సైన్ ఇన్ అవ్వండి

ఎన్ఐఎంఎఫ్ యొక్క కొన్ని స్కీములలో తాజా సబ్‌స్క్రిప్షన్ సస్పెన్షన్ కోసం, దయచేసి చూడండి సంబంధిత సమాచారం

మ్యూచ్యువల్ ఫండ్స్‌లో ఎదురయ్యే రిస్కుల గురించి మీరు తెలుసుకోవలసినవి

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి, పథకానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్‌లను జాగ్రత్తగా చదవండి - ప్రతిఒక్కరూ ఈ డిస్‌క్లెయిమర్‌ని చదివారు/విన్నారు, కానీ సంస్థలు పేర్కొనే ఈ రిస్కులు ఏమిటో మనలో ఎంతమందికి తెలుసు? ఈక్విటీ, ప్రభుత్వ సెక్యూరిటీలు, బంగారం, అంతర్జాతీయ సెక్యూరిటీలు, కార్పొరేట్ బాండ్లు మరియు అనేక ఇతర సెక్యూరిటీలలో మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడి పెడతాయి. వివిధ సూక్ష్మ/స్థూల ఆర్థిక అంశాల కారణంగా ఈ సెక్యూరిటీల ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి, ఇది మ్యూచువల్ ఫండ్ స్కీమ్ యొక్క ఎన్ఎవి (నెట్ అసెట్ వాల్యూ) ని మారుస్తుంది, ఇది స్కీమ్ యొక్క ప్రతి యూనిట్ వాల్యూని సూచిస్తుంది.

పెట్టుబడిదారులందరూ తెలుసుకోవాల్సిన కొన్ని రిస్కులు ఇక్కడ ఇవ్వబడ్డాయి-

అస్థిరత రిస్క్- ఈక్విటీలు/స్టాక్స్ స్టాక్ మార్కెట్‌లో ట్రేడ్ అవుతాయి మరియు బాండ్ మార్కెట్లలో బాండ్‌లు ట్రేడ్ అవుతాయి, అయితే వివిధ స్థాయిలలో ఈ రెండు మార్కెట్లు అస్థిరతకు లోబడి ఉంటాయి. మునుపటిది సాపేక్షంగా రెండవ దానికన్నా ప్రమాదకరమైనది. ఈ అస్థిరత అనేది షేర్‌లు, బాండ్‌లు మొదలైనటువంటి ట్రేడ్ చేయబడే సెక్యూరిటీ యొక్క ప్రతి యూనిట్ ధరలో హెచ్చుతగ్గులను సూచిస్తుంది. ఈ ధరల హెచ్చుతగ్గులకు కంపెనీల పనితీరు, ప్రభుత్వ విధానాలలో మార్పు, నియంత్రణ మార్పులు, ఆర్‌బిఐ పాలసీలు మొదలైనవి కారణం కావచ్చు. ఒక స్కీమ్ అత్యంత సముచిత విభాగానికి చెందితే, అది మరింత ప్రమాదకరమైనదిగా ఉంటుంది. ఉదాహరణకు, ఒక సెక్టోరల్ స్కీమ్, లార్జ్ క్యాప్ ఈక్విటీ స్కీమ్ కంటే ప్రమాదకరంగా ఉంటుంది. ఎందుకనగా, పోర్ట్‌ఫోలియో ఒక నిర్దిష్ట రంగానికే పరిమితం అయినప్పుడు ఇక్కడ డైవర్సిఫికేషన్ పరిధి అనేది, పెట్టుబడులను డైవర్సిఫై చేసే లార్జ్ క్యాప్ స్కీమ్ కంటే చాలా తక్కువగా ఉంటుంది.

లిక్విడిటీ రిస్క్ - ఇది స్కీమ్‌లో అసెట్స్ లిక్విడిటీ ఆప్షన్ లేనపుడు పెట్టుబడిని రీడీమ్ చేయడంలో తలెత్తే ఇబ్బందులను సూచిస్తుంది లేదా ఫండ్ తీర్చలేని ఒక స్కీమ్‌లో అకస్మాత్తు రిడెంప్షన్ కోసం డిమాండ్‌లు ఉన్నపుడు ఈ రిస్క్ తలెత్తుతుంది. ఇటువంటి పరిస్థితులలో ఫండ్ మేనేజర్ అసెట్స్‌ని త్వరగా కొనుగోలు చేయలేరు లేదా విక్రయించలేరు.

వడ్డీ రేటు రిస్క్- వడ్డీ రేటులో మార్పు లేదా మార్పు ఊహాగానాల ఆధారంగా బాండ్‌ల ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. ఈ రెండూ ప్రతికూల సంబంధం కలిగి ఉంటాయి, వడ్డీ రేటు పెరిగినప్పుడు, బాండ్ ధర పడిపోతుంది మరియు వడ్డీ రేటు తగ్గినప్పుడు, బాండ్ ధర పెరుగుతుంది. బాండ్‌ల ధరలో ఈ కదలిక, బాండ్‌లతో సంబంధం ఉన్న వడ్డీ రేటు రిస్కుకి కారణమవుతుంది, అలాగే బాండ్లలో పెట్టుబడి పెట్టబడిన మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లతో కూడి ఉంటుంది. డెట్ స్కీమ్ యొక్క మెచ్యూరిటీ వ్యవధి ఎక్కువగా ఉంటే, వడ్డీ రేటు రిస్క్ ఎక్కువగా మరియు మెచ్యూరిటీ వ్యవధి తక్కువగా ఉంటే, వడ్డీ రేటు రిస్క్ తక్కువగా ఉంటుంది.

క్రెడిట్ రిస్క్ - ఒక కంపెనీకి సంబంధించిన క్రెడిట్ రిస్క్ దాని డెట్/క్రెడిట్ తిరిగి చెల్లించగలిగే సంభావ్యతను నిర్వచిస్తుంది. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు వాటిని ఏఏఏ నుండి డి పరిధిలో రేట్ చేస్తాయి, ఇందులో ఏఏఏ అత్యధిక రేటింగ్‌ని సూచిస్తుంది, అనగా కంపెనీ రుణాన్ని తిరిగి చెల్లించే అధిక సంభావ్యతను సూచిస్తుంది మరియు అదేవిధంగా, డి అతి తక్కువ సంభావ్యతను సూచిస్తుంది. ఈ కంపెనీలలో పెట్టుబడి పెట్టే మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లు క్రెడిట్ రిస్క్‌కు లోనవుతాయి.

చివరగా-

ప్రతి రకంమ్యూచువల్ ఫండ్ స్కీమ్‌‌లో దానితో ముడిపడి ఉన్న అనేక రకాల రిస్కులను కలిగి ఉండవచ్చు; ఒక వ్యక్తిగా, వివిధ రకాలైన రిస్కుల పట్ల మీకు ఎంత సహనం ఉందోనని నిర్ణయించుకోవడం మీ ఇష్టం. స్కీమ్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్ (ఎస్ఐడి) ద్వారా స్కీమ్‌కు సంబంధించిన రిస్కులను మీరు అర్థం చేసుకోవచ్చు. దాని ఆధారంగా, మీరు మీ కస్టమైజ్డ్ అసెట్ కేటాయింపుతో ముందుకు సాగవచ్చు, మీ పెట్టుబడి లక్ష్యాలు, రిస్క్ సామర్థ్యానికి అనుగుణంగా ఉండే పోర్ట్‌ఫోలియోను నిర్మించవచ్చు.

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి, స్కీమ్ సంబంధిత అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి


యాప్‌ని పొందండి