కాంపోజిట్ ప్లానర్
ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కలలు, ఆకాంక్షలు ఉంటాయి మరియు ఈ వ్యక్తిగత లక్ష్యాలకు కస్టమైజ్డ్ ప్లానింగ్, కొంత పరిశీలన అవసరం. లక్ష్యాన్ని ఎంత సమయంలో పూర్తి చేస్తారు మరియు దానిని పూర్తి చేయడానికి ఆర్థికంగా మీరు ఎంత రిస్క్ తీసుకుంటారు అనే అంశాలను మీరు నిర్ణయించుకోవాలి. మీ లక్ష్యాలు స్వల్పకాలిక, మధ్య కాలిక, లేదా దీర్ఘ కాలికం అయి ఉండవచ్చు. స్వల్పకాలిక ఆర్థిక లక్ష్యాలు సాధారణంగా ఒకటి నుండి మూడు సంవత్సరాల వ్యవధిలో సాధించవలసిన లక్ష్యాలు.
ఆర్థిక లక్ష్య ప్రణాళిక అనేది అందుబాటులో ఉన్న మీ డబ్బును క్రమబద్ధంగా, విడతల వారీగా పెట్టుబడి చేయడానికి ఉన్న పద్ధతి అనవసరమైన ఖర్చులను తగ్గించడానికి మరియు పొదుపులను పెట్టుబడి చేయడానికి ఉపయోగించడానికి ఆర్ధిక లక్ష్య ప్రణాళిక అనేది మీకు సహాయపడుతుంది.
సరైన సమయంలో మీ బహుళ ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి మీ పెట్టుబడులను ప్లాన్ చేయవలసిన అవసరం ఉంది. ఒక ఫైనాన్షియల్ ప్లానర్ లాగా, మీరు మీ రిస్క్ ప్రొఫైల్ ఆధారంగా మీ పోర్ట్‌ఫోలియో కోసం ఉత్తమ పెట్టుబడులను ఎంచుకోవాలి. కంగారు పడకండి! ఇది రాకెట్ సైన్స్ కాదు. కాంపోజిట్ ఫైనాన్షియల్ గోల్ ప్లానర్ కాలిక్యులేటర్ రూపంలో ఒక మంచి ప్రణాళిక రచించడంలో మీకు సహాయపడే ఒక సాధనాన్ని మేము మీకు అందిస్తున్నాము.
కాంపోజిట్ ప్లానర్
ఈ కాలిక్యులేటర్ ఒక మ్యూచువల్ ఫండ్ కాలిక్యులేటర్ లేదా ఎస్ఐపి ప్లానర్ లాగానే ఉపయోగించడానికి సులభమైన సాధనం. మీరు కేవలం మీ ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించవలసి ఉంటుంది మరియు ప్రతి లక్ష్యానికి నిధులను కేటాయించవలసి ఉంటుంది. మీరు మీ ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి అవసరం అయిన మొత్తం, వయస్సు, ద్రవ్యోల్బణం యొక్క ఊహించిన రేటు మరియు ఆశించిన రాబడి రేటును నమోదు చేయండి. అంతే. మీ ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చడానికి తగినంత మొత్తాన్ని పొందడానికి మీరు ప్రస్తుతం ఎంత పెట్టుబడి పెట్టాలో కాలిక్యులేటర్ సూచిస్తుంది.
కాంపోజిట్ ప్లానర్ మీకు ఫలితాన్ని చూపుతారు:
- నేటి ధరల వద్ద మొత్తం
- మీ లక్ష్యాలను సాధించడానికి పట్టే సంవత్సరాల సంఖ్య
- వ్యక్తిగత లక్ష్య ధ్యేయం (ద్రవ్యోల్బణం సర్దుబాటు చేయబడింది)
- ప్రతి నెలా అవసరం అయిన సేవింగ్స్
అన్నీ ఒకేసారి మీ లక్ష్యాలను సాధించడానికి మీరు ఎంత పెట్టుబడి పెట్టాలో తెలుసుకోవడానికి మా కాంపోజిట్ కాలిక్యులేటర్‌ను ఉపయోగించవచ్చు.
మీరు క్రింది లింకుల నుండి రేట్లను తీసుకోవచ్చు మరియు అధికారిక అంకెల ప్రకారం ద్రవ్యోల్బణం మరియు రాబడులను అంచనా వేయవచ్చు.