సైన్ ఇన్ అవ్వండి

ఎన్ఐఎంఎఫ్ యొక్క కొన్ని స్కీములలో తాజా సబ్‌స్క్రిప్షన్ సస్పెన్షన్ కోసం, దయచేసి చూడండి సంబంధిత సమాచారం

గోల్డ్ ఎక్స్‌చేంజ్ ట్రేడ్ ఫండ్స్ గురించి సమాచారం మరియు సమీక్ష

ఎక్స్‌చేంజ్ ట్రేడ్ ఫండ్స్ (ఇటిఎఫ్‌ లు) అనేవి ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్, ఇవి సాధారణ స్టాక్స్ వలె స్టాక్ ఎక్స్‌చేంజ్ పై లిస్ట్ చేయబడతాయి మరియు ట్రేడ్ చేయబడతాయి. ఇటిఎఫ్‌ లలో

స్టాక్స్, బాండ్స్ మరియు కమోడిటీలు ఉంటాయి, ఇవి పాసివ్‌గా మేనేజ్ చేయబడతాయి మరియు ఒక ట్రేడింగ్ రోజున వాటి ఎన్ఎవి విలువకు దగ్గరలో ట్రేడ్ చేయబడతాయి. వీటి ధర తక్కువగా ఉంటుంది మరియు పన్నులు కూడా తక్కువగా చెల్లించవలసి ఉంటుంది. ఒక రోజులో ఇటిఎఫ్‌ లలో ధర మార్పు చాలా తరచుగా జరుగుతుంది మరియు ఇవి క్రమం తప్పకుండా ట్రేడ్ అవుతాయి, అందువల్ల వీటి లిక్విడిటీ అధికంగా ఉండడమే కాక ఎక్స్‌చేంజ్‌లో అత్యధికంగా ట్రేడ్ అయ్యే ప్రోడక్టులలో ఒకటిగా నిలిచింది. ప్రాథమికంగా ఒక ఇటిఎఫ్‌‌లో స్టాక్స్, బాండ్స్, విదేశీ కరెన్సీ మొదలైన అనేక అసెట్స్ ఉంటాయి, మరియు ఆ అసెట్స్ షేర్ల లాగా విభజించబడి ఉంటాయి. షేర్‌హోల్డర్లు ఈ అసెట్స్‌కి పరోక్ష యజమానులు అవుతారు. అదే సమయంలో ఇటిఎఫ్‌ షేర్‌హోల్డర్లు వడ్డీ లేదా డివిడెండ్ల రూపంలో లాభాలను ఆర్జిస్తారు, ఒక సారి ఫండ్ లిక్విడేట్ అయిన తరువాత, వారు దాని విలువకు తగ్గ ప్రతిఫలం పొందుతారు. ఇవి పబ్లిక్ స్టాక్ ఎక్స్‌చేంజీలలో ట్రేడ్ అవుతాయి కనుక ఈ ఫండ్లను సులభంగా ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు.

గోల్డ్ ఎక్స్‌చేంజ్ ట్రేడ్ ఫండ్స్ (ఇటిఎఫ్‌లు) అంటే ఏమిటి?

గోల్డ్ ఇటిఎఫ్‌‌ల ద్వారా ఒక పెట్టుబడిదారు గోల్డ్ బులియన్ మార్కెట్లో భాగం అవ్వచ్చు. బంగారం యొక్క భౌతిక డెలివరీ లేకుండా పెట్టుబడి చేసిన డబ్బుతో, బంగారాన్ని పేపర్లలోకి మార్చుకోవచ్చు. ఒక షేర్ లాగా, ఒక జిఇటిఎఫ్ యూనిట్‌ని స్టాక్ ఎక్స్‌చేంజీలో కొనుగోలు చేయవచ్చు లేదా విక్రయించవచ్చు, దీని యూనిట్ ధర 1 కి సమానంగా లేదా కొన్ని సార్లు కేటాయింపు తేదీన అర గ్రాము బంగారం ధరకి సమానంగా ఉంటుంది, ఇది స్పష్టంగా మరియు తగిన విధంగా పేర్కొనబడుతుంది. జిఇటిఎఫ్ ల యొక్క విలువ నేరుగా బంగారం ధరల ఆధారంగా ఉంటుంది; అందుకనే బంగారం ధరలు పెరిగినప్పుడు, ఇటిఎఫ్ విలువ కూడా పెరుగుతుంది మరియు అదే విధంగా బంగారం ధర తగ్గినప్పుడు జిఇటిఎఫ్ ల విలువ కూడా తగ్గుతుంది.

అవి ఎలా పనిచేస్తాయి?

కేటాయింపు సమయంలో ప్రతి గ్రామ్ బంగారం ధర ఆధారంగా, ఒక పెట్టుబడిదారుగా మీరు జిఇటిఎఫ్‌ లలో పెట్టుబడి చేయాలని అనుకున్న మొత్తం పై మీకు కేటాయించబడే యూనిట్ల సంఖ్య ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మీ పూర్తి ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ ₹ 20,000 అయితే, మరియు కేటాయింపు తేదీన ఒక గ్రామ్ బంగారం ధర ₹ 1000 అయితే, మీరు పొందే యూనిట్ల సంఖ్య 20.

గోల్డ్ ఇటిఎఫ్‌ లలో పెట్టుబడి చేయడం వలన కలిగే ప్రయోజనాలు మరియు ఇతర కారణాలు

  • ఒక స్టాక్ లాగా స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో సులభంగా ట్రేడ్ చేయవచ్చు
  • డీమ్యాట్ అకౌంట్ ద్వారా సౌకర్యవంతమైన మరియు వేగవంతమైన డీలింగ్
  • పోర్ట్‌ఫోలియోకు వైవిధ్యాన్ని అందించే ఒక గ్లోబల్ అసెట్‌ని ఎలక్ట్రానిక్ రూపంలో పోర్ట్‌ఫోలియోలో కలిగి ఉండడం
  • పారదర్శకమైన ధర

పెట్టుబడిదారులకు ఏమి కావాలి?

గోల్డ్ ఇటిఎఫ్‌‌ లలో పెట్టుబడిదారులలో పెట్టుబడి చేయడానికి స్టాక్ ఎక్స్‌చేంజ్ బ్రోకర్ వద్ద ఒక డీమ్యాట్ అకౌంట్ మరియు ట్రేడింగ్ అకౌంట్ కలిగి ఉండాలి.

ట్యాక్స్ ట్రీట్‌మెంట్

జిఇటిఎఫ్ లు మ్యూచువల్ ఫండ్స్లాగా పరిగణించబడతాయి మరియు నాన్-ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ నియమాల ఆధారంగా పన్ను విధించబడుతుంది. అయితే నాన్-ఈక్విటీ పన్ను చట్టాల ప్రకారం, పెట్టుబడిదారులు రిడెంప్షన్ తర్వాత చెల్లించవలసి ఉంటుంది, కానీ గోల్డ్ ఇటిఎఫ్ కోసం పన్ను రిడెంప్షన్ భౌతిక బంగారం కోసం వర్తించే పన్ను నియమాలకు సమానంగా ఉంటుంది.

డిస్‌క్లెయిమర్లు
ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు వ్యక్తం చేయబడుతున్న ఉద్దేశాలు కేవలం అభిప్రాయాలను మాత్రమే కలిగి ఉంటాయి. అందువల్ల వీటిని పాఠకుల కోసం మార్గదర్శకాలు లేదా సిఫార్సులు లేదా ప్రొఫెషనల్ గైడ్‌గా పరిగణించకూడదు. పరిశ్రమ మరియు మార్కెట్లకు సంబంధించిన నిర్దిష్ట వాస్తవిక మరియు గణాంక సమాచారం (చారిత్రాత్మకమైన మరియు అంచనా వేయబడిన) స్వతంత్ర థర్డ్ పార్టీ వనరుల నుండి సేకరించబడింది, ఇవి విశ్వసనీయమైనవిగా పరిగణించబడ్డాయి. ఎన్ఎఎం ఇండియా (రిలయన్స్ నిప్పాన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్) అటువంటి సమాచారం లేదా డేటా యొక్క ఖచ్చితత్వం లేదా ప్రామాణికతను, లేదా అటువంటి డేటా మరియు సమాచారం ప్రాసెస్ చేయబడిన లేదా అంచనా వేయబడిన ఊహల యొక్క సహేతుకతను స్వతంత్రంగా ధృవీకరించలేదు; ఎన్ఎఎం ఇండియా (గతంలో రిలయన్స్ నిప్పాన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ అని పేర్కొనబడేది) అటువంటి డేటా మరియు సమాచారం యొక్క ఖచ్చితత్వం లేదా ప్రామాణికతకు ఏ విధంగానూ హామీ ఇవ్వదు. ఈ మెటీరియల్స్‌లో ఉన్న కొన్ని స్టేట్‌మెంట్‌లు మరియు వాదనలు ఎన్ఎఎం ఇండియా యొక్క (గతంలో రిలయన్స్ నిప్పాన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ అని పేర్కొనబడేది) ఉద్దేశాలు లేదా అభిప్రాయాలను ప్రతిబింబిస్తాయి, ఇవి అటువంటి డేటా లేదా సమాచారం ఆధారంగా ఏర్పడి ఉండవచ్చు.

ఏవైనా పెట్టుబడులు పెట్టడానికి ముందు, ఒక వ్యక్తిగత నిపుణుడి సలహా తీసుకోవాల్సిందిగా పాఠకులకు సూచించడమైనది, ఒక తెలివైన పెట్టుబడి నిర్ణయం తీసుకోవడానికి విషయాలను ధృవీకరించుకోవాలి. స్పాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, ట్రస్టీ, వారి సంబంధిత డైరెక్టర్లు, ఉద్యోగులు, అనుబంధ సంస్థలు లేదా ప్రతినిధులు ఎవరూ కూడా ఈ మెటీరియల్‌లో ఉన్న సమాచారం కారణంగా ఉత్పన్నమయ్యే నష్టాలకు ప్రత్యక్ష, పరోక్ష, ప్రత్యేక, యాదృచ్ఛిక, పర్యవసాన, శిక్షణాత్మక లేదా దండనాత్మక నష్టాలకు ఏ విధంగానూ బాధ్యత వహించరు.

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి, స్కీమ్ సంబంధిత అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి.

​​

యాప్‌ని పొందండి