Sign In

గోల్డ్ ఈటిఎఫ్‌ ల గురించి మీరు తెలుసుకోవలసిన 10 విషయాలు

భారతీయులు బంగారాన్ని ఇష్టపడతారన్నది రహస్యం కాదు. పండుగలు, వివాహ సమయాల్లో, ఆభరణాల దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడటాన్ని <>చూడటం సర్వసాధారణం. అయితే, ఆధునిక కాలంలో ఆర్థిక నిపుణులు గోల్డ్ ఈటిఎఫ్‌‌లు అని పిలువబడే గోల్డ్ ఎక్స్‌చేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ ద్వారా బంగారంపై డిజిటల్ పెట్టుబడులు పెట్టాలని పెట్టుబడిదారులకు సలహా ఇస్తున్నారు.

గోల్డ్ ఈటిఎఫ్‌‌ల గురించి మీరు తెలుసుకోవాల్సిన 10 విషయాలు ఇక్కడ ఉన్నాయి

1 అవి ఏమిటి:

గోల్డ్ ఈటిఎఫ్‌‌లు ఓపెన్-ఎండ్ మ్యూచువల్ ఫండ్‌లు, ఇవి భౌతిక బంగారంపై పెట్టుబడి పెడతాయి. ఇవి ఇతర స్టాక్‌ల మాదిరిగానే స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో ట్రేడ్ చేయబడతాయి. అయితే, ఎక్స్‌ఛేంజ్‌లో గోల్డ్ ఈటిఎఫ్‌ ట్రేడ్ చేయబడినప్పుడు, అవి యూనిట్‌కు సమానమైన నగదుతో క్రెడిట్ చేయబడతాయి. గోల్డ్ ఈటిఎఫ్‌ యొక్క ప్రతి యూనిట్ 0.01 గ్రాము భౌతిక బంగారం నుండి 1 గ్రాము భౌతిక బంగారం వరకు పూర్తిగా 99.5% స్వచ్ఛమైన, అధిక-నాణ్యత గల బంగారాన్ని సూచిస్తుంది.

2.కనీస పెట్టుబడి మొత్తాన్ని ఎలా కొనుగోలు చేయాలి?:

స్టాక్ ఎక్స్‌ఛేంజ్(ల)లో గోల్డ్ ఈటిఎఫ్‌‌లు ట్రేడ్ చేయబడుతున్నందున, వాటిని ట్రేడింగ్ అకౌంట్, డీమ్యాట్ అకౌంట్‌ని ఉపయోగించి కొనుగోలు చేస్తారు. గోల్డ్ ఈటిఎఫ్‌‌లలో కనీస పెట్టుబడి అనేది ప్రస్తుతం ఉన్న నగదు మొత్తం, ఇది సుమారు 0.01 గ్రాము భౌతిక బంగారం నుండి 1 గ్రాము భౌతిక బంగారానికి సమానం.

3 ఫ్లెక్సిబిలిటీ మరియు లిక్విడిటీ:

మీరు ఆన్‌లైన్‌లో గోల్డ్ ఈటిఎఫ్‌‌ల యూనిట్‌లను కొనుగోలు చేయవచ్చు, తర్వాత అవి మీ డీమ్యాట్ అకౌంట్‌లో జమ చేయబడతాయి. బంగారం కోసం డిమాండ్ సాధారణంగా ఎక్కువగా ఉన్నందున, దానిని స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో సులభంగా ట్రేడ్ చేయవచ్చు.

4 సులభమైన లావాదేవీలు:

మార్కెట్ పనివేళల్లో స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో గోల్డ్ ఈటిఎఫ్‌‌ల ట్రేడ్ జరుగుతుంది. ఈటిఎఫ్‌‌ల ధర స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో బహిరంగంగా అందుబాటులో ఉంటుంది, ఇది ఒక గ్రాము విలువకు సంబంధించి భౌతిక బంగారం ధరను పోలి ఉంటుంది. ఇది లావాదేవీని పారదర్శకంగా చేస్తుంది, గోల్డ్ ఈటిఎఫ్‌ యూనిట్లలో పెట్టుబడులను సులభతరం చేస్తుంది.

5 అదనపు ఖర్చులు మరియు పన్ను విధింపు

గోల్డ్ ఈటిఎఫ్‌‌లకు ఎంట్రీ లేదా ఎగ్జిట్ లోడ్‌లు లేవు. మీరు చెల్లించాల్సిన ఏకైక ఖర్చు ట్రాన్సాక్షన్స్‌పై బ్రోకరేజ్. ఈ రోజుల్లో, పెట్టుబడి ఎంపిక కోసం డిస్కౌంట్ బ్రోకర్లు అందుబాటులో ఉండటం వల్ల, గోల్డ్ ఈటిఎఫ్‌ యూనిట్‌లను బ్రోకరేజ్ చెల్లించకుండానే కొనుగోలు చేయవచ్చు. అలాగే, గోల్డ్ ఈటిఎఫ్‌‌లకు గోల్డ్ బార్‌లలో అంతర్లీన పెట్టుబడి ఉన్నందున, వాటికి ఎలాంటి మేకింగ్ ఛార్జీలు లేవు. గోల్డ్ ఈటిఎఫ్‌‌ల పై విధించబడే ఇన్‌డైరెక్ట్ ట్యాక్స్‌లు భౌతిక బంగారం అమ్మకం లేదా కొనుగోలుపై విధించే ట్యాక్స్ లాంటివే. గోల్డ్ ఈటిఎఫ్‌ యూనిట్‌ల రిడెంప్షన్‌పై యూనిట్ హోల్డర్స్ లాభం పొందినప్పుడు, వారు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. గోల్డ్ ఈటిఎఫ్‌‌లలో లాంగ్ టర్మ్, షాట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌పై పన్నులు వర్తిస్తాయి. 36 నెలల కంటే ఎక్కువ కాలం పాటు ఉంచిన గోల్డ్ ఈటిఎఫ్‌ పెట్టుబడులపై ఇండెక్సెషన్ తర్వాత లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ టాక్స్ 20% గా విధించబడుతుంది. 36 నెలల వరకు ఉండే పెట్టుబడులను షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్‌గా పరిగణిస్తారు, యూనిట్ హోల్డర్‌లకు వర్తించే టాక్స్ స్లాబ్ ప్రకారం క్యాపిటల్ గెయిన్స్‌పై పన్ను విధించబడుతుంది. బంగారాన్ని ఇతర రూపాల్లో కొనుగోలు చేయడం లేదా పెట్టుబడి పెట్టడంపై విధించబడే టాక్స్‌‌లకు విరుద్ధంగా, గోల్డ్ ఈటిఎఫ్‌‌లు ఎలాంటి వెల్త్ ట్యాక్స్, జిఎస్‌టి లేదా సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ టాక్స్‌ను ఆకర్షించవు. ఏదైనా పెట్టుబడి పెట్టడానికి ముందు దయచేసి మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించండి.

6 సెక్యూరిటీ:

భౌతిక బంగారం వలె, తమ గోల్డ్ ఈటిఎఫ్‌‌లు దొంగిలించబడతాయేమోనని మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అలాగే, వాటిని ఎక్కడ భద్రపరచాలనే దాని గురించి కూడా చింతించాల్సిన అవసరం లేదు, అలాగే బ్యాంక్ లాకర్ వంటి అదనపు ఖర్చులను కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.

7 ద్రవ్యోల్బణం నుండి రక్షణ మరియు తక్కువ మార్కెట్ రిస్క్:

మార్కెట్ అస్థిరత సమయాల్లో బాగా పనిచేసే ప్రసిద్ధ అసెట్ బంగారం. అందువల్ల, గోల్డ్ ఈటిఎఫ్‌‌లు ద్రవ్యోల్బణం, కరెన్సీ తరుగుదలపై హెడ్జ్‌గా పనిచేస్తాయి. బంగారం ధరలు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయని గమనించాలి, ఇవి తిరిగి గోల్డ్ ఈటిఎఫ్‌‌ ధరలను ప్రభావితం చేస్తాయి.

8 పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్:

మీ పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలో గోల్డ్ ఈటిఎఫ్‌‌ల కేటాయింపు చేయాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. బంగారం ధరల స్థిరమైన స్వభావం కారణంగా, గోల్డ్ ఈటిఎఫ్‌‌ పెట్టుబడులు అస్థిర మార్కెట్ పరిస్థితులలో రిస్క్‌ని తగ్గించడంలో సహాయపడతాయి.

9 తనఖాగా పనిచేస్తుంది:

మీరు బ్యాంక్ లేదా నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ నుండి సెక్యూర్డ్ లోన్‌ను పొందడానికి మీ గోల్డ్ ఈటిఎఫ్‌ పెట్టుబడులను తనఖాగా ఉపయోగించుకోవచ్చు. ఇది స్పష్టమైన ధరతో డిజిటల్ రూపంలో ఉంటుంది కావున, సాంప్రదాయ తనఖా పద్ధతి కంటే మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.

10 బంగారంలో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (ఎస్ఐపి):

గోల్డ్ ఈటిఎఫ్‌‌లు డీమ్యాట్ అకౌంట్ ద్వారా కొనుగోలు చేయబడతాయి, కావున, అవి సాంప్రదాయకంగా ఎస్ఐపిలను అనుమతించవు. అయితే, కొంతమంది బ్రోకర్లు స్టాక్ ఎస్ఐపి సౌకర్యాన్ని అందిస్తారు. మీరు క్రమం తప్పకుండా మ్యూచువల్ ఫండ్ ద్వారా బంగారంలో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటే, గోల్డ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్ఓఎఫ్‌లు) అనేది మంచి ఎంపికగా పనిచేస్తుంది. గోల్డ్ ఈటిఎఫ్‌‌లో గోల్డ్ ఎఫ్ఓఎఫ్‌లు పెట్టుబడి పెడతాయి. గోల్డ్ ఎఫ్ఓఎఫ్‌ల విషయంలో, పెట్టుబడిదారులు దాని అంతర్లీన స్కీమ్ యొక్క అదనపు రికరింగ్ ఖర్చులను భరిస్తారు, అనగా గోల్డ్ ఈటిఎఫ్‌.

సంక్షిప్తంగా

గోల్డ్ ఈటిఎఫ్‌‌ సాంప్రదాయవాద పెట్టుబడిదారునికి మంచి పెట్టుబడి ఎంపిక. ఇది తక్కువ రిస్క్‌తో కూడిన పెట్టుబడి, బంగారం వైపు మళ్లించే కొన్ని పోర్ట్‌ఫోలియో కేటాయింపులు లాంగ్ టర్మ్‌లో ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి, స్కీమ్ సంబంధిత అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి

ఇక్కడ ఉన్న సమాచారం సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు పేర్కొన్న వివరణలు కేవలం అభిప్రాయాలను మాత్రమే సూచిస్తాయి, కావున వీటిని, పాఠకులకు మార్గదర్శకాలు, సిఫార్సులు లేదా నిపుణుల సలహాలుగా పరిగణించకూడదు. బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారం, అంతర్గతంగా అభివృద్ధి చేయబడిన డేటా మరియు ఇతర విశ్వసనీయమైన మూలాల ఆధారంగా ఈ డాక్యుమెంట్ తయారు చేయబడింది. స్పాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, ట్రస్టీ లేదా వారి డైరెక్టర్లు, ఉద్యోగులు, అనుబంధ సంస్థలు లేదా ప్రతినిధులు ("సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు") అటువంటి సమాచారం యొక్క ఖచ్చితత్వం, పరిపూర్ణత, సమగ్రత మరియు విశ్వసనీయతకు ఎలాంటి బాధ్యత వహించరు. ఈ సమాచారాన్ని స్వీకరించే వారు తమ సొంత విశ్లేషణ, వివరణలు మరియు పరిశోధనలపై ఆధారపడాలని సూచించడమైనది. తెలివైన పెట్టుబడి నిర్ణయం తీసుకోవడానికి, వృత్తిపరమైన నిపుణుల సలహా తీసుకోవాలని పాఠకులకు సలహా ఇవ్వడమైనది. ఈ మెటీరియల్ తయారీ లేదా జారీలో భాగంగా ఉన్న వ్యక్తులతో సహా సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు, ఈ మెటీరియల్‌లో ఉన్న సమాచారం ఆధారంగా పొందిన లాభాలు, నష్టాలతో సహా ఏదైనా ప్రత్యక్ష, పరోక్ష, ప్రత్యేక, అనుకోని, పర్యవసాన, శిక్షణాత్మక లేదా దండనాత్మక నష్టాలకు బాధ్యత వహించవు. ఈ డాక్యుమెంట్ ఆధారంగా తీసుకునే ఏ నిర్ణయానికైనా స్వీకర్త మాత్రమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది



Get the app