సైన్ ఇన్ అవ్వండి

ఎన్ఐఎంఎఫ్ యొక్క కొన్ని స్కీములలో తాజా సబ్‌స్క్రిప్షన్ సస్పెన్షన్ కోసం, దయచేసి చూడండి సంబంధిత సమాచారం

కంటెంట్ ఎడిటర్

అసెట్ కేటాయింపు కాలిక్యులేటర్

ఎంచుకోవడానికి అనేక అసెట్లు ఉన్నప్పుడు, మీకు ఉత్తమంగా ఏది సరిపోతుందో మీరు ఎలా నిర్ణయిస్తారు? అసెట్ కేటాయింపు క్యాలిక్యులేటర్ మీ ఆర్థిక లక్ష్యాన్ని సాధించడంలో మీకు సహాయపడటానికి అసెట్ మిక్స్ మరియు వాటి నిష్పత్తిని తెలుసుకోవడానికి సహాయపడుతుంది.

మీ వయస్సు
మీరు ఎంత రిస్క్ తీసుకోవచ్చు?
మీ పెట్టుబడి అవధి (సంవత్సరాలు)

పూర్తి మెచ్యూరిటీ మొత్తం

pic

అసెట్ కేటాయింపు కాలిక్యులేటర్

మా జీవితంలోని ప్రతిదీ బ్యాలెన్స్ కోరుతుంది; ఏదైనా ఎక్కువ అయితే రిస్క్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. మీ పెట్టుబడులకి కూడా ఇదే విషయం వర్తిస్తుంది. మీరు ఒక అసెట్ క్లాస్ వైపు ఎక్కువగా ఆసక్తి చూపితే, మీరు ఒకే దానిలో ఎక్కువ పెట్టుబడి చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితిలో అసెట్ కేటాయింపు సహాయపడుతుంది. అసెట్ కేటాయింపు అనేది ఒక పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలో రిస్క్ మరియు రిటర్న్స్‌ను బ్యాలెన్స్ చేయడానికి అత్యంత ప్రభావవంతమైన పెట్టుబడి వ్యూహాల్లో ఒకటి. ఇది మీ ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ ప్రొఫైల్ మరియు పెట్టుబడి పరిధి ప్రకారం ఒక పోర్ట్‌ఫోలియోలో వివిధ ఆస్తులను కేటాయిస్తుంది.

అసెట్ కేటాయింపు కోసం పరిగణించబడే అసెట్ తరగతులు ఈక్విటీ, స్థిర ఆదాయం, బంగారం మరియు రియల్ ఎస్టేట్ మొదలైనవి. ప్రతి అసెట్ తరగతికి రిస్క్ మరియు సంభావ్య రిటర్న్స్ వివిధ స్థాయిల్లో ఉంటాయి. అందువల్ల, ప్రతి ఆస్తిపై రాబడులు కాలం గడిచే కొద్దీ భిన్నంగా ఉంటాయి. రిస్కులు భిన్నంగా ఉన్నందున, వాటి నుండి వచ్చే రిటర్న్స్ కూడా భిన్నంగా ఉంటాయి. మరియు అందువల్ల మీ రిస్కుకి తగిన రాబడి ఉండడానికి అసెట్ కేటాయింపు అనేది అవసరం.

ఒక ఫైనాన్షియల్ ప్లానర్ లాగా అసెట్ కేటాయింపు కోసం, మీరు చేయవలసింది ఇది:

  • మీ రిస్క్ భరించే స్థాయిని అంచనా వేయండి.
  • మీ పెట్టుబడి లక్ష్యాలను నిర్ణయించుకోండి
  • మీ సమయ పరిధిని గుర్తించండి.
  • మీ అవసరాలకు అనుగుణంగా ఆస్తి తరగతులను ఎంచుకోండి.

మీ అసెట్ కేటాయింపును లెక్కించడానికి ఒక త్వరిత మార్గం ఇక్కడ ఇవ్వబడింది - అసెట్ కేటాయింపు క్యాలిక్యులేటర్.

అసెట్ కేటాయింపు కాలిక్యులేటర్

అసెట్ కేటాయింపు క్యాలిక్యులేటర్ అనేది ఒక తగిన అసెట్ కేటాయింపు పొందడానికి మీరు ఉపయోగించగల సాధనం. మీరు మీ ప్రస్తుత వయస్సు, మీరు తీసుకోగల రిస్క్ స్థాయి (చాలా తక్కువ నుండి చాలా ఎక్కువ వరకు), సంవత్సరాలలో పెట్టుబడి అవధి మరియు మధ్య, చిన్న మరియు పెద్ద కంపెనీల నుండి ఎంపికను నమోదు చేయాలి.

మీ ఎంపికల ఆధారంగా, క్యాలిక్యులేటర్ ఒక ప్రొఫైల్‌ను సృష్టిస్తుంది మరియు మీ కోసం తగిన అసెట్ కేటాయింపును సూచిస్తుంది, ఉదాహరణకు, డెట్‌లో 55% మరియు ఈక్విటీలో 45%. ఎక్కువ మంది భావించినట్లుగా, అసెట్ కేటాయింపు కేవలం ఈక్విటీల గురించి మాత్రమే కాదు. ఒక పెట్టుబడి ప్లానర్ ప్రతి ఒక్కరికీ లక్ష్య శాతం కేటాయించేటప్పుడు ప్రతి అసెట్ క్లాస్ యొక్క రిస్క్ స్థాయిని చూస్తుంది. సమతుల్యమైన మార్గంలో అసెట్ల కేటాయింపు ఉండాలి. అయితే, మీరు నిపుణులు అయి ఉండవలసిన అవసరం లేదు. అసెట్ కేటాయింపు క్యాలిక్యులేటర్ మీ కోసం అసెట్ కేటాయింపు బాధ్యతను చూసుకుంటుంది. ఇది సిఫార్సులు చేయదు; ఫలితం కేవలం ఒక సూచన మాత్రమే.

నిరాకరణ: పై ఫలితాలు కేవలం ప్రదర్శనాత్మక ఆవశ్యకత కోసం మాత్రమే. వివరణాత్మక సూచన కోసం దయచేసి ఒక ప్రొఫెషనల్ సలహాదారును సంప్రదించండి. ఈ లెక్కింపులు అనేవి, డెట్ మరియు ఈక్విటీ మార్కెట్లు/ రంగాలు లేదా ఏదైనా వ్యక్తిగత సెక్యూరిటీ యొక్క భవిష్యత్తు రాబడికి సంబంధించిన ఎలాంటి తీర్పులపై ఆధారపడి ఉండవు మరియు వీటిని కనీస రాబడులు మరియు/లేదా మూలధన భద్రతపై వాగ్దానంగా భావించబడకూడదు. కాలిక్యులేటర్‌ను తయారు చేసేటప్పుడు అత్యంత శ్రద్ధ తీసుకోబడినప్పటికీ, సాధించిన గణనలు తప్పులు లేనివనీ మరియు/లేదా ఖచ్చితమైనవనీ ఎన్ఐఎంఎఫ్ ఎలాంటి పరిపూర్ణతను లేదా హామీని ఇవ్వదు మరియు కాలిక్యులేటర్ యొక్క వాడకం వల్ల లేదా దానిపై విశ్వాసం ఉంచి ఏదైనా చేసినందువల్ల ఉత్పన్నమయ్యే అన్ని బాధ్యతలు, నష్టాలు మరియు కోల్పోతలకు బాధ్యత వహించడానికి నిరాకరిస్తుంది. అలాగే, ఈ ఉదాహరణలు ఏదైనా సెక్యూరిటీ లేదా పెట్టుబడి పనితీరును సూచించడానికి ఉద్దేశించబడలేదు. పన్ను పర్యవసానాల వ్యక్తిగత స్వభావాన్ని బట్టి, ప్రతి పెట్టుబడిదారుడు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు అతను/ఆమె వృత్తిపరమైన పన్ను/ఆర్థిక సలహాదారుని సంప్రదించవలసిందిగా సలహా ఇవ్వడమైనది.

ఇక్కడ అందించబడిన సమాచారం/వివరణలు సాధారణంగా చదవడం వంటి ప్రయోజనాల కోసమే, అలాగే ఇక్కడ వ్యక్తపరిచిన విషయాలు కేవలం అభిప్రాయాలను కలిగి ఉంటాయి, కావున వాటిని పాఠకులు మార్గదర్శకాలుగా, సిఫార్సులుగా లేదా వృత్తిపరమైన గైడ్‌గా పరిగణించకూడదు. డాక్యుమెంట్ అనేది బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారం, అంతర్గతంగా అభివృద్ధి చేయబడిన డేటా, అలాగే విశ్వసనీయమైనదిగా భావించే ఇతర వనరులను ఆధారంగా చేసుకొని తయారు చేయబడింది. స్పాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, ట్రస్టీ లేదా వారి డైరెక్టర్లు, ఉద్యోగులు, అనుబంధ సంస్థలు లేదా ప్రతినిధులు ("సంస్థలు మరియు వారి అనుబంధ సంస్థలు") ఇక్కడ అందించిన సమాచారం యొక్క ఖచ్చితత్వం, పరిపూర్ణత, తగినంత, అలాగే విశ్వసనీయతకు ఎలాంటి బాధ్యత వహించరు. ఈ సమాచారాన్ని స్వీకరించేవారు తమ సొంత విశ్లేషణ, వివరణలు, పరిశోధనలపై ఆధారపడాలని సూచించడమైనది. అందించిన పెట్టుబడి నిర్ణయానికి రావడానికి పాఠకులు స్వతంత్ర వృత్తిపరమైన నిపుణుల సలహాలను కూడా పొందాలని సూచించడమైనది. ఈ మెటీరియల్ తయారీ లేదా జారీలో పాల్గొన్న వ్యక్తులతో సహా సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు ఏవైనా ప్రత్యక్ష, పరోక్ష, ప్రత్యేక, యాదృచ్ఛిక, పర్యవసాన, శిక్షాత్మక లేదా దండనాత్మక నష్టాలకు సంబంధం లేదు. ఈ డాక్యుమెంట్ ఆధారంగా తీసుకునే ఏ నిర్ణయానికైనా స్వీకర్త మాత్రమే పూర్తి బాధ్యత వహించాలి.

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి, స్కీమ్ సంబంధిత అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి.

యాప్‌ని పొందండి