మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం అనేది సంపదను సృష్టించడానికి అత్యధికులు అనుసరిస్తున్న మార్గాలలో ఒకటి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (ఎస్ఐపి) ద్వారా పెట్టుబడి చేయడం వలన ప్రజలు చిన్న మొత్తం పొదుపుతో పెద్దమొత్తంలో కార్పస్‌ని కూడబెట్టుకోవచ్చు.
మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ గత కొన్ని సంవత్సరాలుగా ఎస్ఐపి - ఆధారిత పెట్టుబడులలో అసాధారణ వృద్ధిని చూస్తోంది, ఇది పెట్టుబడి అవెన్యూ యొక్క సరళతకు కారణమని చెప్పవచ్చు. ఎస్ఐపి అనేది మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులను ఒక క్రమపద్ధతిలో పెట్టే విధానాన్ని అందిస్తుంది. నెలవారీ ప్రాతిపదికన పెట్టుబడి పెట్టడం అత్యంత ప్రజాదరణ పొందిన మార్గం, అయితే రోజువారీ, వారానికి మరియు త్రైమాసిక ఎంపికలు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఎస్ఐపి గురించిన గొప్ప విషయం ఏమిటంటే, కనీస పెట్టుబడి మొత్తానికి అవకాశం కల్పిస్తుంది. మీరు చాలా తక్కువగా నెలకు ₹ 500 నుండి పెట్టుబడిని ప్రారంభించవచ్చు. ఒకేసారి ₹ 5000 మొత్తం పెట్టుబడి పెట్టడానికి బదులుగా, ఈ ఎస్ఐపి మార్గాన్ని ఎంచుకొని, 10 నెలవారీ వాయిదాలలో ₹ 500 చెల్లించవచ్చు. ఎస్ఐపికి ధన్యవాదాలు, మ్యూచువల్ ఫండ్స్ ఇప్పుడు సామాన్యులకు చేరువలో ఉన్నాయి, ఎందుకనగా భారీగా, ఒకేసారి పెట్టుబడి పెట్టడానికి బదులు తక్కువ బడ్జెట్ గల వారికి కూడా ₹ 500 లేదా ₹ 1,000 ని క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడానికి వీలు కల్పిస్తుంది.
ఇప్పటికీ పరిశ్రమలో ఉన్న అతి పెద్ద అపోహ ఏమిటంటే ఎస్ఐపి అనేది చిన్న పెట్టుబడుల కోసం ఉద్దేశించబడింది, అవి చిన్న పెట్టుబడిదారుల కోసం మాత్రమే పనిచేస్తాయి. ఇందుకు విరుద్ధంగా, అధిక నెట్ అసెట్ వాల్యూ కలిగిన వ్యక్తులు ఎస్ఐపిని మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే ఒక యంత్రాంగంగా కూడా ఉపయోగించారు. దీనికి కారణం చాలా సులభం, చాలా తరచుగా ఈక్విటీలు గొప్ప అస్థిరతను ప్రదర్శిస్తాయి. తెలిసీ తెలియని అనేక కారకాల కారణంగా హెచ్చుతగ్గులకు లోనవుతాయి. కావున, ఆ డిప్రెషన్‌ను అధిగమించడానికి, తెలివైన పెట్టుబడిదారులు ఎస్ఐపి ద్వారా పెట్టుబడి పెట్టడానికి ఎంచుకుంటారు మరియు తరువాత ఆటో-పైలట్ మోడ్‌లో తమ పెట్టుబడులను జాగ్రత్తగా చూసుకుంటారు.
రూపీ కాస్ట్ యావరేజింగ్ (రూపీ కాస్ట్ యావరేజింగ్ అనేది మీరు నిర్ణీత వ్యవధిలో నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడి పెట్టే విధానం. ధరలు తక్కువగా ఉన్నప్పుడు మీరు పెట్టుబడిగా ఎక్కువ యూనిట్‌లను కొనుగోలు చేసేలా చేస్తుంది మరియు ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువ యూనిట్‌లను కొనుగోలు చేసేలా చేస్తుంది) అలాగే
సమ్మేళన సూత్రం (సమ్మేళనం అంటే పెట్టుబడులపై వచ్చే రిటర్న్స్ పెట్టుబడులలో భాగం అవుతాయి, తిరిగి ఆ పెట్టుబడిపై రిటర్న్స్‌ను జెనరేట్ చేయడం ప్రారంభిస్తాయి), లాంగ్ టర్మ్ కార్పస్ కోసం ఎస్ఐపి ఒక గొప్ప మార్గం.
చివరగా, పెద్ద లేదా చిన్న,
ఎస్ఐపి అనేది పెట్టుబడిదారులలో దీర్ఘకాలిక మరియు క్రమశిక్షణతో కూడిన పెట్టుబడుల అలవాటును పెంపొందించడానికి ఒక ప్రభావవంతమైన విధానం.
మ్యూచువల్ ఫండ్ దినోత్సవం అనే నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ వారి ఈ ఆలోచన, పెట్టుబడిదారులకు ఒక విద్యా చొరవగా భావించబడుతుంది.
మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి, స్కీమ్ సంబంధిత అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి..