతర కరెన్సీకి సంబంధించిన నష్టాలను సులభంగా మరొక ఇతర కరెన్సీతో పూడ్చుకోవచ్చు, అది కూడా మీ ఇంటి నుండి సౌకర్యవంతంగా చేయవచ్చు.

ఇండియాలో మ్యూచ్యువల్ ఫండ్ స్కీంలలో పెట్టుబడి పెట్టేటప్పుడు ఎన్‌ఆర్‌ఐలు దృష్టిలో ఉంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలను ఈ ఆర్టికల్ వివరిస్తుంది.

మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టే ఎన్ఆర్ఐలు పరిగణించాల్సిన అంశాలు

1 మీరు ఎఫ్ఇఎమ్ఎ నోటిఫికేషన్, మే 3, 2000 ప్రకారం ఎన్ఆర్ఐ నిర్వచనానికి అనుగుణంగా ఉన్నారో లేదో చెక్ చేసుకోండి

మీరు ఈ కింద పేర్కొన్న ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే మీకు ఎఫ్ఇఎమ్ఎ (ఫారెన్ ఎక్స్‌చేంజ్ మేనేజ్‌మెంట్ చట్టం) ప్రకారం ఎన్ఆర్ఐ‌గా వర్గీకరించబడుతారు: -

● మీరు విదేశాలలో నివసిస్తున్న భారతీయ పౌరులు అయి ఉండాలి.

● మీరు భారతదేశంలో ఒక ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ - మార్చి) 120 రోజులలోపు భౌతికంగా ఉండాలి. భారతదేశంలో మీ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం ఒక ఆర్థిక సంవత్సరంలో ₹15 లక్షలు దాటితే మాత్రమే ఈ 120-రోజుల నియమం వర్తిస్తుంది.

● ఇండియాలో మీ ఆదాయం రూ. 15 లక్షల కంటే తక్కువగా ఉంటే, మీ ఎన్ఆర్ఐ స్థితిని ప్రభావితం చేయకుండా ఇండియాలో మీ భౌతికంగా ఉండే సమయాన్ని 181 రోజుల వరకు పొడిగించవచ్చు.

2 ఇండియాలో మ్యూచ్యువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడానికి కింద పేర్కొన్న విధానాన్ని అనుసరించండి

ఒక ఎన్ఆర్ఒ/ఎన్ఆర్ఇ అకౌంట్‌ను తెరవండి: మీరు భారతీయ బ్యాంకులో పొందిన ఒక ఎన్ఆర్ఒ (నాన్-రెసిడెంట్ ఆర్డినరీ) లేదా ఎన్ఆర్ఇ (నాన్-రెసిడెంట్ ఎక్స్‌టర్నల్) అకౌంట్ ద్వారా ఇండియాలో మ్యూచ్యువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. ఎన్ఆర్ఒ అకౌంట్ మీరు భారతదేశంలో సంపాదించిన మీ ఆదాయాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది, అలాగే ఒక ఎన్ఆర్ఇ అకౌంట్ మీ విదేశీ కరెన్సీ ఆదాయాన్ని భారతీయ కరెన్సీకి మార్చడానికి మీకు సహాయపడుతుంది. ఇండియాలో అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థలు అంతర్జాతీయ కరెన్సీ పెట్టుబడులను అంగీకరించవు కాబట్టి ఇది తప్పనిసరిగా అవసరమైన దశ. మీరు ఒక్కసారి ఎన్ఆర్ఒ/ఎన్ఆర్ఇ అకౌంట్ ద్వారా పెట్టుబడి పెట్టడం మొదలుపెట్టాక ఆ స్కీంలో పెట్టుబడి పెట్టడానికి అదే అకౌంట్‌ను ఉపయోగించాలి. మిశ్రమ పెట్టుబడి మూలాల ద్వారా పెట్టుబడి పెట్టడానికి అనుమతించబడదు.(దయచేసి గమనించండి: ఈ పరిమితి ఫోలియో స్థాయిలో ఉంది.)

a. కెవైసి నియమాలను పాటించాలి: మీరు ఇండియాలో పెట్టుబడి పెట్టడానికి ముందు మీరు కెవైసి ఫార్మాలిటీలను పూర్తి చేయాలి. మీరు మీ పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు, మీ పాస్‌పోర్ట్ స్వీయ ధ్రువీకరణ కాపీలను (ఫండ్ హౌస్ ద్వారా పేర్కొన్న విధంగా సంబంధిత పేజీలు మాత్రమే), అడ్రస్ ప్రూఫ్, అలాగే పుట్టిన తేదీ సర్టిఫికెట్ సమర్పించాలి. సంబంధిత ఫండ్ హౌస్ లేదా బ్యాంక్ వ్యక్తిగత ధృవీకరణ అవసరమని భావిస్తే, అప్పుడు మీరు మీ నివసిస్తున్న దేశంలోని ఇండియన్ ఎంబసీని సందర్శించాలి.

b. అర్హతలు: ఎఫ్ఎటిసిఎ (ఫారిన్ అకౌంట్ ట్యాక్స్ కంప్లియన్స్ యాక్ట్) కింద పేర్కొన్న గజిబిజి సమ్మతి విధానాల కారణంగా యుఎస్ఎ, కెనడా నుండి వచ్చే ఎన్ఆర్ఐలకు భారతదేశంలో అనేక మ్యూచువల్ ఫండ్ స్కీంలు తమ ద్వారాలను మూసివేశాయి. ఈ దేశాలలో ఎన్ఆర్ఐ పెట్టుబడులను అంగీకరించే ఫండ్ హౌస్‌లు కొన్ని అదనపు డాక్యుమెంటేషన్, అర్హతా ప్రమాణాలను నెరవేర్చడానికి సుముఖతను తెలియజేయవు.

c. పెట్టుబడి విధానం: మీరు ఆన్‌లైన్‌లో లేదా భారతదేశంలో నియమించబడిన పవర్ ఆఫ్ అటార్నీ (పిఒఎ) ద్వారా నేరుగా మ్యూచ్యువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టవచ్చు.

3 ట్యాక్స్‌కు సంబంధించి ఉన్న చిక్కులను అర్థం చేసుకోండి

ఎన్ఆర్ఐలు తరచుగా భారతదేశంలో వారి పెట్టుబడి లాభాలు రెట్టింపు ట్యాక్స్‌కు లోబడి ఉంటాయని ఆందోళన చెందుతారు. అయితే, భారతదేశం లోపల మరియు వెలుపల ఉన్న భారతీయ పౌరులకు పన్ను బాధ్యతలను తగ్గించడానికి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలతో రెట్టింపు పన్ను ఎగవేత ఒప్పందాలు (డిటిఏఏ) పై భారత్ సంతకం చేసింది. . అందువల్ల, (డిటిఏఏ) ప్రకారం, మీరు భారతదేశంలో మ్యూచ్యువల్ ఫండ్ లాభాలపై ట్యాక్స్ క్రెడిట్లను క్లెయిమ్ చేసుకోవచ్చు, అయితే అలా చేయడానికి భారతదేశం మీ నివాస దేశంతో అటువంటి ఒప్పందంపై సంతకం చేయాలి.

మే 24, 2021 నాటికి భారతదేశంలో మ్యూచ్యువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతున్న ఎన్ఆర్ఐలకు వర్తించే పన్ను నియమాలు కింద టేబుల్‌లో అందించబడ్డాయి: -

క్రమ సంఖ్యమ్యూచ్యువల్ ఫండ్ రకంషార్ట్-టర్మ్ పెట్టుబడి వ్యవధిలాంగ్-టర్మ్ పెట్టుబడి వ్యవధిషార్ట్-టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్లాంగ్-టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్
1.ఈక్విటీ ఫండ్< 12 నెలలు>= 12 నెలలు15%10% ఇండెక్సేషన్ లేకుండా
2.హైబ్రిడ్ ఫండ్< 12 నెలలు>= 12 నెలలు15%10% ఇండెక్సేషన్ లేకుండా
3.డెట్ ఫండ్< 36 నెలలు>= 36 నెలలుమీ ఆదాయ పన్ను ప్రకారం 20% ఇండెక్సేషన్ తర్వాత
బ్రాకెట్

ముగింపు

ఫారెక్స్ లాభాలు, సులభమైన ఆన్‌లైన్ పెట్టుబడి విధానం మరియు ఇండెక్సేషన్ నుండి పన్ను సామర్థ్యం మ్యూచువల్ ఫండ్స్ యొక్క ప్రధాన ప్రయోజనాలు. అందువల్ల, మీరు ఇప్పుడు విదేశాలలో నివసిస్తూ మీ స్వదేశంలో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టవచ్చు మరియు అనేక ఇతర ప్రయోజనాలను కూడా పొందవచ్చు. అంతేకాకుండా, ఈ విధంగా, మీరు భారతీయ ఆర్థిక వృద్ధిలో కూడా చురుకైన పాత్రను పోషించవచ్చు.

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి, స్కీమ్ సంబంధిత అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి

ఇక్కడ ఉన్న సమాచారం సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు పేర్కొన్న వివరణలు కేవలం అభిప్రాయాలను మాత్రమే సూచిస్తాయి, కావున వీటిని, పాఠకులకు మార్గదర్శకాలు, సిఫార్సులు లేదా నిపుణుల సలహాలుగా పరిగణించకూడదు. బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారం, అంతర్గతంగా అభివృద్ధి చేయబడిన డేటా మరియు ఇతర విశ్వసనీయమైన మూలాల ఆధారంగా ఈ డాక్యుమెంట్ తయారు చేయబడింది. స్పాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, ట్రస్టీ లేదా వారి డైరెక్టర్లు, ఉద్యోగులు, అనుబంధ సంస్థలు లేదా ప్రతినిధులు ("సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు") అటువంటి సమాచారం యొక్క ఖచ్చితత్వం, పరిపూర్ణత, సమగ్రత మరియు విశ్వసనీయతకు ఎలాంటి బాధ్యత వహించరు. ఈ సమాచారాన్ని స్వీకరించే వారు తమ సొంత విశ్లేషణ, వివరణలు మరియు పరిశోధనలపై ఆధారపడాలని సూచించడమైనది. తెలివైన పెట్టుబడి నిర్ణయం తీసుకోవడానికి, వృత్తిపరమైన నిపుణుల సలహా తీసుకోవాలని పాఠకులకు సలహా ఇవ్వడమైనది. ఈ మెటీరియల్ తయారీ లేదా జారీలో భాగంగా ఉన్న వ్యక్తులతో సహా సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు, ఈ మెటీరియల్‌లో ఉన్న సమాచారం ఆధారంగా పొందిన లాభాలు, నష్టాలతో సహా ఏదైనా ప్రత్యక్ష, పరోక్ష, ప్రత్యేక, అనుకోని, పర్యవసాన, శిక్షణాత్మక లేదా దండనాత్మక నష్టాలకు బాధ్యత వహించవు. ఈ డాక్యుమెంట్ ఆధారంగా తీసుకునే ఏ నిర్ణయానికైనా స్వీకర్త మాత్రమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది.


Get the app