Sign In

For Suspension of fresh subscription in certain schemes of NIMF, kindly refer to ADDENDUM

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు మీ కలల విహారయాత్రకు నిధులు సమకూర్చుకోవచ్చా?

విహార యాత్ర ప్రణాళిక అనేది ఇప్పుడున్న కిష్ట సమయాల్లో అది గతానికి సంబంధించిన ఒక విషయం వలె అనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పర్యాటక పరిశ్రమ పై పడిన ప్రభావం సంఖ్యల్లో చూపబడింది. ఫోర్బ్స్ ప్రకారం, 2020 యొక్క మొదటి 10 నెలల్లో, ఈ పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా $935 బిలియన్‌ల ఆదాయాన్ని కోల్పోయింది. కానీ ప్రస్తుతం వైద్య పరిస్థితులు మెరుగుపడుతున్న సమయంలో దేశాలు తిరిగి తెరుచుకుంటున్నాయి, పర్యాటక పరిశ్రమ, యాత్రికులు 2022లో పర్యాటకం మొదలవుతుందనే ఆశతో ఉన్నారు. మీరు కూడా ఆ సానుకూల యాత్రికులలో ఒకరైతే, మీ రాబోయే యాత్ర కోసం ఆర్థిక ప్రణాళిక చేయడానికి మిగిలిన ఆర్టికల్ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ప్రయాణం ఒక ఖరీదైన ప్రతిపాదనగా ఉండవచ్చు, ముఖ్యంగా మీ కలల గమ్యస్థానం ఒక పెద్ద నగరం లేదా అద్భుతమైన ప్రదేశం అయితే. అటువంటి ట్రిప్‌కు ఫైనాన్స్ చేయడానికి డబ్బును ఏర్పాటు చేయడం కోసం సంవత్సరాల సమయం పట్టవచ్చు. వాస్తవానికి, మీ కలల విహార యాత్ర కోరికను నెరవేర్చడానికి మీరు కొన్ని నిర్ణయించబడిన పెట్టుబడుల నుండి డబ్బును తీసుకోవడాన్ని పరిగణించవలసి ఉంటుంది. దీని కారణంగా, కొంత మంది అటువంటి ప్రణాళికల నుండి వెనక్కి తగ్గుతారు. కానీ మీరు మ్యూచ్యువల్ ఫండ్ స్కీంలను కలిగి ఉన్నందున మీరు మీ తదుపరి ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవడానికి ఆర్థికంగా సహాయపడతాయి.

మీ విహార యాత్రకు నిధులు సమకూర్చడం కోసం మ్యూచువల్ ఫండ్స్ ఉపయోగించడానికి దశలు

సంపదను సృష్టించడానికి లేదా పదవీ విరమణ కార్పస్ సృష్టించడానికి మ్యూచువల్ ఫండ్స్ ఉపయోగించడం అర్థం చేసుకోదగినది, కానీ విహార యాత్ర ప్లానింగ్ కోసం ఉపయోగించవచ్చా? అది కొంచెం విడ్డూరంగా అయినప్పటికీ, మీరు ప్రారంభంలో ఆలోచించినంత దూరంలో ఉండకపోవచ్చు. అంతిమంగా, మీ విహార యాత్రకు నిధులు సమకూర్చడానికి మ్యూచ్యువల్ ఫండ్ స్కీంలను ఉపయోగించడం మోటార్ సైకిల్ కొనుగోలు చేసే ప్లానింగ్ కంటే భిన్నంగా ఉండదు. మీరు రెండింటినీ సాధించడానికి ఒక బడ్జెట్ మరియు సమయ పరిధిని కలిగి ఉన్నారు. కాబట్టి, మీ విహార యాత్ర కోసం డబ్బును ఏర్పాటు చేయడం అనేది మీకు ఫైనాన్షియల్ మార్కెట్ల సహాయం అవసరమైన ఏదైనా లక్ష్యానికి ప్లానింగ్ లాగా ఉంటుంది.

మ్యూచ్యువల్ ఫండ్ స్కీంల ద్వారా మీ విహార యాత్రను ప్లాన్ చేయడంలో మొదటి దశ బడ్జెట్ ఎంతో తెలుసుకోవడం. అది ప్రదేశం, బస వ్యవధి, ప్రయాణ విధానం మరియు అక్కడ మీరు చేయడానికి ప్రణాళిక చేసే కార్యకలాపాలపై ఆధారపడి ఉంటుంది. అది విదేశీ విహార యాత్ర అయితే, మీరు వీసా మరియు సంబంధిత ప్రాసెసింగ్ ఫీజులను కూడా పరిగణించవలసి ఉంటుంది. మీ వైపు నుండి ట్రిప్ కోసం మీరు ఏర్పాటు చేయవలసిన మొత్తాన్ని అంచనా వేయడానికి ఈ దశ మీకు సహాయపడుతుంది.

రెండవ దశ సమయ పరిధిని తెలుసుకోవడం, అంటే మీరు ఎప్పుడు ప్రయాణించాలనుకుంటున్నారు అనే విషయం. ఇది ముఖ్యమైనది ఎందుకంటే ఇది మీ ప్రయాణానికి నిధులు సమకూర్చుకోవడానికి మీకు సహాయపడే ఉత్పత్తులను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

మూడవ దశ ఏంటంటే మొదటి రెండు దశలను సంతృప్తి పరచగల తగిన మ్యూచ్యువల్ ఫండ్స్ ఎంచుకోవడం. మీరే అధ్యయనం చేయవచ్చు లేదా దాని కోసం ఆర్థిక నిపుణులను సంప్రదించవచ్చు.

నాల్గవ దశ ఏంటంటే మీ పెట్టుబడిని ట్రాక్ చేసుకోవడం మరియు మీ పెట్టుబడి యొక్క సమయ పరిధి ప్రకారం అవసరమైతే రీబ్యాలెన్స్ చేయండి.

అందుబాటులో ఉన్న విభిన్న ఎంపికలను ఉపయోగించండి

మీ ట్రిప్ కొంత సమయం తర్వాత ఉంటే, దాదాపుగా పది సంవత్సరాల తర్వాత అయితే, అప్పుడు మీరు ఈక్విటీ కేటగిరీ నుండి ఫండ్స్ ఉపయోగించవచ్చు. లార్జ్-క్యాప్ ఫండ్స్, మల్టీ-క్యాప్ ఫండ్స్, మరియు ఫ్లెక్సీ-క్యాప్ ఫండ్స్ మొదలైనవి అవసరమైన కార్పస్ సృష్టించడానికి మీకు సహాయపడటానికి బాగా సరిపోవచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడుల వలన మీరు ఈక్విటీ మార్కెట్లలో స్వల్పకాలిక నష్టాలను తట్టుకునే సామర్థ్యాన్ని అందిస్తుంది.

మీ ప్రయాణం కోసం మీకు 3 నుండి 4 సంవత్సరాల సమయం ఉంటే, మీరు బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్ ఫండ్స్ లేదా మధ్యస్థ నుండి ఆగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్ కేటగిరీ వరకు ఫండ్స్ ఉపయోగించవచ్చు. మరో విధానంలో, మీ ట్రిప్ మూడు సంవత్సరాలలోపు ఉంటే కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్ కేటగిరీ నుండి ఫండ్స్ మరియు స్వల్పకాలిక మ్యూచువల్ ఫండ్స్ ఉపయోగకరంగా ఉండవచ్చు.

మీ పెట్టుబడి ప్రక్రియను సులభతరం చేయడానికి సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్లు (ఎస్ఐపిలు) మరియు సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్లు (ఎస్‌టిపిలు) వంటి సౌకర్యాలను ఉపయోగించడానికి గుర్తుంచుకోండి. మ్యూచ్యువల్ ఫండ్స్ ఉపయోగించడం ద్వారా, ఖర్చు ఎక్కువగా అవుతాయి అని భావించే గమ్యస్థానాలకు కూడా మీరు ప్రయాణం చేయవచ్చు. కాబట్టి, విహార యాత్రను ప్లాన్ చేయండి

ఇక్కడ ఉన్న సమాచారం సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు పేర్కొన్న వివరణలు కేవలం అభిప్రాయాలను మాత్రమే సూచిస్తాయి, కావున వీటిని, పాఠకులకు మార్గదర్శకాలు, సిఫార్సులు లేదా నిపుణుల సలహాలుగా పరిగణించకూడదు. బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారం, అంతర్గతంగా అభివృద్ధి చేయబడిన డేటా మరియు ఇతర విశ్వసనీయమైన మూలాల ఆధారంగా ఈ డాక్యుమెంట్ తయారు చేయబడింది. స్పాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, ట్రస్టీ లేదా వారి డైరెక్టర్లు, ఉద్యోగులు, అనుబంధ సంస్థలు లేదా ప్రతినిధులు ("సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు") అటువంటి సమాచారం యొక్క ఖచ్చితత్వం, పరిపూర్ణత, సమగ్రత మరియు విశ్వసనీయతకు ఎలాంటి బాధ్యత వహించరు. ఈ సమాచారాన్ని స్వీకరించే వారు తమ సొంత విశ్లేషణ, వివరణలు మరియు పరిశోధనలపై ఆధారపడాలని సూచించడమైనది. తెలివైన పెట్టుబడి నిర్ణయం తీసుకోవడానికి, వృత్తిపరమైన నిపుణుల సలహా తీసుకోవాలని పాఠకులకు సలహా ఇవ్వడమైనది. ఈ మెటీరియల్ తయారీ లేదా జారీలో భాగంగా ఉన్న వ్యక్తులతో సహా సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు, ఈ మెటీరియల్‌లో ఉన్న సమాచారం ఆధారంగా పొందిన లాభాలు, నష్టాలతో సహా ఏదైనా ప్రత్యక్ష, పరోక్ష, ప్రత్యేక, అనుకోని, పర్యవసాన, శిక్షణాత్మక లేదా దండనాత్మక నష్టాలకు బాధ్యత వహించవు. ఈ డాక్యుమెంట్ ఆధారంగా తీసుకునే ఏ నిర్ణయానికైనా స్వీకర్త మాత్రమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది.

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి, స్కీమ్ సంబంధిత అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి.


Get the app