సైన్ ఇన్ అవ్వండి

ఎన్ఐఎంఎఫ్ యొక్క కొన్ని స్కీములలో తాజా సబ్‌స్క్రిప్షన్ సస్పెన్షన్ కోసం, దయచేసి చూడండి సంబంధిత సమాచారం

కంటెంట్ ఎడిటర్

ఎస్‌ఐపి కాలిక్యులేటర్

0

ఆర్థికపరమైన లక్ష్యాలు

రూపాయలు (లక్షలలో)

0 10L 20L 30L 40L 50L 60L 70L 80L 90L 100L
5%

వార్షిక రాబడుల రేటు

(శాతంలో)

5 6 7 8 9 10 11 12 13 14 15 16

ఎస్ఐపి క్యాలిక్యులేటర్ - మీ ఎస్ఐపి ప్లాన్ కోసం మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్ మొత్తాన్ని లెక్కించండి

మీ డబ్బు తనంత తానుగా పని చేసేలా చేయడానికి మరియు సంభావ్యంగా సంపదను వృద్ధి చేయడానికి పెట్టుబడి పెట్టడం అనేది ఒక అవసరమైన చర్య. మీరు ఏ వృత్తిలో ఉన్నారు; మీకు ఎంత వయస్సు ఉంది లేదా మీరు ఎంత డబ్బు సంపాదిస్తున్నారు అనే దానితో దీనికి సంబంధం లేదు. మీ ఆర్థిక వ్యవహారాల్ని ప్లాన్ చేసుకోవడం మరియు క్రమం తప్పని అంతరాల్లో ఇన్వెస్ట్ చేయడమనేది ఆరోగ్యకరమైన సంపద విభాగాన్ని వృద్ధి చేసుకోవడానికి సహాయపడుతుంది. పద్ధతితో కూడిన ఒక ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ లేదా ఎస్ఐపి అనేది పెట్టుబడిదారులకు అనేక మ్యూచువల్ ఫండ్స్ చే అందించబడే ఒక ఇన్వెస్ట్‌మెంట్ సాధనం, ఇది వారిని ఏకమొత్తాలకు బదులుగా క్రమానుగతంగా చిన్న మొత్తాలను ఇన్వెస్ట్ చేయడానికి వీలు కలిగిస్తుంది. ఒక ఎస్ఐపి మీకు ఒకేసారి చాలా డబ్బు ఇన్వెస్ట్ చేసే భయాలను పక్కన పెట్టడానికి వీలు కల్పిస్తుంది. ఇది క్రమం తప్పని అంతరాల్లో మరిన్ని అధునాతన ఇన్వెస్ట్‌మెంట్ మొత్తాలతో మొదలు పెట్టడానికి మీకు వీలు కలిగిస్తుంది.

మీ ఎస్ఐపి లతో మీకు సహాయం చేయడం అనేది ఇక్కడ అందించబడిన ఎస్ఐపి క్యాలిక్యులేటర్. ఈ ఎస్ఐపి క్యాలిక్యులేటర్ అనేది ఒక నిర్దిష్ట కాల చట్రము లోపున మీరు సాధించాలనుకుంటున్న లక్ష్యపు మొత్తం ఆధారంగా మీరు పెట్టుబడి పెట్టవలసిన మొత్తాన్ని చూపించే ఒక ఇన్వెస్ట్‌మెంట్ క్యాలిక్యులేటర్.

ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్, ఇందులో మీరు క్రమానుగతమైన అంతరాలలో క్రమం తప్పకుండా ఒక నిర్ధారిత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయవచ్చు మరియు చక్రవడ్డీ కూడగట్టుకునే శక్తి ద్వారా కొంత కాలానికి మెరుగైన ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకోవచ్చు.

మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి క్యాలిక్యులేటర్ మీకు ఎలా సహాయపడుతుంది -

ఒక ఎస్ఐపి క్యాలిక్యులేటర్ మీకు ఇలా సహాయపడుతుంది:

  • మీరు ఒక్కో నెలకు ఇన్వెస్ట్ చేయాల్సియున్న డబ్బు మొత్తాన్ని నిర్ణయించుకోండి
  • మీ ఆర్థిక లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైన సమయ వ్యవధి గురించి ఒక ఉపాయాన్ని పొందండి.

మొత్తం ప్రక్రియ అంతా చక్కగా ముక్కుసూటిగా ఉంటుంది. మీరు చేయవలసిందల్లా మీరు సాధించాలనుకుంటున్న లక్ష్యం మొత్తాన్ని ఎంపిక చేయడం, ఊహించబడిన వార్షిక రిటర్నుల రేటును ఎంపిక చేయడం మరి ఎస్ఐపి క్యాలిక్యులేటర్ మీరు వివిధ సంవత్సరాల (5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, మొదలైనవి) కోసం ఇన్వెస్ట్ చేయాల్సియున్న నెలవారీ ఎస్ఐపి మొత్తాన్ని మీకు తెలియజేస్తుంది. కేవలం ఒక బటన్ క్లిక్ చేయడంతో ఫలితాలు మీకు అందించబడతాయి.

ఈ మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించడం వలన కలిగే ప్రయోజనావకాాాాాాశాలు

ఒక ఎస్ఐపి క్యాలిక్యులేటర్ ఉపయోగించడం ద్వారా:

  • మీ ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి గాను మీరు నెలకు ఇన్వెస్ట్ చేయాల్సియున్న ఎస్ఐపి మొత్తాన్ని మీరు తెలుసుకుంటారు, అది మీరు సరైన ఇన్వెస్ట్‌మెంట్ నిర్ణయాలు తీసుకోవడానికి మీకు సహాయపడవచ్చు. ఇవన్నీ - క్లిష్టమైన లెక్కింపులు చేయవలసిన అవసరం లేకుండానే.
  • ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా మీరు దీనిని ఆన్‌లైన్‌లో ఉపయోగించవచ్చు.
  • మీరు సమర్థవంతంగా మరియు వ్యూహాత్మకంగా మీ ఇన్వెస్ట్‌మెంట్‌లను ప్లాన్ చేసుకోవచ్చు.

ఒక ఎస్ఐపి క్యాలిక్యులేటర్ ఉపయోగించి మీ వివిధ ఆర్థికపరమైన లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి ఎస్ఐపి మార్గం ద్వారా మీ ఇన్వెస్ట్‌మెంట్‌లను చక్కదిద్దుకోండి.


తరచుగా అడిగే ప్రశ్నలు:

1. ఎస్ఐపి క్యాలిక్యులేటర్‌ను ఎలా ఉపయోగించాలి?

కేవలం మీరు సాధించాలనుకుంటున్న లక్ష్యపు మొత్తాన్ని ఎంపిక చేయండి, ఊహించబడిన వార్షిక రిటర్నుల రేటును ఎంపిక చేసుకోండి మరియు ఎస్ఐపి క్యాలిక్యులేటర్ మీరు వివిధ సంవత్సరాల (5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు మొదలైనవి) కోసం ఇన్వెస్ట్ చేయాల్సియున్న నెలవారీ ఎస్ఐపి మొత్తాన్ని మీకు తెలియజేస్తుంది; కాంపౌండింగ్ యొక్క సూత్రం ఆధారంగా. ఇది భవిష్యత్తు కోసం తెలివైన ఇన్వెస్ట్‌మెంట్‌ నిర్ణయాలు తీసుకోవడానికి మీకు వీలు కలిగిస్తుంది.

2. నేను ఒక ఎస్ఐపి ద్వారా ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి?

క్రమశిక్షణతో కూడిన మరియు సౌకర్యవంతమైన ఒక పొదుపు విధానమే కాకుండా, ఒక ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేయడం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాల్లో ఇవి ఉంటాయి-

  • రిస్క్ నుండి ప్రయోజనం పొందడం - స్టాక్ మార్కెట్లు అస్థిరత యొక్క ప్రమాదాన్ని కలిగి ఉంటాయి. మార్కెట్లు తక్కువగా ఉన్నప్పుడు మరిన్ని ఎక్కువ యూనిట్లను కొనుగోలు చేయడానికి మరియు మార్కెట్లు పెరుగుతున్నప్పుడు తక్కువ యూనిట్లను కొనుగోలు చేయడానికి మీకు వీలు కలిగించడం ద్వారా రుపీ-కాస్ట్ యావరేజింగ్ రిస్క్ తగ్గించుకోవడానికి సహాయపడుతుంది. కాబట్టి, మీరు వాస్తవంగా మార్కెట్ అస్థిరత నుండి ప్రయోజనం పొందుతారు.
  • పెరిగిన పొదుపులు మీరు ఇన్వెస్ట్ చేసే డబ్బు మొత్తం కొంత కాలానికి కాంపౌండ్ చేయబడుతుంది మరియు సుదీర్ఘకాలం పాటు భారీ కార్పస్ కూడగట్టుకోవడానికి మీకు సహాయపడవచ్చు.
  • ఫ్లెక్సిబిలిటీ - ఎంత పెట్టుబడి పెట్టాలో మీరు నిర్ణయించుకోవచ్చు. మీరు ₹ 100 వరకు చిన్న మొత్తంతో ప్రారంభించవచ్చు/-.

3. నా లక్ష్యం దీర్ఘకాలిక ఎదుగుదల, ఎస్ఐపి నాకు పనిచేస్తుందా?

క్రమం తప్పని ఇన్వెస్టింగ్ మరియు కూడగట్టుకోవడం యొక్క శక్తి సూత్రముతో, బహుశా మీరు దీర్ఘకాలిక వ్యవధిలో ఒక భారీ కార్పస్ కూడగట్టుకోగలిగి ఉంటారు.

4. ఎస్ఐపి ఇన్వెస్ట్‌మెంట్ మొదలు పెట్టడానికి నాకు ఎంత మొత్తం డబ్బు అవసరమవుతుంది?

మీరు తక్కువలో తక్కువ రూ. 100 లేదా రూ. 500 తో ఒక ఎస్ఐపి ప్రారంభించవచ్చు (మ్యూచువల్ ఫండ్ హౌస్ ద్వారా సెట్ చేయబడిన పరిమితి ఆధారంగా) మరియు కాలక్రమేణా మీ దోహదాలను పెంచుకోవచ్చు.

అయినప్పటికీ, వివిధ ఫండ్ హౌస్‌లు వివిధ కనీస ఇన్వెస్ట్‌మెంట్‌ మొత్తాలను కలిగి ఉండవచ్చు, మరియు ఇన్వెస్ట్ చేయడానికి ముందు వ్యక్తి సరి చూసుకోవాలి.

5. ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేయడం వలన కలిగే ఇతర ప్రయోజనావకాశాలు ఏవి?

ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేయడంలో చాలా ప్రయోజనాలు ఉన్నాయి:

I. సౌకర్యం - ఎస్ఐపి ఇన్వెస్ట్‌మెంట్‌ చెల్లింపు కోసం ఆ మొత్తాన్ని డెబిట్ చేయడానికి మీరు మీ బ్యాంక్ అకౌంట్ నుండి ఒక ఇసిఎస్ మ్యాండేట్‌ను అధీకృతం చేయవచ్చు.

II. మార్కెట్‌ సమయాన్ని చూసుకోవాల్సిన అవసరం లేదు - ఇన్వెస్ట్‌మెంట్‌ కొంత కాలం పాటు చేయబడుతుంది కాబట్టి, మార్కెట్‌ సమయాన్ని చూసుకోవాల్సిన అవసరాన్ని నివారించడానికి ఒక ఎస్ఐపి మీకు సహాయపడుతుంది.

III. కనీస ఇన్వెస్ట్‌మెంట్‌‌లు – ఫండ్ హౌస్ మీద ఆధారపడి , మీరు తక్కువలో తక్కువ రూ. 100 మొత్తంతో ప్రారంభించవచ్చు మరియు మీ అవసరాలకు అనుగుణంగా క్రమంగా పెంచుకోవచ్చు. అయినప్పటికీ, వివిధ ఫండ్ హౌస్‌లకు వివిధ కనీస ఇన్వెస్ట్‌మెంట్‌‌ మొత్తాలు ఉండవచ్చు; అందువల్ల, ఇన్వెస్ట్ చేయడానికి ముందు వ్యక్తి సరి చూసుకోవాలి.

రిస్క్ తగ్గిస్తుంది: ఇది రుపీ కాస్ట్ యావరేజింగ్ భావనతో రిస్క్ తగ్గించడానికి సహాయపడుతుంది. మార్కెట్ తక్కువలో ఉన్నప్పుడు మీరు మరిన్ని ఎక్కువ యూనిట్లను మరియు మార్కెట్ ఎక్కువలో ఉన్నప్పుడు తక్కువ యూనిట్లు కొనుగోలు చేసేలా ఈ భావన చూసుకుంటుంది - ఇది ప్రతి యూనిట్‌కు ఖర్చును సగటు చేయడానికి సహాయపడుతుంది.

6. ఎస్ఐపి లో రుపీ-కాస్ట్ యావరేజింగ్ అంటే ఏమిటి?

ఇది, మార్కెట్ స్థితిగతులతో సంబంధం లేకుండా, ఇన్వెస్టర్లు ఒక స్థిరమైన మొత్తంలో డబ్బును క్రమబధ్ధమైన విరామాల్లో ఒక ఇన్వెస్ట్‌మెంట్‌‌లో ఉంచే ఒక విధానం. దాని ఫలితంగా, మార్కెట్లు తక్కువగా ట్రేడ్ అవుతున్నప్పుడు మరిన్ని ఎక్కువ యూనిట్లు కొనుగోలు చేయబడతాయి, మరియు మార్కెట్లు ఎక్కువగా ట్రేడ్ అవుతున్నప్పుడు తక్కువ యూనిట్లు కొనుగోలు చేయబడతాయి. అస్థిరత ప్రమాదాన్ని తగ్గించడానికి ఇది నిరూపించబడిన ఒక మార్గం.


అస్వీకార ప్రకటన: పై ఫలితాలు ఊహించబడిన రిటర్న్ రేటు ఆధారంగా ఉంటాయి. వివరణాత్మక సలహా సూచన కోసం దయచేసి మీ ప్రొఫెషనల్ సలహాదారుడిని సంప్రదించండి. ఫలితాలు ఊహించబడిన రిటర్న్ రేటు ఆధారంగా ఉంటాయి. ఈ లెక్కింపులు డెట్ మరియు ఈక్విటీ మార్కెట్లు / రంగాలు లేదా ఏదైనా వ్యక్తిగత భద్రత యొక్క భవిష్యత్ రిటర్నుల యొక్క ఏవైనా న్యాయనిర్ణయాల ఆధారంగా ఉండవు మరియు కనీస రిటర్నులు మరియు/లేదా మూలధనం యొక్క భద్రతపై వాగ్దానముగా భావించబడకూడదు. క్యాలిక్యులేటర్‌ను తయారు చేసేటప్పుడు అత్యంత శ్రద్ధ తీసుకోబడినప్పటికీ, సాధించబడిన కంప్యుటేషన్లు తప్పులు లేనివనీ మరియు/లేదా ఖచ్చితమైనవనీ ఎన్ఐఎంఎఫ్ ఎటువంటి పరిపూర్ణతను లేదా హామీని ఇవ్వదు మరియు క్యాలిక్యులేటర్ యొక్క వాడకం వల్ల లేదా దానిపై విశ్వాసం ఉంచి ఏదైనా చేసినందువల్ల ఉత్పన్నమయ్యే అన్ని నష్టబాధ్యతలు, నష్టాలు మరియు కోల్పోతలకు బాధ్యత వహించడానికి నిరాకరిస్తుంది. ఏదైనా సెక్యూరిటీ లేదా ఇన్వెస్ట్‌మెంట్ పనితీరుకు ప్రాతినిధ్యం వహించడానికి ఈ ఉదాహరణలు ఉద్దేశించబడలేదు. పన్ను పరిణామాల యొక్క వ్యక్తిగత స్వభావాన్ని దృష్టిలో ఉంచుకుని, ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్ నిర్ణయం తీసుకునే ముందు ప్రతి ఇన్వెస్టర్ అతని/ఆమె స్వంత ప్రొఫెషనల్ పన్ను/ఆర్థిక సలహాదారుని సంప్రదించవలసిందిగా సలహా ఇవ్వబడుతుంది.

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి, స్కీమ్ సంబంధిత అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి.

యాప్‌ని పొందండి