సైన్ ఇన్ అవ్వండి

ఎన్ఐఎంఎఫ్ యొక్క కొన్ని స్కీములలో తాజా సబ్‌స్క్రిప్షన్ సస్పెన్షన్ కోసం, దయచేసి చూడండి సంబంధిత సమాచారం

మీ పెట్టుబడి ప్రవర్తనకు సవరణ అవసరం. దాని గురించి తెలుసుకుందాం.

మార్కెట్ లాభాలు అనేవి ప్రతి ఒక్కరికీ సమానంగా అందుబాటులో ఉన్నప్పుడు, ప్రతి రిటైల్ పెట్టుబడిదారు పొందిన లాభాలు ఎందుకు భిన్నంగా ఉంటాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దానికి సమాధానం మీ భావోద్వేగాలలో ఉంది. ఈక్విటీ పెట్టుబడులలో ఇది మరింత ప్రబలంగా ఉంటుంది ఎందుకంటే అవి పెట్టుబడిదారు భావోద్వేగాల ప్రకారం మారుతూ ఉంటాయి. మరింత సమాచారం తెలుసుకోవడానికి, ఈక్విటీ మార్కెట్లు ఎలా పని చేస్తాయో అర్థం చేసుకుందాం. ఒక ఈక్విటీ మార్కెట్ యొక్క దీర్ఘకాలిక లాభాలు అనేవి మీరు మీ డబ్బును పెట్టుబడి పెట్టిన కంపెనీల వృద్ధి, అలాగే ఆదాయాలపై ఆధారపడి ఉంటాయి. సులభమైన పదాలలో చెప్పాలంటే, మీరు వృద్ధిలోకి వస్తాయని అనుకునే కంపెనీలలో మీరు డబ్బును పెట్టుబడిగా పెడుతారు. ఆదాయం పెరుగుతున్నప్పుడు, షేర్ ధరలు పెరుగుతాయి, అలాగే లాభాలు ఎక్కువగా వస్తాయి. అయితే, స్వల్పకాలిక వ్యవధిలో, షేర్ ధరలు దాదాపుగా ప్రతి క్షణం హెచ్చుతగ్గులకు లోనవుతాయి, ఇది సెంటిమెంట్‌లో మార్పు వలన జరుగుతుంది. ఈ సమయంలో మీ లాభాలు మరొక పెట్టుబడిదారు నుండి భిన్నంగా ఉండవచ్చు; ఈ తరచుగా జరిగే మార్పులకు మీరు ఎలా ప్రతిస్పందిస్తారు అనే దానిపై సమాధానం ఆధారపడి ఉంటుంది. తరచుగా, మీరు ప్రత్యక్ష ఈక్విటీలో లేదా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతున్నారా అనే దానితో సంబంధం లేకుండా, ఈ ప్రతిస్పందనలు భావాల ద్వారా నడపబడతాయి.

ఇది కేవలం భారతీయ పరిస్థితి మాత్రమే కాదు. ఎస్&పి 500 (యుఎస్ స్టాక్ మార్కెట్ అత్యంత ఎక్కువగా అనుసరించబడే బెంచ్‌మార్కులలో ఒకటి) ద్వారా అందించబడిన లాభాలతో పోలిస్తే వ్యక్తిగత పెట్టుబడిదారులు సంపాదించిన లాభాల మధ్య వ్యత్యాసాన్ని డాల్బార్ అధ్యయనం తేటతెల్లం చేస్తుంది. రిపోర్ట్ ప్రకారం, డిసెంబర్ 2013లో ముగిసిన 30-సంవత్సరాల వ్యవధిలో సూచిక అందించిన లాభాలు 11.11%, అయితే అదే సమయంలో అదే వ్యవధి కోసం వ్యక్తిగత పెట్టుబడిదారు లాభాలు 3.69% మాత్రమే ఉన్నాయి. మార్కెట్ పరిస్థితులలో స్వల్పకాలిక మార్పుల కారణంగా పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టడం, అలాగే పెట్టుబడులను మధ్యలోనే ఉపసంహరించుకోవడం దీనికి కారణం.

గత కొన్ని సంవత్సరాలలో పెట్టుబడులలో ఎస్ఐపి భాగం గురించి ఎఎమ్ఎఫ్ఐ ద్వారా ప్రచురించిన (అసోసియేషన్ ఆఫ్ మ్యూచ్యువల్ ఫండ్స్ ఇండియా) కింది డేటాను పరిగణించండి-

SIP Contribution - NIMF

ఇప్పుడు మార్చి'20లో మార్కెట్‌ను తీవ్రంగా ప్రభావితం చేసిన మహమ్మారి గురించి చూద్దాం. మార్చి వరకు, ఎస్ఐపిలలో నిరంతరం పెట్టుబడులు పెరుగుతూ వచ్చాయి, ఆ సంప్రదాయం ఏప్రిల్ 2020 నుండి ఇటీవల వరకు గణనీయంగా తగ్గింది. అలా జరగడానికి కారణం మహమ్మారి ప్రపంచాన్ని కుదేలు చేసినప్పుడు, మార్కెట్ మారుతున్న భావన, పెరుగుతున్న భయాల కారణంగా క్రాష్ అయింది, ఇది పెట్టుబడిదారులు వారి ఎస్ఐపిలను నిలిపివేయడానికి దారితీసింది. మార్కెట్లు మళ్ళీ లాభాల పొందడం మొదలవ్వగానే, ఎస్ఐపి పెట్టుబడులు పెరిగాయి. ప్రాథమికంగా, ఎన్ఎవిలు (నికర ఆస్తి విలువ, అంటే మ్యూచువల్ ఫండ్ యొక్క ప్రతి-యూనిట్ ఖర్చు) తక్కువగా ఉన్నప్పుడు పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటారు. ఇది తెలివైన పెట్టుబడులు ప్రవర్తనకు వ్యతిరేకం.

ఈ ఎమోషనల్ పెట్టుబడిదారు ప్రవర్తనకు కారణం ఏమిటి?

మిస్ అవుతామోననే భయం (ఎఫ్ఒఎమ్ఒ)

పెట్టుబడిదారులు తరచుగా మార్కెట్లో జరిగే ప్రతి మార్పు పై ప్రతిస్పందించాలి అని భావిస్తారు; అలా చేయకపోతే వారు కొన్ని రకాల ప్రయోజనం లేదా డబ్బును కోల్పోతారని అనుకుంటారు. మనం పైన చూసినట్లుగా, ప్రతి మార్కెట్ స్వల్పకాలిక హెచ్చుతగ్గులకు ప్రతిస్పందించడం వలన మీరు లాభాలను కోల్పోవచ్చు.

హెర్డ్ మెంటాలిటీ

తమకు లాభాలు తెచ్చి పెట్టిన మ్యూచ్యువల్ ఫండ్ గురించి కొందరు సహచరులు/స్నేహితులు/కుటుంబ సభ్యుల నుండి మీరు తరచుగా విని ఉంటారు మరియు అందులో పెట్టుబడి చేయాలని అనుకుంటారు. మొదట, వారు మీ లాగానే సాధారణ వ్యక్తులు కావచ్చు, వారు పెట్టుబడి పెట్టడంలో నిపుణులు కూడా కాకపోవచ్చు అని తెలుసుకోండి. రెండవ విషయం ఏమిటంటే, వారికి మంచి ఫలితాలు ఇచ్చిన ఫండ్ మీకు మంచి లాభాలు ఇవ్వలేకపోవచ్చు, కాబట్టి ప్రతి ఒక్కరి పెట్టుబడి లక్ష్యాలు, రిస్క్ తీసుకునే నైజాం, అలాగే పెట్టుబడి ప్రయాణం ఒకేలా ఉండవు.

ప్రతిరోజూ ఫండ్ లేదా పెట్టుబడి పనితీరు గురించి ఆందోళన చెందడం

మార్కెట్ వార్తల ద్వారా ప్రభావితం అయ్యి, ప్రతి రోజు గొప్ప లాభాలను పొందడానికి లక్ష్యంగా పెట్టుకోవడం చాలా వరకు మనం చేసే సాధారణమైన తప్పు. అదొక మిథ్య లాంటిది, అది దాదాపుగా అసాధ్యమైన ఒక పరిస్థితి. కానీ మీరు అలా చేసే ప్రక్రియలో భాగంగా, మీరు నష్టాలను పొందుతారు, ఎందుకంటే మీరు తగిన సమయం ఒకే మ్యూచ్యువల్ ఫండ్లో పెట్టుబడులు పెట్టలేదు.

మార్కెట్ ఒడిదుడుకుల గురించి సరిగ్గా అర్థం చేసుకోకపోవడం

మహమ్మారికి మునుపు మార్కెట్ అనేక సార్లు పతనమైన సందర్భాలు ఉన్నాయి, అలాగే మీరు చరిత్రను గమనిస్తే అది ఎల్లప్పుడూ తిరిగి పైకి లేస్తుంది. ఇది ఒక చక్రీయ ప్రవర్తన. అందువల్ల, పూర్తిగా గత అనుభవం ఆధారంగా, మార్కెట్ తిరిగి కోలుకుంటుందనే విషయాన్ని తీసిపారవేయకూడదు.

లక్ష్యానికి సంబంధించి సరైన ప్రణాళిక లేకపోవడం

కొన్నిసార్లు, మీరు ఎందుకు పెట్టుబడి పెడుతున్నారో మీకు తెలియకపోవచ్చు. ఉదాహరణకు, పదవీవిరమణ కోసం పెట్టుబడి పెట్టడం ఒక దీర్ఘకాలిక లక్ష్యంగా ఉండవచ్చు, దీని కోసం మీరు కార్పస్ నిర్మించడానికి ఒక లక్ష్యంతో పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. కానీ లక్ష్యం స్పష్టంగా లేకపోతే, మీరు హఠాత్తుగా నిర్ణయాలు తీసుకుని దాని సమయానికి ముందే రిడీమ్ చేసుకోవచ్చు.

చివరగా-
పెట్టుబడి భయం లేదా ఉద్వేగాలకు సంబంధించింది కాదు; మీ విధానంలో ఆచరణాత్మకంగా పెట్టుబడి పెట్టడం అవసరమవుతుంది. కానీ ఉద్వేగాలను నివారించలేరని మేము అర్థం చేసుకున్నాము. అందువల్ల, మీరు ఉద్వేగాల ప్రభావాన్ని తగ్గించడానికి మీకు సహాయపడే ఒక వ్యవస్థను నిర్మించడం లక్ష్యంగా పెట్టుకోవాలి. ఒక ఆర్థిక సలహాదారు లేదా మ్యూచ్యువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ సహాయంతో పెట్టుబడి పెట్టడం వలన కొందరు పెట్టుబడిదారులు పెట్టుబడుల దీర్ఘకాలంపై దృష్టి పెట్టడంలో సహాయపడవచ్చు. మీ కోసం నియమాలను సెట్ చేయండి, వాటిని పాటిస్తూ ఉండండి. మీరు మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడంలో విజయవంతం కాకపోతే, ఎస్ఐపి (సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) ద్వారా పెట్టుబడి పెట్టండి, ఇది మార్కెట్ పెట్టుబడులకు అనుగుణంగా ఉండి మంచి లాభాలను అందిస్తుంది. ఎన్ఎవి తక్కువగా ఉన్నప్పుడు మరిన్ని యూనిట్లను కొనుగోలు చేయడం మరియు ఎన్ఎవి ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువగా కొనుగోలు చేయడంలో ఇది మీకు సహాయపడుతుంది.

మార్కెట్ మీకు అనుకూలంగా ఉందా లేదా వ్యతిరేకంగా ఉందా అనే విషయాలను పట్టించుకోకుండా మీ ఉద్వేగాలు మీ పెట్టుబడులను ప్రభావితం చేయనివ్వకండి. ఇతరులు చెప్పే మాటలు వినకుండా బాగా అధ్యయనం చేయడం ద్వారా నిర్ణయాలు తీసుకోకండి.




పైన పేర్కొన్న వివరణలు అర్థం చేసుకోవడానికి మాత్రమే, ఇది ఏదైనా పథకం యొక్క పనితీరుకు నేరుగా లేదా పరోక్షంగా సంబంధించినది కాదు. ఇక్కడ వ్యక్తం చేయబడిన వ్యూస్ కేవలం అభిప్రాయాలను మాత్రమే కలిగి ఉంటాయి మరియు రీడర్ అనుసరించదగిన ఏదైనా చర్య, ఏలాంటి మార్గదర్శకాలు లేదా సిఫారసులు కలిగి లేవు. ఈ సమాచారం సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు పాఠకుల కోసం ఒక ప్రొఫెషనల్ గైడ్‌గా ఉపయోగపడటానికి కాదు.

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి, స్కీమ్ సంబంధిత అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి


యాప్‌ని పొందండి