సైన్ ఇన్ అవ్వండి

ఎన్ఐఎంఎఫ్ యొక్క కొన్ని స్కీములలో తాజా సబ్‌స్క్రిప్షన్ సస్పెన్షన్ కోసం, దయచేసి చూడండి సంబంధిత సమాచారం

మ్యూచువల్ ఫండ్‌లు మరియు ఎన్ఎవి అంటే ఏమిటి?

పెట్టుబడులను పరిశీలిస్తున్నప్పుడు, ప్రజలు సాధారణంగా మ్యూచువల్ ఫండ్స్‌గురించి సందేహాస్పదంగా ఉంటారు, ఎందుకనగా వారు మ్యూచువల్ ఫండ్స్‌ను అర్థం చేసుకోవడాన్ని, నిర్వహించడాన్ని క్లిష్టంగా భావిస్తారు. ఆర్ధిక పరిభాషను పక్కన పెడితే, మ్యూచువల్ ఫండ్ అనేది ఒకే విధంగా ఆలోచించే పెట్టుబడిదారులందరూ కలిసి కూడబెట్టిన నిధుల మొత్తం. అయితే పెట్టుబడిదారుల కాంట్రిబ్యూషన్స్ మొత్తాన్ని ఫండ్ మేనేజర్లు నిర్వహిస్తారు, వీరు మార్కెట్లతో కొనసాగుతూనే, వివిధ రకాల ఆర్థిక సాధనాలలో పెట్టుబడి పెడుతూ వారి నైపుణ్యతను ప్రదర్శిస్తారు.

ఇప్పుడు ఈ పెట్టుబడిదారులకు ఉమ్మడి ఆర్థిక లక్ష్యం, ఆధారం ఉంది, అలాగే వారి ఫండ్స్‌ని ఈ లక్ష్యాలకు సరిపోయే స్కీమ్‌లో పెట్టారు. ఈ ఫండ్స్ సాధారణంగా బాగా వైవిధ్యభరితంగా ఉంటాయి, విభిన్న స్టాక్స్, బాండ్లు, స్వల్ప కాల మనీ మార్కెట్ ఇన్‌స్ట్రుమెంట్స్ ‌ మరియు కమోడీటీలలో పెట్టుబడులు పెడతాయి. ఈ విధంగా మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు ఆకర్షణీయమైన పొదుపు మార్గాన్ని అందిస్తాయి, ఇవి చాలా పాసివ్‌గా నిర్వహించబడతాయి, ఎక్కువ శ్రద్ధ వహించకుండానే, ప్రతిరోజూ నిపుణులచే ఈ డబ్బు నిర్వహించబడుతుంది.

ఫండ్స్ రకాలను ఎంచుకునేటప్పుడు, పెట్టుబడిదారుడు మొదట పెట్టుబడి మొత్తం, పెట్టుబడి వ్యవధి, రిస్క్ తీసుకునే సామర్థ్యంపై స్పష్టంగా ఉండాలి. దీని కోసం మీరు అందుబాటులో ఉన్న వివిధ ఆప్షన్‌ల గురించి పూర్తిగా తెలుసుకోవడం అవసరం. కావున, మ్యూచువల్ ఫండ్స్ మూడు ప్రాథమిక వర్గాలు:

  • డెట్ ఫండ్స్
  • ఈక్విటీ
  • లిక్విడ్/ హైబ్రిడ్ ఫండ్స్

డెట్ ఫండ్స్, పేరు సూచించినట్లుగా ఇది రుణాలపై పని చేస్తుంది. చాలా వరకు ఈ ఫండ్స్‌పైనే చాలా కంపెనీలు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కూడా పనిచేస్తాయి. Tబిల్స్, డిబెంచర్లు మొదలైన అనేక డెట్ సాధనాలని ఆఫర్ చేస్తాయి. డెట్ ఫండ్స్ వ్యవధి ముగిసిన తర్వాత రిటర్న్స్ సమయంలో ప్రిన్సిపల్ మొత్తానికి హామీ ఇస్తాయి మరియు వడ్డీ కూడా ఇచ్చిన వడ్డీ రేటుపై లెక్కించబడుతుంది. ఈ డెట్ ఫండ్స్ పెట్టుబడి పోర్ట్‌ఫోలియోకు స్థిరత్వాన్ని తెస్తాయి ఎందుకనగా ఇందులో వీటి కన్నా రిస్క్ తక్కువగా ఉంటుంది:‌ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్.

ఈక్విటీ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టినప్పుడు, మీరు అందించిన పెట్టుబడి మేరకు మీరు ఒక కంపెనీ యజమానిలాగా ఉంటారు. ఈ ఫండ్స్‌లోని లాభం, నష్టం, వాటి పనితీరు మిమ్మల్ని ప్రత్యక్షంగా ఎలా ప్రభావితం చేస్తాయోనని ఇది స్పష్టంగా వివరిస్తుంది. అధిక రిస్క్ ఉన్నందున, రిటర్న్స్ యొక్క సంభావ్యత కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే, లాంగ్ టర్మ్‌లో ద్రవ్యోల్బణం, స్వల్పకాలంలో మార్కెట్ హెచ్చుతగ్గుల పట్ల జాగ్రత్త వహించాలి.

లిక్విడ్ ఫండ్స్ అనేవి అత్యంత లిక్విడిటీ కలిగిన అసెట్స్, వీటిని డబ్బుతో పోల్చవచ్చు. పెట్టుబడిదారుడికి తిరిగి అందుబాటులో ఉండేలా సిద్ధంగా ఉండటం వలన, ఇవి తక్కువ రిస్కుని కలిగి ఉంటాయి మరియు ఇవి అందించే రిటర్న్స్ సేవింగ్ అకౌంట్ కన్నా కొంచెం ఎక్కువగా ఉంటాయి. హైబ్రిడ్ ఫండ్స్ అనేవి పేరు సూచించినట్లుగా, పోర్ట్‌ఫోలియోలో డెట్, ఈక్విటీల కలయికను కలిగి ఉంటాయి. ఈక్విటీ, డెట్‌ల కలయికను బట్టి, హైబ్రిడ్ ఫండ్‌లు చాలా విభిన్నంగా ఉంటాయి.

మీరు మీ ఫండ్స్‌ని విత్ డ్రా చేసుకున్నప్పుడు, అవి నెట్ అసెట్ వాల్యూ (ఎన్ఎవి) ఆధారంగా చెల్లించబడతాయి. ఎన్ఎవి, షేర్ ధర లాంటిది, ఇది ఫండ్‌లోని ప్రతి యూనిట్ యొక్క మార్కెట్ విలువను సూచిస్తుంది లేదా పెట్టుబడిదారుల యూనిట్‌లను కొనుగోలు చేయగల లేదా విక్రయించగల ధరను సూచిస్తుంది. ఇది ఒక నిర్దిష్ట రోజున షేర్లు, సెక్యూరిటీలు, బాండ్ల సంయుక్త మార్కెట్ విలువ ఆధారంగా లెక్కించబడుతుంది.

డిస్‌క్లెయిమర్లు
ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు వ్యక్తం చేయబడుతున్న ఉద్దేశాలు కేవలం అభిప్రాయాలను మాత్రమే కలిగి ఉంటాయి. అందువల్ల వీటిని పాఠకుల కోసం మార్గదర్శకాలు లేదా సిఫార్సులు లేదా ప్రొఫెషనల్ గైడ్‌గా పరిగణించకూడదు. పరిశ్రమ మరియు మార్కెట్లకు సంబంధించిన నిర్దిష్ట వాస్తవిక మరియు గణాంక సమాచారం (చారిత్రాత్మకమైన మరియు అంచనా వేయబడిన) స్వతంత్ర థర్డ్ పార్టీ వనరుల నుండి సేకరించబడింది, ఇవి విశ్వసనీయమైనవిగా పరిగణించబడ్డాయి. ఎన్ఎఎం ఇండియా (రిలయన్స్ నిప్పాన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్) అటువంటి సమాచారం లేదా డేటా యొక్క ఖచ్చితత్వం లేదా ప్రామాణికతను, లేదా అటువంటి డేటా మరియు సమాచారం ప్రాసెస్ చేయబడిన లేదా అంచనా వేయబడిన ఊహల యొక్క సహేతుకతను స్వతంత్రంగా ధృవీకరించలేదు; ఎన్ఎఎం ఇండియా (గతంలో రిలయన్స్ నిప్పాన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ అని పేర్కొనబడేది) అటువంటి డేటా మరియు సమాచారం యొక్క ఖచ్చితత్వం లేదా ప్రామాణికతకు ఏ విధంగానూ హామీ ఇవ్వదు. ఈ మెటీరియల్స్‌లో ఉన్న కొన్ని స్టేట్‌మెంట్‌లు మరియు వాదనలు ఎన్ఎఎం ఇండియా యొక్క (గతంలో రిలయన్స్ నిప్పాన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ అని పేర్కొనబడేది) ఉద్దేశాలు లేదా అభిప్రాయాలను ప్రతిబింబిస్తాయి, ఇవి అటువంటి డేటా లేదా సమాచారం ఆధారంగా ఏర్పడి ఉండవచ్చు.

ఏవైనా పెట్టుబడులు పెట్టడానికి ముందు, ఒక వ్యక్తిగత నిపుణుడి సలహా తీసుకోవాల్సిందిగా పాఠకులకు సూచించడమైనది, ఒక తెలివైన పెట్టుబడి నిర్ణయం తీసుకోవడానికి విషయాలను ధృవీకరించుకోవాలి. స్పాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, ట్రస్టీ, వారి సంబంధిత డైరెక్టర్లు, ఉద్యోగులు, అనుబంధ సంస్థలు లేదా ప్రతినిధులు ఎవరూ కూడా ఈ మెటీరియల్‌లో ఉన్న సమాచారం కారణంగా ఉత్పన్నమయ్యే నష్టాలకు ప్రత్యక్ష, పరోక్ష, ప్రత్యేక, యాదృచ్ఛిక, పర్యవసాన, శిక్షణాత్మక లేదా దండనాత్మక నష్టాలకు ఏ విధంగానూ బాధ్యత వహించరు.

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి, స్కీమ్ సంబంధిత అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి.

​​

యాప్‌ని పొందండి