సైన్ ఇన్ అవ్వండి

ఎన్ఐఎంఎఫ్ యొక్క కొన్ని స్కీములలో తాజా సబ్‌స్క్రిప్షన్ సస్పెన్షన్ కోసం, దయచేసి చూడండి సంబంధిత సమాచారం

మ్యూచువల్ ఫండ్స్ మరియు ఎన్ఏవి - గురించిన కొంత సమాచారాన్ని తెలుసుకోండి

సారాంశం: భారతదేశంలో మ్యూచువల్ ఫండ్స్ అత్యంత ప్రజాదరణ పొందుతున్నాయి మరియు దాని గురించి మరింత పరిజ్ఞానంతో ప్రజల పెట్టుబడిలో ముఖ్యమైన భాగం అవుతుంది. అవును, ఇది రిస్క్‌తో కూడుకున్నది, అయితే, రిస్క్ లేకుండా లాభం పొందడం కూడా అసాధ్యం. కావున, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి, వివిధ రకాల మ్యూచువల్ ఫండ్‌లు మరియు ఎన్ఏవి అంటే ఏమిటి? అనే విషయాలను స్పష్టంగా అర్థం చేసుకోవడం ఎంత ముఖ్యమో త్వరగా తెలుసుకోండి. ఇంకా మీ ఫండ్స్‌ని స్వయంగా నిర్వహించడం మీకు ఖచ్చితంగా తెలియకపోతే, మీ ఫండ్ మేనేజర్‌పై ఆధారపడండి లేదా ఒక విశ్వసనీయ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీని సంప్రదించండి.

భారతదేశంలో మ్యూచువల్ ఫండ్స్ గత కొన్ని సంవత్సరాలలో చాలా ప్రజాదరణ పొందింది. అయితే, నేటికీ అర్థం చేసుకోవడంలో కొందరికి క్లిష్టమైన కాన్సెప్ట్‌గా మిగిలింది, పెట్టుబడి చేయడానికి రిస్కుతో కూడుకున్నది. కానీ వారి మాటల్లో: 'రిస్క్ లేకపోతే, లాభం లేదు'. అవును! ఇక్కడ కొంత రిస్క్ ఉంది, కానీ అదనపు డబ్బును సురక్షితంగా ఉంచడానికి ఇతర ప్రత్యామ్నాయం ఏదైనా ఉందా? మరి, మీరు దానిని వృద్ధి చేయడానికి ఎందుకు ప్రయత్నించకూడదు? ఇంకా, ఒకవేళ మీరు ఒక భారీ మొత్తాన్ని సంపాదిస్తున్నట్లయితే, ట్యాక్స్ ఎలా ఆదా చేస్తారు? అలాగని, మీరు ఎఫ్‌డి ల కోసం మాత్రమే వెళ్లే వారు కాదు. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఒక్కటే, మ్యూచువల్ ఫండ్‌లలో పెట్టుబడి పెట్టడం. కానీ, మీరు ఇది చేయడానికి ముందుగా, దాని ప్రాథమిక అంశాలను అర్థం చేసుకోవాలి. కావున, దీనిని సరళీకృతం చేయడానికి, మీరు 5 మంది స్నేహితుల బృందం అని అనుకుందాం, ప్రతి ఒక్కరూ కొంత మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టాలని కోరుకుంటారు. ఆ ఫండ్ కోసం ఒక లక్ష్యాన్ని కూడా సెట్ చేసుకుంటారు మరియు మీ ఫండ్ రాబోయే 3 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలంలో కొంత శాతం వరకు పెరుగుతుందని నిర్ధారించుకోవాలనుకుంటారు. మీలో ప్రతి ఒక్కరూ సంపాదించాలనుకునే మొత్తం భిన్నంగా ఉంటుంది, కానీ దానిని ఉపయోగించడానికి ఉత్తమమైన మార్గం ఏమిటో మీలో ఎవరికీ తెలియదు.

కాబట్టి, ఈ విషయాలన్నింటినీ క్రమబద్ధీకరించడానికి, ముందుగా, మీరు సమకూర్చుకున్న నిధులను మ్యూచువల్ ఫండ్స్ అని పిలుస్తారు మరియు దానిని పెట్టుబడిగా పెట్టడానికి, మ్యూచువల్ ఫండ్ మేనేజర్ అని పిలువబడే ఒక నిపుణుడు నియమించబడతారు. అతను/ఆమె సెక్యూరిటీల మార్కెట్ విలువపై ఉన్న వారి అమితమైన పరిజ్ఞానంతో స్కీమ్ లక్ష్యానికి అనుగుణంగా పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోను నిర్మిస్తారు. అయితే, ఇప్పటివరకూ సేకరించిన నిధులన్నింటినీ, కేవలం ఒక సెక్టార్‌లో మాత్రమే పెట్టడం మూర్ఖంగా ఉంటుంది. కాబట్టి, తాజా ట్రెండ్‌లను అంచనా వేసిన తర్వాత మీ ఫండ్ మేనేజర్ మీ నిధులను వివిధ రంగాలకు కేటాయిస్తారు, ఉ.దా: ఐటి, ఇన్ఫ్రా, టెలికామ్, హెల్త్‌కేర్ మొదలైన రంగాలు. అయితే, అన్ని రంగాలు లేదా స్టాక్‌లు ఒకే దిశలో లేదా ఒకే నిష్పత్తిలో ఒక నిర్ధిష్ట సమయంలో ముందుకు సాగవు కాబట్టి, రిస్కులు నియంత్రించబడతాయని నిర్ధారించడంలో ఇది సహాయపడుతుంది. అలాగే, నిధుల విభజన అనేది మొత్తం నిధిని సమతుల్యం చేస్తుంది. ఇక్కడ వివిధ రకాల మ్యూచువల్ ఫండ్‌లు ఉన్నాయి, పెట్టుబడి లక్ష్యం ప్రకారం అవి ప్రధాన పెట్టుబడిగా వర్గీకరించబడ్డాయి, ఇందులో 4 ప్రధాన వర్గాలు ఉన్నాయి అవి బాండ్లు లేదా స్థిర ఆదాయ నిధులు, స్టాక్ లేదా ఈక్విటీ ఫండ్స్ , మనీ మార్కెట్ ఫండ్స్ మరియు హైబ్రిడ్ ఫండ్స్.

ఇప్పుడు వివరించదగిన తదుపరి విషయం ఏమిటంటే, మీ 5 మంది స్నేహితులలో ప్రతి ఒక్కరికి ఎన్ని యూనిట్‌ల కోసం అర్హత ఉంటుంది మరియు వారి ఎన్ఏవి (నికర అసెట్ వాల్యూ) ఎంత? మొదట్లో మీలో ప్రతి ఒక్కరూ వివిధ మొత్తంలో డబ్బును పెట్టుబడిగా పెట్టాలనుకుంటారు. దీని ఆధారంగా ప్రతి పెట్టుబడిదారుడు మ్యూచువల్ ఫండ్‌లో కొంత మొత్తంలో యూనిట్లను పొందుతారు, తద్వారా మీ 5 మంది స్నేహితుల బృందంలోని అందరూ యూనిట్ హోల్డర్లు అని పిలువబడతారు. అయితే ఇప్పుడు, ఒక స్కీములో డబ్బును పెట్టుబడిగా పెట్టిన తరువాత, మీ 5 మంది స్నేహితులలో ప్రతి ఒక్కరికి యూనిట్‌లు కేటాయించబడతాయి. ప్రతి యూనిట్ విలువ ఎన్ఏవి గా పిలువబడుతుంది, ఇది సింగిల్ యూనిట్‌ యొక్క ప్రస్తుత మార్కెట్ విలువను ప్రతిబింబిస్తుంది. ఒక పెట్టుబడిదారుడు ఒక ఫండ్‌లో పెట్టుబడి పెట్టినపుడు, వారు వాస్తవానికి ఎన్ఏవి ధర వద్ద మ్యూచువల్ ఫండ్ యూనిట్‌లను కొనుగోలు చేస్తారు. ఇప్పుడు స్పష్టంగా, ఒక పెట్టుబడిదారుడు ఎన్ని యూనిట్‌లను కొనుగోలు చేయవచ్చు అనేది మరియు ప్రతి యూనిట్ యొక్క ఎన్ఏవి అనేది మొత్తం పెట్టుబడి మీద ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా, స్కీమ్ యొక్క సెక్యూరిటీల ప్రస్తుత మార్కెట్ విలువ ఆధారంగా ప్రతి ఒక యూనిట్‌కు ఎన్ఏవి లెక్కించబడుతుంది. కాబట్టి, ఒక యూనిట్‌కి ఎన్‌ఏవి ని స్కీమ్ యొక్క సెక్యూరిటీల మార్కెట్ వాల్యూ నుండి పూర్తి పునరావృత ఖర్చులని తీసివేసి, ఆ మొత్తాన్ని ఒక నిర్ధిష్ట తేదీన స్కీమ్ యూక పూర్తి యూనిట్ల సంఖ్యతో భాగించి లెక్కించాలి. అలాగే, సెక్యూరిటీల మార్కెట్ విలువ ప్రతిరోజూ మారుతుంది కాబట్టి, స్కీమ్ యొక్క ఎన్ఏవి కూడా మారుతుంది.

ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటో మీకు తెలుసు మరియు మ్యూచువల్ ఫండ్ ఎన్ఏవి అంటే ఏమిటో మీకు తెలుసుఅలాగే మీకు ఏ స్కీమ్ సరిపోతుందో కూడా మీరు తెలుసుకోవాలి, దీని కోసం మీరు, మీ స్కీమ్ సంబంధిత డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి

డిస్‌క్లెయిమర్లు
ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు వ్యక్తం చేయబడుతున్న ఉద్దేశాలు కేవలం అభిప్రాయాలను మాత్రమే కలిగి ఉంటాయి. అందువల్ల వీటిని పాఠకుల కోసం మార్గదర్శకాలు లేదా సిఫార్సులు లేదా ప్రొఫెషనల్ గైడ్‌గా పరిగణించకూడదు. పరిశ్రమ మరియు మార్కెట్లకు సంబంధించిన నిర్దిష్ట వాస్తవిక మరియు గణాంక సమాచారం (చారిత్రాత్మకమైన మరియు అంచనా వేయబడిన) స్వతంత్ర థర్డ్ పార్టీ వనరుల నుండి సేకరించబడింది, ఇవి విశ్వసనీయమైనవిగా పరిగణించబడ్డాయి. ఎన్ఎఎం ఇండియా (రిలయన్స్ నిప్పాన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్) అటువంటి సమాచారం లేదా డేటా యొక్క ఖచ్చితత్వం లేదా ప్రామాణికతను, లేదా అటువంటి డేటా మరియు సమాచారం ప్రాసెస్ చేయబడిన లేదా అంచనా వేయబడిన ఊహల యొక్క సహేతుకతను స్వతంత్రంగా ధృవీకరించలేదు; ఎన్ఎఎం ఇండియా (గతంలో రిలయన్స్ నిప్పాన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ అని పేర్కొనబడేది) అటువంటి డేటా మరియు సమాచారం యొక్క ఖచ్చితత్వం లేదా ప్రామాణికతకు ఏ విధంగానూ హామీ ఇవ్వదు. ఈ మెటీరియల్స్‌లో ఉన్న కొన్ని స్టేట్‌మెంట్‌లు మరియు వాదనలు ఎన్ఎఎం ఇండియా యొక్క (గతంలో రిలయన్స్ నిప్పాన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ అని పేర్కొనబడేది) ఉద్దేశాలు లేదా అభిప్రాయాలను ప్రతిబింబిస్తాయి, ఇవి అటువంటి డేటా లేదా సమాచారం ఆధారంగా ఏర్పడి ఉండవచ్చు.

ఏవైనా పెట్టుబడులు పెట్టడానికి ముందు, ఒక వ్యక్తిగత నిపుణుడి సలహా తీసుకోవాల్సిందిగా పాఠకులకు సూచించడమైనది, ఒక తెలివైన పెట్టుబడి నిర్ణయం తీసుకోవడానికి విషయాలను ధృవీకరించుకోవాలి. స్పాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, ట్రస్టీ, వారి సంబంధిత డైరెక్టర్లు, ఉద్యోగులు, అనుబంధ సంస్థలు లేదా ప్రతినిధులు ఎవరూ కూడా ఈ మెటీరియల్‌లో ఉన్న సమాచారం కారణంగా ఉత్పన్నమయ్యే నష్టాలకు ప్రత్యక్ష, పరోక్ష, ప్రత్యేక, యాదృచ్ఛిక, పర్యవసాన, శిక్షణాత్మక లేదా దండనాత్మక నష్టాలకు ఏ విధంగానూ బాధ్యత వహించరు.

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి, స్కీమ్ సంబంధిత అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి.

​​

యాప్‌ని పొందండి