సైన్ ఇన్ అవ్వండి

ఎన్ఐఎంఎఫ్ యొక్క కొన్ని స్కీములలో తాజా సబ్‌స్క్రిప్షన్ సస్పెన్షన్ కోసం, దయచేసి చూడండి సంబంధిత సమాచారం

మ్యూచువల్ ఫండ్స్ ఉపయోగించి ఒక ఆర్థిక లక్ష్యం కోసం ఎలా ప్రణాళిక వేసుకోవాలి

శ్రీమతి శుక్లా భవిష్యత్తులో కొండ ప్రాంతాల్లో ఒక బంగ్లాను కొనాలనుకుంటున్నారు. మిస్టర్ చక్రవర్తి వ్యాపార నష్టాన్ని చవిచూశారు, దాని ఫలితంగా ఎలాంటి రిటైర్‌మెంట్ పొదుపులు చేయలేక పోయారు. శ్రీమతి టోప్పో కొత్త కారు కొనాలనుకుంటున్నారు, కానీ ఆమె వద్ద నిధుల కొరత ఉంది. ఈ వ్యక్తులందరికీ ఉమ్మడిగా ఒక గోల్ ప్లాన్ అవసరం, ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ సహాయపడవచ్చు.

గోల్ ప్లానర్‌ని ఎలా ఉపయోగించాలి?

మ్యూచువల్ ఫండ్స్ కోసం ఆన్‌లైన్ గోల్ ప్లానర్ ఇక్కడ గొప్పగా సహాయపడుతుంది. ఉదాహరణకు, నిప్పాన్ ఇండియా వారి రూపొందించిన గోల్ ప్లానింగ్ కాలిక్యులేటర్ విదేశాలలో సెలవుదినం, సంపద సృష్టి, కొత్త ఇల్లు కొనడం మరియు మరెన్నో భవిష్యత్తు లక్ష్యాల కోసం ప్లాన్ చేయడంలో మీకు సహాయపడుతుంది.

ముందుగా, మీరు మీ లక్ష్యం గురించి వివరంగా తెలుసుకోవాలి. స్మార్ట్ అనే ఈ గోల్ ప్లానర్ మెథడాలజీని ఫైనాన్షియల్ ప్లానింగ్ కోసం ఉపయోగించవచ్చు:

1 S – స్పెసిఫిక్: మీ ఆర్థిక లక్ష్యాలు నిర్దిష్టంగా మరియు పూర్తి వివరణను కలిగి ఉండాలి. ఉదాహరణకి, రాబోయే 15 సంవత్సరాలలో సెంట్రల్ నైనిటాల్‌లో ₹ 80 లక్షల విలువ కలిగిన ఒక బంగ్లాను కొనుగోలు చేయాలని మిసెస్ శుక్లా గారికి ఒక నిర్దిష్ట లక్ష్యం ఉంది.
2 M – మెజరబుల్: 'ఎంత' లేదా 'ఎన్ని' అనే దాని పరంగా మీ ఆర్థిక లక్ష్యాలను గురించి ఆలోచించండి.
3 A – అచీవబుల్: మీ లక్ష్యం సాధించదగినదిగా ఉండాలి మరియు మీ పెట్టుబడులు, మార్కెట్లు ఎలా పనిచేస్తాయనే వాస్తవికతకు అనుగుణంగా ఉండాలి.
4 R – రియలిస్టిక్: మీ ఆర్థిక లక్ష్యాలు వాస్తవికంగా ఉండాలి. మీరు చేసే పెట్టుబడులు ఆ లక్ష్యాన్ని సాధించడానికి తోడ్పడే విధంగా ఉండాలి.
5 T – టైమ్-బౌండ్: మీ గోల్ ప్లానర్ పద్ధతి తప్పనిసరిగా ప్రారంభ తేదీ మరియు టార్గెట్ తేదీని కలిగి ఉండాలి.

ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి మ్యూచువల్ ఫండ్స్‌ని ఎలా ఉపయోగించాలి?

పెట్టుబడిదారులు ఏకమొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టవచ్చు లేదా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (ఎస్ఐపి) సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు, ఇందులో ముందుగా నిర్ణయించిన మొత్తాన్ని క్రమానుగతంగా ప్రీఫిక్స్‌డ్ తేదీన ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. మ్యూచువల్ ఫండ్స్‌ని ఉపయోగించి మీ లక్ష్యాల కోసం ప్లాన్ చేయడానికి ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి:

లక్ష్యం - రిటైర్‌మెంట్ ప్లానింగ్

1 డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్:
డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ విభిన్నమైన పెట్టుబడుల ద్వారా లాంగ్ టర్మ్ క్యాపిటల్ అప్ప్రిసియేషన్‌ను సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఫండ్‌లు పెట్టుబడిని వివిధ రంగాల్లో పెడతాయి, తద్వారా రిస్క్ తగ్గుతుంది.
2 రిటైర్‌మెంట్ మ్యూచువల్ ఫండ్స్:
పెట్టుబడిదారులకు వారి రిటైర్‌మెంట్ తర్వాత రెగ్యులర్ ఆదాయ వనరులను సృష్టించడమే వీటి లక్ష్యం. రిటర్న్స్ నెలవారీ చెల్లింపుగా లేదా ఏకమొత్తంలో చెల్లించవచ్చు. అవి డెట్ లేదా ఈక్విటీ-ఆధారిత ఫండ్స్ కావచ్చు..
3 మిడ్-క్యాప్ ఫండ్స్:
మెరుగైన రిటర్న్స్ కోసం, మిడ్ క్యాప్ ఫండ్స్‌పై అవకాశం తీసుకోండి. లార్జ్ క్యాప్ ఫండ్స్ కంటే మెరుగైన రాబడుల సంభావ్యత కలిగిన స్మాల్ క్యాప్ ఫండ్స్ కంటే అవి తక్కువ రిస్కుని కలిగి ఉంటాయి. ప్రయోజనాలను పొందడం కోసం పెట్టుబడిదారులు దీర్ఘకాలంగా పెట్టుబడి పెట్టాలి.

లక్ష్యం - పిల్లల విద్య, వివాహం మొదలైనవి.

1 చిల్డ్రన్స్ మ్యూచువల్ ఫండ్:
ఈ ఫండ్‌లు పెట్టుబడిదారుల పిల్లలకు ఉన్నత విద్య, పెళ్లి వంటి భవిష్యత్తు జీవిత కార్యక్రమాలకు నిధులను సమకూర్చడమే లక్ష్యంగా ఉన్నాయి, ఇవి సొల్యూషన్ ఓరియెంటెడ్ ఫండ్‌లు మరియు ఎస్ఐడిలో నిర్వచించిన అసెట్ కేటాయింపు ప్రకారం ఈక్విటీ మరియు డెట్‌లో పెట్టుబడి పెట్టవచ్చు.
2 ఇండెక్స్ ఫండ్స్:
ఈ నిధుల పోర్ట్‌ఫోలియో సెన్సెక్స్ లేదా నిఫ్టీ వంటి మార్కెట్ సూచికను అనుకరిస్తుంది. ఈ నిధులు యాక్టీవ్‌గా నిర్వహించబడవు మరియు యాక్టీవ్‌గా నిర్వహించే నిధులతో పోలిస్తే తక్కువ ఎక్స్‌పెన్స్ రేషియోని కలిగి ఉంటాయి.

లక్ష్యం – ట్యాక్స్ సేవింగ్

1 ఇఎల్ఎస్ఎస్ ఫండ్స్:
ఈక్విటీ-లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఇఎల్ఎస్ఎస్) ఫండ్‌లు పన్ను మినహాయింపులకు అర్హత కలిగి ఉంటాయి. అవి దాదాపుగా 80% ఈక్విటీ మరియు ఈక్విటీ-సంబంధిత సాధనాలలో పెట్టుబడి పెడతాయి మరియు 3 సంవత్సరాల చట్టబద్ధమైన లాక్-ఇన్ వ్యవధిని కలిగి ఉంటాయి.

లక్ష్యం - రెగ్యులర్ ఆదాయం

1 సిస్టమాటిక్ విత్‍డ్రాయల్ ప్లాన్‌లు (ఎస్‌‌డబ్ల్యూపిలు):
ఇక్కడ ఒక నిర్ణీత మొత్తాన్ని ఫండ్ నుండి రీడీమ్ చేసి, ముందుగా నిర్ణయించిన తేదీలో కాలానుగుణంగా పెట్టుబడిదారునికి చెల్లించబడుతుంది. ఎస్‌డబ్ల్యూపిలు రెగ్యులర్ ఆదాయం/నగదు ప్రవాహాల కోసం చూస్తున్న ఎవరికైనా ఉపయోగపడుతుంది.

సంక్షిప్తంగా

మొదటి దశలో, పెట్టుబడిదారులు తమ ఆర్థిక లక్ష్యాలను గుర్తించాలి. అప్పుడు వారు తమ లక్ష్యాలను సాధించడంలో సహాయపడటానికి తగిన మ్యూచువల్ ఫండ్‌ను ఎంచుకోవడం కోసం గోల్ ప్లానర్ కాలిక్యులేటర్‌ని ఉపయోగించవచ్చు.

డిస్‌క్లెయిమర్: అజ్యూమ్డ్ రిటర్న్ రేటు ఆధారంగా గోల్ ప్లానింగ్ ఫలితాలు ఉంటాయి. ఒక వివరణాత్మక సూచన కోసం దయచేసి మీ ప్రొఫెషనల్ అడ్వైజర్‌ను సంప్రదించండి. ఈ లెక్కలు భవిష్యత్తులో డెట్ మరియు ఈక్విటీ మార్కెట్లు / సెక్టార్లు లేదా ఏదైనా వ్యక్తిగత భద్రత యొక్క భవిష్యత్తు రిటర్న్‌పై ఆధారపడి ఉండవు మరియు కనీస రాబడులు మరియు/లేదా క్యాపిటల్ రక్షణ కోసం హామీగా పరిగణించకూడదు. కాలిక్యులేటర్‌ని తయారుచేసేటప్పుడు అత్యంత జాగ్రత్తలు పాటించినప్పటికీ ఎన్ఐఎంఎఫ్, సమగ్రతకు లేదా చేసిన గణనలు దోషరహితమైనవి మరియు/లేదా ఖచ్చితమైనవి అనే దానికి హామీ ఇవ్వదు లేదా/మరియు కాలిక్యులేటర్‌పై ఆధారపడే ఏదైనా విషయంలో అనగా దాని వినియోగం వల్ల తలెత్తే అన్ని బాధ్యతలు, నష్టాలు మరియు డ్యామేజీలను అది నిరాకరిస్తుంది. ఉదాహరణలు అనేవి ఏదైనా భద్రత లేదా పెట్టుబడుల పనితీరును సూచించవు. పన్ను పరిణామాల యొక్క వ్యక్తిగత స్వభావాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రతి పెట్టుబడిదారుడు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు స్వయంగా ఒక వృత్తిపరమైన పన్ను/ ఆర్థిక సలహాదారుని సంప్రదించాల్సిందిగా సలహా ఇవ్వడం జరుగుతుంది.

పైన పేర్కొన్న వివరణలు కేవలం అర్థం చేసుకోవడానికి మాత్రమే, ఇది ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎన్ఐఎంఎఫ్ యొక్క ఏదైనా స్కీం పనితీరుకు సంబంధించినది కాదు. ఇక్కడ పేర్కొనబడిన విషయాలు కేవలం అభిప్రాయాలను మాత్రమే కలిగి ఉంటాయి మరియు రీడర్ అనుసరించదగిన ఏదైనా చర్య, ఎలాంటి మార్గదర్శకాలు లేదా సిఫారసులు కలిగి ఉండవు. ఈ సమాచారం సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు పాఠకుల కోసం ఒక ప్రొఫెషనల్ గైడ్‌గా ఉపయోగపడటానికి కాదు."

ఇక్కడ ఉన్న సమాచారం సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు పేర్కొన్న వివరణలు కేవలం అభిప్రాయాలను మాత్రమే సూచిస్తాయి, కావున వీటిని, పాఠకులకు మార్గదర్శకాలు, సిఫార్సులు లేదా నిపుణుల సలహాలుగా పరిగణించకూడదు. బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారం, అంతర్గతంగా అభివృద్ధి చేయబడిన డేటా మరియు ఇతర విశ్వసనీయమైన మూలాల ఆధారంగా ఈ డాక్యుమెంట్ తయారు చేయబడింది. స్పాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, ట్రస్టీ లేదా వారి డైరెక్టర్లు, ఉద్యోగులు, అనుబంధ సంస్థలు లేదా ప్రతినిధులు ("సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు") అటువంటి సమాచారం యొక్క ఖచ్చితత్వం, పరిపూర్ణత, సమగ్రత మరియు విశ్వసనీయతకు ఎలాంటి బాధ్యత వహించరు. ఈ సమాచారాన్ని స్వీకరించే వారు తమ సొంత విశ్లేషణ, వివరణలు మరియు పరిశోధనలపై ఆధారపడాలని సూచించడమైనది. తెలివైన పెట్టుబడి నిర్ణయం తీసుకోవడానికి, వృత్తిపరమైన నిపుణుల సలహా తీసుకోవాలని పాఠకులకు సలహా ఇవ్వడమైనది. ఈ మెటీరియల్ తయారీ లేదా జారీలో భాగంగా ఉన్న వ్యక్తులతో సహా సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు, ఈ మెటీరియల్‌లో ఉన్న సమాచారం ఆధారంగా పొందిన లాభాలు, నష్టాలతో సహా ఏదైనా ప్రత్యక్ష, పరోక్ష, ప్రత్యేక, అనుకోని, పర్యవసాన, శిక్షణాత్మక లేదా దండనాత్మక నష్టాలకు బాధ్యత వహించవు. ఈ డాక్యుమెంట్ ఆధారంగా తీసుకునే ఏ నిర్ణయానికైనా స్వీకర్త మాత్రమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది.

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి, స్కీమ్ సంబంధిత అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి


యాప్‌ని పొందండి