సైన్ ఇన్ అవ్వండి

ఎన్ఐఎంఎఫ్ యొక్క కొన్ని స్కీములలో తాజా సబ్‌స్క్రిప్షన్ సస్పెన్షన్ కోసం, దయచేసి చూడండి సంబంధిత సమాచారం

కంటెంట్ ఎడిటర్

డెట్ ఫండ్స్‌కు సంబంధించిన రిస్కులు ఏమిటి?

డెట్ ఫండ్స్‌లో రిస్క్ అతి తక్కువగా ఉంటుంది అని మీరు విని ఉంటారు, కానీ అది నిజం కాదు. ఏదైనా పెట్టుబడి పూర్తిగా రిస్క్ లేకుండా ఉంటుందా? మేము దానిని సందేహిస్తాము. రిస్క్ స్థాయి మరియు స్వభావం మాత్రమే మారుతుంది. ఒక పెట్టుబడి స్టాక్స్‌లో చేయనంత మాత్రాన అందులో రిస్క్ ఉండదు అని కాదు. ఈక్విటీలతో పోలిస్తే డెట్ ఫండ్స్‌లో రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది. ఈ రిస్కులను అర్థం చేసుకోవడానికి, డెట్ ఫండ్స్ పనితీరును అర్థం చేసుకుందాం.

డెట్ మ్యూచువల్ ఫండ్స్‌తో రిస్కులు ఎందుకు సంబంధించినవి?

మీరు ఒక డెట్ ఫండ్ యూనిట్ కొనుగోలు చేసినప్పుడు, ఇది మీరు ప్రభుత్వం లేదా కార్పొరేట్‌కు రుణం ఇచ్చినట్లు సూచిస్తుంది. ఎలాగో ఇక్కడ ఉంది. ఈ సంస్థలకు డబ్బు అవసరమైనప్పుడు, వారు స్థిరమైన మెచ్యూరిటీ వ్యవధి మరియు స్థిర వడ్డీ రేటుతో బాండ్లు మరియు ఇతర స్థిర-ఆదాయ సాధనాలను జారీ చేస్తారు. ఈ సెక్యూరిటీలను మీలాంటి పెట్టుబడిదారులు కొనుగోలు చేస్తారు మరియు మీరు చెల్లించే డబ్బును ఈ సంస్థలు తమ స్వల్ప లేదా దీర్ఘకాలిక ద్రవ్య అవసరాలను తీర్చడానికి ఉపయోగిస్తాయి.

ఈ బాండ్‌లు మెచ్యూరిటీ వరకు ఉంచబడతాయి లేదా ఫండ్ మేనేజర్ నిర్ణయం ప్రకారం ఫండ్ యొక్క పెట్టుబడి లక్ష్యానికి అనుగుణంగా మార్కెట్లో ట్రేడ్ చేయబడతాయి. ఇప్పుడు, ఏదైనా ఇతర రుణాలు/అప్పులు తీసుకునే ట్రాన్సాక్షన్ లాగా, ఒక డెట్ ఫండ్ కొనుగోలు కూడా రిస్కులను కలిగి ఉండవచ్చు. ఎందుకంటే, ఇది మార్కెట్లో ట్రేడ్ చేయబడుతున్న వడ్డీ అందించే సెక్యూరిటీ. డెట్ ఫండ్స్, వడ్డీ రేటు హెచ్చుతగ్గులు, పైన పేర్కొన్న సంస్థలు రుణాలను తిరిగి చెల్లించలేకపోవడం లేదా సెక్యూరిటీలు కొనుగోలు/అమ్మడం కోసం మార్కెట్‌లో లిక్విడిటీని కోల్పోతాయి. కారకాలు చాలా ఉండవచ్చు, కానీ పెట్టుబడిదారుడిగా మీరు చూడవలసినది ఏమిటంటే, రిస్క్-రివార్డ్ నిష్పత్తి మీ కోసం పని చేస్తుందా, అంటే డెట్ ఫండ్స్ రిస్క్‌కి తగినట్లుగా మీకు రాబడి ఉందా. అలాగే, అది మీ రిస్క్ తీసుకునే సామర్థ్యానికి సరిపోలాలి.

డెట్ ఫండ్స్ యొక్క రిస్కులు ఏమిటి?

వడ్డీ రేటు రిస్క్

ఈ రిస్క్ మార్కెట్లో వడ్డీ రేటు మరియు బాండ్ ధర మధ్య ప్రతికూల సహసంబంధం కారణంగా ఉంటుంది. వడ్డీ రేటు పెరిగినప్పుడు, ధర తగ్గుతుంది మరియు వడ్డీ రేటు తగ్గినప్పుడు, ధర పెరుగుతుంది. ఇది బాండ్ మెచ్యూరిటీ వ్యవధిపై కూడా ఆధారపడి ఉంటుంది. మెచ్యూరిటీ వ్యవధి ఎక్కువగా ఉంటే, మీ బాండ్‌కు వడ్డీ రేటులో హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల, తక్కువ వ్యవధి గల డెట్ ఫండ్స్ అనేవి తక్కువ రిస్క్ డెట్ మ్యూచువల్ ఫండ్స్‌గా పరిగణించబడతాయి.

ఉదాహరణకు, మీరు 10 సంవత్సరాల మెచ్యూరిటీ ఉన్న మరియు 10% వడ్డీని అందించే బాండ్‌లో పెట్టుబడి పెట్టారని అనుకుందాం. ఇప్పుడు మీరు దానిలో ₹10,000 పెట్టుబడి పెడితే, సాధారణంగా మీరు ప్రతి సంవత్సరం చివరిలో 10 సంవత్సరాల వరకు ₹1000 అందుకుంటారు మరియు గత సంవత్సరంలో, మీరు మీ అసలు మొత్తం ₹10,000 ను తిరిగి పొందుతారు. బాండ్‌లు ఈ విధంగా పని చేస్తాయి. కానీ ఇప్పుడు, 8% కు తగ్గుతున్న వడ్డీ రేటును పరిగణించండి. ఇప్పుడు, మీ బాండ్ 10% అధిక వడ్డీ రేటును అందిస్తుంది కాబట్టి దాని కోసం డిమాండ్ పెరుగుతుంది మరియు అందువల్ల బాండ్ ధర కూడా పెరుగుతుంది. ఈ సందర్భంలో, అదే సంఖ్యలో బాండ్‌లను కొనుగోలు చేయడానికి మీరు మరింత ఖర్చు చేయాలి. మీ సెక్యూరిటీలు నిరంతరం ట్రేడ్ చేయబడుతున్నందున మార్కెట్లో వడ్డీ రేటు హెచ్చుతగ్గుల పరంగా మీరు ఎదుర్కొంటున్న రిస్క్ ఇది

క్రెడిట్ రిస్క్

మీ డబ్బును మరొకరికి మీరు అప్పుగా ఇస్తున్నారు అని మరచిపోకండి. ఎందుకంటే, వారు ఆ డబ్బును తిరిగి ఇవ్వకుండా ఉండే అవకాశం కూడా ఉంది. మీరు రుణం అందిస్తున్న సంస్థ యొక్క క్రెడిట్ రీపేమెంట్ సామర్థ్యానికి సంబంధించిన ఈ రిస్కును క్రెడిట్ రిస్క్ అని పేర్కొంటారు. ఈ సామర్థ్యాన్ని 'క్రెడిట్ రేటింగ్' అనే కొలమానంతో నిర్ణయిస్తాయి మరియు ఈ సామర్థ్యాన్ని కొలవడానికి క్రిసిల్, ఐసిఆర్ఎ మొదలైన క్రెడిట్ రేటింగ్ సంస్థలు ఉన్నాయి. క్రెడిట్ రేటింగ్ ఎక్కువగా ఉంటే, చెల్లించే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది మరియు మీ పెట్టుబడి సురక్షితంగా ఉంటుంది. క్రెడిట్ రేటింగ్లను మెరుగ్గా అర్థం చేసుకోండి Here

ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, క్రెడిట్ రేటింగ్‌లు కూడా కాలం గడిచే కొద్దీ మారవచ్చు. ఇలా జరిగితే, ఫండ్ మేనేజర్ కలిగి ఉన్న డెట్ సెక్యూరిటీల విలువ కూడా తగ్గుతుంది మరియు అది ఫండ్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

లిక్విడిటీ రిస్క్

మీ మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియోలో ఉన్న సెక్యూరిటీలు తరచుగా ట్రేడ్ చేయబడకపోతే లేదా వాటి డిమాండ్ తక్కువగా ఉంటే, అప్పుడు ఈ సెక్యూరిటీలను వాటి మెచ్యూరిటీకి ముందే విక్రయించాలనే ఉద్దేశ్యం ఉంటే ఫండ్ మేనేజర్ వీటిని నష్టానికి విక్రయించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది.

ఈ రిస్కులకు మీ అప్రోచ్ ఏమిటి?

మీరు డెట్ ఫండ్స్‌లో పెట్టుబడి చేయడం ఆపివేయాలా? అస్సలు కానే కాదు! అంటే, అవి మీ పెట్టుబడి లక్ష్యాలకు అనుగుణంగా ఉంటే ఈ రిస్కుల సంభావ్యత మీరు పొందే రాబడిలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. ఇంకా, ఏదైనా రకమైన పెట్టుబడిలో మీరు చేపట్టే రిస్క్ లెక్కించబడాలి. ఉదాహరణకు, డెట్ మ్యూచువల్ ఫండ్స్ కంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ చాలా ప్రమాదకరమని చాలా మంది పెట్టుబడిదారులకు తెలుసు అయితే ప్రతి ఒక్కరూ గతంలో పెట్టుబడి పెట్టడం మానేశారా? లేదు. ఎందుకంటే రిస్క్ పెరగడం వల్ల రాబడి పెరిగే అవకాశం కూడా ఉంటుంది.

మీరు డెట్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు పొందగల ప్రయోజనాలను పరిశీలిస్తే, అవి డెట్ ఫండ్స్ రిస్క్‌ను అధిగమించవచ్చు. ఉదాహరణకు, వాటి లిక్విడిటీ వంటి డెట్ ఫండ్స్ ఫీచర్లు, డెట్ ఫండ్స్‌పై దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్ పన్నుపై ఇండెక్సేషన్ ప్రయోజనం, ఈక్విటీతో పోలిస్తే సాపేక్షంగా స్థిరమైన రాబడిని ఉత్పత్తి చేయగల సామర్థ్యం లేదా మీరు పెట్టుబడి పెట్టడానికి అందుబాటులో లేని మార్కెట్‌లో పెట్టుబడి పెట్టగల అవకాశం కూడా- పరిగణించదగిన ఎంపికలు! డెట్ మ్యూచువల్ ఫండ్స్ ప్రయోజనాల గురించి మరింత తెలుసుకోండి Here

ఇక్కడ ఉన్న సమాచారం సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు పేర్కొన్న వివరణలు కేవలం అభిప్రాయాలను మాత్రమే సూచిస్తాయి, కావున వీటిని, పాఠకులకు మార్గదర్శకాలు, సిఫార్సులు లేదా నిపుణుల సలహాలుగా పరిగణించకూడదు. బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారం, అంతర్గతంగా అభివృద్ధి చేయబడిన డేటా మరియు ఇతర విశ్వసనీయమైన మూలాల ఆధారంగా ఈ డాక్యుమెంట్ తయారు చేయబడింది. స్పాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, ట్రస్టీ లేదా వారి డైరెక్టర్లు, ఉద్యోగులు, అనుబంధ సంస్థలు లేదా ప్రతినిధులు ("సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు") అటువంటి సమాచారం యొక్క ఖచ్చితత్వం, పరిపూర్ణత, సమగ్రత మరియు విశ్వసనీయతకు ఎలాంటి బాధ్యత వహించరు. ఈ సమాచారాన్ని స్వీకరించే వారు తమ సొంత విశ్లేషణ, వివరణలు మరియు పరిశోధనలపై ఆధారపడాలని సూచించడమైనది. తెలివైన పెట్టుబడి నిర్ణయం తీసుకోవడానికి, వృత్తిపరమైన నిపుణుల సలహా తీసుకోవాలని పాఠకులకు సలహా ఇవ్వడమైనది. ఈ మెటీరియల్ తయారీ లేదా జారీలో భాగంగా ఉన్న వ్యక్తులతో సహా సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు, ఈ మెటీరియల్‌లో ఉన్న సమాచారం ఆధారంగా పొందిన లాభాలు, నష్టాలతో సహా ఏదైనా ప్రత్యక్ష, పరోక్ష, ప్రత్యేక, అనుకోని, పర్యవసాన, శిక్షణాత్మక లేదా దండనాత్మక నష్టాలకు బాధ్యత వహించవు. ఈ డాక్యుమెంట్ ఆధారంగా తీసుకునే ఏ నిర్ణయానికైనా స్వీకర్త మాత్రమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది.

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి, స్కీమ్ సంబంధిత అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి

యాప్‌ని పొందండి