సైన్ ఇన్ అవ్వండి

ప్రియమైన పెట్టుబడిదారు, BCP డ్రిల్ కారణంగా 19 ఏప్రిల్ 2024 09:00 AM నుండి 20 ఏప్రిల్ 2024 06:00 PM వరకు మా డిజిటల్ ఆస్తులపై (వెబ్‌సైట్ మరియు యాప్స్) లావాదేవీ చేసేటప్పుడు మీరు మధ్యంతర సమస్యలను ఎదుర్కుంటారని దయచేసి గమనించండి. కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము. మీ ప్రోత్సాహకానికి ధన్యవాదాలు - నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ (ఎన్ఐఎంఎఫ్)

కంటెంట్ ఎడిటర్

ఇన్‌ఫ్లేషన్ క్యాలిక్యులేటర్, ఫ్యూచర్ వాల్యూ క్యాలిక్యులేటర్

సమయం గడిచే కొద్దీ మీ రిటర్నుల యొక్క నిజమైన విలువ క్షీణించిపోతుందని ఆందోళన చెందుతున్నారా? మారుతున్న ద్రవ్యోల్బణం మరియు వడ్డీ రేట్లతో మీరు ఎంత ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందో తెలుసుకోవడానికి ఈ క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించండి. మీ ఆర్థిక ప్రణాళికను అప్‌డేట్ చేసి ఉంచుకోండి.

ప్రస్తుత ఖర్చు
ద్రవ్యోల్బణం రేటు (పిఎ)
వ్యవధి (సంవత్సరాల సంఖ్య)
  • ప్రస్తుత ఖర్చు

  • ద్రవ్యోల్బణం (సంవత్సరానికి %)

  • సంవత్సరాల సంఖ్య

భవిష్యత్తు ఖర్చు

pic

ప్రస్తుతమున్న ద్రవ్యోల్బణ రేటులో వేసి చూసుకున్న తర్వాత మీ ప్రస్తుత ఇన్వెస్ట్‌మెంట్‌లు లాభదాయకంగా ఉన్నాయా అనేదానిని మీరు ఎలా సరిచూసుకుంటారు?

భవిష్యత్తులో ₹ 100 యొక్క విలువ తగ్గుతుందని మీకు తెలిసి ఉండిందా?? దాన్ని వేరుగా ఉంచుతూ, ఈ రోజున రూ. 100 భవిష్యత్ తేదీ నాటి రూ. 100 కంటే ఎక్కువ కొనుగోలు శక్తిని కలిగి ఉంది. సమయం గడిచే కొద్దీ డబ్బు యొక్క కొనుగోలు శక్తి తగ్గుతుంది మరియు ఈ పోకడనే ద్రవ్యోల్బణం అని అంటారు. భవిష్యత్తులో రూపాయితో కొనడానికి మీకు వీలయ్యే దాని కంటే ఎక్కువ వస్తువులు మరియు సేవలను ఈ రోజున దానితో కొనుగోలు చేయగలిగేలా, వస్తువులు మరియు సేవల ధరల్లో క్రమబద్ధమైన పెరుగుదలగా ద్రవ్యోల్బణాన్ని నిర్వచించవచ్చు.

నిజమే, కచ్చితంగా మీరు దానినే విన్నారు. చేయడానికి చక్కనైన పని ఏమిటంటే, మీ ఇన్వెస్ట్‌మెంట్‌లను ప్లాన్ చేస్తున్నప్పుడు ద్రవ్యోల్బణంతో పోల్చి చూసుకోవడం. అందువల్ల, ద్రవ్యోల్బణం రేటును అధిగమించే రిటర్న్ రేటును మీ ఇన్వెస్ట్‌మెంట్‌ సంపాదించాల్సి ఉంటుంది. క్లుప్తంగా చెప్పాలంటే, మీరు మీ ద్రవ్యోల్బణ-సర్దుబాటు చేయబడిన రాబడులను గరిష్టం చేసుకోవాల్సి ఉంటుంది. ఒక సులువైన నియమం ఏంటంటే మీ ఇన్వెస్ట్‌మెంట్‌లు ఒక నిర్దిష్ట ఇన్వెస్ట్‌మెంట్‌ వ్యవధి కోసం ప్రస్తుత ద్రవ్యోల్బణ రేటు కంటే ఎక్కువ రిటర్న్ రేటును ఉత్పన్నం చేయాలి.

ప్రస్తుతమున్న ద్రవ్యోల్బణ రేటులో వేసి చూసుకున్న తర్వాత మీ ప్రస్తుత ఇన్వెస్ట్‌మెంట్‌లు లాభదాయకంగా ఉన్నాయా అనేదానిని మీరు ఎలా సరిచూసుకుంటారు?

ఒక ఫ్యూచర్ వాల్యూ ఇన్‌ఫ్లేషన్ క్యాలిక్యులేటర్, ప్రస్తుతమున్న ద్రవ్యోల్బణ రేటు ఆధారంగా మీ ఇన్వెస్ట్‌మెంట్‌ల యొక్క భవిష్యత్ విలువను అర్థం చేసుకోవడానికి మీకు సహాయపడుతుంది. ఒక ఊహాత్మకమైన మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్‌ ఉదాహరణతో ఆ భావనను మెరుగ్గా అర్థం చేసుకోవడానికి ఈ క్రింది పట్టికలను చూడండి.

పెట్టుబడి తేదీ ఇన్వెస్ట్‌మెంట్‌ వ్యవధి అసలు అమౌంట్ ద్రవ్యోల్బణం-సర్దుబాటు చేయబడిన అసలు మొత్తం (ద్రవ్యోల్బణ రేటు = 5.52%)
మే 6, 2021 2 సంవత్సరాలు 1,00,000 ₹ 1,11,345

కాబట్టి, ప్రాథమికంగా మీ మ్యూచువల్ ఫండ్ రిడెంప్షన్ విలువ ద్రవ్యోల్బణం-సర్దుబాటు చేయబడిన అసలు మొత్తం రూ. 1,11,345 కంటే ఎక్కువగా ఉండాలి మరియు మీ అసలు మొత్తం రూ. 1,00,000 కాదు. ఒక ఫ్యూచర్ వాల్యూ ఇన్‌ఫ్లేషన్ కాలిక్యులేటర్ ఒక ఇన్వెస్ట్‌మెంట్‌ యొక్క నిజమైన సంపాదన సంభావ్యత లేదా వాస్తవమైన రాబడులను అర్థం చేసుకోవడానికి మీకు సహాయపడుతుంది. ద్రవ్యోల్బణం మీ లాభాలను తగ్గిస్తుంది మరియు నష్టాల పరిమాణాన్ని పెంచుతుంది కాబట్టి, మీ ఇన్వెస్ట్‌మెంట్‌ పోర్ట్‌ఫోలియోను రూపొందించడానికి ఫ్యూచర్ వాల్యూ ఇన్‌ఫ్లేషన్ కాలిక్యులేటర్ చాలా ఉపయోగకరమైన సాధనంగా ఉంటుంది. ఇది రిటైర్‌మెంట్ ప్లానింగ్ కోసం కూడా ఒక అద్భుతమైన సాధనం.

నిరాకరణ: పై ఫలితాలు కేవలం ప్రదర్శనాత్మక ఆవశ్యకత కోసం మాత్రమే. వివరణాత్మక సూచన కోసం దయచేసి ఒక ప్రొఫెషనల్ సలహాదారును సంప్రదించండి. ఈ లెక్కింపులు అనేవి, డెట్ మరియు ఈక్విటీ మార్కెట్లు/ రంగాలు లేదా ఏదైనా వ్యక్తిగత సెక్యూరిటీ యొక్క భవిష్యత్తు రాబడికి సంబంధించిన ఎలాంటి తీర్పులపై ఆధారపడి ఉండవు మరియు వీటిని కనీస రాబడులు మరియు/లేదా మూలధన భద్రతపై వాగ్దానంగా భావించబడకూడదు. కాలిక్యులేటర్‌ను తయారు చేసేటప్పుడు అత్యంత శ్రద్ధ తీసుకోబడినప్పటికీ, సాధించిన గణనలు తప్పులు లేనివనీ మరియు/లేదా ఖచ్చితమైనవనీ ఎన్ఐఎంఎఫ్ ఎలాంటి పరిపూర్ణతను లేదా హామీని ఇవ్వదు మరియు కాలిక్యులేటర్ యొక్క వాడకం వల్ల లేదా దానిపై విశ్వాసం ఉంచి ఏదైనా చేసినందువల్ల ఉత్పన్నమయ్యే అన్ని బాధ్యతలు, నష్టాలు మరియు కోల్పోతలకు బాధ్యత వహించడానికి నిరాకరిస్తుంది. అలాగే, ఈ ఉదాహరణలు ఏదైనా సెక్యూరిటీ లేదా పెట్టుబడి పనితీరును సూచించడానికి ఉద్దేశించబడలేదు. పన్ను పర్యవసానాల వ్యక్తిగత స్వభావాన్ని బట్టి, ప్రతి పెట్టుబడిదారుడు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు అతను/ఆమె వృత్తిపరమైన పన్ను/ఆర్థిక సలహాదారుని సంప్రదించవలసిందిగా సలహా ఇవ్వడమైనది.

ఇక్కడ అందించబడిన సమాచారం/వివరణలు సాధారణంగా చదవడం వంటి ప్రయోజనాల కోసమే, అలాగే ఇక్కడ వ్యక్తపరిచిన విషయాలు కేవలం అభిప్రాయాలను కలిగి ఉంటాయి, కావున వాటిని పాఠకులు మార్గదర్శకాలుగా, సిఫార్సులుగా లేదా వృత్తిపరమైన గైడ్‌గా పరిగణించకూడదు. డాక్యుమెంట్ అనేది బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారం, అంతర్గతంగా అభివృద్ధి చేయబడిన డేటా, అలాగే విశ్వసనీయమైనదిగా భావించే ఇతర వనరులను ఆధారంగా చేసుకొని తయారు చేయబడింది. స్పాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, ట్రస్టీ లేదా వారి డైరెక్టర్లు, ఉద్యోగులు, అనుబంధ సంస్థలు లేదా ప్రతినిధులు ("సంస్థలు మరియు వారి అనుబంధ సంస్థలు") ఇక్కడ అందించిన సమాచారం యొక్క ఖచ్చితత్వం, పరిపూర్ణత, తగినంత, అలాగే విశ్వసనీయతకు ఎలాంటి బాధ్యత వహించరు. ఈ సమాచారాన్ని స్వీకరించేవారు తమ సొంత విశ్లేషణ, వివరణలు, పరిశోధనలపై ఆధారపడాలని సూచించడమైనది. అందించిన పెట్టుబడి నిర్ణయానికి రావడానికి పాఠకులు స్వతంత్ర వృత్తిపరమైన నిపుణుల సలహాలను కూడా పొందాలని సూచించడమైనది. ఈ మెటీరియల్ తయారీ లేదా జారీలో పాల్గొన్న వ్యక్తులతో సహా సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు ఏవైనా ప్రత్యక్ష, పరోక్ష, ప్రత్యేక, యాదృచ్ఛిక, పర్యవసాన, శిక్షాత్మక లేదా దండనాత్మక నష్టాలకు సంబంధం లేదు. ఈ డాక్యుమెంట్ ఆధారంగా తీసుకునే ఏ నిర్ణయానికైనా స్వీకర్త మాత్రమే పూర్తి బాధ్యత వహించాలి.

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి, స్కీమ్ సంబంధిత అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి.

యాప్‌ని పొందండి