మీరు మ్యూచువల్ ఫండ్స్ అన్నింటిలో స్టాక్స్/ఈక్విటీ ఉంటాయి అని అనుకుంటే, అలా అనుకునే చాలా మందిలో మీరు ఒకరు! ఇది సాధారణంగా ఉన్న అభిప్రాయం కావచ్చు, కానీ మ్యూచువల్ ఫండ్లలో ఈక్విటీ మాత్రమే కాకుండా అనేకం ఉంటాయి. వీటిలో ప్రతి పెట్టుబడిదారు అవసరాలకు తగినవి ఉంటాయి, వాటిలో డెట్ మ్యూచువల్ ఫండ్స్ ప్రముఖమైనవి.
డెట్ మ్యూచువల్ ఫండ్స్ రాబడులను పొందే లక్ష్యంతో మీ డబ్బును బాండ్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు మరియు ట్రెజరీ బిల్లులు వంటి స్థిరమైన ఆదాయ సాధనాలలో పెట్టుబడి పెడతాయి. ఇందులో మీరు కార్పొరేట్లు లేదా ప్రభుత్వానికి డబ్బును అప్పుగా ఇస్తారు మరియు వాటి పై రుణం పొందుతారు. రుణం ఇవ్వడం అనే ఈ ప్రక్రియలో, రుణగ్రహీత రుణదాతకు ఒక బాండ్ జారీ చేస్తారు. డెట్ మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్స్ మరియు డెట్ ఫండ్స్ ఎలా పనిచేస్తాయో వివరంగా అర్థం చేసుకుందాం.