సైన్ ఇన్ అవ్వండి

ఎన్ఐఎంఎఫ్ యొక్క కొన్ని స్కీములలో తాజా సబ్‌స్క్రిప్షన్ సస్పెన్షన్ కోసం, దయచేసి చూడండి సంబంధిత సమాచారం

కంటెంట్ ఎడిటర్

డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం ఎలా?

మీరు డెట్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలని ఎంచుకుంటే, పెట్టుబడి ఎలా పెట్టాలోనని అర్థం చేసుకోవడమే మీ తదుపరి దశ. అయితే, ఈ దశలను అనుసరించడమే కాక, పెట్టుబడి ప్రారంభించడానికి ముందు మీరు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.

డెట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి?

డెట్ మ్యూచువల్ ఫండ్స్‌తో మీరు ప్రాథమికంగా లోన్లలో పెట్టుబడి పెడుతున్నారు. సులభంగా చెప్పాలంటే, మీరు డెట్ మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టినప్పుడు, ఫండ్ మేనేజర్ ఆ కార్పస్‌ను తీసుకుని నిర్ధిష్ట మెచ్యూరిటీ మరియు వడ్డీని అందించే బాండ్ల రూపంలో ప్రభుత్వానికి, కార్పొరేట్‌లకు అప్పుగా ఇస్తారు. ఈ బాండ్లు బాండ్ మార్కెట్లో ట్రేడ్ చేయబడతాయి. డెట్ ఫండ్స్ నుండి రాబడులు రెండు మార్గాల్లో పొందబడతాయి, అవి- బాండ్ వడ్డీ ఆదాయం నుండి మరియు వడ్డీ రేటులో హెచ్చుతగ్గుల కారణంగా డెట్ మార్కెట్లో బాండ్ ధరలలో వచ్చే మార్పు నుండి.‌ డెట్ ఫండ్స్ ‌ ఎలా పనిచేస్తాయో తెలుసుకోవడానికి మరింత చదవండి, Here

ఇవి సాపేక్షంగా తక్కువ రిస్క్ సామర్థ్యం గల పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉంటాయి. ఎందుకనగా, డెట్ సెక్యూరిటీలు సాపేక్షంగా ఈక్విటీ స్టాక్స్ కన్నా తక్కువ అస్థిరతను కలిగి ఉంటాయి. మీరు పెట్టుబడి పెట్టాలనుకునే డెట్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లకు సంబంధించి మీ పెట్టుబడి పరిధి మరియు రిస్క్ సామర్థ్యం ముడిపడి ఉన్నందున, మీరు మీ స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక లక్ష్యాల కోసం డెట్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. పన్ను-సమర్థవంతంగా ఉండడంతో పాటు, ఈక్విటీ స్కీమ్‌ల కంటే సాపేక్షంగా తక్కువ మార్కెట్ రిస్క్‌లో మీ పోర్ట్‌ఫోలియోకు వైవిధ్యాన్ని తీసుకురావడానికి డెట్ ఫండ్స్ మీకు సహాయపడతాయి. డెట్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం వలన సంప్రదాయ పెట్టుబడిలో లేని లిక్విడిటీ మీకు లభిస్తుంది. విభిన్న పెట్టుబడి లక్ష్యాలతో అనేక రకాల డెట్ ఫండ్‌లు ఉన్నాయి మరియు వివిధ రకాల లక్ష్యాలకు అనువైనవి కావచ్చు

మీ లక్ష్యాల ప్రకారం డెట్ ఫండ్స్ ఎంచుకోండి

ఒకసారి డెట్ ఫండ్స్ పనితీరును గురించి మీరు స్పష్టంగా తెలుసుకున్న తర్వాత, మీ లక్ష్యాలను నిర్ణయించుకోవాలి. డెట్ ఫండ్ ఎంపిక మీ లక్ష్యం యొక్క సాధన సమయం పై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, మీ లక్ష్యం తదుపరి సంవత్సరం కొత్త కార్ కొనుగోలు చేయడం అయితే, మీ పెట్టుబడి పరిధి మీ పిల్లల వార్షిక స్కూల్ ఫీజు చెల్లించే లక్ష్యం కంటే ఎక్కువగా ఉంటుంది. పిల్లల వార్షిక ఫీజు లక్ష్యంతో పోలిస్తే మునుపటి లక్ష్యంలో మార్పునకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు కొన్ని నెలలు లేదా సంవత్సరాల వరకు లక్ష్యాన్ని ముందుకు జరిపినా లేదా వాయిదా వేసినా, అది ఎక్కువ వ్యత్యాసం చూపకపోవచ్చు; అయితే, స్కూల్ ఫీజు అనేది మార్పులేనిది మరియు దానిని వాయిదా వేయలేరు.

మీ లక్ష్యాలను బట్టి వివిధ రకాల రిస్క్ స్థాయిలు మరియు పెట్టుబడి పరిధి ప్రకారం డెట్ ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి. స్వల్పకాలిక లక్ష్యం కోసం డెట్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టేటప్పుడు, మీరు రిస్క్ ఎక్స్‌పోజర్‌ను పరిమితం చేయాలనుకోవచ్చు. మరొకవైపు, మీరు దీర్ఘకాలం కోసం డెట్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతున్నప్పుడు, మీరు కొంత రిస్క్ కలిగి ఉండవచ్చు. ఆన్‌లైన్‌లో డెట్ ఫండ్స్‌లో ఎలా పెట్టుబడి పెట్టాలో మీరు ఆలోచిస్తున్నట్లయితే, కొన్ని వేగవంతమైన మరియు సులభమైన దశలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. మీరు దీర్ఘకాలం కోసం డెట్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలనుకుంటే,‌ క్లిక్ చేయండి Here మీ అవసరాలకు ఏ రకాలు సరిపోతాయో తెలుసుకోండి.

డెట్ ఫండ్స్‌లో ఏవిధంగా పెట్టుబడి పెట్టాలి?

మీరు ఏ మార్గాన్ని అనుసరించాలని అనుకుంటున్నారో నిర్ణయించుకున్న తర్వాత, డెట్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం సులభం. మీరు నేరుగా ఫండ్ హౌస్‌లో లేదా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా పెట్టుబడి పెట్టవచ్చు. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా చేసినట్లయితే, వారికి ఒక స్వంత పెట్టుబడి పోర్టల్ ఉండే అవకాశం ఉంది. అయితే, రెండు మార్గాల్లోనూ క్రింది దశలు ఉంటాయి

Here

మీరు పెట్టుబడి పెట్టిన తర్వాత, ఒక కొత్త ఫోలియో నంబర్ క్రియేట్ చేయబడుతుంది, మీరు మీ పెట్టుబడి వివరాలతో ఫండ్ హౌస్ నుండి ఒక ఇమెయిల్ అందుకుంటారు ఆ తర్వాత, ఫండ్ హౌస్ మీకు ఫండ్ గురించి లేదా దాని పెట్టుబడి లక్ష్యంలో ఏవైనా మార్పులు, ఎక్స్‌పెన్స్ రేషియో, మొదలైనవాటి గురించి రెగ్యులర్ అప్‌డేట్లను పంపుతూ ఉంటుంది.

సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఆదేశాల ప్రకారం, మీరు ఏదైనా ఆర్థిక సాధనంలో పెట్టుబడి పెట్టడానికి ముందు కెవైసి తప్పనిసరి అవసరం. కెవైసి గురించి మరింత తెలుసుకోవడానికి, Here

ఇక్కడ ఉన్న సమాచారం సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు పేర్కొన్న వివరణలు కేవలం అభిప్రాయాలను మాత్రమే సూచిస్తాయి, కావున వీటిని, పాఠకులకు మార్గదర్శకాలు, సిఫార్సులు లేదా నిపుణుల సలహాలుగా పరిగణించకూడదు. బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారం, అంతర్గతంగా అభివృద్ధి చేయబడిన డేటా మరియు ఇతర విశ్వసనీయమైన మూలాల ఆధారంగా ఈ డాక్యుమెంట్ తయారు చేయబడింది. స్పాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, ట్రస్టీ లేదా వారి డైరెక్టర్లు, ఉద్యోగులు, అనుబంధ సంస్థలు లేదా ప్రతినిధులు ("సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు") అటువంటి సమాచారం యొక్క ఖచ్చితత్వం, పరిపూర్ణత, సమగ్రత మరియు విశ్వసనీయతకు ఎలాంటి బాధ్యత వహించరు. ఈ సమాచారాన్ని స్వీకరించే వారు తమ సొంత విశ్లేషణ, వివరణలు మరియు పరిశోధనలపై ఆధారపడాలని సూచించడమైనది. తెలివైన పెట్టుబడి నిర్ణయం తీసుకోవడానికి, వృత్తిపరమైన నిపుణుల సలహా తీసుకోవాలని పాఠకులకు సలహా ఇవ్వడమైనది. ఈ మెటీరియల్ తయారీ లేదా జారీలో భాగంగా ఉన్న వ్యక్తులతో సహా సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు, ఈ మెటీరియల్‌లో ఉన్న సమాచారం ఆధారంగా పొందిన లాభాలు, నష్టాలతో సహా ఏదైనా ప్రత్యక్ష, పరోక్ష, ప్రత్యేక, అనుకోని, పర్యవసాన, శిక్షణాత్మక లేదా దండనాత్మక నష్టాలకు బాధ్యత వహించవు. ఈ డాక్యుమెంట్ ఆధారంగా తీసుకునే ఏ నిర్ణయానికైనా స్వీకర్త మాత్రమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది.

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి, స్కీమ్ సంబంధిత అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి

యాప్‌ని పొందండి