క్రమశిక్షణతో కూడిన మరియు ప్రణాళిక బద్ధమైన పెట్టుబడులు ’సంపదను సమీకరించడానికి సులువైన మార్గం అని అనేక సార్లు నిరూపించబడింది. కరోడ్‌పతి కాలిక్యులేటర్’ - కోటీశ్వరులు అవ్వాలన్న మీ కలను సాకారం చేసుకోవడానికి సహాయపడే ఒక సాధనం
ఒక కరోడ్‌పతి కాలిక్యులేటర్
ఒక కరోడ్‌పతి కాలిక్యులేటర్ అనేది సులభంగా అందుబాటులో ఉండే ఒక సాధనం. మీరు కోటీశ్వరులు అవ్వడానికి ప్రతి నెలా అవసరం అయిన పెట్టుబడి మొత్తాన్ని లెక్కించడానికి మీరు దీనిని ఉపయోగించవచ్చు. దాని కోసం మీ నుండి అవసరం అయిన సమాచారం ఈ కింద ఇవ్వబడింది:
- మీరు సంపన్నులు అని మీరు పరిగణించడానికి కోట్లలో మొత్తం
- ప్రస్తుతం మీ వయస్సు
- మీరు కరోడ్‌పతి అవ్వాలని లక్ష్యం చేసుకున్న వయస్సు
- సంవత్సరాలలో ద్రవ్యోల్బణం యొక్క అంచనా వేయబడిన రేటు
- మీ పెట్టుబడి నుండి ఆశించిన రాబడి రేటు
- ప్రస్తుతం మీ మొత్తం పొదుపులు
ఫలితంగా, ఇది మీ పెట్టుబడి అవసరాల గురించిన వివరాలను మీకు తెలియజేస్తుంది:
- మీ లక్షిత సంపద మొత్తం (ద్రవ్యోల్బణం సర్దుబాటు చేయబడినది)
- మీ సేవింగ్స్ మొత్తం యొక్క వృద్ధి
- మీ సేవింగ్స్ మొత్తం యొక్క వృద్ధిని మినహాయించిన తర్వాత తుది లక్షిత మొత్తం
- మీరు సేవ్ చేయవలసిన సంవత్సరాల సంఖ్య
- కోటీశ్వరులు అవ్వడానికి అవసరం అయిన నెలవారీ పెట్టుబడి
- పెట్టుబడి చేసిన పూర్తి మొత్తం
- మరియు వృద్ధి చెందిన పూర్తి మొత్తం