సైన్ ఇన్ అవ్వండి

ప్రియమైన పెట్టుబడిదారు, BCP డ్రిల్ కారణంగా 19 ఏప్రిల్ 2024 09:00 AM నుండి 20 ఏప్రిల్ 2024 06:00 PM వరకు మా డిజిటల్ ఆస్తులపై (వెబ్‌సైట్ మరియు యాప్స్) లావాదేవీ చేసేటప్పుడు మీరు మధ్యంతర సమస్యలను ఎదుర్కుంటారని దయచేసి గమనించండి. కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము. మీ ప్రోత్సాహకానికి ధన్యవాదాలు - నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ (ఎన్ఐఎంఎఫ్)

ఆధునిక పెట్టుబడి ఆప్షన్‌లు మరియు సాంప్రదాయ పెట్టుబడి ఆప్షన్ల మధ్య భేదాలు

చాలా మంది భారతీయ పెట్టుబడిదారులు ఇప్పటికీ, మునుపటి కాలంలో పనిచేసిన అదే సాంప్రదాయ పెట్టుబడి ఎంపికలను ఎంచుకుంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా తగ్గుతున్న వడ్డీ రేటు, ఈ పెట్టుబడిదారులలో కొంత మందిని మ్యూచువల్ ఫండ్స్ వైపు నడిపించింది. కానీ, ఇటీవల వడ్డీ రేట్ల పెంపు మరియు ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లపై దాని ప్రభావం తర్వాత, ఇప్పుడు చాలా మంది పెట్టుబడిదారులు పెట్టుబడి ఎంపిక కోసం సాంప్రదాయ పెట్టుబడులు బాగుంటాయా అని ప్రశ్నిస్తున్నారు?



సాంప్రదాయ పెట్టుబడులు పెట్టుబడిదారులకు ప్రియమైనవి, ఎందుకనగా అవి భద్రత మరియు సౌకర్యాన్ని అందిస్తాయి. కానీ, అవి కూడా ప్రధానంగా మరియు తరచుగా నిర్లక్ష్యం చేయబడినవి, దుష్ప్రభావాలు ఉంటాయి; ఇది సంపద యొక్క అతితక్కువ వృద్ధిని సూచిస్తుంది.

పన్ను: మీరు అత్యధిక పన్ను పరిధిలోకి వస్తే, అనగా 30 శాతంలోకి వస్తే మరియు సాంప్రదాయ పద్ధతి పై మేము 7 శాతం వడ్డీ రేటును ఊహించినట్లయితే, మీరు పొందే రాబడి కేవలం 4.8 శాతంగా ఉంటుంది

ద్రవ్యోల్బణం: ద్రవ్యోల్బణం అనగా ధరలు పెరుగుతున్న రేటు. తాజా గణాంకాలను తీసుకుంటే, ద్రవ్యోల్బణం రేటు భారతదేశంలో 5 శాతంగా ఉంది. అంటే ప్రతి సంవత్సరం, డబ్బు దాని విలువను 5 శాతం కోల్పోతుంది. అనగా, పన్నుతో సహా సాంప్రదాయ పెట్టుబడులపై 4.8 శాతం రాబడితో మనం, ద్రవ్యోల్బణంను పరిగణనలోకి తీసుకుంటే నెగటివ్ రియల్ రిటర్న్స్ పొందుతాము.

మూలం: భారత ప్రభుత్వం గణాంకాలు మరియు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ కేంద్ర గణాంకాల కార్యాలయం



పన్ను ప్రయోజనాల వ్యక్తిగత స్వభావాన్ని దృష్టిలో పెట్టుకుని పెట్టుబడిదారులు తమ పన్ను సలహాదారుని సంప్రదించాలని సూచించడమైనది.

లాక్డ్-ఇన్: మీరు ప్రీ మెచ్యూర్ విత్‌డ్రా పై జరిమానా విధించే (అనేక ఉదంతాలలో) సాంప్రదాయ పెట్టుబడిలో పెట్టుబడి పెడితే , అత్యవసర పరిస్థితుల్లో మీకు డబ్బు అవసరమైనపుడు మీరు తదుపరి క్యాపిటల్‌ను కోల్పోవచ్చు.

సరికొత్త ఎంపికలను ఎంచుకోండి: ఇతర ఎంపికలను అన్వేషించడానికి మరియు సాంప్రదాయ పెట్టుబడులకు మించి వెళ్లడానికి ఇది సమయం.



డెట్ మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్‌లు) అనేవి భద్రత మరియు సౌకర్యంతో పాటు ద్రవ్యోల్బణం కోసం సర్దుబాటు చేసిన రాబడులను కోరుకునే పెట్టుబడిదారులకు మెరుగైన ఎంపిక. ఈ ఫండ్స్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయవు; బదులుగా, అవి బాండ్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు మొదలైన సురక్షితమైన అసెట్స్‌లో పెట్టుబడి పెడతాయి మరియు ఇవి అధిక రేటింగ్ కలిగిన ఫండ్‌లు. ఇక్కడ మీరు డెట్ ఫండ్స్‌ను ఎందుకు పరిగణించాలి అనేది ఇక్కడ ఇవ్వబడింది:

ట్యాక్స్-పరంగా ఉత్తమం: డెట్ ఫండ్‌లు 3 సంవత్సరాలకు పైగా ఉంచినట్లయితే పన్ను ప్రభావం తక్కువగా ఉంటుంది; వాటిపై వచ్చే లాభాలను లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌గా పరిగణిస్తారు మరియు ఇండెక్సేషన్ తర్వాత వాటిపై 20 శాతం పన్ను విధించబడుతుంది. ఇండెక్సేషన్ పెట్టుబడి సమయంలోని ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకున్నందున, సముపార్జన ధర పెరుగుతుంది మరియు ఇది తక్కువ పన్నులకు దారితీస్తుంది.

అన్ని రకాల వడ్డీ రేట్లకి అనుకూలంగా ఉంటుంది: డెట్ ఫండ్‌లు అన్ని వడ్డీ రేట్ల ఆవరణలో అనుకూలంగా ఉంటాయి, ఎందుకనగా, ఆన్ గోయింగ్ ప్రాతిపదికన అనేక ఫండ్‌లు అధిక వడ్డీ రేటును నిర్వహించడానికి ప్రయత్నిస్తాయి. కావున, ప్రస్తుత వడ్డీ రేటు దృష్ట్యా అవి వాటి వద్ద ఉన్న ఇన్‌స్ట్రుమెంట్‌లను సర్దుబాటు చేయవచ్చు.

ప్రొఫెషనల్ ఫండ్ మానేజ్మెంట్: ఒక డెట్ మ్యూచువల్ ఫండ్‌తో మీరు బాండ్స్ మరియు సెక్యూరిటీలను ఎంచుకోవచ్చు; మీరు ఒక ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ నైపుణ్యం యొక్క ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు.



కావున, మీరు చూస్తున్నట్లు, వివిధ సాంప్రదాయ పెట్టుబడి ఎంపికలు మిమ్మల్ని స్థిరమైన వడ్డీ రేటుతో లాక్ చేయవచ్చు, ఇది పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుంది మరియు నిరర్ధకమైనది. అదనంగా, పెరుగుతున్న ద్రవ్యోల్బణం సమయంలో, ద్రవ్యోల్బణం మరియు పన్నుల తరువాత మీకు మిగిలే వడ్డీ ఆదాయం చాలా తక్కువ.

బదులుగా, మీరు పన్ను ప్రయోజనం కలిగిన మరియు ద్రవ్యోల్బణంతో పోరాడగలిగే డెట్ ఫండ్స్ కోసం ఎంచుకోవచ్చు, ఇవి మీకు మెరుగైన ద్రవ్యోల్బణం, సర్దుబాటు చేయబడిన రిటర్న్స్ అందిస్తాయి.

మరింత తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.



మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి, స్కీమ్ సంబంధిత అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి.

​​

యాప్‌ని పొందండి