సైన్ ఇన్ అవ్వండి

ఎన్ఐఎంఎఫ్ యొక్క కొన్ని స్కీములలో తాజా సబ్‌స్క్రిప్షన్ సస్పెన్షన్ కోసం, దయచేసి చూడండి సంబంధిత సమాచారం

మ్యూచువల్ ఫండ్స్‌తో మీ రిటైర్‌మెంట్‌ని ఎలా ప్లాన్ చేసుకోవాలి

మనమందరం జీవితంలో ముందుగా లేదా తరువాతనో రిటైర్‌మెంట్ గురించి ఆలోచిస్తాము. అయితే, పనిచేసే యుక్త వయస్సులో మనం దానిని తేలికగా తీసుకోవచ్చు, కానీ జీవిత పరిస్థితులు ఖచ్చితంగా తిరిగి ఆ ప్రశ్నను మనముందు ఉంచుతాయి మరియు మనల్ని ఆందోళనకు గురిచేస్తాయి. ఖచ్చితంగా, ఇప్పుడున్న పరిస్థితులలో మన జీవనశైలికి ఒక సురక్షితమైన రేపటి దినం అవసరం, ఆదాయ ప్రవాహం క్రమంగా మందగింపును చూపిస్తున్నపుడు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం రాబోయే ఖర్చులను ఎదుర్కోవడాన్ని కఠినతరం చేయవచ్చు. ఖచ్చితంగా, రిటైర్‌మెంట్ కోసం ప్లాన్ చేయడం అనేది ఒక ముఖ్యమైన ఆర్థిక లక్ష్యం మరియు ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీరు మీ రిటైర్‌మెంట్‌ని మ్యూచువల్ ఫండ్స్‌తో ప్లాన్ చేసుకోవచ్చు.

మ్యూచువల్ ఫండ్‌లతో మీ రిటైర్‌మెంట్ ప్లాన్‌ను మరింత ముందుకు తీసుకెళ్లడానికి, ఒక పెట్టుబడిదారుగా మీరు, రిటైర్‌మెంట్ ప్లాన్‌ ఎలా పనిచేస్తుందనే దానిపై ఒక అవలోకనాన్ని కలిగి ఉండటం చాలా అవసరం. ఇవన్నీ మీరు యుక్త వయస్సులో ఉండి, తక్కువ బాధ్యతలను మరియు ఎక్కువ రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పుడే అంటే ప్రారంభ దశలలోనే ఫండ్‌లను పెట్టుబడిగా పెట్టడం ద్వారా మొదలవుతాయి. క్రమంగా అది ఫండ్స్ నిర్వహణకు దారితీస్తుంది, అలాగే, మీకు చాలా అవసరమైనపుడు చెల్లింపు మరియు ఉపసంహరించుకునే ఎంపికను కూడా ఇస్తుంది. మ్యూచువల్ ఫండ్స్కూడా, రిటైర్‌మెంట్ ప్లాన్‌లను లక్ష్యంగా చేసుకున్నప్పుడు అదే మార్గాన్ని అనుసరిస్తుంది.

సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్
మీ జీవితంలో ప్రారంభదశలోనే రిటైర్‌మెంట్ ప్లాన్ లక్ష్యంతో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లను(ఎస్ఐపి) ప్రారంభించడం మీ రిటైర్‌మెంట్ ప్లాన్ కొరకు మొదటి అడుగు. ఎస్ఐపి ద్వారా మీరు క్రమంతప్పకుండా నిర్ణీత మొత్తాన్ని కాలానుగుణ వ్యవధిలో పెట్టుబడి పెట్టవచ్చు మరియు సమ్మేళనం శక్తి ద్వారా కొంత కాలానికి మెరుగైన ప్రయోజనాలను లక్ష్యంగా పెట్టుకోవచ్చు. కానీ, మీ రిటైర్‌మెంట్‌ని మ్యూచువల్ ఫండ్స్‌తో ప్లాన్ చేయడానికి ముందు, అందుబాటులో ఉన్న ఫండ్‌ రకాలను మీరు అర్థం చేసుకోవాలి. అలాగే మీ అవసరాలు, రిస్క్ సామర్థ్యం, పెట్టుబడి వ్యవధి మొదలైన వాటి ఆధారంగా తగిన ఫండ్ రకాన్ని ఎంచుకోవాలి. రిటైర్‌మెంట్ ప్లాన్‌కు ఉత్తమంగా సరిపోయే ఫండ్ రకాలు:

డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్
విభిన్న రకాల ఈక్విటీ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం ఈ స్కీమ్‌ అగ్రెసివ్‌గా ఉంటుంది. ఇది మీకు అధిక రాబడిని పొందే అవకాశం ఇస్తుంది, కానీ రిస్కుతో కూడుకున్నది. ఈక్విటీలు లాంగ్‌ రన్‌లో బాగా పనిచేస్తాయి మరియు మీరు చిన్న వయస్సులోనే పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే మంచి ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌ పొందుతారు.

థీమాటిక్/సెక్టార్ ఫండ్స్
ఈ ఫండ్స్ మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్న రంగానికి మరింత నిర్దిష్టంగా ఉంటాయి మరియు అధిక రిస్క్‌తో కూడుకున్నవి. అగ్రెసివ్ పెట్టుబడిదారులకు సరైనవి, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, వెరీ స్మాల్ క్యాప్ స్టాక్స్ కోసం ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఫండ్‌లు ఆర్థిక పారామితులకు సున్నితంగా ఉంటాయి మరియు ప్రతి సంవత్సరం పనితీరులో కొత్తవి ఉంటాయి.

అసెట్ కేటాయింపు నిధులు
దేశీయ మరియు విదేశీ స్టాక్స్ మరియు బాండ్‌లు, ప్రభుత్వ సెక్యూరిటీలు, గోల్డ్ బులియన్ మరియు రియల్ ఎస్టేట్ స్టాక్‌లతో సహా అనేక రకాల పెట్టుబడుల మధ్య తన పోర్ట్‌ఫోలియోను విస్తరించే ఫండ్. ఈ ఫండ్స్‌లో కొన్ని, వేర్వేరు రంగాల మధ్య కేటాయించిన నిష్పత్తులను సాపేక్షంగా స్థిరంగా ఉంచుతాయి, మరికొన్ని మార్కెట్ పరిస్థితులు మారినప్పుడు మిశ్రమాన్ని మారుస్తాయి.

ఇఎల్‌ఎస్‌ఎస్ ఫండ్స్
ఇది లాంగ్ టర్మ్ మరియు ట్యాక్స్ సేవింగ్ పెట్టుబడులు రెండింటికీ అత్యంత అనుకూలమైన స్కీమ్. ఇవి కూడా డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్ అందిస్తాయి, కానీ కేవలం మూడు సంవత్సరాల లాక్-ఇన్ వ్యవధిని కలిగి ఉంటాయి మరియు పన్ను మినహాయింపుకు అర్హతగలవి. కావున, డివిడెండ్‌లు మరియు క్యాపిటల్ గెయిన్స్ రెండూ కూడా సెక్షన్ 80C కింద పన్ను-మినహాయింపుతో వస్తాయి. అలాగే ఈక్విటీతో లింక్ చేయబడినది కావున, ట్యాక్స్ సేవింగ్ బెనిఫిట్‌తో మెరుగైన రిటర్న్స్ అందిస్తాయి.




సిఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్, దీనిలో మీరు నియమిత కాల వ్యవధిలో నిర్ధిష్ట మొత్తాన్ని క్రమం తప్పకుండా పెట్టుబడిగా పెట్టవచ్చు మరియు కాంపౌండింగ్ పవర్ ద్వారా కొంత కాలానికి మెరుగైన లాభాలను పొందవచ్చు.

ఇక్కడ ఉన్న సమాచారం సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు పేర్కొన్న వివరణలు కేవలం అభిప్రాయాలను మాత్రమే సూచిస్తాయి, కావున వీటిని, పాఠకులకు మార్గదర్శకాలు, సిఫార్సులు లేదా నిపుణుల సలహాలుగా పరిగణించకూడదు. బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారం, అంతర్గతంగా అభివృద్ధి చేయబడిన డేటా మరియు ఇతర విశ్వసనీయమైన మూలాల ఆధారంగా ఈ డాక్యుమెంట్ తయారు చేయబడింది. స్పాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, ట్రస్టీ లేదా వారి డైరెక్టర్లు, ఉద్యోగులు, అనుబంధ సంస్థలు లేదా ప్రతినిధులు ("సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు") అటువంటి సమాచారం యొక్క ఖచ్చితత్వం, పరిపూర్ణత, సమగ్రత మరియు విశ్వసనీయతకు ఎలాంటి బాధ్యత వహించరు. ఈ సమాచారాన్ని స్వీకరించే వారు తమ సొంత విశ్లేషణ, వివరణలు మరియు పరిశోధనలపై ఆధారపడాలని సూచించడమైనది. తెలివైన పెట్టుబడి నిర్ణయం తీసుకోవడానికి, వృత్తిపరమైన నిపుణుల సలహా తీసుకోవాలని పాఠకులకు సలహా ఇవ్వడమైనది. ఈ మెటీరియల్ తయారీ లేదా జారీలో భాగంగా ఉన్న వ్యక్తులతో సహా సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు, ఈ మెటీరియల్‌లో ఉన్న సమాచారం ఆధారంగా పొందిన లాభాలు, నష్టాలతో సహా ఏదైనా ప్రత్యక్ష, పరోక్ష, ప్రత్యేక, అనుకోని, పర్యవసాన, శిక్షణాత్మక లేదా దండనాత్మక నష్టాలకు బాధ్యత వహించవు. ఈ డాక్యుమెంట్ ఆధారంగా తీసుకునే ఏ నిర్ణయానికైనా స్వీకర్త మాత్రమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది.

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి, స్కీమ్ సంబంధిత అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి.


యాప్‌ని పొందండి