సైన్ ఇన్ అవ్వండి

 కంటెంట్ ఎడిటర్

డెట్ మ్యూచువల్ ఫండ్స్ ప్రపంచంలోకి స్వాగతం!

స్థిర ఆదాయ ఫండ్స్ అని కూడా పేర్కొనబడే డెట్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఈక్విటీ సంబంధిత పెట్టుబడులతో పోలిస్తే తక్కువ రిస్క్‌తో మీకు స్థిరమైన రాబడిని అందించే లక్ష్యం కలిగి ఉంటాయి. అయితే, డెట్ ఫండ్స్ అంటే ఏమిటి మరియు అవి మీకు అనుకూలంగా ఉంటాయా? మనం తెలుసుకుందాం!

డెట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి?

Debt mutual funds invest in debt instruments/securities like bonds (corporate and Government), money market instruments, treasury bills etc.

Simply put, when you invest in a debt instrument, you are lending money to a corporate or the Government directly. In return, they issue a security which generally has a fixed coupon (interest rate). These securities are traded in the debt market, similar to how stocks are traded in the stock market. These are the securities debt funds invest in. Each security like a bond comes with a coupon rate, face value and maturity period. For example, a company can issue bonds of face value Rs 100, at a coupon rate of 6% for a maturity period of 5 years. Till 5 years, you will get 6% returns annually, and at the end of 5 years, you will get your principal amount back.

You may wonder, how safe are debt funds? Well, debt mutual funds are not risk-free. Any investment that is entirely risk-free may not have the potential to generate higher than nominal returns- that is the risk-return trade-off. But debt mutual funds are relatively safer than equity mutual funds. If you are a risk-averse investor wanting to get better returns than the traditional saving instruments with lower volatility, then debt funds may help you. The best debt funds for you will depend on the goals that you wish to achieve with them. Click here to know more about how to link your debt funds to your life goals.

డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం వలన కలిగే ప్రయోజనాలు

కొన్ని సంవత్సరాల వ్యవధిలో, దీర్ఘ-కాలిక మరియు స్వల్ప-కాలిక పెట్టుబడిదారులు వారి పోర్ట్‌ఫోలియోలలో డెట్ ఫండ్‌ల ప్రయోజనాలను గుర్తించారు. సాపేక్షంగా తక్కువ అస్థిరతతో మరింత సమతుల్యమైన పోర్ట్‌ఫోలియోను సాధించడంలో ఇవి మీకు సహాయపడతాయి. లిక్విడిటీ, సాపేక్ష భద్రత, పన్ను సామర్థ్యం మరియు రిటర్న్స్ కారణంగా మీరు డెట్ ఫండ్‌ల నుండి ప్రయోజనం పొందడాన్ని లక్ష్యంగా పెట్టుకోవచ్చు.

డెట్ మ్యూచువల్ ఫండ్స్ వలన కలిగే ప్రయోజనాలను చూద్దాం-

అధికం
లిక్విడిటీ

డెట్ ఫండ్‌ల నుండి మీ పెట్టుబడిని రీడీమ్ చేయకుండా నిరోధించే ఎలాంటి లాక్-ఇన్ వ్యవధులు లేదా స్వల్పకాలిక అస్థిరతలు లేవు. మీ వద్ద అదనపు నగదు ఉంటే, మీరు దానిని పెట్టుబడి పెట్టడానికి మీకు నచ్చిన ఏదైనా స్వల్పకాలిక డెట్ ఫండ్‌లను ఎంచుకోవచ్చు. ఇది మీకు ఒక గొప్ప అత్యవసర నిధిగా కూడా పనిచేస్తుంది.

పోర్ట్‌ఫోలియో రిస్కును
బ్యాలెన్స్ చేయడం

భద్రత పరంగా డెట్ ఫండ్స్ మరియు ఈక్విటీ ఫండ్‌ల మధ్యన చూసుకుంటే, డెట్ ఫండ్స్‌లో మార్కెట్ రిస్క్ తక్కువగా ఉంటుంది. కావున, డెట్ ఫండ్‌లు స్వచ్ఛమైన ఈక్విటీ పోర్ట్‌ఫోలియోలో లేని స్థిరత్వాన్ని మీకు అందించవచ్చు. ఒకవేళ, మీరు వ్యూహాత్మకంగా మీ పోర్ట్‌ఫోలియోలో కొంత భాగాన్ని షార్ట్ టర్మ్ డెట్ ఫండ్‌లకు కేటాయించినట్లయితే, మీరు రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్‌లను పొందే అవకాశం ఉంటుంది.

బహుళ
ఎంపికలు

ఒక ఫండ్ నుండి మీ అవసరాన్ని బట్టి, మీరు ఎంచుకోవడానికి అనేక రకాల డెట్ ఫండ్‌లు అందుబాటులో ఉన్నాయి. స్వల్పకాలిక ఫండ్‌లు సాపేక్షంగా స్థిరమైన డెట్ ఫండ్ రిటర్న్స్ అందించడంలో సహాయపడతాయి, మీరు సాపేక్షంగా అధిక అస్థిరతతో సౌకర్యంగా ఉన్నట్లయితే, దీర్ఘకాలిక ఫండ్‌లు కూడా మీకు తగినవిధంగా సరిపోతాయి. ఈ డెట్ ఫండ్స్ విభాగంలో మీ వివిధ లక్ష్యాలను చేరుకోవడంలో మీకు సహాయపడే వాటిని మీరు ఖచ్చితంగా కనుగొంటారు.

వృత్తిపరమైన
నైపుణ్యం

డెట్ ఫండ్‌లు మీకు మార్కెట్‌లు మరియు పెట్టుబడి సాధనాల్లోకి ప్రవేశించడానికి అవకాశాన్ని ఇస్తాయి, లేదంటే ప్రవేశించడానికి మీకు ఎలాంటి ప్రాప్యత లేదా నైపుణ్యం ఉండకపోవచ్చు. డెట్ మ్యూచువల్ ఫండ్‌ల యొక్క ఫండ్ మేనేజర్లు వారి వారి రంగాల్లో నిపుణులు మరియు తక్కువ రిస్క్‌తో మీకు క్యాపిటల్ అప్రిసియేషన్‌ను అందించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు.

కొత్త
పెట్టుబడిదారులకు

మీరు సాంప్రదాయక పెట్టుబడుల నుండి మ్యూచువల్ ఫండ్‌లకు మారుతున్నప్పుడు, రాబడుల స్థిరత్వం మరియు తక్కువ రిస్క్ కారణంగా డెట్ ఫండ్‌లు సురక్షితమైన మరియు మరింత అనువైన ఎంపికగా రుజువవుతాయి.

పన్ను
ప్రయోజనం

సాంప్రదాయక పెట్టుబడుల మాదిరిగానే, మీరు మీ పెట్టుబడిని రీడీమ్ చేసినప్పుడు డెట్ ఫండ్ రిటర్న్‌లపై పన్ను విధించబడుతుంది. దీనినే క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ అని పిలుస్తారు. కానీ, డెట్ మ్యూచువల్ ఫండ్లలో ఇండెక్సేషన్ ప్రయోజనం మీకు టాక్స్-అడ్జెస్టెడ్ రిటర్న్‌లను మరింత అనుకూలంగా చేస్తుంది. డెట్ మ్యూచువల్ ఫండ్స్ పన్ను ప్రయోజనాలు వీటిని సాంప్రదాయ పెట్టుబడి సాధనాల కంటే మెరుగైన ఎంపికగా చేస్తాయి.

ఆసక్తికరంగా ఉంది కదూ? డెట్ మ్యూచువల్ ఫండ్స్ ప్రయోజనాల గురించి మరింత తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

డెట్ ఫండ్స్‌లో ఎవరు పెట్టుబడి పెట్టాలి?

దీర్ఘ-కాలిక సంపద సృష్టి

మీడియం/లాంగ్-టర్మ్ డెట్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా మీ దీర్ఘ-కాలిక లక్ష్యాలను సాధించవచ్చు. తక్కువ రిస్క్ సామర్థ్యం గల వ్యక్తుల కోసం మరియు ఈక్విటీ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలని ఎదురుచూసే పెట్టుబడిదారుల కోసం ఈ డెట్ ఫండ్స్ అనువైనవి, ఇవి మీ లక్ష్యాలను సరైన దిశలో మ్యాప్ చేసే వాహనాలుగా పనిచేస్తాయి.

స్వల్ప/మధ్య-కాలిక లక్ష్యాలను నెరవేర్చాలనుకునే పెట్టుబడిదారులు

మీరు కారును కొనుగోలు చేయడం లేదా మీ పిల్లల వార్షిక ఫీజును చెల్లించడం లాంటి స్వల్ప/మధ్య-కాలిక లక్ష్యాలను కలిగి ఉంటే, డెట్ ఫండ్‌లు అందుకు అనుకూలమైనవి. ఎందుకనగా, ఈక్విటీ ఫండ్స్‌తో పోలిస్తే ఇవి సాపేక్షంగా స్థిరమైన రిటర్న్స్ అందిస్తాయి. అలాగే, ఒక మోస్తరు రాబడిని సంపాదించే అవకాశం కల్పిస్తాయి.

అత్యవసర నిధిని సృష్టించాలనుకునే పెట్టుబడిదారులు

అత్యవసర నిధి కోసం ప్రాథమిక అవసరం ఏమిటంటే అది లిక్విడ్‌ రూపంలో లభించడం, ఇది డెట్ ఫండ్స్ ద్వారా అది నెరవేరుతుంది. సాంప్రదాయక పొదుపు సాధనాలతో పోలిస్తే, పెట్టుబడిదారులు డెట్ ఫండ్స్ ద్వారా మెరుగైన రాబడులను ఈక్విటీ కంటే తక్కువ రిస్క్‌తో పొందవచ్చు.

తమ పెద్ద మొత్తాలను క్రమపద్ధతిలో పెట్టుబడి పెట్టాలనుకునే పెట్టుబడిదారులు

మీరు పెద్ద మొత్తాన్ని కలిగి ఉండి దానిని ఈక్విటీ ఫండ్‌లలో పెట్టుబడి పెట్టాలనుకుంటే, మార్కెట్ సమయం అందుకు అనువైనదో కాదో మీకు ఖచ్చితంగా తెలియకపోతే, మీరు మీ నిధులను డెట్ ఫండ్‌లో ఉంచవచ్చు. అలాగే, ఈక్విటీ ఫండ్‌ కోసం ఒక సిస్టమాటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్‌ను ప్రారంభించవచ్చు. ఇది సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రయోజనాలను మీకు అందిస్తుంది.

సాంప్రదాయక లేదా కొత్త మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులు

తక్కువ-రిస్క్ విముఖత కలిగిన పెట్టుబడిదారులు ఈక్విటీ-సంబంధిత పెట్టుబడుల కంటే డెట్ ఫండ్‌లను తక్కువ రిస్కుతో కూడినవిగా పరిగణిస్తారు, అంతేకాకుండా, ఇవి మరింత అనుకూలమైనవి. అదేవిధంగా, కొత్త మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులు కూడా డెట్ ఫండ్‌లు సౌకర్యవంతమైనవని, ఎక్కువ లిక్విడిటీని, ఈక్విటీ కన్నా మరింత స్థిరమైన రిటర్న్స్ అందిస్తాయనే వాస్తవాన్ని నమ్ముతారు.

డెట్ ఫండ్స్‌లో ఎవరు పెట్టుబడి పెట్టాలో అని తెలుసుకోవడానికి మరింత చదవండి Here

డెట్ ఫండ్స్ రకాలు

డెట్ ఫండ్‌లను ఎలా ఎంచుకోవాలి?

భారతదేశంలో అందుబాటులో ఉన్న విభిన్న కేటగిరీలు మరియు అనేక రకాల డెట్ ఫండ్‌ల నుండి, మీ పెట్టుబడి కోసం ఉత్తమమైన డెట్ ఫండ్‌లను ఎలా ఎంచుకుంటారు? ఫండ్ యొక్క రిస్క్-రిటర్న్‌ల కలయిక కోసం చూడండి, ఇది మీకు ఏ డెట్ ఫండ్‌లలో పెట్టుబడి పెట్టాలో నిర్ణయించకోవడానికి సహాయపడుతుంది. కింది అంశాలను దృష్టిలో ఉంచుకుని మీరు సరైన డెట్ ఫండ్‌ను ఎంచుకోవచ్చు

మీ పెట్టుబడి వ్యవధి ఏమిటి?

ఫండ్ వ్యవధి ఎక్కువగా ఉంటే, వడ్డీ రేట్లలో మార్పుల ప్రభావం ఈ ఫండ్స్ పై ఎక్కువగా ఉంటుంది, అలాగే రిటర్న్స్‌లో కూడా సంభావ్య హెచ్చుతగ్గులు ఉంటాయి. ముందుగా, మీరు ఎంతకాలం పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో గుర్తించండి. ఒక డెట్ ఫండ్ మీకు 3-5 సంవత్సరాల పెట్టుబడి కోసం తగిన విధంగా సరిపోతుంది, ఇది ఓవర్‌నైట్ ఫండ్‌ కన్నా విభిన్నమైన రిస్కులను చవిచూస్తుంది.

మీరు ఎలాంటి రిస్క్‌ను తీసుకోవాలనుకుంటున్నారో చెక్ చేయండి

క్రెడిట్ రిస్క్ ఫండ్ లాంటి డెట్ ఫండ్‌లు అధిక క్రెడిట్ రిస్క్‌ను కలిగి ఉంటాయి. అలాగే, వివిధ రకాల డెట్ ఫండ్‌లు వేర్వేరు క్రెడిట్ రిస్క్ ప్రొఫైల్‌లను కలిగి ఉండవచ్చు. ఫండ్‌ వ్యవధితో పాటు మీరు, మీకు సౌకర్యవంతంగా అనిపించే క్రెడిట్ రిస్క్ మొత్తాన్ని కూడా నిర్ణయించుకోవాలి. రిటర్న్స్ వేటలో కొన్నిసార్లు, పెట్టుబడిదారులు రిస్క్‌లను విస్మరిస్తారు. మీరు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకునే ముందు ఏదైనా డెట్ ఫండ్‌ను ఎంచుకొని దాని గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నించండి.

పైన పేర్కొన్న రెండు అంశాలపై పూర్తి అవగాహన వచ్చిన తర్వాత, మీరు డెట్ ఫండ్స్ యొక్క వివిధ కేటగిరీల కోసం చూడవచ్చు మరియు మీ ఆర్థిక లక్ష్యాలు, పెట్టుబడి పరిధి మరియు రిస్క్ సామర్థ్యానికి అనుగుణంగా ఉండే వాటిని ఎంచుకోవచ్చు. అలాగే, డెట్ మ్యూచువల్ ఫండ్‌లకు మీ లక్ష్యాలను ఎలా అనుసంధానించాలో తెలుసుకోవడానికి, ఇక్కడ క్లిక్ చేయండి.

డెట్ ఫండ్స్‌లో ఏవిధంగా పెట్టుబడి పెట్టాలి?



డెట్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడానికి Here

డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఎలా పనిచేస్తాయి?

డెట్ ఫండ్‌లు ఒక నిర్దిష్ట ధర వద్ద డెట్ సెక్యూరిటీలను కొనుగోలు చేస్తాయి. మీరు డెట్ సెక్యూరిటీలో పెట్టుబడి పెట్టినప్పుడు, రుణగ్రహీత లేదా డెట్ సెక్యూరిటీ జారీ చేసే సంస్థ వడ్డీ మరియు మెచ్యూరిటీ అవధిని నిర్ణయిస్తుంది. అందువల్ల, వాటిని స్థిర-ఆదాయ సెక్యూరిటీలుగా పిలుస్తారు. ఈ స్థిరమైన వడ్డీతో పాటు డెట్ ఫండ్‌లు వడ్డీ రేట్లలో మార్పు ద్వారా కూడా సంపదను సృష్టిస్తాయి. వడ్డీ రేట్లు మరియు బాండ్ ధరలు విలోమానుపాతంలో ఉంటాయి. వడ్డీ రేటులో హెచ్చుతగ్గులు బాండ్ ధర పెరగడానికి మరియు తగ్గడానికి కారణమవుతాయి, తద్వారా మూలధన విలువలో పెరుగుదల/తరుగుదల ఏర్పడుతుంది. డెట్ మ్యూచువల్ ఫండ్ కలిగి ఉన్న వివిధ బాండ్ల రకాలు స్థిరమైన వడ్డీ మరియు మూలధన లాభాలు/ నష్టాల ద్వారా సంపాదన పరిధిని నిర్ణయిస్తాయి. చివరగా డెట్ ఫండ్స్ ఈ విధంగా పనిచేస్తాయని చెప్పుకోవచ్చు.

డెట్ ఫండ్‌లు వివిధ క్రెడిట్ రేటింగ్‌ల సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టడం ద్వారా రిటర్న్‌లను నిర్వహించగలవు. క్రెడిట్ రేటింగ్ ప్రధానంగా ఒక రుణగ్రహీత రుణాన్ని తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని సూచిస్తుంది. అధిక క్రెడిట్ రేటింగ్ గల బాండ్లు తక్కువ క్రెడిట్ రేటింగ్ గల బాండ్ల కంటే సురక్షితమైనవి మరియు అధిక కూపన్ రేట్లను కలిగి ఉంటాయి. అందువల్ల, అధిక రిటర్న్స్ కోసం కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడే ఫండ్ మేనేజర్లు కూడా ప్రధాన పాత్రను పోషిస్తారు. వారు వడ్డీ రేటులో కదలికలను బట్టి, క్రెడిట్ రిస్క్ సంభావ్యతల నుండి రిటర్న్‌లను గరిష్టంగా పెంచడానికి వారి నైపుణ్యంతో బాగా పరిశోధించిన నిర్ణయాలను తీసుకుంటారు. డెట్ ఫండ్స్ ఎలా పనిచేస్తాయనే దాని గురించి మరింత తెలుసుకోవడానికి Here

ముగింపు-

ఈక్విటీతో పోలిస్తే సాపేక్షంగా స్థిరమైన ఆదాయం/రిటర్న్స్, అత్యంత లిక్విడిటీ, తక్కువ అస్థిరత మరియు పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్ అనేవి డెట్ ఫండ్‌లలో పెట్టుబడి పెట్టడం వలన కలిగే అనేక ప్రయోజనాల్లో కొన్ని. సరైన డెట్ ఫండ్‌ను ఎల్లప్పుడూ మొత్తం పోర్ట్‌ఫోలియోను దృష్టిలో ఉంచుకుని, జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. ఒకవేళ సరైన ఎంపిక చేయబడితే, అది కొంత కాలం పాటు క్యాపిటల్ అప్రిసియేషన్ మరియు అద్భుతమైన రిటర్న్స్‌తో మీకు సహాయపడుతుంది.

ఇక్కడ ఉన్న సమాచారం సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు పేర్కొన్న వివరణలు కేవలం అభిప్రాయాలను మాత్రమే సూచిస్తాయి, కావున వీటిని, పాఠకులకు మార్గదర్శకాలు, సిఫార్సులు లేదా నిపుణుల సలహాలుగా పరిగణించకూడదు. బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారం, అంతర్గతంగా అభివృద్ధి చేయబడిన డేటా మరియు ఇతర విశ్వసనీయమైన మూలాల ఆధారంగా ఈ డాక్యుమెంట్ తయారు చేయబడింది. స్పాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, ట్రస్టీ లేదా వారి డైరెక్టర్లు, ఉద్యోగులు, అనుబంధ సంస్థలు లేదా ప్రతినిధులు ("సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు") అటువంటి సమాచారం యొక్క ఖచ్చితత్వం, పరిపూర్ణత, సమగ్రత మరియు విశ్వసనీయతకు ఎలాంటి బాధ్యత వహించరు. ఈ సమాచారాన్ని స్వీకరించే వారు తమ సొంత విశ్లేషణ, వివరణలు మరియు పరిశోధనలపై ఆధారపడాలని సూచించడమైనది. తెలివైన పెట్టుబడి నిర్ణయం తీసుకోవడానికి, వృత్తిపరమైన నిపుణుల సలహా తీసుకోవాలని పాఠకులకు సలహా ఇవ్వడమైనది. ఈ మెటీరియల్ తయారీ లేదా జారీలో భాగంగా ఉన్న వ్యక్తులతో సహా సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు, ఈ మెటీరియల్‌లో ఉన్న సమాచారం ఆధారంగా పొందిన లాభాలు, నష్టాలతో సహా ఏదైనా ప్రత్యక్ష, పరోక్ష, ప్రత్యేక, అనుకోని, పర్యవసాన, శిక్షణాత్మక లేదా దండనాత్మక నష్టాలకు బాధ్యత వహించవు. ఈ డాక్యుమెంట్ ఆధారంగా తీసుకునే ఏ నిర్ణయానికైనా స్వీకర్త మాత్రమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది.

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి, స్కీమ్ సంబంధిత అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి

యాప్‌ని పొందండి